Hawk Eye application
-
మేమున్నామని.. మీకేంకాదని..
సాక్షి, మంచిర్యాల : హైదరాబాద్‌లో దిశ, హన్మకొండలో మానస, ఆసిఫాబాద్‌లో జిల్లాలో సమతలు మానవ మృగాల చేతుల్లో బలైన సంఘటనలు సంచలనం సృష్టించాయి. ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ ఎంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తెచ్చింది. ఆపద పొంచి ఉన్నప్పుడు, ఆటోలో, ట్యాక్సీలో ప్రయాణిస్తున్నప్పుడు 100 డయల్, హాక్–ఐ, షీ టీంలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతాయి. వీటి గురించి పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని తద్వారా నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని పోలీసులు సూచిస్తున్నారు. దీనిపై ప్రత్యేక కథనం.. నేర రహిత తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఇప్పటికే నేర నియంత్రణలో శర వేగంగా దూసుకుపోతోంది. హాక్–ఐ, 100 డయల్ రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సేవలు అందిస్తోంది. పోలీస్ అధికారులు హాక్–ఐ, 100 డయల్ సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికి పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన రాలేదు. ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో ప్రజలకు దగ్గరవుతూ నేరరహిత సమాజం వైపు అడుగులు వేస్తున్నారు తెలంగాణ పోలీసులు. హాక్–ఐ యాప్‌ను స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న వారు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ.. అత్యవసర సమయాల్లో పోలీస్ సహాయం కోరడం కోసం ఏర్పాటు చేసిన పర్చువల్ బటన్ ‘ఎస్‌వోఎస్’ ప్రెస్ చేస్తే చాలు పోలీసులు స్పందిస్తారు. ఈ బటన్ ద్వారా లొకేషన్ తెలుసుకునే సౌకర్యం కూడా ఉండడంతో బాధితుల ఆచూకీ గుర్తించి, ఆయా ప్రాంతాలకు చెందిన స్థానిక పోలీసులను అప్రమత్తం చేసేందుకు అవకాశం ఉంది. ఈ తరహాలో ఇప్పటి వరకు రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో సుమారు 20 కాల్స్‌కు పోలీసులు స్పందించారు. యాప్ డౌన్లోడ్ ఇలా.. ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగించే వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఐవోఎస్ ద్వారా హాక్–ఐ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అనంతరం యాప్‌ని ఓపెన్ చేయగానే రిపోర్ట్ స్టేషన్ టూ పోలీస్, ఉమెన్ ట్రావెల్ మూడ్ సేఫ్, రిజిష్టర్ డీటెయిల్స్ ఆఫ్ సర్వెంట్, వర్కర్, టెనెంట్, ఎస్‌వోఎస్, ఎమ్మర్జెన్సీ పోలీస్ కాంటాక్ట్, కమ్యూనిటీ పోలీసింగ్ అని స్క్రీన్ మీద కనిపిస్తాయి. వివిధ ఆప్షన్లు వస్తాయి. ► ఆప్షన్–1లో మూడు కేటగిరీలు ఉంటాయి. ఇందులో సెలెక్ట్ కేటగిరిలో ట్రాఫిక్, జరిగిన నేరం మహిళలపై జరుగుతున్న వేధింపులు, పోలీసులు చేసే ఉల్లంఘనలు, ఉత్తమ పోలీసింగ్ సలహాలు తీసుకోవడానికి ఆప్షన్లు పొందుపరిచారు. ► ఆప్షన్–2లో ఫొటో లేదా వీడియో సేవ్ సదుపాయం, ప్లేస్ ఆప్ బోర్డింగ్ అని ఉంటుంది. బాధితులు ఎక్కడ ఉన్నారో టైప్ చేయాలి, ఇది పూర్తిగా మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ఆప్షన్. ► ఆప్షన్–3లో ఇంట్లో అద్దెకు దిగిన వారు, పని మనుషులు, ఎలక్ట్రికల్ బోర్డ్ రిపేర్లు చేసే వారి సమాచారాన్ని సేకరించడానికి దీన్ని ఏర్పాటు చేశారు. ► ఆప్షన్–4, ఎస్‌వోఎస్ అంటే