High income
-
భారత్‌కు మరో 75 ఏళ్లు..
న్యూఢిల్లీ: భారత్‌సహా 100కు పైగా దేశాలు రాబోయే కొన్ని దశాబ్దాల్లో అధిక ఆదాయ దేశాలుగా అవతరించడంలో తీవ్ర అవరోధాలను ఎదుర్కొంటున్నాయని ప్రపంచబ్యాంక్ నివేదిక ఒకటి పేర్కొంది. అమెరికా తలసరి ఆదాయంలో పావుశాతానికి చేరుకోవడానికి భారత్‌కు దాదాపు మరో 75 ఏళ్లు పట్టవచ్చని కూడా నివేదిక విశ్లేషించింది. చైనా విషయంలో 10 సంవత్సరాలు, ఇండోనేషియా విషయంలో 70 సంవత్సరాలు పడుతుందని కూడా నివేదిక పేర్కొంది. ‘వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024: ది మిడిల్ ఇన్కమ్ ట్రాప్’ అనే శీర్షికన వెలువరించిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు.. → అమెరికా తలసరి ఆదాయం (నామినల్) ప్రస్తుతం దాదాపు 80,000 డాలర్లు ఉంటే, భారత్ విషయంలో ఈ విలువ దాదాపు 2,500 డాలర్లు. → 2023 చివరి నాటికి 1,136 డాలర్ల నుంచి 13,845 డాలర్ల మధ్య తలసరి కలిగిన 108 ప్రధాన దేశాలను పరిశీలిస్తే 600 కోట్ల ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో వీరు 75 శాతం. ఈ దేశాల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు తీవ్ర పేదరికంలో నివసిస్తున్నారు. → మున్ముందు ఆయా దేశాలు గతం కంటే కఠినమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. వేగంగా పెరుగుతున్న వృద్ధాప్య జనాభా, పెరుగుతున్న రుణాలు, తీవ్రమైన భౌగోళిక, రాజకీయ, వాణిజ్య ఘర్షణలు అలాగే పర్యావరణానికి హాని కలిగించకుండా ఆర్థిక పురోగతిని వేగవంతం చేయడంలో పెరుగుతున్న కష్టాల వంటివి ఇక్కడ ముఖ్యమైనవి. → ఇంకా అనేక మధ్య–ఆదాయ దేశాలు ఇప్పటికీ గత దశాబ్ద కాల అనుభవాలతో పురోగతికి ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి. ప్రధానంగా పెట్టుబడిని విస్తరించేందుకు రూపొందించిన విధానాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది కేవలం మొదటి గేర్‌లో కారును నడపడం, దానిని వేగంగా వెళ్లేలా చేయడానికి ప్రయతి్నంచడం వంటిది. – ఇదే పరిస్థితి కొనసాగితే, చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ శతాబ్దం మధ్య నాటికి తగిన సంపన్న సమాజాలను సృష్టించే రేసును కోల్పోతాయని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్, డెవలప్మెంట్ ఎకనామిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇండెరి్మట్ గిల్ అన్నారు. → అధిక అధిక ఆదాయ స్థితికి చేరుకోవడానికి దేశాలు వాటి పరిస్థితులకు అనుగుణంగా క్రమక్రమంగా మరింత అధునాతన విధానాలను అవలంబించవలసి ఉంటుంది. → 1990 నుండి కేవలం 34 మధ్య–ఆదాయ ఆర్థిక వ్యవస్థలు మాత్రమే అధిక–ఆదాయ స్థితికి మారాయి. వాటిలో దాదాపు 10 దేశాలు యూరోపియన్ యూనియన్ ఏకీకరణ నేపథ్యంలోనో లేక ముందే ఆయా దేశాల్లో కనుగొన్న చమురు క్షేత్రాల నుంచి ప్రయోజనం పొందడం కారణంగానో అధిక ఆదాయ దేశాలుగా మారగలిగాయి.ఎకానమీలో భారత్ ఐదవ స్థానం అయినా... 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌ను అధిగమించగా, త్వరలో జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత దేశ ఎకానమీ విలువ 3.6 ట్రిలియన్ డాలర్లు. ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ తలసరి ఆదాయంలో దేశం చాలా వెనుకబడి ఉంది. అభివృద్ధి చెందిన దేశమంటే...ప్రస్తుతం భారత్ తలసరి ఆదాయం దాదాపు 2,500 డాలర్లు. 2031 ఆర్థిక సంవత్సరం భారత్ తలసరి ఆదాయం 4,500 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. ఇదే జరిగితే దేశం ఎగువ మధ్య–ఆదాయ దేశాల క్లబ్లో ప్రవేశిస్తుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. ఆ స్థాయి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. -
కష్టపడినా.. ఆదాయం పెరగడం లేదా? అయితే..
