health minister jp nadda
-
తెలంగాణ ఎయిమ్స్ పనులు ప్రారంభించండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రతిపాదిత ఎయిమ్స్‌కు వెంటనే నిధులు విడుదలచేసి, పనులు ప్రారంభించాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఇక్కడ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ఆ శాఖ కార్యదర్శి ప్రీతిసుడాన్‌ను వేర్వేరుగా కలసి వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక మంత్రి లోక్‌సభలో హామీ ఇచ్చిన సంగతిని గుర్తుచేశారు. -
ఎవరినీ వదలం: సీఎం యోగి
పరిస్థితిపై మోదీ సమీక్ష పుండు మీద కారం సరికాదన్న యోగి ఖరగ్‌పూర్: తీవ్ర విమర్శల నడుమ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సొంత నియోజక వర్గం గోరఖ్‌పూర్ లోని బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీని సందర్శించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో కలిసి పరిస్థితిపై వైద్యులతో చర్చించిన ఆయన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. "ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. కేంద్రం తరపున అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు" అని యోగి తెలిపారు. 'మేము ఈ అంశంపై సీరియస్‌గానే ఉన్నాం. విచారణ కమిటీ నివేదికను రానివ్వండి. తప్పని తేలితే ఎంతవారినైనా వదిలే ప్రసక్తే లేద(ని ఆయన తెలిపారు. తప్పుడు కథనాలపై మండిపడ్డ ఆయన, వార్డులలోకి వెళ్లి చూస్తే పరిస్థితి మీకే అర్థమౌతుందంటూ మీడియాకు చురకలంటించారు. రాజకీయాలు వద్దు చనిపోయిన బాధలో ఉన్న తల్లిదండ్రులను రెచ్చగొడుతూ కొందరు ఈ సున్నితమైన అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. 'అది సరికాదు. గతంలో గులామ్ నబీ ఆజాద్ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమంటూ చేతులెత్తేశారు. ఇప్పుడేమో మాపై విమర్శలు చేస్తున్నారు. అది వారి విచక్షణకే వదిలేస్తున్నా' అని యోగి పేర్కొన్నారు. ఇక ఘటనపై కేంద్రం తరపున ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటును చేస్తామని ప్రకటించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా, పరిస్థితులను సమీక్షించేందుకు ఓ వైద్య బృందాన్ని బీఆర్డీ మెడికల్ కళాశాలకు రప్పిస్తున్నట్లు వెల్లడించారు. సిలిండర్ల బకాయిలను ఆగష్టు 5నే చెల్లించినప్పటికీ, కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే ఈ మరణాలు సంభవించినట్లు ఇప్పటికే కమిటీ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు ఉంటాయని యోగి ప్రకటించారు. గోరఖ్‌పూర్ ఘటనపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూపీ కాంగ్రెస్ విభాగం సీఎం యోగి, వైద్యశాఖ మంత్రి సిద్ధార్థ్ నాథ్‌ల రాజీనామాకు డిమాండ్ చేస్తోంది. -
జూలై 24న నీట్ పరీక్ష యథాతథం: నడ్డా
న్యూఢిల్లీ : నీట్ ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. కేంద్ర ప్రభుత్వం నీట్‌కు అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు. నీట్ ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జేపీ నడ్డా ...నీట్ ఆర్డినెన్స్‌పై వివరణ ఇచ్చారు. ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారన్నారు. నీట్‌పై కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాని జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రాల అభ్యంతరాలతో ఆర్డినెన్స్‌ను తీసుకు వచ్చామని ఆయన తెలిపారు. రాష్ట్రాల వాదనతో పాటు, సిలబస్‌లో మార్పు అంశాన్ని తాము పరిగణనలోకి తీసుకున్నామన్నారు. అయితే ఇప్పటికే ఏడు రాష్ట్రాలు నీట్ నిర్వహణకు అంగీకరించాయన్నారు. జూలై 24న నీట్-2 పరీక్ష యథాతథంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా ప్రభుత్వ కళాశాలకు నీట్ పై మినహాయింపు ఉందన్నారు. అయితే నీట్‌పై వస్తున్న ఊహాగానాలు సరికాదన్నారు. ప్రయివేట్ కళాశాలలు, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ సీట్లు నీట్ కిందకే వస్తాయన్నారు. ఈ ఏడాది డిసెంబర్ తర్వాత పీజీ పరీక్షలు కూడా నీట్ కిందకే వస్తాయని నడ్డా పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రాంతీయ భాషల్లో నీట్ నిర్వహిస్తామన్నారు. కాగా నీట్-1 పరీక్షకు ఇప్పటికే ఆరులక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారన్నారు. నీట్ ద్వారా సీట్ల భర్తీలో పారదర్శకత వస్తుందని నడ్డా అభిప్రాయపడ్డారు. -
దేశంలో స్వైన్‌ఫ్లూ మరణాలు 841!
దేశంలో ఈ ఏడాది ఇప్పటివరకు 841 మంది స్వైన్ ఫ్లూతో మరణించారు. ఇది చాలా ఆందోళనకరమైన విషయమని, పరిస్థితిని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. ఈ అంశంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పార్లమెంటులో ప్రకటన చేశారు. జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 22 వరకు మొత్తం 14,673 మందికి స్వైన్ ఫ్లూ సోకిందని తెలిపారు. ఈ వ్యాధి చికిత్సకు ఉపయోగించే ఓసెల్టామివిర్ అనే మందు కొరతగా ఉందన్న వాదనను ఆయన తిరస్కరించారు. దాన్ని భారతదేశంలోనే తయారుచేస్తున్నారని మంత్రి జేపీ నడ్డా చెప్పారు. అయితే దీన్ని నేరుగా కౌంటర్లలో అమ్మడంలేదని, కేవలం వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్ముతున్నారని తెలిపారు. మందును ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తే వైరస్ దానికి లొంగకుండా పోయే ప్రమాదం ఉన్నందున ముందునుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.