Harbour Development
-
అభివృద్ధి దిశగా..వడివడిగా అడుగులు
-
వలలో వరాల మూట
సాక్షి, అమరావతి బ్యూరో/నిజాంపట్నం: ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. సీఎం వైఎస్ జగన్ బడ్జెట్లో మత్స్యకారులకు వరాల జల్లు కురిపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మత్స్యకారుల కుటుంబాల సంక్షేమం కోసం ఎన్నడూ లేని రీతిలో బడ్జెట్లో అధిక శాతం కేటాయింపులు చేశారు. దీని ద్వారా జిల్లాలో వేలాది మంది మత్స్యకార కుటుంబాలకు మేలు చేకూరనుంది. సీఎం నిర్ణయంతో జిల్లాలోని మత్స్యకార కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో 161 మత్స్యకార సొసైటీలు, 25,280 మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వేట సమయంలో మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇంతకు మునుపు కేవలం లక్ష రూపాయలు పరిహారం మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుతం దానిని ప్రభుత్వం రూ.10 లక్షలు పెంచారు. నిజాంపట్నం, బాపట్ల, రేపల్లె మండలాల్లో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతిని రూ.4 వేలు నుంచి 10 వేలకు పెంచారు. దీని ద్వారా జిల్లాలో 7968 మంది మత్స్యకారులు లబ్ధి పొందుతున్నారు. ఏడాదికి రూ.15 కోట్ల డీజిల్ రాయితీ జిల్లాలో మత్స్యకారులకు సంబంధించి పెద్ద బోట్లు 218 ఉన్నాయి. వీటికి నెలకు 3 వేల లీటర్ల డీజల్‌ను సబ్సిడీపై ఇస్తారు. 1874 చిన్న బోట్లకు నెలకు 300 లీటర్ల డీజల్‌ను సబ్సిడీపైన ఇవ్వనున్నారు. ప్రభుత్వం డీజిల్ సబ్సిడీని రూ.6.03 పైసల నుంచి రూ.12.06 పైసలకు పెంచింది. గతంలో కేవలం పెద్ద బోట్లకు మాత్రమే సబ్సిడీపై డీజిల్ ఇచ్చేవారు. ప్రస్తుతం చిన్న బోట్లకూ సబ్సిడీపై డీజిల్ అందించనున్నారు. దీంతో ఏడాదికి దాదాపు రూ.15 కోట్ల డీజిల్ సబ్సిడీని మత్స్యకారులు పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రొయ్యల చెరువులు 8123 హెక్టార్లు, చేపల చెరువులు 500 హెక్టార్ల విస్తీర్ణంలో 5500 మంది రైతులు సాగు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్ యూనిట్ రూ.6 చార్జీ ఉండేది. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీని యూనిట్‌కు రూ.2.70 పైసలకు తగ్గించారు. ప్రస్తుతం సీఎం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ చార్జీని యూనిట్‌కు రూ.1.50లకు తగ్గించారు. నిజాంపట్నం హార్బర్ అభివృద్ధి కోసం.. నిజాపట్నం హార్బర్ అభివృద్ధికి మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రత్యేకంగా కృషి చేశారు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న నిజాంపట్నం హార్బర్‌కు బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించారు. హార్బర్లో జెట్టీలను నిర్మించనున్నారు. ప్రస్తుతం బోట్లు నిలుపుకొనేందుకు స్థలం సరిపోవడం లేదు. హార్బర్ రేవు సముద్రంలో కలిసే చోట ఇసుక మేట వేయడంతో బోట్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. కేవలం సముద్రపు పోటు సమయంలో మాత్రమే బోట్లు హార్బర్‌కు వస్తున్నాయి. హార్బర్ పక్కనే ఉన్న రేవులో డ్రెడ్జింగ్ చేసిన ఇసుక దిబ్బలు తొలగించాలి. హార్బర్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలి. ప్రధాన రహదారిలో వీధి దీపాలు వెలగడం లేదు. మంచినీటి సదుపాయం లేదు. ప్రస్తుతం బడ్జెట్లో నిధుల కేటాయింపుతో ఈ సమస్య తీరనుంది. -