రోజులో 10–12 గంటలు, ఎంతో సిన్సియర్‌గా పనిచేసినా, లాభం లేదు.. ఆదాయం అక్కడక్కడే.. ఎదుగూ బొదుగూ లేకుండా ఉంది..! రూపాయి కూడా మిగలడం లేదు.. ఇలాంటి నిట్టూర్పు, నిరాశా వాతావరణం కొందరిలో కనిపిస్తుంటుంది. ఎప్పుడూ తమ గురించి ఇలా అనుకోవడమే కానీ, పట్టుబట్టి కారణాలేంటని? విశ్లేషించుకుని, సమీక్షించుకునేది కొద్ది మందే ఉంటారు. జీవితంలో మరింత పురోగమనం చెందాలంటే? అందుకు ఎక్కువ గంటలు పనిచేయడం ఒక్కటే ప్రామాణికం కాబోదు. తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందా..? ఆదాయం పెంచుకునే మార్గాలేంటి?.. సమీక్షించుకుని సరైన దిశలో అడుగులు వేస్తే మార్పుకు ఆహ్వానం పలికినట్టే.. వృద్ధి లేకపోవడానికి కారణాలు కొందరు వ్యయాలను నియంత్రించుకోవడంలోనే బిజీగా కనిపిస్తుంటారు. మరికొందరు ఆదాయం పెంచుకునే మార్గాలపైనే దృష్టి పెడతారు. ఖర్చుల నియంత్రణకు సమయం వృ«థా చేయకుండా, ఆదాయం పెంచుకోవడానికే ఆ సమయాన్ని ఖర్చు చేస్తారు. ఇందులో మీరు ఏ రకం అన్నది ప్రశ్నించుకోవాలి. ఆదాయం పెంచుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ, వ్యయ నియంత్రణ పూర్తిగా మన చేతుల్లో ఉండకపోవచ్చు. కూరగాయలు, గ్రోసరీ, స్కూలు ఫీజులు, పెట్రోల్ చార్జీలు, ఇంటి అద్దె వీటిల్లో ఏవీ మన నియంత్రణలో ఉండేవి కావు. ఏ మార్గంలో వెళితే, ఎలా పనిచేస్తే ఆదాయం పెరుగుతుంది? అనేది విశ్లేషించుకోవాలి. ► నిందలతో కాలయాపన చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఈ ఏడాది ‘నాకు కచ్చితంగా పదోన్నతి రావాలి. కానీ, ఆఫీసు రాజకీయాలు దానికి నన్ను దూరం చేశాయి. ఆ ఆర్డర్ నాకు రావాల్సింది. నా పోటీదారు తన్నుకుపోయాడు’ ఈ తరహా ఆక్షేపణలతో వచ్చేది ఏమీ ఉండదు. ఎందుకు రాలేదో? నిజాయితీగా విశ్లే షించుకుని, కారణాలను గుర్తించినప్పుడే అదే అనుభవం పునరావృతం కాకుండా ఉంటుంది. ► నాకేంటి? ఏ పని చేసినా అందులో నాకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఈ ఆలోచన కూడా ఆదాయం పెరగకపోవడానికి, అవకాశాలను గుర్తించకపోవడానికి అడ్డుగా ఉంటుందన్నది నిపుణుల విశ్లేషణ. ఒక ఉదాహరణ చూద్దాం. ఇద్దరు మిత్రులు ఒక హోటల్‌కు వెళ్లారు. అక్కడ వెయిటర్లు కొందరు ఎవరు టిప్ ఇస్తారన్న దానిపైనే శ్రద్ధ చూపిస్తూ, టిప్ కోసమే పనిచేస్తున్నారు. కానీ, వారికి టిప్ అనుకున్నంత రావడం లేదు. కొందరు శ్రద్ధతో, గౌరవంగా, వేగంగా వచ్చిన వారికి కావాల్సినవి అందిస్తూ, వారిని సంతోష పెట్టడంపై దృష్టి పెట్టారు. వారికి బోలెడంత టిప్ వస్తోంది. ఇక్కడ కార్యాచరణే ఫలితమిస్తుంది. అంచనాలు కాదు. ఆదాయం పెంచుకోవాలని ఉంటుంది. అందుకు ఫలితం ఇవ్వని చోట వెతుక్కుంటే ప్రయోజనం