hara gopal
-
Union Budget 2023-24: కార్పొరేట్ల బడ్జెట్
ఇదే కాదు... కొన్నేళ్ళుగా బడ్జెట్ల స్వరూపాలను చూస్తే ఇవి బడుగులకు బాసటగా ఉంటున్నాయా? కార్పొరేట్లకు కొమ్ముగాస్తు న్నాయా అనే సందేహా లొస్తున్నాయి. ప్రజల భవి ష్యత్, మానవ ప్రమా ణాలు, జీవన అవసరాలు నెరవేరని బడ్జెట్ దేశాన్ని సంక్షోభంలోకి నెడుతుందనేది నిర్వివాదాంశం. సంపద సృష్టే లక్ష్యంగా దేశ బడ్జెట్‌ను ప్రవేశపెడితే దుష్ఫలితాలు తప్పవు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఈ వాదా నికి ఏమాత్రం తీసిపోదు. ఆదాయానికి అనుగు ణంగా పన్నులు వేయాల్సిందే. దాని ద్వారా వచ్చిన ఆదాయంతోనే ప్రజా సంక్షేమం సాధ్యం. ఇది జర గాలంటే సంపాదించే వర్గం నుంచే ఆదాయాన్ని రాబట్టాలి. కానీ నూతన ఆర్థిక విధానాల తర్వాత బడ్జెట్ల స్వరూపమే మారుతోంది. అవి కార్పొరేట్ రంగానికి ఊతమిచ్చేలా ఉంటున్నాయి. ప్రత్యక్ష, పరోక్ష పన్నులను పరిశీలిస్తే 70 శాతం సంపదను గుప్పిట్లో పెట్టుకునే పది శాతం ఆదాయ వర్గాల నుంచి పన్ను రాబట్టడం లేదు. ఆదాయం తక్కువగా ఉండే 90 శాతం ప్రజలే పన్నుల భారాన్ని మోస్తున్నారు. రూ. 6 కోట్ల సంపద దాటినా 30 శాతమే పన్ను వేయడం ఏమిటి? ఇదే ప్రభుత్వాలు అనుసరిస్తున్న లాజిక్. ప్రత్యక్ష పన్నుల పేరుతో 90 శాతం తక్కువ సంపద ఉన్నవారి నుంచి పీడిస్తున్నారు. దేశ ద్రవ్యోల్బణం 3 శాతం దాటకూడదు. కానీ 6 శాతం ద్రవ్యోల్బణం ఉన్నట్టు కేంద్రం చెబుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడంలో ఏమాత్రం వెనకాడని ప్రభుత్వం, వాటి పరిరక్షణకు ఎక్కడా కేటాయింపులు చేయక పోవడం దుర్మార్గమే. జనాభాలో 60 శాతంగా ఉన్న రైతుల ఆదాయం కేవలం 11 శాతమే. అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అనేక రకాలుగా ఆందోళనలకు దిగుతున్నారు. ఈ రంగాన్ని కేంద్ర బడ్జెట్ విస్మరించడం దారుణం. డిజిటల్ టెక్నాలజీ తెస్తామనీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తామనే భరోసాలు రైతన్న కళ్ల నీళ్లు తుడుస్తాయా? విద్యారంగంపై చేసే ఖర్చును పెట్టుబడిగానే చూడాలి. ఈ రంగంపై పెట్టుబడులు పెట్టబట్టే జపాన్, కొరియా వంటి దేశాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. కానీ మన బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు తగ్గించారు. కోవిడ్ మనకు ఎన్నో అనుభవాలు నేర్పింది. వైద్య రంగాన్ని అతలాకుతలం చేసింది. అయినా పేదవాడి ప్రాణాలకు భరోసా ఇచ్చే రీతిలో కేటా యింపులు కన్పించడం లేదు. ప్రైవేట్ కాలేజీలు నర్సింగ్ కోర్సులు పెట్టుకునేందుకు ముందుకు రావడం లేదు. లాభాలు తక్కువగా వస్తున్నాయని వెనకడుగు వేస్తున్నాయి. కాబట్టే నర్సింగ్ కాలేజీ లకు నిధులు కేటాయించారు. కానీ అందరికీ వైద్యం అందించేందుకు తీసుకున్న చర్యలేమిటో, కేటాయించిన నిధులెంతో ప్రభుత్వం చెప్పలేదు. విద్య, వైద్యాన్ని విస్మరిస్తే పురోగతి ఎలా సాధ్య మవుతుంది? ఏదేమైనా ఈ బడ్జెట్ పేదలకు ఏ మాత్రం ప్రయోజనం చేసేది కాదు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగానే ఉంది. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తిలోదకాలిచ్చిన నేపథ్యం తాజా బడ్జెట్ కూర్పులో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రభావం మున్ముందు అనేక దుష్ఫలితాలకు దారి తీస్తుంది. జి. హరగోపాల్ వ్యాసకర్త సామాజిక, ఆర్థిక విశ్లేషకులు -
వీరికి సడన్‌గా ఏపీపై ఎందుకంత ప్రేమ?
