gvmc Commissioner
-
ప్రమాదకర ప్లాస్టిక్ రహిత విశాఖ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు
-
స్టేజ్‌పై డ్యాన్స్ చేసిన వెంకటేశ్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి..
F3 Success Meet Vizag, పెదవాల్తేరు(విశాఖ తూర్పు): మహిళా ప్రేక్షకుల ఆదరణ వల్లే ఎఫ్–3 (F3) సినిమా అఖండ విజయం సాధించిదని ప్రముఖ హీరో వెంకటేశ్ తెలిపారు. ఆర్.కె.బీచ్ దరి గోకుల్‌పార్కులో శనివారం రాత్రి ఎఫ్–3 ఫన్టాస్టిక్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ తనకెప్పుడూ స్పెషల్ అన్నారు. తన తొలి సినిమా కలియుగ పాండవులు షూటింగ్ విశాఖ బీచ్‌రోడ్డులోనే జరిగిందని గుర్తు చేసుకున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మల్లీశ్వరి వంటి ఎన్నో సూపర్‌హిట్ సినిమాలను విశాఖలో చిత్రీకరించామన్నారు. తాను నటించిన దృశ్యం–2, నారప్ప వంటి సినిమాలు ఓటీటీలో మాత్రమే విడుదల కావడంతో తన అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారని పేర్కొన్నారు. ఎఫ్–3 సినిమాకు అభిమానులు విజయం చేకూర్చారని సంతోషం వ్యక్తం చేశారు. మరో హీరో వరుణ్‌తేజ్ మాట్లాడుతూ 'అభిమానుల ఆదరణే తమకు వందకోట్ల ఆదాయంతో సమానం. విశాఖ నోవాటెల్ హోటల్లోనే దర్శకుడు అనిల్ ఎఫ్–3 సినిమా కథ రాసుకున్నారు. మళ్లీ అవకాశం వస్తే కథ వినకుండానే వెంకటేశ్‌తో సినిమా చేస్తాను.' అని పేర్కొన్నారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ విశాఖలో ఆర్య, పరుగు సినిమా షూటింగ్ రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. అమెరికాలో కూడా ఇదే ఆదరణ లభించడం అపూర్వమన్నారు. ఈ రోజుకు సినిమా విడుదలై 9 రోజులవుతుందని.. రూ.100 కోట్ల గ్రాస్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. జగదాంబ వంటి 1,100 సీట్లు ఉన్న థియేటర్లో ఎఫ్–3 హౌస్‌ఫుల్స్‌తో నడుస్తోందని జగదాంబ థియేటర్ అధినేత జగదీష్ చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఎఫ్–4 త్వరలోనే ప్రకటిస్తామన్నారు. The TRIO of Team #F3Movie rocks the stage dancing for 'Kurradu Baboye' DJ Mix 💥💥😍😍 Triple Blockbuster FUNtastic Celebrations! 🥳 📽️ https://t.co/YuJh17JmAd#F3TripleBlockbuster@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @ThisIsDSP @SVC_official @adityamusic @shreyasgroup pic.twitter.com/UptRcOSs9b — Sri Venkateswara Creations (@SVC_official) June 4, 2022 'విశాఖతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాకు ముందు నేను చేసిన చాలెంజ్‌తో మీడియా కూడా షాక్ అయింది. కుటుంబ ప్రేక్షకుల ఆదరణను నేను, హీరో వెంకటేశ్ ఎంతో రుచి చూశాం' అని నటకిరీటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ కేవలం ప్రేక్షకులను నవ్వించడానికే ఈ సినిమా తీశానన్నారు. ఈ సినిమాలో ఆలీ పాత్ర నచ్చిందా అని ప్రేక్షకులను అడిగారు. తనకు ఎఫ్–2 కంటే ఎఫ్–3 సినిమా అంతకుమించి ఆనందం ఇచ్చిందన్నారు. ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రలు కూడా చాలా బాగా పండాయన్నారు. తన సినిమా కథలన్నీ వైజాగ్‌లోనే రాసుకున్నానని చెప్పారు. జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ ఎఫ్–3 చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఇదే రోడ్డుపై ఎన్నో షూటింగ్‌లు చేశానని నటుడు అలీ చెప్పారు. హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ శివరామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హీరో వెంకటేశ్, వరుణ్‌తేజ్, అనిల్ సినిమాలోని ఓ పాటకు నృత్యాలు చేసి ప్రేక్షకులను అలరించారు. సే నో టు ప్లాస్టిక్ ఎఫ్–3 విజయోత్సవంలో పాల్గొన్న జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ మాట్లాడుతూ విశాఖలో ఆదివారం నుంచి ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నామన్నారు. విశాఖను ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా మారుస్తున్నట్లు తెలిపారు. దీనిపై చిత్ర నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ విశాఖను ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా చేయాలన్న జీవీఎంసీ ప్రయత్నాన్ని అభినందించారు. ప్రజల సంపూర్ణ సహకారంతోనే ఇది సాధ్యపడుతుందన్నారు. -
మోడల్ స్కూళ్లకు ఫ్రాన్స్ చేయూత
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ తీర్చిదిద్దిన మోడల్ కార్పొరేషన్ స్కూళ్లను చూసి అచ్చెరువొందిన ఫ్రాన్స్ ప్రభుత్వం.. మరిన్ని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు సహకారం అందిస్తోంది. గ్రేటర్ పరిధిలోని 44 కార్పొరేషన్ స్కూళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సిటీ ఇన్వెస్ట్మెంట్ టు ఇన్నోవేట్ అండ్ సస్టైన్ (సిటీస్) పేరుతో ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఏఎఫ్‌డీ) రూ.52 కోట్ల నిధులు సమకూర్చింది. ఈ నిధులతో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టాలనే అంశాలపై సిటీస్ బృందం ఇప్పటికే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, జీవీఎంసీ అధికారులతో సమావేశమైంది. వారి నుంచి సలహాలు సూచనలు స్వీకరించింది. నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు విభిన్న ప్రాజెక్టులతో ముందుకెళ్తున్న మహా విశాఖ నగర పాలక సంస్థ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. సిటీస్ చాలెంజ్ పేరుతో ఏడాది కిందట జరిగిన పోటీలో 15 నగరాలకు సంబంధించి మొత్తం 26 ప్రాజెక్ట్‌లు ఎంపికవ్వగా.. ఇందులో కార్పొరేషన్ పాఠశాలలను ఆధునికీకరించిన జీవీఎంసీ ప్రాజెక్ట్ అవార్డు సొంతం చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని ఆకర్షించింది. దీనికి ఫిదా అయిన ఫ్రాన్స్ ప్రభుత్వ అనుబంధ సంస్థ ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఏఎఫ్‌డీ) మరిన్ని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది. -