సేవ్ అవర్ సెల్ఫ్ ఇది కూడా మహిళా భద్రతను దృష్టిలో ఉంచుకొని తయారు చేశారు. ► ఆప్షన్–5, ఇందులో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లాల పోలీస్స్టేషన్ల నంబర్లతో పాటు వివిధ పోలీసు అధికారుల నంబర్లు పొందుపరిచారు. ► ఆప్షన్–6, కమ్యూనిటీ పోలీసింగ్‌లో చేరాలనుకునే వారి కోసం ఈ ఆప్షన్ తయారు చేశారు. పేరు మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ, చిరునామా పొందు పరిచారు. సంబంధిత పోలీస్‌స్టేషన్ పేరు నమోదు చేయాలి. ► ఆప్షన్–7, వివిద ఆప్షన్ల ద్వారా పోలీసులు చేసిన ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు వీలుగా ఉండే ఆప్షన్ ఇది. ► ఆప్షన్–8, ఈ ఆప్షన్లో యాప్‌లో రిజిష్టర్ అయిన తర్వాత మళ్లీ ఏదైనా మార్పులు చేసుకునే విధంగా ఉపయోగ పడుతోంది. ఆపన్నహస్తం.. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో హాక్–ఐ యాప్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 50వేల మంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ ఘటనకు ముందు కమిషనరేట్ పరిధిలో 20వేల మంది యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు. దిశ ఘటన అనంతరం 13రోజుల వ్యవధిలో 30వేల మంది యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలు మొదలు కొని ఇతర నేరాల వరకు ఉన్న చోట నుంచి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఆపదలో ఉన్నప్పుడు అత్యవసరమైనప్పుడు పోలీసుల నుంచి సహాయం సైతం పొందేందుకు ఉపయుక్తంగా ఉండేలా డిజైన్ చేశారు. పోలీసింగ్‌ను మెరుగు పరిచేందుకు అవసరమైన సలహాలు సూచనలను సైతం ప్రజలు ఈ యాప్ ద్వారా చేసే అవకాశం ఉంది. తక్షణ సహాయం కోసం.. హాక్–ఐలో ఉన్న వివిధ ఆప్షన్స్‌లో ఎస్‌వోఎస్ కీలకమైనది. అత్యవసర సమయంలో ఫోన్ చేసి పూర్తిస్థాయి సందేశం పంపేందుకు అవకాశం లేనప్పుడు మీటా నొక్కడం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఉపయోగించే పర్చువల్ ఎమ్మర్జెన్సీ బటన్ ఇది. ఈ ఆప్షన్‌లోకి ప్రవేశించిన తర్వాత వినియోగదారులు తమ పేరు, ఫోన్ నంబర్ వంటివి ఎంటర్ చేయాలి. అత్యవసర సమయాల్లో ఎవరిని సంప్రదించాలని భావిస్తున్నామో వారి నంబర్లు సైతం పొందుపరుచాలి. గరిష్టంగా 5గురికి చెందిన సెల్ ఫోన్ నంబర్లు ఎంటర్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో ఎమ్మర్జెన్సీ బటన్ యాక్టివేట్ అయినట్లే, అత్యవసన సమయాల్లో ఈ బటన్ నొక్కితే సరిపోయేలా యాప్ డిజైన్ చేశారు. ఎక్కడున్నా సరే... జీపీఎస్ పరిజ్ఞానంతో అనుసంధానమై ఉన్న యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కితే వారు ఏ ప్రాంతంలో ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవచ్చు. బటన్ నొక్కిన వెంటనే వీటిపై మ్యాప్‌లో బాధితుడు ఏ ప్రాంతంలో ఉన్నారనేది హాక్–ఐ మార్క్‌లోనే కనిపించడంతో పాటు ప్రత్యేక సైరన్ వస్తుంది. ఎస్‌వోఎస్ నొక్కిన తర్వాత బాధితుడు ఎటూ వెళ్లినా కమిషనరేట్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై వివరాలు కనిపిస్తాయి. ముందుగా సంప్రదించేందుకు ప్రయత్నిస్తారు.. హాక్–ఐ ఎస్‌వోఎస్ ద్వారా సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు ప్రాథమికంగా బాధితులు ఎక్కడ ఉన్నారో గుర్తిస్తారు. ఆపై ఫోన్ చేయడం, పూర్తి సందేశం పంపడం ద్వారా వారిని సంప్రదించే