కొద్ది రోజుల క్రితం విజయవాడలో రాజధాని అమరావతిపై ఒక సమావేశం జరిగింది. రాజధాని ఉద్యమం 900 రోజుకు చేరిందంటూ ఆ సమావేశం పెట్టారు. అందులో మాట్లాడిన కొందరు వక్తలు చాలా ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. అందులోను రిటైర్డ్ న్యాయమూర్తి గోపాలగౌడ, తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్, పౌరహక్కుల నేత ఫ్రొఫెసర్ హరగోపాల్ ప్రభృతులు ఉన్నారు. సీపీఐ నారాయణ వంటివారు ఈ సమావేశంలో పాల్గొన్నా, వారు ఎప్పుడూ చెప్పే విషయాలు చెబుతుంటారు కాబట్టి, వారు అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారన్న అబిప్రాయం ఉంది కాబట్టి వారి గురించి ప్రత్యేకంగా ఏమీ అననవసరం లేదు. కాకపోతే గోపాలగౌడ గతంలో రాజధాని భూముల సమీకరణకు వ్యతిరేకంగా కూడా వచ్చి మాట్లాడి వెళ్లినట్లు గుర్తు. అప్పట్లో ఆ రకమైన సమీకరణ రైతులకుఅన్యాయం చేసినట్లు అవుతుందని చెప్పారు. కాని ఇప్పుడే అదే గౌడ వచ్చి రాజధానిలో మార్పులు ఉండరాదని, మొత్తం లక్షన్నర కోట్లు అయినా అక్కడే వ్యయం చేయాలని చెప్పి అందరిని విస్తుపరిచారు. వీరు సామాజిక బాధ్యతతోనే మాట్లాడారా?లేక అమరావతి రైతుల ముసుగులో ఉన్న కొందరు వ్యాపారులు తీసుకు వచ్చారు కనుక వారికి లాభం చేకూర్చాలన్న ఉద్దేశంతో మాట్లాడారో అర్ధం కాదు. రాజధాని పై హైకోర్టు తీర్పు అమలు చేయాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. పైగా తీర్పు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి, మంత్రులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన అన్నారు. ఒక న్యాయ కోవిదుడు ఇలా మాట్లాడడమా? అసలు శాసనసభకు చట్టం చేసే హక్కే లేదని గౌరవ హైకోర్టు తీర్పు ఇస్తే దానిని ఇలాంటి మాజీ న్యాయమూర్తులు సమర్దించడమా? పైగా అమలు చేయకపోతే కేసులు పెట్టాలని అనడమా? ఎంత దారుణం. హైకోర్టు తీర్పుపై ఏపీ శాసనసభలో క్షుణ్ణంగా చర్చించి, హైకోర్టు కాని, శాసన వ్యవస్థ కాని ఎవరి పరిధులలో వారు ఉండాలని పేర్కొనడం గురించి గౌడ మాట్లాడరా? కాకపోతే జడ్జిలకు బంగ్లాలు నిర్మించలేదని బాదపడ్డారు. మరి ఇదే సమయంలో రాజధాని భూ స్కామ్ కేసులు, వాటిని న్యాయ వ్యవస్థ హాండిల్ చేసిన తీరు గురించి కూడా గౌరవ న్యాయమూర్తి చర్చించి తన అబిప్రాయాలు చెబితే బాగుండేది కదా? గౌరవ న్యాయమూర్తులు కొందరికి అమరావతిలో భూ ప్రయోజనాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబితే ,దానిని న్యాయ వ్యవస్థ ఎలా స్వీకరించాలో కూడా ఈయన వివరించి ఉండాల్సికదా. రాజధానిలో ఇప్పటివరకు చేసిన నిర్మాణాల గురించి, వాటిని అబివృద్ది చేయండని చెప్పడం తప్పుకాదు. కానీ ఇప్పటికే ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల అప్పు చేసింది కనుక మరో లక్షన్నర కోట్ల అప్పు తెచ్చి అమరావతి ప్రాంతంలోనే వ్యయం చేయాలని అనడం మాత్రం గౌడ ది పూర్తిగా బాద్యతారాహిత్యం. కేవలం కొందరికి మేలు చేసేందుకే ఆయన అలా మాట్లాడారేమోనన్న అభిప్రాయం కలుగుతుంది. వేరే రాష్ట్రానికి చెందిన ఈయనకు శ్రీ బాగ్ ఒడంబడిక, వికేంద్రీకరణ,తదితర అంశాల గురించి తెలిసి ఉండకపోవచ్చు. అలాగే శివరామకృష్ణన్ కమిటీ మూడు పంటలు పండే భూములలో రాజధాని పెట్టవద్దని చెప్పిన సంగతిని ఆయనకు ఎవరూ చెప్పకపోయి ఉండవచ్చు. ఆయన మేధావి కావచ్చు. న్యాయ కోవిదుడు కావచ్చు.కాని ప్రజల మనిషి కాదని మాత్రం తనకు తాను రుజువు చేసుకున్నారేమో అని పిస్తుంది. ఇక మరో ప్రముఖుడు హరగోపాల్ చేసిన వ్యాఖ్యలు కూడా అనుచితంగా ఉన్నాయనిపిస్తుంది. రాజధాని మార్చరాదని అభిప్రాయం ఉంటే ఆక్షేపణీయం కాదు. కానీ ఆయన విజయవాడ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారుల సరసన కూర్చుని ఇలా మాట్లాడతారని ఎవరూ ఊహించలేం. ఆయనను ఎవరు మాయ చేసి తీసుకు వచ్చారో తెలియదు కానీ, ఎవరి ట్రాప్ లో పడి వచ్చారో తెలియదు కానీ ,పూర్తిగా పేదల ప్రయోజనాలను ఆయన విస్మరించడం విస్తుపరుస్తుంది. రాజధాని ప్రాంతంలో పేదలైన ఎస్.సి,ఎస్టి, బిసి వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని డిమాండ్ చేసేవారికి ఆయన మద్దతు ఇవ్వడమా? ఇలాగేనా పౌరహక్కులు కాపాడడం అంటే?ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారకూడదట. మరి తెలంగాణ ఉద్యమం సమయంలో ఏమి ప్రచారం చేశారు. ఆంద్ర పెట్టుబడిదారులు దోచుకుపోతున్నారని కదా? అలాంటి ఉద్యమానికి హరగోపాల్ కూడా మద్దతు ఇచ్చారు కదా? అంటే తెలంగాణలో ఆంధ్ర పెట్టుబడిదారులు దోపిడీ చేయకూడదు. ఏపీలో మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ ఇష్టారీతిన భూముల రేట్లు పెంచి దోపిడీ చేయవచ్చని హరగోపాల్ వంటివారు చెబుతున్నారా? రాజధానిని కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చితే దానికి ఆయన మద్దతు ఇవ్వడమా? హవ్వ! ఇదేనేమో కాలమహిమ! హరగోపాల్ వంటివారిని కూడా అప్రతిష్టపాలు చేయగల తెలివైన రాజకీయనేతలు ఎపిలో ఉండడం విశేషమే. హైకోర్టు తీర్పు ఇచ్చింది కనుక దానిని అమలు చేయకపోతే వ్యవస్థపై నమ్మకం పోతుందట. మరి ఇదే హరగోపాల్ ఎన్ని కోర్టు తీర్పులను విమర్శించలేదూ. అంతదాక ఎందుకు విప్లవకవి వరవరరావుకు బెయిల్ ఇవ్వరాదని ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సమర్ధిస్తారా? కోర్టులను విమర్శించకూడదు. న్యాయమూర్తులకు ఆపాదించకూడదు అన్నది వాస్తవమే అయినా, తీర్పులపై విశ్లేషించుకోవచ్చు.. విమర్శించవచ్చన్న సంగతి మేధావి అయిన హరగోపాల్ కు తెలియకుండా ఉంటుందా? న్యాయ వ్యవస్థ లో ఏమి జరుగుతోందో తెలియనంత అమాయకంగా హరగోపాల్ ఉన్నారా? తెలంగాణ ఉద్యమంలో హైకోర్టు జడ్జిలనే నేరుగా కోర్టులలోనే దూషించిన ఘట్టాలు జరిగినప్పుడు , వారిపై దాడి చేసినంత పని చేసినప్పుడు హరగోపాల్ ఖండించారో ,లేదో గుర్తు లేదో కానీ, ఇప్పుడు ఆయనకు సడన్ గా న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం కలగడం మంచిదే అనుకోవాలా? మరో మేధావి తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రవారిని ఉద్యమకారులు కొందరు దూషిస్తున్న సమయంలో ఎన్నడైనా వారించారా? ఆంధ్రులపై కొన్ని చోట్ల దాడులు జరిగినప్పుడు ఖండించారా? ఇప్పుడు సడన్ గా ఏపీపై అంత ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చింది. దానికి కారణం టిడిపి అదినేత చంద్రబాబుతో ఏర్పడిన సన్నిహిత సంబంధాలేనేనా? గత ఎన్నికల సమయంలో టిడిపి,కాంగ్రెస్, సిపిఐలతో కలిసి పోటీచేసిన కోదండరామ్ పార్టీకి మెజార్టీ చోట్ల డిపాజిట్ లు దక్కకపోయి ఉండవచ్చు. అయినా ఆనాడు కోదండరామ్ పార్టీకి అవసరమైన వనరులు అన్నీ టీడీపీ నాయకత్వం సమకూర్చిందన్న కృతజ్ఞతతోనే వారు విజయవాడ వరకు వెళ్లి ,అమరావతికి మద్దతు ఇచ్చి వచ్చారా? ఒక టెంట్ కింద కూర్చుని, టీడీపీ మీడియాతో మాట్లాడి వెళ్లిపోయేవారు మహోద్యమం చేసినట్లుగా వీరంతా గుర్తించారన్నమాట. వీరంతా అమరావతి రాజధాని ఒకే చోట ఉండాలని కోరదలిస్తే ,దానికి నిలదీయాల్సింది కేంద్రాన్ని కదా? లక్ష కోట్లా.?ఇంకా ఎక్కువ కోట్లా అన్నదానితో నిమిత్తం లేకుండా కేంద్రం నిధులు ఇవ్వాలని వీరు ఎందుకు డిమాండ్ చేయలేదో తెలియదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారరాదట. అలాగైతే 1956లొ సమైక్య రాష్ట్రానికి నాటి హైదరాబాద్ అసెంబ్లీ కూడా మద్దతు ఇచ్చింది కదా? మరి ఆ నిర్ణయం మారే వరకు ఎందుకు తెలంగాణవాదులు ఆందోళనలు చేశారు. పలు ప్రభుత్వాలు తెలంగాణ ఇవ్వడం కుదరదని, హైదరాబాద్ చుట్టూరానే అనేక సంస్థలు ఏర్పాటు చేసినా, ఎందుకు ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించారు? ఇప్పుడు కూడా ఏపీలో అయినా, మరెక్కడైనా ప్రభుత్వ అబిప్రాయాలను అంతా ఆమోదించనవసరం లేదు. నచ్చకపోతే నిరసనలకు దిగవచ్చు. తప్పు లేదు. కాకపోతే అవి హేతుబద్దమా?కాదా? ప్రజలంతా ఆమోదిస్తారా?లేదా అన్నది ఎన్నికలలో తేలుతుంది. అంతవరకు ఎందుకు ఆగడం లేదు? ఏది ఏమైనా అసలు ఆంధ్రకు ఈ దుస్థితి ఏర్పడడానికి కారణమైనవారితో సుద్దులు చెప్పించడం వారికే చెల్లిందని అనుకోవాలి. తెలంగాణ వాదులుగా పచ్చి ఆంద్ర వ్యతిరేకులుగా ముద్ర పడ్డ నేతలను విజయవాడ తీసుకు వచ్చి అమరావతి గురించి మాట్లాడించడమే ఆశ్చర్యంగా ఉంటుంది. నిర్వాహకుల చిత్తశుద్ది ఏమిటో తెలుస్తుంది. ఆంద్రా బాగుపడాలని కోరుకునేవారిని పిలవాలి కాని, ఆంద్ర అంటే గిట్టనివారిని తీసుకు రావడం ద్వారా వారు ఏమి చెప్పదలిచారు? రాజదాని రైతుల భూములు పోయాయట .మరి వారు తీసుకుంటున్న పరిహారం మాటేమిటి. వారు భూములు అమ్ముకోవడం ద్వారా కోట్లు సంపాదించిన మాటేమిటి. రైతులు ఎవరికైనా అన్యాయం జరిగితే దాని గురించి ఎవరైనా అడగవచ్చు.కాని ఆ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారుల లక్ష్యాల కోసం పనిచేయడం సరికాదు .నిజాయితీ ఉంటే రియల్ ఎస్టేట్ వారికి నష్టం కలుగుతుంటే ఆ విషయాన్ని ధైర్యంగా చప్పి ప్రభుత్వాన్ని పరిష్కారం కోరవచ్చు.కాని వారు అలా చేయడం లేదు. రైతుల పేరుతో డ్రామాలు నడుపుతున్నారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ గురించి అందరికి తెలిసినా, అసలు ఏమి జరగనట్లు నటిస్తున్నారు.వేల ఎకరాల భూములు ఎలా చేతులు మారాయో తెలియదా? ఇలాంటి వాటికి హరగోపాల్, కోదండరామ్, గోపాలగౌడ వంటివారు మద్దతు ఇవ్వడమా?, ఇది ఒక విషాదం. ఇదే సమయంలో వీరు మరో మాట చెప్పారు. తీర్పు తర్వాత రాజధాని మారదన్న నమ్మకం రైతులలో వచ్చిందని, హైకోర్టు అన్ని కోణాలలో పరిశీలించి తీర్పు ఇచ్చిందని వీరు అభిప్రాయపడుతున్నారు. ఇది మారదన్న భావన ఉన్నప్పుడు ఇక ఉద్యమం అవసరం ఏమి ఉంటుంది? తెలంగాణ నేతలను పిలుచుకు రావల్సిన అవసరం ఏమి ఉంటుంది?అయినా ఏపీ ప్రభుత్వం అమరావతి గ్రామాలలో అభివృద్ది చేయబోమని ఎక్కడా చెప్పలేదు. కాకపోతే మొత్తం ఏపీ ప్రజల డబ్బు అంతా తెచ్చి కేవలం కొన్ని గ్రామాలలో వ్యయం చేయలేమని చెబుతోంది.అ ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోకుండా పెట్టుబడిదారుల కోసమే తెలంగాణ నేతలు వచ్చి ప్రసంగాలు చేస్తే ఆంధ్ర ప్రజలు సమ్మతిస్తారా? -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