ఏముంటుంది? ► అధిక ఆదాయం ఆశిస్తున్నప్పుడు మీ ఉత్పాదకత ఏ పాటిది? అని ప్రశ్నించుకున్నారా! నైపుణ్యాలు పెంచుకోకుండా వృద్ధి కోరుకోవడం అత్యాశ అవుతుందేమో ఆలోచించాలి. కొందరు తమ నైపుణ్యాలపై పెట్టుబడి పెడుతుంటారు. ఏటా కొంత మొత్తాన్ని పక్కన పెడుతూ, ఆ మొత్తాన్ని నైపుణ్యాల వృద్ధికి ఇన్వెస్ట్ చేస్తుంటారు. మారుతున్న అవసరాలకు అనగుణంగా మీ నుంచి ఉత్పత్తి ఉండాలి. అప్పుడే పురోగతి సాధ్యపడుతుందని గుర్తించాలి. ► మార్గదర్శి లేకపోవడం? చాలా మందికి జీవితంలో మంచి, చెడులు చెప్పి, సరైన మార్గంలో నడిపించే మార్గదర్శకులు ఉండరు. సొంతంగా చేయడం తప్పించి, పెద్దగా ఉండదు. ఒక మార్గదర్శి ఉంటే వచ్చే ఫలితాలు వేరు. ఒక రచయితకు మార్గదర్శి ఉంటే ఎప్పటికప్పుడు మెరుగుపడడానికి వీలుంటుంది. ఒక ఇన్వెస్టర్ తాను సొంతంగా ఇన్వెస్ట్ చేస్తే ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. అప్పటికే పెట్టుబడుల స్వరూపం పూర్తిగా అర్థం చేసుకుని, చక్కని పరిజ్ఞానం ఉన్న వారి అనుభవాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా వచ్చే ఫలితాలు భిన్నంగా ఉంటాయి. ► ఏ పని చేస్తున్నారు?.. చేసే పనులను బట్టే ఆదాయం ఆధారపడి ఉంటుంది. చేస్తున్న పనిని ఎక్కువ ఫలితం ఇచ్చేవి, తక్కువ ఫలితం ఇచ్చేవి, అసలు ఫలితం ఇవ్వనివి అంటూ మూడు రకాలుగా నిపుణులు చూస్తారు. ఆదాయం పెంచుకోలేని వారిలో ఎక్కువ మందిని గమనించినప్పుడు.. వారు చేసే పనులు ఫలితాన్ని ఇవ్వనివే ఉంటున్నాయి. మీరు చేస్తున్నది కూడా ఇదే అయితే సరిదిద్దుకోవడం ఒక మార్గం. ► మెచ్చేలా పనిచేయకపోవడం! కొందరు ఉద్యోగులు కంపెనీని వీడుతుంటే.. కంపెనీయే బతిమిలాడే సందర్భాలు కనిపిస్తాయి. కొందరు కొన్ని అవసరాలకు ఎప్పుడైనా ఒకటే దుకాణానికి వెళుతుంటారు. అక్కడ లేకపోతేనే మరొక దుకాణం చూసుకుంటారు. అక్కడ ఆ వర్తకుడు అందించే సేవలు, దుకాణాదారు నిర్వహణ, మాటతీరు, ఎక్కువ శ్రేణిలో ఉత్పత్తులు ఉండ డం కారణం ఏదైనా కావచ్చు. అలాంటి ప్రత్యేకతలు చేస్తున్న పనిలో మీరు చూపిస్తే ఆదాయం వృద్ధి చెందుతుందేమో పరిశీలించాలి. మార్పు దిశగా అడుగులు ► మీరు చేస్తున్న పనికి పారితోషికం పెరగాలంటే లేదా బ్యాంక్ బ్యాలన్స్ పెరగాలంటే ముందు ఆలోచనల పరిధిని విస్తృతం చేసుకోవాల్సి ఉంటుంది. గొప్ప ఆలోచనలకు చోటు ఇవ్వాలి. మీ పరిధిని విస్తృతం చేసి, ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించండి. ► పనికి సృజనాత్మక జోడించుకోవాలి. మీకు అప్పగించిన పనిని సాధారణంగా చేసుకుపోవడం వేరు. దాన్ని భిన్నంగా, ఆకర్షణీయంగా చేయడం వేరు. మీకు అప్పగించిన పని.. మీరేంటన్నది చూపించుకునే వేదిక. ఇచ్చిన పనికి ఎంత విలువ జోడించామన్నది