hariharanatha sharma
-
హైకోర్టు న్యాయమూర్తులుగా హరిహరనాథ శర్మ, లక్ష్మణరావు ప్రమాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్ యడవల్లి లక్ష్మణరావులు శుక్రవారం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరి చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అంతకు ముందు హైకోర్టు రిజిస్ట్రార్.. వీరి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను చదవి వినిపించారు. అనంతరం సీజే వారి చేత ప్రమాణం చేయించారు. ఆ తర్వాత సీజే వారికి విడి విడిగా రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ప్రమాణం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) పసల పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, హైకోర్టు రిజి్రస్టార్లు, న్యాయవావాదులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాణం అనంతరం వీరు సింగిల్ జడ్జీలుగా కేసులను విచారించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు, శ్రేయోభిలాషులు వీరిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. -
జిల్లా జడ్జి హరిహరనాథ శర్మ బదిలీ
అనంతపురం లీగల్ : జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరనాథ శర్మను బదిలీ చేస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన్ను గుంటూరు జిల్లా న్యాయమూర్తిగా నియమించింది. ఈయన స్థానంలో మొదటి అదనపు జిల్లా జడ్జి సుబ్రమణ్యకుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం సుబ్రమణ్యకుమార్ కుటుంబ న్యాయస్థానం జడ్జిగానూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వచ్చిన హరిహరనాథ శర్మ పరిపాలనా పరంగా కొన్ని విప్లవాత్మక చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లాకు చెందిన ఈయన న్యాయవాదులకు జూనియర్ సివిల్ జడ్జి రాత పరీక్షలకు సంబంధించి కోచింగ్ ఇవ్వడం, కోర్టు ఆవరణలో స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాలు చేపట్టి తనదైన శైలిని చూపారు. -
నేడు జాతీయ లోక్ అదాలత్
అనంతపురం లీగల్ : జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిల్లో జాతీయ లోక్ అదాలత్‌ను రెండవ శనివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాథ శర్మ, కార్యద ర్శి కమలాకర్‌రెడ్డి తెలిపారు. కోర్టులో దాఖ లు చేయని వివాదాలను కూడా ఈ లోక్ అదాల త్లో రాజీ మార్గంలో పరిష్కరిస్తున్నట్లు వారు తెలిపారు. కక్షిదారులు లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.