harith haram
-
సీఎం కేసీఆర్ నాటిన మొక్క ఎండింది!
-
కేసీఆర్ నాటిన మొక్కపై వివాదం
కరీంనగర్: సాక్షాత్తు ముఖ్యమంత్రి నాటిన మొక్క వాడిపోతుండటంపై వివాదం రేగింది. సీఎం నాటిన మొక్క వాడిపోవడానికి కొందరు యువకులు కారణమని కార్పొరేషన్ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కరీంనగర్ మానేరు కట్ట దిగువన సీఎం చంద్రశేఖర్‌రావు ఇటీవల మహాఘని మొక్క నాటారు. అయితే అది కాస్తా వాడిపోతోంది. కొందరు యువకులు ఈనెల 9న రాత్రి మూడు ద్విచక్ర వాహనాలపై వచ్చి మొక్క దగ్గర నిలబడి ఏదో చేస్తున్నట్లు అనిపించిందని, అనుమానం రావడంతో తాను ప్రశ్నించగా దుర్భాషలాడుతూ వారు వెళ్లిపోయారని బల్దియా వాచ్‌మన్ చెప్పారు. అప్పటి నుంచి మొక్క క్రమంగా వాడిపోతోందని, ఈ విషయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ సూపర్వైజర్కు సమాచారమిచ్చినట్టు వాచ్మెన్ పోలీసులకు తెలిపాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
హరిత చైతన్యం..
హరితహారానికి మద్దతు పలికిన గొల్లకుర్మలు బీడుగా ఉన్న 84 ఎకరాల్లో నాటిన లక్ష మొక్కలు వారి చొరవను అభినందించిన ఎమ్మెల్యే దుబ్బాక రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న హరితహారానికి గొల్లకుర్మలు చైతన్యవంతులై ముందుకు వచ్చారు. తమ సొంత భూముల్లో వేలాది మొక్కలు నాటారు. దుబ్బాక నగర పంచాయతీ పరిధిలోని మల్లన్నగుట్ట సమీపంలో సర్వే నంబర్ 117, 129లో గల దుబ్బాకకు చెందిన గొల్లకుర్మ యాదవ సంఘానికి 84 ఎకరాల భూమి ఉంది. ఈ సంఘంలోని సభ్యులైన 39మంది హరితహారానికి జైకొట్టారు. వారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. రాళ్లు, రప్పలతో కూడుకున్న ఈ భూమిని వారే స్వయంగా చదును చేసి గుంతలు తవ్వి లక్ష మొక్కలు నాటారు. అల్లనేరేడు, చింత, జామ, నీలగిరి, సీతాఫలం తదితర మొక్కలు నాటారు. లక్ష మొక్కలు నాటడంతో 84 ఎకరాలు హరితహారంతో కళకళలాడుతోంది. వారి కృషిని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అభినందించారు. లక్ష మొక్కలు నాటడం చాలా గర్వ కారణమన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. గర్వకారణం.. గొల్లకుర్మ యాదవ సం ఘం వారు 84 ఎకరాల్లో లక్ష మొక్కలు నాటడం అభినందనీయం. బీడు భూమిని ఈ విధంగా వినియోగంలోకి తేవడం సంతోషకరం. – భోగేశ్వర్, దుబ్బాక నగర పంచాయతీ కమిషనర్ మరిన్ని మొక్కలు నాటుతాం.. ఎమ్మెల్యే కృషితో నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు మొక్కలు నాటారు. మల్లన్నగుట్ట సమీపంలో 84 ఎకరాల్లో గొల్లకుర్మ యాదవ సంఘం వారు లక్ష మొక్కలు నాటడం అభినందనీయం. ఇందులో ఎమ్మెల్యే కృషి ఎంతో ఉంది. – బట్టు ఎల్లంయాదవ్, టీఆర్ఎస్ నేత -
మోతెలో మొక్కలు నాటిన సీఎం కేసీఆర్
నిజామాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆదివారం రాత్రి వేల్పూరుకు చేరుకున్న ఆయన హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మోతె గ్రామానికి చేరుకున్న కేసీఆర్ వేల్పూర్ జెడ్పీ హైస్కూల్లో మొక్కలు నాటారు. అనంతరం ఆర్మూర్ మార్కెట్ యార్డుకు చేరుకుని అక్కడ కూడా కేసీఆర్ మొక్కలు నాటారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆ గ్రామానికి వరాల జల్లు కురుపించారు. మోతెలో సాగు, తాగునీటి పనులకు రూ 2.50 కోట్లు, పంచాయితీకి రూ.80 లక్షల నిధులను మంజూరు చేశారు. వందశాతం డ్రిప్ ఇరిగేషన్, నీటి కుండీలకు సబ్సిడీ ఇవ్వనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని హామి ఇచ్చారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాల్కొండకు గోదావరి జలాలను అందిస్తామని కేసీఆర్ తెలిపారు. అంతకముందు హరితాహారం ప్రరంభించని సీఎం మొక్కలు నాటి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్లొనాలని పిలుపునిచ్చారు. అడివుల నరికివేత వల్లే వాతావరణ సమతుల్యత దెబ్బతిందన్నారు. చెట్లు పెంచడంతో వానలు సమృద్ధిగా కురుస్తాయన్నారు.