Hari Chandana
-
పెళ్ళైన కొన్ని నెలలకే..
ఖమ్మం: డెంగీ జ్వరం బారిన పడిన వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందింది. వైరాకు చెందిన వ్యాపారి అనుమోలు చంద్రయ్య కుమారుడు రాజేష్‌కు ఈ ఏడాది మే 30న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన హరిచందన(23)తో వివాహం జరిగింది. మూడు రోజుల క్రితం ఆమె జ్వరంతో బాధపడుతుండగా వైరాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించినా ఫలితం లేక హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేయిస్తుండగానే ఆమె సోమవారం మృతి చెందింది. వివాహం జరిగిన నాలుగున్నర నెలలకే హరిచందన మృతి చెందగా, కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతదేహం వద్ద బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ తదితరులు నివాళులర్పించారు. -
చీరపైన బాపూ బొమ్మ
బాపు బొమ్మల అందం గురించి ఎంత వర్ణించినా.. మనవైన చేనేతల ఘనత గురించి ఎంత చెప్పినా మాటలు సరిపోవు. ఇక, ఈ రెండింటి కాంబినేషన్లో వచ్చిన కళా సోయగాలను ఎంత చూసినా తనివి తీరవు. ఆ అందమైన కాంబినేషన్‌ను నారాయణపేట చేనేత చీరల మీదకు వచ్చేలా రూపుకట్టారు హైదరాబాద్ వాసి, ఫ్యాషన్ డిజైనర్ హేమంత్‌సిరి. ఈ కొత్త కాంబినేషన్ గురించి, ఆమెకు వచ్చిన ఈ ఆలోచన గురించి ఆమె మాటల్లోనే.. ‘నాలుగేళ్లుగా ప్రతి యేడాది ఆగస్టు నెలలో మన తెలుగురాష్ట్రాల చేనేత కారులతో కలిసి ‘తస్రిక’ పేరుతో ఒక వేడుక నిర్వహిస్తున్నాను. ఇందులో భాగంగా గతంలో హ్యాండ్లూమ్స్ని యువత కోసం ఇండోవెస్ట్రన్ డ్రెస్‌లు రూపొందించాను. ఈ క్రమంలోనే నారాయణ పేట చేనేతకారులను కలిసినప్పుడు, వారి డిజైన్స్ చూసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నారాయణ పేట చీరలు సాధారణంగా ప్లెయిన్లోనే ఉంటాయి. అయితే అందరినీ ఆకర్షించాలంటే వీటిలో కొన్ని మార్పులు తీసుకురావచ్చు అనిపించింది. దీంతో కిందటేడాది లేపాక్షి డిజైన్స్‌ని నారాయణ పేట్ కాటన్ శారీస్మీదకు తీసుకువచ్చాం. బాపూ స్మరణం ఈ నెలలో బొమ్మల బాపూ వర్ధంతి ఉంది. హ్యాండ్లూమ్ డే కూడా ఈ ఆగస్టు నెలలోనే. బాపూగారిని తలుచుకోగానే మనకు ఆ ముగ్గులు, బొమ్మలు.. మన మదిలో అలా నిలిచిపోతాయి. దీంతో ఈ యేడాది బాపూ బొమ్మలను డిజిటల్ ప్రింట్లుగా నారాయణ పేటæపట్టు చీరల మీదకు తీసుకువచ్చాను. ఆ బొమ్మల రూపును నా డ్రెస్ డిజైన్స్పైకి తీసుకురావాలనే ఆలోచన కొన్నాళ్లుగా ఉంది. కానీ, నారాయణ పేట హ్యాండ్లూమ్స్కైతే మరింత బాగుంటుందని అనుకున్నాను. నారాయణæపేట పట్టు చీరల మీద డిజిటల్ ప్రింట్ల అందం గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనుకున్నది కూడా దీని వెనక ఉన్న ఉద్దేశ్యం. ఈ బాపూ బొమ్మల కాన్సెప్ట్‌ని ఐఎఎస్ హరిచందన, ఇతర అధికారులు చాలా అభినందించారు. చేనేత కారులకు మార్కెటింగ్ ప్లెయిన్‌గా ఉన్న హ్యాండ్లూమ్స్కి మరిన్ని హంగులు అద్దడం వల్ల ప్రజల్లోకి వీరి చేనేతలు