వైజాగ్.. ది ల్యాండ్ ఆఫ్ లవ్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరం.. సిటీ ఆఫ్ డెస్టినీ.. పర్యాటకుల స్వర్గధామంగా పేరొందిన వైజాగ్.. ప్రకృతి అందాలకు నెలవు. కనుచూపు మేర కనువిందు చేసే పచ్చని కొండలు.. నీలి సంద్రం.. మనసు దోచే సహజ అందాల కలబోత. సాగర తీర సొగసులకు ఫిదా అవ్వని వారంటూ ఎవరూ ఉండరు. అందుకే.. విశాఖ విశ్వనగరిగా మారింది. ఇప్పుడు కార్యనిర్వాహక రాజధానిగా రూపాంతరం చెందుతోంది. ఈ నేపథ్యంలో.. విశాఖ వైభవాన్ని మరింత చాటేందుకు జీవీఎంసీ కమిషనర్ జి.సృజన సోషల్ మీడియాను వేదికగా మలచుకున్నారు. అలరారే సాగరతీర అందాలతో ఉన్న ఫొటోను ట్వీట్ చేసి.. విశాఖపట్నంపై స్లోగన్స్ రాయండి... టాప్ త్రీ స్లోగన్స్‌కు ప్రశంసలు అందిస్తాం. అంటూ పోస్ట్ చేశారు. (విశాఖ విజయీభవ.. రాజధానిగా రాజముద్ర) అసలే వాహ్.. వైజాగ్ అంటూ ట్విటర్లో అత్యధికంగా పోస్టులు వస్తున్న నేపథ్యంలో కమిషనర్ పిలుపునకు విశాఖ ప్రజలతో పాటు రాష్ట్రం నలుదిశల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా.. 1084 లైక్స్‌తో పాటు 154 మంది రీట్వీట్ చేశారు. ఇక 303 మంది తమ కవి హృదయాన్ని వెల్లడిస్తూ.. విశాఖ అందాలపై షార్ట్ అండ్ స్వీట్ కవితలను ఇంగ్లిష్ హిందీ భాషల్లో పోస్ట్ చేశారు. వాటిలో కొన్ని మెచ్చుతునకలివీ... ఎస్జే బాబు– ది ల్యాండ్ ఆఫ్ లవ్.. హోప్ అండ్ డ్రీమ్స్.. ద గేట్ వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్.. వైజాగ్ పట్టణం.. ఆంధ్రుల స్వప్నాల చిహ్నం రాఘవ– విశాల మనసులున్న పట్నం.. విశాఖపట్నం సంతోష్‌బాబు ఎస్ఎస్ఎంబీ – విశాఖపట్నం.. అచీవ్ యువర్ డ్రీమ్స్ లైక్ ద సైలెంట్ వేవ్స్.. చెగువీరా– విశాఖపట్నం.. ద ప్లేస్ ఫర్ పీస్.. ద ప్లేస్ ఫర్ లవ్.. ద ప్లేస్ ఫర్ కామన్ పీపుల్ మోహన్– అమ్మ.. ఆవకాయ్.. వైజాగ్ బీచ్ ఎప్పుడూ బోర్ కొట్టవు త్రిలోక్ చంద్ర– కలలో స్వర్గానికి ఇలలో విశాఖ మార్గం.. వీరబాబు– సాగర తీరాన కార్యనిర్వాహక రాజధాని.. కృష్ణమ్మ చెంత శాసన రాజధాని.. చారిత్రక కర్నూలులో న్యాయ రాజధాని.. ప్రాంతాల మధ్య ఇక చెక్కు చెదరని అనుబంధాలకు తిరుగులేని పునాది. రవికుమార్– విశాఖ సాగరతీరం.. భారత మాతకు మణిహారం ఏఎన్వీఎల్ శ్రీకాంత్– బిల్డింగ్ ఏ బ్యూటిఫుల్ సిటీ నాట్ జస్ట్ బై బ్రిక్ బై బ్రిక్.. బట్ బై హార్ట్ బై హార్ట్.. సాయిప్రదీప్ పోలెపల్లి– సాగరతీర మెరిక.. మన విశాఖ, ప్రకృతి సౌందర్య దీపిక– మన విశాఖ, రమణీయ వీచిక.. మన విశాఖ. శశాంక్ శ్రీధరాల– ల్యాండ్ ఆఫ్ హోప్ అండ్ సిటీ ఆఫ్ డ్రీమ్స్ రైజింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్.. రైజింగ్ స్టార్ సిటీ విశాఖప ట్నం -