కీలకం అవుతుంది. మీకు పని అప్పగిస్తే ప్రశాతంగా నిద్రపోవచ్చు? అన్న నమ్మకం కలిగించారంటే సంస్థకు విలువైన ఆస్తియే అవుతారు. అప్పుడు ఆదాయం దానంతట అదే పెరుగుతుంది. ఖర్చయినా మీకే ప్రాధాన్యం ఇస్తారు. ఆ నైపుణ్యాలు లేకపోతే వాటిని తెచ్చుకోవడంపై ఫోకస్ పెట్టాలి. పనిలో నైపుణ్యాలను పెంచుకునే మార్గాలు కచ్చితంగా ఉంటాయి. సంస్థ కంటే ముందు మీరు మీ పనిలో కొత్తదనాన్ని కోరుకోవడం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ► మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడం కూడా ఆదాయం పెంచుకోవడానికి మార్గం అవుతుంది. చేస్తున్న పనిలోనే కొత్త అవకాశాలను వెతుక్కోవాలి. వాటిని సంస్థతో పంచుకోవాలి. మీ నుంచి వచ్చే ఒక్క ఆవిష్కరణ సక్సెస్ అయినా, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ► ఎంత ప్రయత్నించినా చేస్తున్న పనిలో ఆదాయం పెంచుకోవడం సాధ్యపడడం లేదన్న వారికి మరో ఆదాయ మార్గాన్ని వెతుక్కోవడం ఒక పరిష్కారం కావచ్చు. అయితే, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం లేదా వృత్తికి అదనంగా, రెండో ఆదాయం కోసం ఎంత సమయం కేటాయించగలరనేది ఇక్కడ కీలకం అవుతుంది. ► సమయం చాలడం లేదు? ఈ డైలాగ్ ఎక్కువ మంది నుంచి వినిపిస్తుంటుంది. ఏది చేయాల న్నా వచ్చే సమాధానం ఇదే. పని ప్రదేశంలో ఉ త్పాదకతకు తోడ్పడని, అదనపు కాల హరణంతో వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని గుర్తు ంచుకోవాలి. సమయాన్ని వృ«థా చేయకుండా, సద్వినియోగం చేసుకోవడం విజయానికి, అదనపు ఆదాయానికి పునాదిగా గుర్తించాలి. ► అదనపు ఆదాయ వనరులు ఎన్నో ఉన్నాయి. మీరు ఎందులో నిపుణులు అయితే ఆ విభాగానికి సంబంధించి అధ్యాపకులుగా మారొచ్చు. ఆన్లైన్ బోధన చేపట్టవచ్చు. ఫ్రీలాన్స్ వర్క్, డిజిటల్ మార్కెటింగ్ లేదా ఆలోచనలో పదునుంటే స్టార్టప్ పెట్టేయవచ్చు. ఒక్కసారి ఆలోచన చానల్ తెరుచుకుంటే రెండో ఆదాయానికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. ఆదాయ మార్గాలు.. పార్ట్‌టైమ్/ఫ్రీలాన్స్ వర్క్ ద్వారా రెండో ఆదాయానికి ఎన్నో మార్గాలున్నట్టే.. అసలు కష్టపడకుండా ఆదాయం సమకూర్చి పెట్టే ‘ప్యాసివ్’ మార్గం కూడా ఒకటి ఉంది. ► రెండు ప్రాపర్టీలు ఉంటే ఒకదానిని అద్దెకు ఇ వ్వడం ద్వారా ప్యాసివ్ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. కార్యాలయ స్థలం ఉన్నా, అందులో కొత భాగాన్ని అద్దెకు ఇచ్చినట్టయితే అలా కూ డా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. లేదంటే బ్యా ంకు డిపాజిట్లలో పెద్ద మొత్తంలో ఉంటే వెన క్కి తీసుకుని ప్రాపర్టీని సమకూర్చుకోవాలి. ► బిల్డింగ్‌లో చిన్న స్పేస్‌ను