ప్రయత్నం చేస్తారు. గరిష్టంగా 2 నిమిషాలు వేచి చూసి ఈ రెండింటికి బాధితుల నుంచి స్పందన రాని పక్షంలో బాధితులు ఇబ్బందుల్లో ఉన్నట్లు నిర్ధారిస్తారు. సమీపంలో విధులు నిర్వహిస్తున్న రక్షక్, బ్లూకోట్స్ సిబ్బందిని బాధితులు ఉన్న ప్రదేశానికి పంపిస్తారు. క్యాబ్ ప్రయాణంలో.. మహిళలు ట్యాక్సీ, ఆటోల్లో ప్రయాణం చేస్తూ వాహనం నంబర్, వాహన వీడియో లేదా ఫొటో తీయాలి. వాహనం నంబర్ వెళ్తున్న ప్రదేశం, వెళ్లాల్సిన ప్రదేశం యాప్ ద్వారా పంపించాలి. దీంతో ప్రయాణం చేస్తున్న వాహనం పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంటుంది. డయల్100.. నేరాల నియంత్రణకు సత్వర సమాచారం కోసం రాష్ట్ర పోలీస్ శాఖ డయల్ 100 నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే సకాలంలో స్పందించి సేవలందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. 24 గంటలు ఇది పనిచేస్తుంది. విడతల వారీగా పోలీస్ సిబ్బంది వచ్చిన కాల్స్‌ను నమోదు చేసుకొని సంబంధిత పోలీస్స్టేషన్లకు సమాచారం అందజేస్తారు. టోల్ ఫ్రీ నంబర్లు.. దేశ వ్యాప్తంగా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి టోల్ ఫ్రీ నంబర్లను తెచ్చింది. 112, 1090, 1091 నంబర్లు సైతం వినియోగంలో ఉన్నాయి. వీటికి ఫోన్ చేసి పోలీస్‌ల నుంచి సహాయం పొందవచ్చు. షీ టీమ్ ఫిర్యాదులకు ప్రత్యేక నంబర్.. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీ టీమ్ పోలీస్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. షీ టీమ్ పోలీసుల సహాయం కోసం 181 లేదా వాట్సాప్ నంబర్ 6303923700 మెసేజ్ చేసినా బాధితులకు తక్షణమే సహాయం అందుతోంది. సాంకేతికతతోనే నేరాల నియంత్రణ హాక్–ఐ, 100 డయల్ చేయడం ద్వారా నేరాల నియంత్రణ అత్యంత త్వరలోనే సాధ్యమవుతుంది. వీటి ద్వారా పోలీసులు సత్వరమే స్పందిస్తారు. యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి. ఆపద పొంచి ఉన్నట్లు అనిపిస్తే వెంటనే 100 డయల్ చేయండి. ట్యాక్సిలో ప్రయాణిస్తున్న వారికి హాక్ –ఐ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. – వి. సత్యనారాయణ, పోలీస్ కమిషనర్, రామగుండం -
అతివలకు అభయం ‘హాక్–ఐ’
అత్యవసర సమయాల్లో అతివలకు హాక్ ఐ యాప్ ఎంతో ఉపయోగపడుతోంది. ఈ యాప్‌ను ఇప్పటివరకు 8,96,554 మంది సెల్ఫోన్లో నిక్షిప్తం చేసుకున్నారు. దీంతో 7,689 ఫిర్యాదులు వస్తే.. 5,212 ఫిర్యాదులను పోలీసులు పరిష్కరించారు. చాలామంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నా వినియోగిస్తున్న వారి సంఖ్య అతి తక్కువ. పగలు, రాత్రితో సంబంధం లేకుండా పనిచేసే మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పోలీసులు అంటున్నారు. ఎస్ఓఎస్... విపత్కర పరిస్థితుల్లో అతివలకు అండగా ఉండేందుకు ‘ఎస్ఓఎస్’విభాగం ఏర్పాటైంది. ‘హాక్–ఐ’లో ఉన్న ఈ విభాగంలోకి ప్రవేశించిన తర్వాత ప్రాథమికంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. హెల్ప్, డేంజర్ వంటి అంశాలను పొందుపరచడంతో పాటు సన్నిహితులు, స్నేహితులకు చెందిన ఐదు ఫోన్ నంబర్లనూ ఫీడ్ చేయాలి. ‘క్రియేట్’అన్నది నొక్కడం ద్వారా దీని షార్ట్‌కట్ మొబైల్ స్క్రీన్‌పై వస్తుంది. అత్యవసర సమయాల్లో ఈ ‘ఎస్ఓఎస్’ను ప్రెస్ చేస్తే చాలు... కంట్రోల్ రూమ్, జోనల్ డీసీపీ, డివిజనల్ ఏసీపీతో పాటు