థాంక్యూ సోమచ్ కమిషనర్: తేజశ్వి యాదవ్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని వివిధ హోటల్స్‌లో చిక్కుకున్న బిహార్‌కి చెందిన ఇంటర్ విద్యార్థులను సురక్షితంగా కళాశాల హాస్టల్స్‌కి పంపించినందుకు జీవీఎంసీ కమిషనర్ జి.సృజనకు బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఓ ప్రైవేట్ కళాశాలలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు లాక్డౌన్ నేపథ్యంలో కాలేజీ హాస్టల్ నుంచి బయలుదేరి బిహార్ రాలేక నగరంలోని పలు హోటల్స్‌లో తలదాచుకున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు ట్విట్టర్ ద్వారా తెలిపారు. Thank you so much https://t.co/1om5Z2twCL — Tejashwi Yadav (@yadavtejashwi) March 28, 2020 దీంతో బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ ట్విట్టర్ ద్వారా కమిషనర్ సృజనకి విషయాన్ని తెలియజేశారు. కమిషనర్ వెంటనే స్పందించి నగరంలోని హోటల్స్‌లో జల్లెడపట్టగా 17 మంది విద్యార్థుల ఆచూకీ గుర్తించి వైద్య పరీక్షల అనంతరం కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి తిరిగి హాస్టల్‌కి పంపించారు. ఈ విషయాన్ని తేజశ్వికి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దీంతో కమిషనర్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. -
హరికృష్ణ, అక్కినేని విగ్రహాల తొలగింపు
సాక్షి, విశాఖపట్నం: ముందస్తు అనుమతిలేకుండా విశాఖలోని ఆర్కేబీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన మూడు విగ్రహాలను మున్సిపల్ అధికారులు సోమవారంఅర్థరాత్రి తొలగించారు. గతేడాది డిసెంబర్ మొదటి వారంలో మంత్రి గంట శ్రీనివాసరావు, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు, హరికృష్ణ విగ్రహాలను బీచ్ రోడ్డులో ఏర్పాటు చేశారు. అయితే జీవీఎంసీ నుంచి ఎటువంటి అనుమతి లేకుండా ఈ విగ్రహాలను ఏర్పాటటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు ప్రజాసంఘాలు కోర్డును ఆశ్రయించాయి. దీంతో కోర్డు ఆ విగ్రహాలను తొలగించాలని తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్త్ మధ్య జీవీఎంసీ అధికారులు ఆ మూడు విగ్రహాలను తొలగించారు. -
ఖజానాకు కాసుల కళ
మహా విశాఖ నగర పాలక సంస్థ ఖజానాలో రికార్డు స్థాయి ఆదాయం వచ్చి చేరింది. మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా రూ. 302 కోట్ల లక్ష్యాన్ని అందుకుంది. ముఖ్యంగా రెవెన్యూ విభాగం మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించడంతో చివరి నెలలో దాదాపు రూ.75 కోట్లు వసూలు చేసింది. ఆస్తి పన్నులు, నీటి ఛార్జీలు మొదలైన పన్నుల ద్వారా ఆదాయం అత్యధిక స్థాయిలో జీవీఎంసీకి వచ్చి చేరింది. ఇదే ఉత్సాహంతో ఈ ఏడాది పన్నులవసూళ్లకు ఆది నుంచే శ్రీకారం చుట్టారు. విశాఖసిటీ: జీవీఎంసీ రెవెన్యూ విభాగం పన్నుల వసూళ్లలో తొలిసారిగా లక్ష్యానికి చేరువైంది. ఏటా నిర్దేశించుకున్న లక్ష్యానికి కూతవేటు దూరంలోనే వసూళ్లు నిలిచిపోయేవి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మాత్రం పన్నుల వసూళ్ల జోరు లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను, నీటి పన్ను, వీఎల్టీ మొత్తం రూ.300 నుంచి రూ.305 కోట్లు వసూళ్ల లక్ష్యంగా నిర్దేశించుకోగా