హార్బర్ అభివృద్ధిపై ఆశ
నవ్యాంధ్ర రాజధానిగా రూపొందుతున్న జిల్లాకు తీరప్రాంతం ఆయువు పట్టుగా మారనుంది. రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నం హార్బర్ రాష్ట్రంలో విశాఖపట్నం తరువాత అత్యంత ప్రాధాన్యత గలది. విదేశీ మారకద్రవ్య సముపార్జనతో పాటు వేలాదిమందికి ఉపాధి కేంద్రంగా మారిన ఈ హార్బర్ అభివృద్ధి ప్రతిపాదనలకే పరిమితమైంది. అమరావతి అంకురార్పణతోనైనా ఈ దిశగా పాలకులు దృష్టి సారిస్తారని, తమకు మంచి రోజులొస్తాయని తీరప్రాంత ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. రేపల్లె: రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నం సముద్ర తీరంలో సహజసిద్ధంగా ఏర్పడిన పాయను అనువైన ప్రాంతంగా ఎంచుకుని 1980లో అటవీశాఖకు చెందిన 38 ఎకరాల్లో హార్బర్ నిర్మించారు. దీనికి అనుసంధానంగా తొలి దశ పనుల్లో భాగంగా 50 బోట్లను నిలుపుదల చేసుకునే విధంగా జె ట్టీ నిర్మించారు. హార్బర్ ఏర్పాటుతో ఆప్రాంతం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. బోట్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కాకినాడ, మచిలీపట్నం, చీరాల ఓడరేవు, నెల్లూరు, మద్రాసుకు చెందిన బోట్లు మత్స్యసంపద విక్రయాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాకపోకలు సాగించటం మొదలుపెట్టాయి. దీంతో జెట్టీ సమస్య జటిలంగా మారింది. మురిగిపోయిన నిధులు.. జెట్టీ సమస్య పరిష్కారానికి పదేళ్ల కిందట నాడు కూచినపూడి శాసనసభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమాణారావు హార్బర్ రెండో దశ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం జెట్టీ అభివృద్ధికి రూ.10 కేటాయించినప్పటికీ అటవీశాఖకు చెందిన భూమికి అనుమతి మంజూరుకాక నిధులు మురిగిపోయాయి. కొంతకాలం తరువాత సమస్యను నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లి హార్బర్ అభివృద్ధికి కావలసిన ఐదెకరాల అటవీశాఖ భూమిని కేటాయింపు చేయించడంలో మోపిదేవి సఫలీకృతులయ్యారు. వైఎస్ ఆకస్మిక మరణంతో పనులు మాత్రం ముందుకు సాగలేదు. 2011 ఫిబ్రవరి 7న రచ్చబండ కార్యక్రమానికి నిజాంపట్నం వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా హార్బర్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఒక్కఅడుగూ ముందుకు పడలేదు. పెరిగిన బోట్లు.. తరచూ వివాదాలు... హార్బర్లోని జెట్టీలో 50 బోట్లు నిలిపేందుకు మాత్రమే చోటు సరిపోతుంది. ప్రస్తుతం నిజాంపట్నంలో 150 మెక్‌నైజ్డ్ బోట్లు, 150 మోటరైజ్డ్ బోట్లు ఉన్నాయి. వీటితో పాటు నిత్యం ఇతర ప్రాంతాలకు చెందిన బోట్లు 50 వరకు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. వేటనుంచి వచ్చిన బోట్లు నిలుపుకునేందుకు జెట్టీలో ఖాళీలేక మత్స్య సంపద దిగుమతి చేసుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో బోట్లు ఒకేసారి ఒడ్డుకు చేర తాయి. వీటిని పక్కపక్కనే నిలపడం వల్ల అలలు, ఈదురుగాలుల ప్రభావానికి ఒకదానికి ఒకటి ఢీకొని దెబ్బతింటున్నాయి. జెట్టీలో చోటుకోసం గొడవలు జరగ డం పరిపాటిగా మారింది. పాయ పక్కనే లంగర్లు వేసి, మడ చెట్లకు కట్టి ఉంచితే ఇటీవల తుపాన్ల సమయంలో మూడు బోట్లు తాళ్లు తెగిపోయి సముద్రంలోకి వెళ్లిపోయాయి. ఏర్పాటు చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.