సమీపంలోని పెట్రోలింగ్ వాహనాలకు సెల్‌ఫోన్ వినియోగదారుల లోకేషన్ జీపీఎస్ వివరాలతో సహా చేరుతుంది. వినియోగదారుడు పొందుపరిచిన ఐదు నంబర్లకూ సమాచారం వెళ్తుంది. ఓ సారి ‘ఎస్ఓఎస్’ను నొక్కిన తర్వాత 9 సెకండ్ల కౌంట్‌డౌన్ ఉంటుంది. ఎవరైనా పొరపాటున ప్రెస్‌చేసి ఉంటే ఈ సమయంలో క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ సమయం తర్వాత అధికారులు రంగంలోకి దిగి జీపీఎస్ ద్వారా బా«ధితురాలు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు. ‘వందకూ’వర్తింపు... హాక్–ఐ మొబైల్ యాప్ ద్వారా ‘డయల్–100’కు సైతం ఫోన్ చేసే ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారులు, బాధితులు ఎవరైనా నేరుగా ‘100’డయల్ చేసి కాకుండా ఈ యాప్ ద్వారా సంప్రదించే ఆస్కారం ఏర్పడింది. హాక్–ఐ ద్వారా కాల్ చేస్తే... ఆ ఫిర్యాదుదారుల లోకేషన్ సైతం ఎస్ఓఎస్ వినియోగించిన వారి మాదిరిగానే కంట్రోల్ రూమ్స్‌లో స్క్రీన్స్‌పై కనిపించేలా సిటీ పోలీసు ఐటీ సెల్ ఏర్పాటు చేసింది. ప్రయోగాత్మక దశలో ఉన్న దీని వినియోగంలో వచ్చే ఇబ్బందుల్ని అధికారులు ప్రస్తుతం గమనిస్తున్నారు. క్రైమ్ ఎగెనెస్ట్ ఉమెన్... మహిళల భద్రత కోసం ‘హాక్–ఐ’లో ఏర్పాటు చేసిన మరో విభాగం ‘క్రైమ్ ఎగెనెస్ట్ ఉమెన్’. వారు పని చేసే ప్రాంతంలో, ప్రయాణించే మార్గంలో, ఇంట్లో... ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా ఈ విభాగాన్ని ఆశ్రయించవచ్చు. పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా ఈ విభాగంలో ఉన్న ఆప్షన్స్‌ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఈ సమాచారాన్ని విశ్లేషించే ఐటీ సెల్ ఫిర్యాదు స్వభావాన్ని బట్టి పోలీసులు, షీ–టీమ్స్, సైబర్ పోలీసులకు సమాచారమిస్తారు. అలాగే డయల్ ‘100’, పోలీసు ఫేస్బుక్, వాట్సాప్ (హైదరాబాద్:9490616555, సైబరాబాద్: 9490617444, రాచకొండ: 9490617111) ద్వారా ఎలాంటి సహాయం కావాలన్నా పొందవచ్చు. -
అందరికీ అండగా హాక్-ఐ
సాక్షి, మంచిర్యాల: ఎప్పుడైనా.. ఎక్కడైన ఏదైనా సంఘటన జరిగితే వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే భయపడుతున్నారా..? నేరం ఏదైనా చేసిన వారు ఎవరైనా సరే.. చివరికి పోలీస్ అధికారైనా పర్వాలేదు. ఒంటరిగా టాక్సీ లేదా ఆటోలో ప్రయాణం చేస్తున్నారా...? అయితే ప్రతి సమస్యనుంచి మీకు తక్షణ రక్షణ చర్యలు, సమస్యలకు పరిష్కారం, వీటన్నింటికి సమాదానం చెప్పేందుకు హాక్–ఐ అందరికి అండగా ఉండనుంది. ఎలాంటి సంఘటన చోటుచేసుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఉన్నచోట నుంచే పోలీసులకు సమాచారం అందించవచ్చు. రహస్యమైన ఫిర్యాదులు గోప్యంగా ఉంచబడుతాయి.. అయితే హాక్–ఐ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి... దీని పనితీరు, ఉపయోగాలు తదితర అంశాలపై ప్రత్యేక కథనం... నేరాలను అరికట్టేందుకు... నేరరహిత తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు తెలంగాణ పోలీస్‌శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఇప్పటికే పోలీస్ శాఖ దూసుకువెళ్తోంది. హాక్–ఐ యాప్ ఇప్పటికే రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సేవలు అందిస్తోంది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2017 ఫిబ్రవరి 28 అప్పటి కమిషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. నాటి ప్రారంభంలో కొంత అక్కడక్కడ అవగాహన సదస్సులు నిర్వహించారు. నేటికి పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన రాకపోవడం గమనార్హం. ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యం అంటు సాంకేతిక పరిజ్ఞానంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలాజీని ఉపయోగించి కొత్తకొత్త యాప్‌లను ఉపయోగిస్తూ ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో ప్రజలకు దగ్గరవుతోంది. హాక్ – ఐ యాప్‌ను స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న వారు ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో ఉన్నా అత్యవసర సమయాల్లో పోలీస్ సాయం కోసం ఏర్పాటు చేసిన పర్చువల్ బటన్ ‘ఎస్‌వోఎస్’ ప్రెస్ చేస్తే చాలు పోలీసులు స్పందిస్తారు. ఈ బటన్ ద్వారా లొకేషన్ తెలుసుకునే సౌకర్యం ఉండటంతో బాధితుల ఆచూకీ గుర్తించి ఆయా ప్రాంతాలకు చెందిన స్థానిక పోలీసులను అప్రమత్తం చేసేందుకు అవకాశముంది. ఈ తరహాలో ఇప్పటి వరకు రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో సుమారు 20కాల్స్‌కు పోలీసులు స్పందించారు. హాక్– ఐ ఫిర్యాదుల పర్యవేక్షణకు కమిషనరేట్‌లో 24గంటలు పని చేసేలా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఆపన్న హస్తం.... రామగుండం పోలీస్ కమి షనరేట్ పరిధిలో దాదాపు 20వేల మంది ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నా రు. ఈ యాప్ ద్వారా ట్రా ఫిక్ ఉల్లంఘనలు మొదలుకుని ఇతర నేరాల వరకు ఉన్న చోటు నుంచే ఫిర్యాదు చేయవచ్చు. ఆపదలో ఉన్నప్పుడు అత్యవసరమైనప్పుడు పోలీసుల నుంచి సాయం సైతం పొందేందుకు ఉపయుక్తంగా ఉండేలా డిజైన్ చేశారు. పోలీసింగ్‌ను మెరుగుపరిచేందుకు అవసరమైన సలహాలు సూచనలను సైతం ప్రజలు ఈయాప్ ద్వారా చేసే అవకాశం ఉంది. తక్షణ సాయం కోసం... పోలీస్ మొబైల్ యాప్ హాక్–ఐలోని వివిధ ఆప్షన్స్‌లో ఎస్ఓఎస్ కీలకమైనది. అత్యవసర సమయంలో ఫోన్‌చేసి పూర్తిస్థాయి సందేశం పంపేందుకు అవకాశం లేనప్పుడు మీటా నొక్కడం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఉపయోగించే పర్చువల్ ఎమర్జెన్సీ బటన్ ఇది. ఈ అప్షన్‌లోకి ప్రవేశించిన తర్వాత వినియోగదారులు తమ పేరు, ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. అత్యవసర సమయాల్లో ఎవరిని సంప్రదించాలని భవిస్తున్నారో వారి నంబర్లు సైతం పొందుపరుచాలి. గరిష్టంగా ఐదుగురికి చెందిన సెల్‌ఫోన్ నంబర్లు ఎంటర్ చేసుకునే అవకాశముంది. ఇందులో ఒక్కసారి రిజిష్టర్ చేసుకుని, సంబంధికుల నంబర్లు పొందుపరిస్తే చాలు. ఆపై అత్యవసర సమయాల్లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కితే సరిపోతుంది. ఎలాంటి నేరాలైనా యాప్‌తో తెలుపవచ్చు. ఎక్కడున్నా సరే... ఈ యాప్ పూర్తి జీపీఎస్ పరిజ్ఞానంతో అనుసందానమై ఉన్న ఈ యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కితే వారు ఏ ప్రాంతంలో ఉన్నారనే విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. ఎస్‌వోఎస్ నొక్కిన వెంటనే వీటిపై మ్యాప్‌లో బాధితుడు ఏ ప్రాంతంలో ఉన్నారనేది హాక్–ఐ మార్క్‌లోనే కనిపించడంతో పాటు ప్రత్యేక సైరన్ వస్తుంది. దేశంలో ఎక్కడున్నా ఈ విషయాన్ని గుర్తించే ఆస్కారముంది. ఎస్‌వోఎస్ నొక్కిన తర్వాత బాధితుడు ఎటూ సంచరించినా.. ఫిర్యాదు