రూ.302 కోట్లు కార్పొరేషన్ ఖజానాలో చేరింది. గతేడాదితో పోలిస్తే అధికంగానే పన్నులు ఖజానాకు చేరాయి. మొత్తంగా ఆరు జోన్లతో పాటు అనకాపల్లి, భీమిలిలో ఉన్న ప్రైవేట్ ఆస్తుల నుంచి రూ.218,89,12,000, ప్రభుత్వ ఆస్తుల నుంచి రూ.11,77,46,000, కేంద్ర ప్రభుత్వ ఆస్తుల నుంచి రూ.6,16,64,000, కోర్టు కేసుల ద్వారా రూ.20,70,57,000, ఖాళీ స్థలాల పన్నుల ద్వారా రూ.35,23,10,000, విశాఖ పోర్టు ట్రస్టు నుంచి రూ.9.42 కోట్లు వచ్చాయి. మొత్తంగా 8 జోన్ల నుంచి ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.302,18,89,000 వసూలయ్యాయి. దీనికి తోడు అన్ని జోన్ల నుంచి రూ.23,75,86,000 నీటి పన్నులు వసూలయ్యాయి. ‘మొండి’ఘటాలకు ముకుతాడు ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఎలాగైనా చేరుకోవాలని జీవీఎంసీ అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏటా పన్ను వసూళ్లకు గుదిబండలా మారుతున్న మొండిబకాయిలనే ప్రధాన టార్గెట్‌గా ఎంచుకున్నారు. ఆ దిశగా సఫలీకృతులయ్యారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 4.5 లక్షల ఆస్తి పన్ను అసెస్మెంట్లు ఉన్నాయి. కమిషనర్ హరినారాయణన్ ప్రత్యేక దృష్టి సారించి మొండి బకాయిల వసూళ్లపై చర్యలు తీసుకోవాలని డీసీఆర్ సోమన్నారాయణకు ఆదేశాలు జారీ చెయ్యడంతో కొత్త ప్రణాళికలతో ముందుకెళ్లారు. కొన్నేళ్లుగా వసూలు కాని మొండి బకాయిలు వసూలయ్యాయి. ఆయా జోన్లలోని రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్కలెక్టర్లు పన్నుల వసూళ్లలో కీలక పాత్ర పోషించారు. ఇలా వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించడంతో మార్చి 30వ తేదీన ఒక్కరోజే ఏకంగా రూ.30 కోట్ల వరకూ గ్రేటర్ ఖజానాకు చేరాయి. ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తంలో పన్నులు వసూలు కావడం జీవీఎంసీ చరిత్రలో ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి బకాయిలు పడిన గీతం యూనివర్సిటీ రూ.10.41 కోట్లు, గాయత్రీ విద్యాసంస్థలు రూ.2.15 కోట్లు, వాల్తేర్ రైల్వే డివిజన్ రూ.5.16 కోట్లు, విశాఖ పోర్టు ట్రస్టు రూ.4కోట్లు చెల్లించాయి. ఆం«ధ్రా యూనివర్సిటీ రూ.5.60 కోట్లు.... ఇలాంటి వసూళ్లతో లక్ష్యానికి చేరుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై ప్రధాన దృష్టిసారించడంతో పన్నుల వసూళ్లు పుంజుకున్నాయి. 30లోగా ఆస్తిపన్నుచెల్లింపులపై 5 శాతం రాయితీ కమిషనర్ సూచనల మేరకు పన్నుల వసూళ్ల విషయంలో రెవెన్యూ విభాగం నిరంతరం కృషి చేసింది. అందరూ శక్తి వంచన లేకుండా శ్రమించినందుకు రికార్డు స్థాయిలో వసూళ్లు ఆనందాన్నిచ్చాయి. ఇదే స్ఫూర్తితో 2019–20 ఆర్థిక సంవత్సరంలో ముందుకెళ్లాలని నిర్ణయించాం. ఈ ఏడాది జీవీఎంసీ పరిధిలో ఆస్తిపన్నును ఈనెల 30వ తేదీలోగా చెల్లించేవారికి ప్రభుత్వం 5 శాతం రాయితీ సదుపాయం కల్పించింది. ఆస్తిపన్నును చెల్లించే వారికి ఈ రాయితీ వర్తిస్తుంది. జీవీఎంసీ పరిధిలోని మధురవాడ, ఆశీలమెట్ట, సూర్యాబాగ్, జ్ఞానాపురం, వేపగుంట, గాజువాక, భీమిలి, అనకాపల్లి జోనల్ కార్యాలయాల్లోని సౌకర్యం కేంద్రాలు, ఎంపిక చేసిన బ్యాంకుల్లోను పన్నులు చెల్లించాలని ప్రజలకు సూచిస్తున్నాం.– ఆర్.సోమన్నారాయణ, జీవీఎంసీ డీసీఆర్ -
