Hathway cable and data
-
ముకేశ్ అంబానీ గ్రూప్ షేర్ల హవా
గత నెల రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నప్పటికీ దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీలు మాత్రం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో గత నెల రోజుల్లో ఆటుపోట్ల మధ్య ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 8 శాతమే బలపడగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఎంటర్టైన్మెంట్, మీడియా కంపెనీల షేర్లు 46-98 శాతం మధ్య దూసుకెళ్లాయి. ఈ బాటలో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ప్రాస్ట్రక్చర్ సైతం 12 శాతం స్థాయిలో పుంజుకోవడం గమనార్హం! జియో ఎఫెక్ట్? మొబైల్, డిజిటల్ సర్వీసుల అనుబంధ కంపెనీ రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా కొనుగోలుకి విదేశీ దిగ్గజాలు క్యూ కట్టినప్పటి నుంచీ మాతృ సంస్థ ఆర్ఐఎల్ జోరందుకుంది. జియో ఇన్ఫోకామ్‌లో 22 శాతం వాటా విక్రయంతో రూ. 1.04 లక్షల కోట్లను సమీకరించగా.. రైట్స్ ఇష్యూ ద్వారా ఆర్ఐఎల్ రూ. 53,000 కోట్లకుపైగా సమకూర్చుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గ్రూప్‌లో ప్రధాన కంపెనీ ఆర్ఐఎల్ రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు.. ఇతర బిజినెస్‌ల విస్తరణపై దృష్టిసారించనున్నట్లు నిపుణలు పేర్కొంటున్నారు. దీంతో గ్రూప్‌లోని కంపెనీల షేర్లకు డిమాండ్ పెరిగినట్లు తెలియజేశారు. జోరు తీరిలా ముకేశ్ అంబానీ గ్రూప్‌లోని ఆర్ఐఎల్, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ప్రాస్ట్రక్చర్ గత నెల రోజుల్లో 11 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఫలితంగా ఆర్ఐఎల్ షేరు మంగళవారం(16న) రూ. 1648 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది కూడా. ఈ బాటలో ఇతర కౌంటర్లు మరింత జోరందుకున్నాయి. హాథవే భవానీ కేబుల్టెల్ 98 శాతం ఎగసి రూ. 16 నుంచి రూ. 32కు చేరింది. టీవీ18 బ్రాడ్‌క్యాస్ట్ 75 శాతం జంప్‌చేసి రూ. 22 నుంచి రూ. 38కు ఎగసింది. నెట్వర్క్ 18 మీడియా రూ. 25 నుంచి రూ. 40కు చేరింది. ఇది 61 శాతం వృద్ధికాగా..డెన్ నెట్వర్క్స్ 53 శాతం పురోగమించి రూ. 80ను తాకింది. ఇదే విధంగా హాథవే కేబుల్ 46 శాతం పుంజుకుని రూ. 34ను అధిగమించగా.. రిలయన్స్ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా 12 శాతం బలపడి రూ. 306కు చేరింది. -
మరో టారిఫ్ వార్ : రిలయన్స్ చేతికి డెన్, హాత్వే
సాక్షి,ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో టారిఫ్ వార్‌కు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే రిలయన్స్ జియో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపించింది. తాజాగా కేబుల్ రంగంలో కూడా విధ్వంసానికి రడీ అవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో చరిత్రలో అతిపెద్ద లాభాలను నమోదు చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కేబుల్ టీవీ, హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో పాక్షిక పెట్టుబడులను పెట్టనున్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో జియో ఎంట్రీతో కుదేలైన ఎయిర్‌టెల్‌ను, సిటీ కేబుల్ వ్యాపారాన్ని కూడా దెబ్బతీయనుంది. దేశీయంగా అతిపెద్ద కేబుల్ ఆపరేటర్ హాత్వే కేబుల్ అండ్ డేటాకామ్, డెన్ నెట్వర్క్స్ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను ప్రకటించింది. బ్రాడ్ బాండ్ సేవలను పెద్దయెత్తున విస్తరించే క్రమంలో ఈ పెట్టుబడులకు బుధవారం బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హాత్వే, డెన్ నెట్వర్క్ కంపెనీల్లో మెజారిటీ వాటా తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు రిలయన్స్ రూ. 5,230 కోట్లు చెల్లించనుంది. హాత్వేలో 51.3 శాతం వాటా కొనుగోలుకు రూ. 2,045 కోట్లను రిలయన్స్ చెల్లిస్తుంది. అలాగే డెన్ నెట్‌వర్క్స్‌లో 66 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ రూ. 2,045 కోట్లు. హాత్వే, డెన్ నెట్వర్స్క్ 1,100 నగరాల్లో 5 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. తాజా డీల్ ద్వారా ప్రత్యక్షంగా 20 మిలియన్ల కేబుల్ చందాదారులు రియలన్స్ అధీనంలోకి రానున్నారు. అంతేకాదు కేబుల్ మార్కెట్లో 23 శాతం వాటాను రిలయన్స్ సొంతం కానుంది. -
రూ. 981 కోట్ల విలువైన 7 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఓకే
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రూ.981 కోట్ల విలువైన ఏడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. వీటిల్లో హైదరాబాద్‌కు చెందిన సీలన్ ల్యాబొరేటరీస్ ప్రతిపాదన కూడా ఆమోదం పొందింది. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్(ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్-ఎఫ్ఐపీబీ) సూచనల మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఏడు ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో ఆరు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. హాత్వే కేబుల్ అండ్ డేటా కామ్‌లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి పరిమితిని ప్రస్తుతమున్న 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. హైదరాబాద్‌కు చెందిన సీలన్ ల్యాబొరేటరీస్ రూ.16 కోట్ల విదేశీ పెట్టుబడి ప్రతిపాదన ఆమోదం పొందింది. ఇటీవలనే ఐఎన్జీ వైశ్యా బ్యాంక్‌ను విలీనం చేసుకున్న కోటక్ మహీంద్రా బ్యాంక్ విదేశీ పెట్టుబడులను 55 శాతానికి పెంచుకోవడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.