ఆర్కేను రక్షించుకోలేకపోయాం: కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి
సాక్షి, అమరావతి/టంగుటూరు/చర్ల (ఖమ్మం)/కొరాపుట్ (ఒడిశా): సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ (63) అలియాస్ రామకృష్ణ, ఆర్కే, సాకేత్, మధు, శ్రీనివాస్‌కు వైద్యం అందించినప్పటికీ రక్షించుకోలేకపోయామని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ స్పష్టం చేశారు. ఆర్కే మరణాన్ని ధృవీకరిస్తూ శుక్రవారం ఓ ప్రకటన, అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను శనివారం విడుదల చేశారు. ఆర్కేకు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య మొదలుకాగా, వెంటనే డయాలసిస్ ప్రారంభించినప్పటికీ.. కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయని, పర్యవసానంగా ఈ నెల 14న ఉదయం 6 గంటలకు అమరుడయ్యారని అభయ్ పేర్కొన్నారు. ఆర్కేకు విప్లవ శ్రేణుల మధ్య అంత్యక్రియలు నిర్వహించామని, ఆయన మృతి పార్టీకి తీరనిలోటని చెప్పారు. సాధారణ జీవితం, అకుంఠిత దీక్ష, ప్రజల పట్ల ప్రేమ, కామ్రెడ్స్‌తో ఆప్యాయతలు, విప్లవ గమనంపై స్పష్టతతో విప్లవోద్యమానికి నిస్వార్థంగా సేవలు అందించారని కొనియాడారు. ఆర్కే ఆశయాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అంత్యక్రియలకు భారీగా హాజరైన ఆదివాసీలు ► ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడు – కొండపల్లి మధ్య అటవీ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ శ్రేణుల సమక్షంలో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించారు. ► ఈ సందర్బంగా ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండాను ఉంచి మావోయిస్టులు నివాళులు అర్పించారు. ఆర్కే అంత్యక్రియల్లో బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని పాలగూడ, గుండ్రాయి, కంచాల, మీనగట్ట, దామారం, జబ్బగట్ట తదితర గ్రామాల నుంచి సుమారు 2 వేల మందికిపైగా ఆదివాసీలతో పాటు పెద్ద ఎత్తున మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. భారీ ర్యాలీ నిర్వహించినట్లు సమాచారం. ఆలకూరపాడులో ఆర్కే చిత్రపటానికి నివాళులర్పిస్తున్న భార్య శిరీష, కుటుంబ సభ్యులు లొంగిపోయుంటే బతికుండేవారు ఆర్కే మృతి విషయాన్ని ఒడిశాలోని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పిళ్లై ఓ వీడియో ద్వారా వెల్లడించారు. పోలీసులకు లొంగిపోయుంటే ఆర్కేకు నాణ్యమైన వైద్యం అందేదని, బతికేవాడన్నారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో గతంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు రామన్న, హరి భూషణలతో పాటు దండకారణ్యం జోనల్ స్పెషల్ కమిటీ సభ్యులు శోభరాజ్, గంగా, వినోద్‌లు సైతం ప్రాణాలు విడిచారని ఐజీ గుర్తు చేశారు. ఆర్కేకు ఘన నివాళి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఆర్కే భార్య శిరీష, కుటుంబ సభ్యులు, అమరుల బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఆర్కే చిత్రపటానికి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ‘ఆర్కే అమర్ రహే.. అమరవీరులకు జోహార్లు’ అంటూ నినాదాలు చేశారు. ఉద్యమ గీతాలు ఆలపించారు. ‘నా భర్తతో పాటు కుమారుడు వీరత్వం పొందాడని గర్వంగా భావిస్తున్నాను. ఆర్కే మృతితో ఉద్యమం ఆగిపోదు. ఆయనలాంటి గెరిల్లా యుద్ధ వీరులు ఇంకా పుట్టుకొస్తారు’ అని శిరీష అన్నారు. ‘ప్రజల కోసం జీవిస్తాం.. ప్రజల కోసమే మరణిస్తాం’ అన్న మాటను ఆర్కే నిలబెట్టుకున్నాడని అమరవీరుల బంధుమిత్రుల సంఘం స్టేట్ సెక్రటరీ భవాని పేర్కొన్నారు. ‘ఆర్కే ప్రజల మనిషి. ప్రజల హృదయాల్లో ఉంటాడు. ఆయన ప్రజల కోసమే అమరుడయ్యారు’ అని విరసం నేత కళ్యాణరావు పేర్కొన్నారు. కాగా, శుక్రవారం ఆర్కే మరణ వార్తను ధ్రువీకరించుకుని శిరీష, బంధుమిత్రులు విలపించారు. శిరీషను విరసం అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పినాకపాణి, సహాయ కార్యదర్శి రివేరా, అమరుల బంధు మిత్రుల సంఘం సభ్యురాలు శోభా తదితరులు పరామర్శించారు. -
అప్పట్లో ఇలానే ఉంటే తెలంగాణ వచ్చేదా?