మృత్యు దూతలు
విశాఖ సిటీ: నగర శివారు గుడ్లవానిపాలెంలో జనవరి ఒకటో తేదీన ఐదేళ్ల బాలుడు రాముపై ఓ కుక్క దాడి చేసి నోట కరచుకొని లాక్కెళ్లిన ఘటన మరవకముందే.. అనకాపల్లిలో పదేళ్ల బాలికను తీవ్రంగా గాయపరచడంతో కోమాలోకి వెళ్లి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న దారుణం చోటు చేసుకుంది. ఈ దారుణాలకు బాధ్యులెవరు..? కుక్కలు ఇంతలా పేట్రేగుతున్నా.. అరికట్టడంలో విఫలమవుతున్న జీవీఎంసీనా..? కుక్కల్ని పట్టుకుంటే.. విడిచిపెట్టాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్న మూగ జీవాల సంరక్షణ సంస్థ ప్రతినిధులా..? కుక్కల్ని చంపకూడదు.. కు.ని. చికిత్సలు చేసిన తర్వాత ఎక్కడ పట్టిన శునకాలను అక్కడే విడిచిపెట్టాలని ఆదేశాలిచ్చిన న్యాయస్థానమా..? బాధ్యులెవరైనా.. బాధలు మాత్రం సామాన్య ప్రజలే ఎదుర్కొంటున్నారు. కుక్కల దాడుల్లో నిత్యం గాయపడుతున్నారు. నగరంపై శునకం దాడి చేస్తోంది. రాత్రి పూట అయితే జనావాసం కంటే శునకాలే అధికంగా కనిపిస్తున్నాయి. పాఠశాలకు వెళ్లాలన్నా.. ఆరుబయట ఆడుకోవాలన్నా చిన్నారులు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి దాపురించింది. చీకటి పడితే చాలు పాదచారులు, ద్విచక్ర వాహనదారుల వెంటపడి మరీ తరుముతున్నాయి. వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందనీ, వాటిని తొలగించాలని కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదులు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో ఇదీ దుస్థితి జీవీఎంసీ అధికారుల లెక్క ప్రకారం నగరంలో 2012లో ఉన్న వీధి కుక్కల సంఖ్య సుమారు 70 వేలు. ప్రస్తుతం ఇవి సుమారు ల„ýక్ష ఉంటాయని చెబుతున్నా.. మొత్తం సంఖ్య లక్షకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే వీటిలో 70 వేల కుక్కల వరకూ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే అధికారికంగా మరో 30 వేలు మొత్తమ్మీద మరో 70 వేల కుక్కల వరకూ శస్త్ర చికిత్సలు చెయ్యాల్సిన అవసరం ఉంది. రూ.కోట్లు కుమ్మరిస్తున్నా తగ్గవెందుకు.? జీవీఎంసీ అధికారులు కుక్కల నియంత్రణ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. జీవీఎంసీతో పాటు విశాఖ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ కేర్ ఆఫ్ యానిమల్స్(వీఎస్‌పీసీఏ) అనే సంస్థతో కలిసి ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ కార్యక్రమం నగరంలో జరుగుతోంది. ఒక్కో కుక్కకు శస్త్ర చికిత్స చేసేందుకు రూ.1100 చొప్పున.. ఏడాదికి కుక్కల కోసం సుమారు కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నా... నగరంలో మాత్రం శునకాల బెడద తీరకపోవడం ఆశ్చర్యకరం. సాధారణంగా