యువత కోసం ‘హలో..మై ఫ్రండ్..’!
పింప్రి, న్యూస్‌లైన్: యువతకు మార్గనిర్దేశనం చేయడానికి దేశంలో మొట్టమొదటిసారిగా పుణే కార్పొరేషన్ ‘హలో! మై ఫ్రెండ్’ హెల్ప్ లైన్‌ను ప్రారంభించింది. విద్య, సాంకేతిక, ఉద్యోగ తదితర అంశాల గురించి విపులంగా వివరించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఈ హెల్ప్‌లైన్ ఎంతగానో ఉపయోగపడుతుందని కార్పొరేషన్ ఉప మేయర్ ఆబా బాగుల్ తెలిపారు. నేటి యువతకు అనేక విషయాలపై సరైన అవగాహన లేక ఇబ్బందిపడుతున్నారని, వారందరి సందేహాలను తీర్చడానికి హలో మై ఫ్రెండ్ టోల్ ఫ్రీ నంబర్ 18002336850ను ఉపయోగించుకోవాల్సిందిగా అధికారి కోరారు.