క్లోజ్ అయ్యే వరకు కమిషనరేట్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై ఆ వివరాలు కనిపిస్తాయి. హాక్–ఐ మార్క్‌ను క్లిక్ చేస్తే బాధితుల పేరు, ఫోన్‌నంబర్ డిస్ప్లే అవుతాయి. ముందుగా సంప్రదించేందుకు ప్రయత్నిస్తారు.. హాక్–ఐ ద్వారా అత్యవసర కాల్ ఎస్‌వోఎస్ ద్వారా సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు ప్రాథమికంగా బాధితులు ఎక్కడ ఉన్నారో గుర్తిస్తారు. ఆపై ఫోన్ చేయడం, పూర్తి సందేశం పంపడం ద్వారా వారిని సంప్రదించే ప్రయత్నం చేస్తారు. గరిష్టంగా రెండు నిమిషాలు వేచి చూసి ఈ రెండింటికీ బాధితుల నుంచి స్పందన రాని పక్షంలో బాధితులు ఇబ్బందుల్లో ఉన్నట్లు నిర్ధారిస్తారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే కేసు అయితే పోలీస్ స్టేషన్లతో సంబంధం లేకుండా సమీపంలో విధులు నిర్వహిస్తున్న రక్షక్, బ్లూకోట్స్ సిబ్బందిని బాధితులు ఉన్న ప్రదేశానికి పంపిస్తూ పూర్తి వివరాలు అందిస్తారు. బాధితులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లైతే అక్కడి పోలీసులను అప్రమత్తం చేస్తూ సమాచారం చేరవేస్తారు. ఇప్పటి వరకు కమిషనరేట్‌లో 10అత్యవసర కాల్స్‌ను అటెండ్ చేశారు. ఉద్యోగులు, కిరాయిదారుల వివరాల కోసం ఎవరైన డ్రైవర్‌గా పనిలో పెట్టుకున్న, ఇంట్లో ఎవరికైన ఇళ్లు కిరాయికి ఇచ్చిన... ఉద్యోగంలో చేర్చుకున్న.. ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతోంది. ఇందులో ఎవరైన నేరం చేసి పారిపోయినప్పుడు వారి పూర్తి సమాచారం కావాలంటే కష్టం అవుతోంది. వీరి వివరాలు పోలీసులకు తెలియజేస్తూ వాళ్ల వివరాలు అన్ని పోలీస్స్టేషన్లలోని సర్వర్‌లో వారి ఫొటోలు నిక్షిప్తం చేయబడి ఉంటాయి. నేరం చేసి తప్పించుకుని పోతే ఈ యాప్ ద్వారా సులభంగా పట్టుకునే అవకాశం ఉంది. టాక్సీ ప్రయాణంలో... మహిళలు టాక్సీలో ఆటోలో గాని ప్రయాణం చేస్తూ వాహనం నంబర్, వాహన వీడియో లేదా ఫొటో తీయాలి, వాహనం నంబర్ వెళ్తున్న ప్రదేశం పేరు. వెళ్లాల్సిన ప్రదేశం పేరు రాసుకుని ఈ హాక్–ఐ యాప్ ద్వారా పంపించాలి. ప్రయాణం చేస్తున్న వాహనం పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంటుంది. చేరాల్సిన గమ్యం చేరకుండా వేరేచోటికి మళ్లించినట్లు తెలిస్తే వెంటనే పోలీసులు అప్రమత్తమై పట్టుకునే విధంగా యాప్‌ను డిజైన్ చేశారు. యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి... ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగించే వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఐఓఎస్ నుంచి హాక్–ఐ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని యాప్‌ని ఓపెన్ చేయాగానే రిపోర్ట్ స్టేషన్ టూ పోలీస్, ఉమెన్ ట్రావెల్ మూడ్ సేఫ్, రిజిష్టర్ డిటెయిల్స్ ఆఫ్ సర్వెంట్, వర్కర్, టెనెంట్, ఎస్ఓఎస్, ఎమర్జెన్సీ పోలీస్ కాంట్రాక్ట్, కమ్యూనిటీ పోలీసింగ్ అని స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఇక్కడ ఆప్షన్లు వస్తాయి. ఆప్షన్ల గురించి వివరాలు... ► ఆప్షన్– 1 లో మూడు కేటగిరీలు ఉంటాయి. ఇందులో సెలెక్ట్ కేటగిరిలో ట్రాఫిక్ మంచిర్యాలలో జరిగిన నేరం మహిళలపై జరుగుతున్న వేధింపులు, పోలీసులు చేసే ఉల్లంఘనలు, ఉత్తమ పోలీసింగ్ సలహాలు తీసుకోవడానికి ఆప్షన్లు పొందుపరిచారు. ► ఆప్షన్–2 ఇందులో ఫొటో లేదా