ఒక కుక్క కాన్పులో సుమారు 8 పిల్లలను కంటుంది. ఏటా లక్ష్యం పేరుతో 15 వేల కుక్కల వరకూ ఆపరేషన్లు చేస్తున్నారు. మిగిలిన కుక్కల్లో సగానికిపైగా ఆడ కుక్కలు ఉంటున్నాయి. వచ్చే ఏడాది నాటికి వీటిలో సగం కుక్కలు పిల్లలను కంటున్నాయి. అంటే ఏడాది తిరిగేలోపు సుమారు 25 నుంచి 30 వేల కుక్కల వరకూ పెరుగుతున్నాయి. ఈ లెక్కన టార్గెట్ల పేరుతో సగం సగం ఆపరేషన్లు చేస్తున్న కొద్దీ మరో 30 వేల కుక్కలు అదనంగా పెరుగుతూ వస్తున్నాయే తప్ప.. తగ్గుతున్న దాఖలాలు లేవు. సుప్రీంకోర్టు నిబంధనలే కారణమా..? కుక్కల సమస్య తగ్గాలంటే వాటి చంపాల్సిందేనన్న విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కుక్కల్ని చంపకుండా వాటికి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసి పట్టుకున్న చోటే తిరిగి విడిచిపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఏళ్ల తరబడి అలవాటు పడిన ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి కుక్కలను తీసుకెళ్లి విడిచిపెడితే... అక్కడి పరిస్థితులకు అలవాటు పడక వాటి మానసిక స్థితి గతితప్పి పిచ్చికుక్కలా ప్రవర్తించి మనుషులను కరిచే ప్రమాదముందని వైద్య నిపుణులు వెల్లడించడంతో.. సుప్రీంకోర్టు ఈ తరహా ఆదేశాలను జారీ చేసింది. దీంతో వీధుల్లో కుక్కలను పట్టుకొని శస్త్ర చికిత్సలు నిర్వహించి తిరిగి అక్కడే విడిచి పెడుతున్నారు. మరోవైపు జంతు ప్రేమికులు సైతం తమకు అడ్డు తగులుతున్నారని జీవీఎంసీ సిబ్బంది చెబుతున్నారు. ప్రజల ఫిర్యాదు మేరకు అక్కడి కుక్కలను తరిమేసేందుకు యత్నిస్తుంటే.. వివిధ జంతు ప్రేమికుల సంఘాలు తమ పనికి అడ్డుతగులుతున్నాయ నీ... ఫలితంగా ఏమీ చెయ్యలేకపోతున్నామని జీవీఎంసీ వెటర్నరీ సిబ్బంది చెబుతున్నారు. శివారు ప్రాంతాల్లో నియంత్రించలేకపోతున్నాం ఎండాడ, సాగర్‌నగర్, పెందుర్తి, గోపాలపట్నం, పీఎం పాలెం, అనకాపల్లి శివారు ప్రాంతాల్లో కుక్కల నియంత్రణ కుదరడం లేదు. కుక్కల బండి కనిపిం చగానే ఆ ప్రాంతంలోని కుక్కలన్నీ కొండల్లోకి వెళ్లిపోతూ దొరకడం లేదు. కుక్క కాటుని పూర్తిగా నియంత్రించాలంటే ప్రజలు, జంతు ప్రేమికుల సహకారం అవసరం. కుక్కలను తరిమెయ్యాలని మేం చేసే ప్రయత్నాలను వారు అడ్డుకుంటున్నారు. అనకాపల్లిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. శివాజీపార్కులో రోజూ పిల్లలను కుక్కలు కరుస్తున్నాయి. వాటిని తరలిద్దామని ప్రయత్నిస్తుంటే కుక్కల ప్రేమికులు అడ్డుపడుతున్నారు. ఇక మేమేం చెయ్యగలం. – డాక్టర్ ఎల్కే సుధాకర్, జీవీఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ -
వెజ్ బిర్యానీలో గొంగళి పురుగు