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ఉమ్మడి రాష్ట్రంలో ఇంత నిర్బంధం ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా?అని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రావడానికి గల ఉద్యమాలను మర్చిపోయి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని, యూనియన్లు అవసరం లేదని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉపా చట్టం కింద అందరినీ అరెస్టు చేస్తే తెలంగాణను సాధించుకునే వారిమా? అని ప్రశ్నించారు. ఇప్పటి ప్రభుత్వం కంటే అప్పటి ప్రభుత్వమే ప్రజాస్వామికంగా ఉందని అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్లో (టీపీటీఎఫ్) టీడీఎఫ్, టీడీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు విలీనమైన సందర్భంగా సదస్సు జరిగింది. ఈ సదస్సులో హరగోపాల్ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ కాశింను అరెస్టు చేసిన పద్ధతి అప్రజాస్వామికం అని అన్నారు. వైస్ చాన్స్‌లర్ అనుమతి లేకుండా పోలీసులు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ చక్రధర్‌రావు, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఏపీటీఎఫ్ మాజీ అధ్యక్షుడు ఎ.నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీపీటీఎఫ్ నూతన కమిటీ.. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) నూతన కమిటీని ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రకటించా రు. అధ్యక్షుడిగా కె.రమణ, అసోసియేట్ అధ్యక్షుడిగా వై.అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా మైస శ్రీనివాసులు, అదనపు ప్రధాన కార్యదర్శిగా నన్నెబోయిన తిరుపతి, ఉపాధ్యక్షులుగా బి.రమేష్, పి.నారాయణమ్మ, ఎం.రవీందర్, జి.తిరుపతిరెడ్డి, కె.కిషన్‌రావు, రావుల రమేష్, కార్యదర్శులుగా పి.నాగమణి, పి.నాగిరెడ్డి, ఎం.రామాచారి, జె.చంద్రమౌళి, ఎ.రాంకిషన్, కె.కనకయ్య, మాడుగుల రాములు తదితరులు ఎన్నికయ్యారు. కాశింపై కేసులు ఎత్తివేయాలి సుల్తాన్‌బజార్: విరసం కార్యదర్శిగా కొత్తగా ఎన్నికైన కాశింను విడుదల చేసి ఆయనపై మోపిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. వ్యవస్థాపక సభ్యుడు వరహరరావు ఏడాదికి పైగా పూణె జైలులో ఉన్నారని సభ్యులమీద సైతం కేసులు నడుస్తున్నాయని అన్నారు. ప్రజల పక్షాన మాట్లాడే ప్రజా సంఘాల నేతలను రాష్ట్ర ప్రభుత్వం జైళ్లకు నెడుతోందని మండిపడ్డారు. రాష్ట్రం కోసం విద్యార్థి దశ నుంచి ఎన్నో పోరాటాల్లో భాగమైన కాశింను అక్రమంగా అరెస్ట్ చేయడం తగదన్నారు. ప్రజా సంఘాల బాధ్యులను వరుసగా అరెస్టు చేసి మొత్తం సమాజాన్ని ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తుందని మండిపడ్డారు. సమావేశంలో విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ, సహాయ కార్యదర్శి రివేర, కాశిం తల్లి వీరమ్మ పాల్గొన్నారు. -
రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు ప్రజాసంఘాల పిలుపు
సాక్షి, హైదరాబాద్ : విరసం నేత వరవరరావు అరెస్ట్‌కు నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణల నేపథ్యంలో విరసం నేత వరవరరావును మంగళవారం పుణె పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తొలుత వరవరరావు ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. ఆపై ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వరవరరావు అరెస్ట్‌పై ఎవరేమన్నారంటే.. ప్రో. హరగోపాల్ : దేశ వ్యాప్తంగా దాడులు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేక శక్తులను ఇరుకున పెట్టె ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని చూస్తే సిగ్గేస్తుంది. పూణే పోలీసులు హైదరాబాద్‌లో చేస్తున్న సోదాలపై డీజీపీ, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశా. కానీ ఎవరూ అందుబాటులోకి రాలేదు. పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాము. కేసీఆర్ కోసం ఉద్యమం చేయలేదు. ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇలా దాడులు చేయలేదు. భవిష్యత్‌లో ఇలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు కార్యాచరణ రూపొందిస్తాము. వరవరరావు అరెస్ట్‌పై ప్రజా సంఘాలు : ప్రజల హక్కుల గురించి మాట్లాడితే ప్రభుత్వం ఇలా దాడులు చేస్తుందని హెచ్చరికలు పంపింది. ఉదయం 6గంటల నుండి దేశ వ్యాప్తంగా దాడులు జరిపారు. వరవరరావు ఇంట్లోకి ప్రవేశించిన మహారాష్ట్ర పోలీసులు ల్యాండ్ లైన్ ఫోన్ వైర్ కట్ చేశారు. వరవరరావు, అతని భార్య హేమలత సెల్ ఫోన్స్ లాక్కున్నారు. ఎవరితో మాట్లాడకుండా 8గంటల పాటు తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు బంధించారు. క్రాంతితో పాటు అతని బందువుల ఇళ్లపై దాడి చేశారు. జూన్ 6న కూడా ఇదే తరహాలో దాడులు చేశారు. భీమా కోరేఘం పేరుతో రాంచీ, మహారాష్ట్ర, ఢిల్లీ, హైదరాబాద్‌లో అరెస్టులు చేశారు. లెటర్లు అన్ని బోగస్ దొంగ ఉత్తరాలు. మోదీ తన గ్రాఫ్ పడిపోతుందని అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. అబద్ధపు ఉత్తరం మీద అక్రమ కేసులు పెట్టారు. కోర్టులో ఇలాంటి కేసు నిలబడదు. ఇంట్లో సోదాలు చేసి పంచనామా రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేశారు. వారి వద్ద ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేదు. మాట్లాడే వాళ్లను భయపెట్టే భాగంలో ఇలాంటి దాడులు చేస్తున్నారు. ఈ దాడులను ఖండిస్తున్నాము. వరవరరావు భార్య హేమలత : 50 ఏళ్లుగా అరెస్టులు చేస్తున్నారు. 25 కేసులు పెట్టారు. తప్పుడు కేసులన్ని కోర్టులో వీగిపోయాయి. ఇంట్లో అణువణువు గాలించారు. మా కూతుళ్ల ఇళ్లలో కూడా సోదాలు చేశారు. అరెస్టులు మాకు కొత్త కాదు. 70 ఏళ్ల మనిషి.. అనారోగ్యంతో బాధపడుతున్నడు(కన్నీళ్లు తుడుచుకుంటూ). అక్కడ ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తారో. క్రాంతి(జర్నలిస్ట్) : రాత్రి 8 గంటలకు ఇంట్లోకి ప్రవేశించి ఫోన్లు లాక్కున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చి ఓ కాగితం చేతిలో పెట్టి 20మంది తెల్లవార్లు సోదాలు చేశారు. మా అమ్మ హార్ట్ పేషెంట్ అని చూడకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. ఎఫ్ఐఆర్లో పెరు లేకుండా తన ఇంట్లో సోదాలు చేశారు. నా వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం లాగేసుకున్నారు. పలాన కేసు విషయంలో సోదాలు చేస్తున్నామనే విషయాన్ని కూడా చెప్పలేదు. కుర్మా నాథ్ (జర్నలిస్ట్) : మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు 5 గంటలపాటూ మా ఇంట్లో చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఆంధ్రపాలకుల సమయంలో ఇలాంటి దాడులు ఎన్నడూ చేయలేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే సందర్భంలో అతని వ్యతిరేక శక్తులు ఉండోదనే మోదీని ప్రసన్నం చేసుకున్న కేసీఆర్ ఈ దాడులు చేయించారు. ఇంట్లో ఉన్న విలువైన మా వ్యక్తి గత సమాచారాన్ని ఎత్తుకెళ్లారు. -
రాష్ట్రంలో హక్కుల ఉల్లంఘన ఆపాలి
హైదరాబాద్: కేసీఆర్ కుటుంబ పాలనలో పౌర, ప్రజాస్వామిక హక్కుల ఉల్లంఘన రోజురోజుకూ తీవ్రమవుతోందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. గురువారం హైదరాబాద్ హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 20న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ విద్యార్థి సంఘం తలపెట్టిన రాష్ట్ర మహాసభలను టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన తెలంగాణ విద్యార్థి సంఘం మహాసభలను అడ్డుకోవడమంటే అమరుల త్యాగాలను అవమానించడమేనని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో 144 సెక్షన్‌ను ఎత్తివేసి మహాసభలు సజావుగా జరిగేలా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థి ఉద్యమాలపై ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్బంధకాండను మానుకుని, విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆయన కోరారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుని చెరకు రైతులను, కార్మికులను ఆదుకోవాలని, ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఆదివాసీ గూడేలపై అటవీశాఖ చేస్తున్న దాడులు ఆపాలని హరగోపాల్ డిమాండ్ చేశారు. సమావేశంలో బండి దుర్గాప్రసాద్, పీడీఎం.రాజు, అరుణాంక్ తదితరులు పాల్గొన్నారు. -
టీఎస్పీఎస్సీ సమీక్షా కమిటీ నివేదిక
-
ప్రజలు భయంతో బతికే పరిస్థితి రానివ్వకండి
తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రొ. హరగోపాల్ బహిరంగ లేఖ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, మీకు బెంగళూరు నుండి ఫ్యాక్స్ ద్వారా ఒక విజ్ఞప్తి చేశాను. అది మీ దృష్టికి తప్పకుండా వచ్చి ఉంటుంది. ఏ విజ్ఞప్తులు చేసినా మీరు ఎవరి సలహా తీసుకున్నారో తెలియదు కాని, తెలంగాణ ప్రభుత్వం ఒక సభకు అనుమతించకపోవడమే కాక, రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను, సభకు రావాలనుకుంటున్న వాళ్లందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పౌరహక్కుల సంఘం కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. (పౌరహక్కుల సంఘం తన సుదీర్ఘ చరిత్రలో మిమ్మల్ని తప్పించి ఏ రాజకీయ నాయకుడినీ పిలిచిన దాఖలాలు లేవు. మీరు ఒక ఉద్యమ పార్టీకి నాయకుడని, ఉద్యమ అనుభవాల దృష్ట్యా పౌరహక్కుల ఉల్లంఘనల మీద మీకు ఒక అనుభవముంటుందని హక్కుల సంఘం భావించింది. మీరు అప్పుడు మాట్లాడిన ప్రసంగం హక్కుల ఉద్యమానికి ఒక విశ్వాసం కల్పించింది.) అలాగే మీటింగ్ జరిగే స్థలంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి రాజ్యాంగం ద్వారా లభించిన ‘మీటింగ్ హక్కు’ను గౌరవించకపోవడం మా లాంటి వాళ్లను చాలా ఆశ్చర్యపరచింది. ఈ మీటింగ్ మావోయిస్టుల మీటింగ్ అని, మావోయిస్టు నాయకులు మీటింగ్‌కు వస్తున్నారని, తెలంగాణలో మళ్లీ మావోయిస్టు ప్రభావం ప్రబలుతుందని, పారిశ్రామికవేత్తలు ఇక రారని తప్పక మీకు సలహా ఇచ్చి ఉంటారు. అలాగే ముఖ్యమంత్రిగా మీరు చాలా దృఢ నిశ్చయంతో ముందుకు పోవాలని చాలా బలంగానే చెప్పి ఉంటారు. కానీ వాస్తవాలు అలా ఉండవు. మావోయిస్టు పార్టీ ప్రభావం, ఆ రాజకీయాల ఎదుగుదలకు సమాజంలో ఉండే సమస్యలు, రాజ్య అణచివేత ప్రధాన కారణాలు. ఒక స్వేచ్ఛ కలిగిన సమాజంలో అన్ని రాజకీయ అభిప్రాయాలూ వ్యక్తీకరించే ఒక ప్రజాస్వామ్య సంస్కృతి కావాలి. నిజానికి మావోయిస్టు పార్టీ చర్చలకు వచ్చినప్పుడు తుపాకులు లేకుండా తమ రాజకీయ అభిప్రాయాలను చెప్పుకునే స్వేచ్ఛ కావాలని అడిగారు. స్వేచ్ఛగా రాజకీయ అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం ఉంటే అలాగే అణచివేత లేకపోతే తమకు తుపాకులను ఉపయోగించే అవసరమే ఉండదని, తాము ఆత్మ రక్షణ కోసం తప్ప ఆయుధాలను ఉపయోగించమని స్పష్టంగా ప్రభుత్వానికి చెప్పారు. ఆ చారిత్రక అవకాశాన్ని అప్పటి ప్రభుత్వం కావాలనే నీరు గార్చింది. పౌర స్పందన వేదికలో మీ గౌరవం, మీ పార్టీ గౌరవం పొందిన జయశంకర్ గారు కూడా సభ్యుడు. శాంతి చర్చలు విఫలమవుతున్న సందర్భంలో ‘డాక్టర్ సాబ్, తెలంగాణ రాష్ట్ర నిర్మాణం తప్ప వేరే గత్యంతరం లేద’ని ఆయన నాతో అన్నాడు. ఇవ్వాళ జయశంకర్ గారు బతికుంటే ఏం చేసేవాడో తెలియదు. తెలంగాణ ఏర్పడినా మనకు ఒక ప్రజాస్వామ్య తెలంగాణ విజన్ ఉండాలి కదా అంటే తెలంగాణ రానివ్వండి డాక్టర్ సాబ్, మనమే ఉంటాం కద అనేవాడు. తెలంగాణ వస్తే మన హోంమినిస్టర్ ఉంటాడు, ఇప్పుడు తెలంగాణ వాళ్లకు హోంమినిస్టర్ పదవి నామమాత్రంగా ఇచ్చి అధికారాన్ని ఆంధ్ర ప్రాంతం వాళ్లు చలాయిస్తున్నారు అంటూ తెలంగాణలో పరిస్థితి అలా ఉండదు కదా అనేవాడు. చంద్రశేఖర్‌రావు గారూ... ఏ కారణమేదైనా మీటింగ్‌ను జరగనివ్వకపోవడమే కాక హైద్రాబాదులో, జిల్లాలలో చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలను అదుపులోకి తీసుకొనడం ద్వారా పోలీస్ యంత్రాంగానికి చాలా అధికారాలు ఇవ్వడమవుతుంది. ఇక వాళ్లు ప్రజలను వేధించడం ప్రారంభిస్తే ఆపైన మీ చేతిలో కూడా ఏమీ ఉండదు. ఉద్యమ సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుభవించిన వేధింపులు, అసహజ హత్యలు మీకు తెలియనివి కావు. మొత్తం అణచివేత నుండి తెలంగాణ బయటపడిందని ఊపిరి తీసుకుంటున్న సందర్భంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొనడం తెలంగాణ ప్రజలను నిర్ఘాంతపరచింది. చుక్కా రామయ్య గారు, పొత్తూరు వెంకటేశ్వర్రావు గారు, నేను మీతో కలవడానికి ప్రయత్నం చేశాం. నిజానికి మీతో కలిసి పరిస్థితిని, రాబోయే పరిణామాలను మీకు వివరించవలసిన బాధ్యత మా మీద ఉందని భావించాం. ఉదయం వరవరరావు గారిని అదుపులోకి తీసుకున్నారని పొత్తూరు వెంకటేశ్వర్రావు గారితో చెప్తే ‘ఇక నేను ఎక్కువ కాలం బ్రతకడం లాభం లేద’ని ఆయన అంటే నేను చలించిపోయాను. ఆ మనిషి ఆ వయసులో అంత బాధపడ్డాడంటే, తెలంగాణను తెలంగాణ ప్రజలను