వీడియో సేవ్ సదుపాయం, ప్లేస్ ఆప్ బోర్డింగ్ అని ఉంటుంది. బాధితులు ఎక్కడ ఉన్నారో పక్కనే ఉన్న బాక్స్‌లో స్పష్టంగా టైప్ చేయాలి. ఇది పూర్తిగా మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన అప్షన్ ► ఆప్షన్ – 3, ఇందులో ఇంట్లో అద్దెకు దిగినవారు, పని మనుషులు, ఎలక్ట్రికల్ బోర్డ్ రిపేర్లు చేసే వారి సమాచారాన్ని సేకరించడానికి దీనిని ఏర్పాటు చేశారు. ► ఆప్షన్– 4, ఎస్ఓఎస్ అంటే సేవ్ అవర్ సెల్ప్ ఇది కూడా మ హిళ భద్రతను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. ఇందులో సెల్‌నంబర్, పేరు, ఎలాంటి ఆపాద పొంచి ఉందో నమోదు చేయాలి. ► ఆప్షన్– 5, ఇందులో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లోని మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లాల పోలీస్స్టేషన్ల నంబర్‌తో పాటు పెట్రోలింగ్ వాహనంలో ఉంటే వారి నంబర్లు స్టేషన్ నంబర్, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ నంబర్, ఏసీపీ, నంబర్పేరు, డీసీపీ నంబర్ పేరు కంట్రోల్ నంబర్లు పొందుపరిచారు. ► ఆప్షన్– 6, కమ్యూనిటీ పోలీసింగ్‌లో చేరాలనుకునే వారి కోసం ఈ అప్షన తయారు చేశారు. పేరు మొబైల్ నంబర్, ఈ– మెయిల్ ఐడీ, చిరునామ పొందుపరిచారు. సంబంధిత పోలీస్‌స్టేషన్ పేరు నమోదు చేయాలి. ► ఆప్షన్– 7, వివిధ ఆప్షన్ల ద్వారా పోలీసులు చేసిన ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు వీలుగా ఉండే అప్షన్ ఇది. ఒక ఫిర్యాదు పంపిణీ తర్వాత దాని ఐడీ నంబర్ తెలుస్తోంది. ఫిర్యాదు పరిష్కారం కాకపోతే అది పెండింగ్ అని చెబుతుంది. ► ఆప్షన్ – 8, ఈ ఆప్షన్లో యాప్‌లో రిజిష్టరైన తర్వాత మళ్లీ ఏదైనా మార్పులు చేసుకునే విధంగా ఉపయోగపడుతోంది. యాప్ ఇలా పని చేస్తుంది... యూజర్ పంపించే సమాచారాన్ని తక్షణం స్థానిక పోలీసులకు షీ టీమ్స్, పెట్రోలింగ్, వాహనాలకు అందించడం ప్రత్యేకత వివరాలు అందగానే సిబ్బంది తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని సమస్యలు వెంటనే పరిష్కరిస్తారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసులతో ప్రజల భాగస్వామ్యం అవశ్యకత ప్రజల భద్రత కల్పించి నేర రహిత కమిషనరేట్‌గా మార్చేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతోంది. ప్రతి ఒక్కరూ ఈ హాక్–ఐ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని వ్యక్తిగత సమాచారం కాకుండా నేరాల గురించి తెలుసుకోవచ్చు. సమాజంలో అన్ని వర్గాల ప్రజల మధ్య సమన్వయం ఏర్పాటు చేయడానికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతోంది. యాప్ ద్వారా సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడుతాయి. ఒక వేల ఎవరికైనా కావాలంటే స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాల్సి ఉంటుంది. హాక్–ఐతో నేరాల నియంత్రణ హాక్– ఐ ద్వారా నేరాల నియంత్రన సాధ్యమవుతోంది. తెలంగాణ పోలీస్ ఇప్పటికే దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉంది. హాక్–ఐ యాప్‌ను అన్ని వర్గాల ప్రజలు ఉపయోగించాలి. నేరా నియంత్రణకు సహకరించాలి. అందరు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైన దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోంది. – గౌస్‌బాబా, ఏసీపీ, మంచిర్యాల -
‘హాక్ ఐ’తో ఆపద నుంచి బయటపడొచ్చు ఇలా..
