నిజామాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆదివారం రాత్రి వేల్పూరుకు చేరుకున్న ఆయన హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మోతె గ్రామానికి చేరుకున్న కేసీఆర్ వేల్పూర్ జెడ్పీ హైస్కూల్లో మొక్కలు నాటారు. అనంతరం ఆర్మూర్ మార్కెట్ యార్డుకు చేరుకుని అక్కడ కూడా కేసీఆర్ మొక్కలు నాటారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆ గ్రామానికి వరాల జల్లు కురుపించారు. మోతెలో సాగు, తాగునీటి పనులకు రూ 2.50 కోట్లు, పంచాయితీకి రూ.80 లక్షల నిధులను మంజూరు చేశారు.
వందశాతం డ్రిప్ ఇరిగేషన్, నీటి కుండీలకు సబ్సిడీ ఇవ్వనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని హామి ఇచ్చారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాల్కొండకు గోదావరి జలాలను అందిస్తామని కేసీఆర్ తెలిపారు. అంతకముందు హరితాహారం ప్రరంభించని సీఎం మొక్కలు నాటి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్లొనాలని పిలుపునిచ్చారు. అడివుల నరికివేత వల్లే వాతావరణ సమతుల్యత దెబ్బతిందన్నారు. చెట్లు పెంచడంతో వానలు సమృద్ధిగా కురుస్తాయన్నారు.