'కార్పోరేట్ సంస్థలను రక్షించాలనే రహస్య ఎజెండా'
న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని భారత్ కు తెప్పించడానికి ఎలాంటి చర్యల్ని తీసుకుంటుందో చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని సీపీఎం సీతారాం ఏచూరి అన్నారు. కేవలం నల్ల కుబేరుల పేర్లను వెల్లడించడమే కాకుండా.. నల్ల ధనాన్ని భారత్ తెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్నికల ప్రచారంలో బీజేపీకి అండగా నిలిచిన కార్పోరేట్ సంస్థలను రక్షించాలనే రహస్య ఎజెండాతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామని బీజేపీ హామీ చేసిందని, అయితే మళ్లీ ఈ అంశాన్ని సుప్రీం కోర్టు పరిధిలోకి ఎందుకు తీసుకెళ్తోందని సీతారాం ఏచూరి ప్రశ్నించారు. నల్ల కుబేరుల జాబితాను బుధవారం ఉదయం సుప్రీం కోర్టుకు కేంద్రం సమర్పించిన సంగతి తెలిపిందే.