మీరు ఆపదలో ఉన్నారా?.. మీ కళ్లముందే అన్యాయం జరుగుతుందా?.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఉందా?.. ఇదివరకటిలా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సమయం వృథా చేసుకోనవసరం లేదు. జస్ట్ ఒకే ఒక్క క్లిక్‌తో మీ ఫిర్యాదును నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. డ్యూటీలో ఉన్న పోలీసూ నిర్లక్ష్యం చేసినా ఒక్క క్లిక్ చాలు. ఇందుకోసం ‘హాక్ ఐ’ పేరిట హైదరాబాద్ పోలీస్ ఐటీ సెల్ డిపార్ట్మెంట్ సరికొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ఎలా ఉపయోగించాలి?, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీ కోసం... కావాల్సింది ఏమిటి?.. * ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ డేటా సౌకర్యం ఉండాలి. అప్పుడు ‘హాక్ ఐ’ అప్లికేషన్‌ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. * ఇందుకోసం మీరు ప్లే గూగూల్.కామ్‌లో సెర్చ్ చేయవచ్చు. * http://www.hyderabadpolice.gov.in/Default.htm ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. * కుడి వైపున ఉన్న ‘హాక్ ఐ’ సింబల్‌పై క్లిక్ చేయండి. విండోలో కనిపిస్తున్న ‘ఇన్స్టాల్’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే యాప్ మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. అప్లికేషన్ యాక్టివేట్ చేయాలంటే లాగిన్ కావాలి. లాగిన్ రెండు రకాలుగా చేయవచ్చు. ఒకటోది లాగిన్ విత్ ఫేస్బుక్, రెండోది లాగిన్ విత్ ఎప్పిర్ విండో. * స్క్రీన్‌పై ఉన్న ఆప్షన్ లాగిన్ అయిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. రిపోర్ట్ వైలేషన్ టూ పోలీస్... * ఇక్కడ మీరు మీ ఫిర్యాదును ఫొటోలు, వీడియో రూపంలో పంపవచ్చు. * మీరున్న ప్రాంతం, దాని వివరాలు క్లుప్తంగా ఇక్కడ అందించి ఫిర్యాదు చేయవచ్చు. ఉమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్ * మహిళలు ప్రయాణించే సమయంలో ఇది రక్షణగా ఉంటుంది. * ఆటోలు, ట్యాక్సీలో ప్రయాణిస్తున్నప్పుడు దీన్ని వాడవచ్చు. * ముందుగా మీరు ఎక్కే వాహనం ఫొటోను క్యాప్చర్ చేయాలి. * ఈ ఆప్షన్లో.. ఎక్కడ ఎక్కుతున్నది, వాహనం ఏది, దాని నంబరు, ఎక్కడికి వెళ్తున్నారు... అనే వివరాలు పొందుపర్చాలి. * ప్రమాదం జరిగితేనేకాకుండా ప్రయాణ సమయంలో ఇబ్బందులు ఎదురైనా దీన్ని ఉపయోగించవచ్చు. ఎస్ఓఎస్ (ఎమర్జెన్సీ బటన్) * ఈ ఆప్షన్లో మీ పేరు, ఫోన్ నంబరు, అత్యవసర సమాచారాన్ని టైప్ చేయాలి. * తరువాత మీరు అత్యవసర సమయంలో ఎవరిని సంప్రదించాలనుకుంటున్నారో వారి ఫోన్‌నంబరును ఎంటర్‌చేసి సెండ్ చేయాలి. * ఇప్పుడు మీకు ఎమర్జెన్సీ బటన్ యాక్టివేట్ అవుతుంది. * అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఈ బటన్ నొక్కితే ఆ సమాచారం మీరు అనుకున్నవారికి చేరుతుంది. కమ్యూనిటీ పోలీసింగ్ * సమాజంలో మీరు లా అండ్ ఆర్డర్‌కు సహకరించాలనుకున్నా, పోలీసులకు అన్ని విధాలా సహకరించాలనుకున్నా కమ్యూనిటీ పోలీసింగ్ ఆప్షన్లో రిజిష్టర్ కావొచ్చు. * ఇక్కడ మీరు.. పేరు, చిరునామా, ఈ-మెయిల్, ఫోన్ నంబరు, మీ పరిధిలోని పోలీస్ స్టేషన్ తదితర వివరాలు ఇవ్వాలి. * ఇక్కడ మీరు పోలీసుల నుంచి కమ్యూనిటీ పోలీసింగ్ న్యూస్ కావాలంటే అది సెలక్ట్ చేసి సబ్మిట్ చేయాలి. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ *ఇక్కడ మీరు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల వివరాలు పొందవచ్చు. * ఈ ఆప్షన్లో మీకు అన్ని పోలీస్ స్టేషన్ల పేర్లు కనిపిస్తాయి. * మీకు కావాల్సిన పోలీస్ స్టేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. * అప్పుడు మీకు సంబంధిత పోలీస్ స్టేషన్ చిరునామా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ నంబర్, ఏసీపీ, కంట్రోల్ రూమ్ తదితర ఇతర అధికారుల ఫోన్ నంబర్లు కనిపిస్తాయి. ఎస్ఓఎస్ ప్రాధాన్యత * దీన్ని క్రియేట్ చేసిన తరువాత మీ స్క్రీన్‌పై ఎస్ఓఎస్ బటన్ కనిపిస్తుంది. * అత్యవసర సమయంలో ఈ బటన్ నొక్కితే ఇదివరకు మీరు నమోదు చేసిన ఐదుగురితోపాటు స్థానిక పోలీస్ స్టేషన్‌కు, ఏసీపీ, డీసీపీలకు సమాచారం వెళ్తుంది.