సాయిరామ్ పార్లర్లో బయటపడ్డ వైనం ఇదేమిటని అడిగిన వారికి నిర్లక్ష్య సమాధానం జీవీఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు నమూనాలు సేకరించి తీసుకువెళ్లిన అధికారులు విశాఖపట్నం : ఏం లేకపోయినా ఉండగలం కానీ సమయానికి కడుపు నిండకపోతే మాత్రం తట్టుకోలేం. కోటి విద్యలు కూటి కోసమేనని అందుకే అన్నారు. అలాంటి ఆహారాన్ని అందించే వారిని ఎంతగానో గౌరవిస్తాం. ఈ కోవలోనే నగరంలో ప్రముఖ హోటల్‌గా పేరుగాంచి, నిత్యం రద్దీగా ఉండే సాయిరామ్ పార్లర్లో నిర్వాహకుల నిర్లక్ష్యం సోమవారం వెలుగు చూసింది. పురుగుల బిర్యానీని కస్టమర్లకు అందిస్తున్న వైనం బయటపడింది. బాధితుడు అరుణ్ ‘సాక్షి’కి ఆ వివరాలను అందించారు. ఇదీ జరిగింది : అప్పటికే మధ్యాహ్న భోజన సమయం దాటిపోతోంది. సమయం 3.30 గంటలైంది. బాగా ఆకలిమీద ఉన్న కంచరపాలెం ప్రాంతానికి చెందిన జి.అరుణ్‌బాబు డైమండ్ పార్కు దగ్గరున్న సాయిరామ్ పార్లర్‌కు వెళ్లారు. వెజ్ బిర్యానీ, పెరుగు ఆవడ తీసుకున్నారు. పెరుగు ఆవడ ముందుగా తిని, తర్వాత వెజ్ బిర్యానీ తీసుకున్నారు. పచ్చి మిరపకాలయలు తినడం ఇష్టం లేక వాటిని ముందే ఏరి పక్కన పెట్టేశాడు. రెండు స్పూన్ల బిర్యానీ తినే సరికి పచ్చగా ఏదో కనిపించింది. పచ్చిమిరపకాయలు తీసేశాక ఇదేమిటని దగ్గరగా చూస్తే గుండె ఝల్లుమంది. వాంతి వచ్చినంత పనైంది.ప్లేటులో ఉన్నది పచ్చి మిరపకాయ కాదు పచ్చ గొంగళి పరుగు. నూనెలో బాగా వేగిందో, బిర్యానీలో ఉడికిందో తెలియదు గానీ చనిపోయి ఉంది. దానిని చూడగానే అరుణ్ తనను తాను సముదాయించుకుని సరఫరా చేసిన వారి వద్దకు వెళ్లి విషయం చెప్పారు. వారు చాలా నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ, ఆ ప్లేటు పక్కన పెట్టేసి మరోటి తీసుకోమన్నారు. ఈ విషయం హోట ల్ యజమానికి తెలి యాలని, ఆయనను పిలిపించమని అరుణ్ పట్టుబట్టాడు. దాదాపు గంట న్నర తర్వాత హోటల్ నిర్వాహకులు ఆయన వద్దకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడేం చేయమంటావ్, నీకు చేతనైంది చేసుకో అని చెప్పి వెళ్లిపోయారు. నిర్వాహకుల సమాధానం, వారి తీరు చూసిన తర్వాత అరుణ్‌కు ఆన్లైన్లో జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ ఫోన్ నెంబర్ సంపాధించి ఆయనకు ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్న కమిషనర్ పరిశీలించాల్సిందిగా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్(సిఎంహెచ్ఓ) డాక్టర్ ఎ.హేమంత్‌ను ఆదేశించారు. ఆయన హుటాహుటిన దగ్గరలో ఎవరున్నారని ఆరాతీస్తే శానిటరీ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఉన్నారని తెలియడంతో వెంటనే సాయిరామ్ పార్లర్‌కు వెళ్లి విషయం ఏమిటో తెలుసుకోమని ఆయనకు చెప్పారు. వెంటనే కృష్ణమూర్తి వెళ్లి అరుణ్‌ను కలిశారు. బిర్యానీ ప్లేటును పరిశీలించి దానిలో ఉన్న గొంగళి పురుగును కూడా చూశారు. వెంటనే ఆ ఆహారాన్ని డబ్బాలో సీజ చేశారు. అరుణ్ నుంచి ఫిర్యాదు స్వీకరించారు. కాగా ఈ ఉదంతంపై స్పందించేందుకు హాటల్ సిబ్బంది నిరాకరించగా యజమాని ఫోన్లో అందుబాటులోకి రాలేదు. అరుణ్ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి, ఆహారాన్ని పరీక్షించిన అనంతరం హోటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటా మని సిఎంహెచ్ఓ హేమంత్ ‘సాక్షి’కి వెల్లడించారు.