రిబ్బన్లు కట్టుకోలేదని.. జుట్టు కత్తిరించారు!
క్రమశిక్షణ.. వింత పోకడలకు పోతోంది. కామారెడ్డిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులు రిబ్బన్లు కట్టుకోలేదని.. కొంతమందికి జుట్టు కత్తిరించారో టీచర్. అమ్మాయిలు జడలు వేసుకుని, రిబ్బన్లు కట్టుకు రావాలన్న నిబంధన చాలా పాఠశాలల్లో ఉంది. చాలావరకు ప్రైవేటు పాఠశాలలు కూడా ఈ నిబంధన విధిస్తాయి.
అయితే, దాన్ని ఉల్లంఘించినవారిని టీచర్లు పిలిచి మందలిస్తారే తప్ప.. ఏకంగా ఇలా జుట్టు కత్తిరించిన ఘటన మాత్రం ఇంతకుముందు ఎక్కడా లేదు. ఈ సంఘటన పట్ల విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సదరు టీచర్ మంత్రాలు వేస్తోందంటూ వారు ఆందోళనకు దిగారు. దాంతో.. ఆ తల్లిదండ్రులకు సదరు టీచర్ క్షమాపణలు చెప్పారు.