మరింత వేగంగా వెళతాయి. చీరలపై డిజిటల్ ప్రింట్లు సులువుగానూ వేయచ్చు. స్థానికంగా బ్లాక్‌ప్రింట్, డిజిటల్ ప్రింట్ యూనిట్స్‌ని ప్రభుత్వం గానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ఏర్పాటు చేయగలిగితే చేనేత కారులకు మరిన్ని అవకాశాలు మెరుగవుతాయి. నారాయణ పేటæ చీరలు అనగానే పెద్దవాళ్లు కట్టుకునేవి అనే అభిప్రాయం ఉండేది. ఆ ఆలోచన మార్చాలనే టీనేజర్స్ కూడా ఇష్టపడేలా పేస్టల్ కలర్స్, మోటిఫ్స్లోనూ మార్పులు తీసుకురావడంపై కృషి జరుగుతోంది. చేనేతకారులకు అవకాశాలు మెరుగవడానికి చేస్తున్న చిరు ప్రయత్నం ఇది’ అని వివరించారు ఈ ఫ్యాషన్ డిజైనర్. – నిర్మలారెడ్డి -
కలెక్టర్ హరిచందనపై.. మక్తల్ ఎమ్మెల్యే మండిపాటు
నారాయణపేట: ‘జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ జీరోగా తయారైంది.. నా ఎమ్మెల్యే పదవి పోయినా పర్లేదు.. నేనేంటో చూపిస్తా.. ఇక్కడ నియంత పాలన సాగదు’ అంటూ నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కలెక్టర్ దాసరి హరిచందనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జెడ్పీ చైర్పర్సన్ వనజమ్మ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో విద్యాశాఖ ఎజెండా చదువుతుండగా సమావేశానికి డీఈవో ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ‘కలెక్టరే సమావేశాలకు రారు.. ఇక జిల్లా అధికారులు ఎందుకు వస్తార’ని అసహనం వ్యక్తం చేశారు. ‘జెడ్పీ సమావేశమంటే పిల్లలాటైంది.. ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులందరూ పనికిమాలిన వాళ్లా.. వచ్చేసారి అందరం కలసి కలెక్టరేట్‌కు వెళ్లి జెడ్పీ మీటింగ్ పెట్టాలి’అని అన్నారు. ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే, అక్కడ (కలెక్టరేట్లో) కలెక్టర్ రహస్య సమావేశాలు పెట్టడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ‘తెలంగాణ తెచ్చుకుంది.. జిల్లా వచ్చింది ఇందుకోసమేనా’ అని అసంతృప్తి వెళ్లగక్కారు. ఐదుగురు కనిపిస్తే కలెక్టర్‌కు బుగులు పుడుతుందని, వెంటనే పోలీసులు వచ్చి వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తారని అన్నారు. సంగంబండ ముంపు బాధితులు కలెక్టరేట్‌కు వస్తే వారిని అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. మక్తల్ నుంచి ఓ మహిళా సర్పంచ్ సమస్య పరిష్కారం కోసం వస్తే అగౌరవపరిచారని, ఇదే కలెక్టర్ బిల్డింగ్‌పై నుంచి దూకి చస్తానని ఆమె తనతో ఫోన్లో చెప్పారన్నారు. జిల్లాకేంద్రంలో రూ.కోట్ల విలువైన ఎస్ఎల్ డిగ్రీ కళాశాలను ప్రభుత్వానికి ఇస్తే తమ సొసైటీ బిల్డింగ్ దగ్గరికి ఆర్అండ్బీ అధికారులను పంపించి పెనాల్టీ కట్టాలని నోటీసులు పంపించారన్నారు. భారత్‌మాల కోసం దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారని, ధర నిర్ణయించి తిరిగి నోటిఫికేషన్ వేసి భూములు తీసుకోవాలని కోరారు. (క్లిక్: టీఆర్ఎస్కు రాజయ్య గుడ్‌బై)