ఎంత ప్రేమించారో మీరు ఊహించవచ్చు. పొత్తూరు గారు తెలంగాణ గ్రామాలను తిరిగాడు, వాళ్లు అనుభవించిన హింసను కళ్లారా చూశాడు, అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజలు స్వేచ్ఛగా బతుకుతారని భావించి, గుంటూరుకు చెందిన వాడైనా తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డాడు. గత మూడు నెలలుగా దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా తెలంగాణ ప్రజాస్వామ్య సంస్కృతి గురించి ప్రసంగించాను. మీ గురించి కూడా వివరించాను. ఉద్యమ నాయకుడు కాబట్టి మిగతా ముఖ్యమంత్రుల లాగా ఉండరని విశ్లేషించాను. మీరు ఒక తొందర నిర్ణయం వలన మా లాంటి వాళ్లను చాలా ఇబ్బందికి గురిచేశారు. తెలంగాణ వ్యతిరేకులు చాలా సంతోషంగా ఉన్నారు. ఉంటారు కూడా. నాకు అర్థం కాని అంశం, మీరు నిర్ణయం తీసుకునే ముందు కొందరు పెద్దలనైనా సంప్రదించవలసింది. వరవరరావు లాంటి వాళ్లతో మీరు డెరైక్ట్‌గా మాట్లాడవలసింది. వరవరరావు గారిని గతంలో మీరు ఒక కేంద్ర మంత్రిగా వెళ్లి కలసినప్పుడు, ఇప్పుడు ఆయనతో మాట్లాడడంలో మీకు ఇబ్బంది ఉండకూడదు. సార్, తెలంగాణ వాడిగా, పౌరహక్కుల కార్యకర్తగా, ఒక రాజనీతిశాస్త్ర బోధకుడుగా మీకు ఒక సలహా. అడగని సలహాలకు అంత గౌరవం ఉండదు. ఐనా చెప్పవలసిన బాధ్యత నాది. నేను ఎన్టీఆర్ దగ్గర నుండి కిరణ్‌కుమార్‌రెడ్డి దాకా ప్రతి ముఖ్యమంత్రికి నా అభిప్రాయాలను చాలా సూటిగా, నిజాయితీగా చెప్పాను. అణచివేత పెరిగిన చోట హింస పెరుగుతుంది, స్వేచ్ఛా సమాజాలలో శాంతి విలసిల్లుతుంది. మీరు తీసుకున్న మొదటి నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోండి. భవిష్యత్తులో తెలంగాణ పల్లెలలో ఏ పరిస్థితిలోనూ ప్రజలను వేధించవద్దని పోలీసు యంత్రాంగానికి కచ్చితమైన ఆజ్ఞలు ఇవ్వండి. అలాగే ఎలాంటి సభలకైనా అవి మావోయిస్టు సభలైనా అనుమతి నిరాకరించకండి. లేకపోతే తెలంగాణ ప్రజలు మీ పాలనను హర్షించరని దయచేసి అర్థం చేసుకోండి. పోలీసులు, కేంద్ర ప్రభుత్వం మీకు సలహాలిచ్చినపుడు, మీ క్యాబినెట్ మంత్రులతో, మీ పార్టీ ప్రతినిధులతో చర్చించండి. నిర్ణయాలు తీసుకుని మొత్తం బాధ్యత మీ మీదే వేసుకోవడం మీకే మంచిది కాదు. తెలంగాణ ప్రజలను మరికొంత కాలం కంటి నిండా నిద్రపోనీయండి. ప్రజలకు మనం ఏమీ ఇవ్వలేకపోయినా, భయంతో బతికే పరిస్థితి రానివ్వకండి అని సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రొ. జి. హరగోపాల్ ఒక తెలంగాణ స్వాప్నికుడు -
కాంగ్రెస్- బీజేపీకి పెద్ద తేడా లేదు
ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌లైన్: దేశంలో జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్, బీజేపీల నడుమ గుణాత్మక తేడా లేదని సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. జార్జిరెడ్డినగర్ (ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల) వద్ద పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభల సందర్భంగా బహిరంగ సభ జరిగింది. హరగోపాల్‌తో పాటు పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల అశోక్, ప్రధాన కార్యదర్శి జేఎల్ గౌతంప్రసాద్, టీఎన్జీవో అధ్యక్షులు దేవీప్రసాద్, ఐఎఫ్టీయూ జాతీయ కార్యదర్శి బి.ప్రదీప్, న్యూడెమక్రసీ రాష్ట్ర నాయకులు పి.రంగారావు, పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఝాన్సీ పాల్గొన్నారు. పీడీఎస్‌యూ ఉద్యమంలో అసువులుబాసిన అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. హరగోపాల్ మాట్లాడుతూ... కాంగ్రెస్, బీజేపీల కూటముల్లో ఏది అధికారంలోకి వచ్చినా అమెరికా, ప్రపంచ బ్యాంకుల చెప్పు చేతల్లోనే ఉంటాయన్నారు. కాంగ్రెస్ నాయకులు సొంత బుర్రలతో ఆలోచించకుండా... వాటిని తాకట్టు పెట్టారన్నారు. విద్యను అమ్ముకునే సంస్కృతి మన దేశంలో మధ్యయుగంలో సైతం లేదన్నారు. ప్రస్తుతం విద్యను, వైద్యాన్ని అమ్ముకుంటున్నారన్నారు. ఉద్యమాల ద్వారానే నవ తెలంగాణాలో మార్పు వస్తుందన్నారు. ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలలో గిరిజనులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న వారి ఆత్మహత్యల లేఖలను పాఠ్యాంశాలలో చేర్చాలని దేవీప్రసాద్ సూచిం చారు. అరుణోదయ కళాబృందం ఆటపాటలు విద్యార్థులను ఆలోచింపచేశాయి.