ఏటీఎం కేంద్రానికి అద్దెకు ఇచ్చుకున్నా చక్కని ఆదాయ వనరు ఏర్పడుతుంది. పట్టణాల్లో ఏటీఎం కేంద్రానికి బ్యాంకులు నెలవారీగా రూ.25–50వేల వరకు చెల్లిస్తున్నాయి. ► పార్కింగ్ స్థలాన్ని అద్దెకు ఇవ్వడం కూడా మంచి ఐడియా. అదనపు పార్కింగ్ స్లాట్లను కొనుగోలు చేసి, ఇతరులకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. పట్టణాల్లో ఖాళీ ప్లాట్/స్థలం ఉన్నా అందులో రూపాయి పెట్టుబడి పెట్టుకుండా పార్కింగ్‌కు అద్దెకు ఇచ్చినా మంచి ఆదాయం సమకూరుతుంది. అందరికీ ప్రాపర్టీ ఉండాలని లేదు. కానీ, మనసుంటే మార్గం ఉంటుందన్నట్టు.. పట్టణానికి శివారులో అయినా ప్రాపర్టీని సమకూర్చుకుని, దానిపై ఆదాయం తెచ్చుకునే మార్గం గురించి ఆలోచిస్తే మార్గం కనిపించొచ్చు. ► భవనంపైన, టెర్రాస్‌లో హోర్డింగ్‌కు స్థలాన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూరుతుంది. రహదారికి సమీపంలో మీకు ఇల్లు/స్థలం ఉంటే చాలు. ► వడ్డీ ఆదాయానికి ప్యాసివ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ద్రవ్యోల్బణం కంటే అధిక రాబడినిచ్చే సాధనాలనే ఎంపిక చేసుకోవాలి. బ్యాంకు సేవింగ్స్ డిపాజిట్, ► స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే డివిడెండ్ ఆదాయం మరొక మార్గం. డివిడెండ్ ఆదాయం అన్నది ఆయా కంపెనీల పనితీరు, మార్కెట్ పరిస్థితులు, దేశ ఆర్థిక పరిస్థితులకు ప్రభావితం అవుతుందని గుర్తించాలి. ► కార్లు, వ్యాన్లను కొనుగోలు చేసి, కంపెనీలకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం లభిస్తుంది. ► కష్టమా, సుఖమా.. ఎంత మిగులుతుంది? ఇలాంటి వాటికి చోటు ఇవ్వకుండా కృషితో మీకు తోచినది ప్రారంభించండి. మంచి ఫలితమే ఎదురవుతుంది. -
అత్యధిక ఆదాయం ఎస్పీ, టీడీపీలదే
న్యూఢిల్లీ: 2016–17 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయం పొందిన తొలి మూడు ప్రాంతీయ పార్టీలుగా సమాజ్‌వాదీ, టీడీపీ, అన్నా డీఎంకే నిలిచాయి. ఆ ఏడాదిలో 32 ప్రాంతీయ పార్టీల ఆదాయం కలిపి రూ.321.03 కోట్లు కాగా, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి వచ్చిన ఆదాయం రూ.82.76 కోట్లు. 32 పార్టీల మొత్తం ఆదాయంలో ఇది 25.78%. రెండో స్థానంలో ఉన్న టీడీపీకి రూ.72.92 కోట్లు, ఆ తర్వాతి స్థానంలో నిలిచిన అన్నాడీఎంకేకు రూ. 48.88 కోట్ల ఆదాయం వచ్చింది. పార్టీల ఆదాయ వ్యయాలకు సంబంధించి ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాలను విశ్లేషించిన ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్) అనే సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. అయితే ఆర్జేడీ, ఆప్ వంటి 16 ప్రధాన ప్రాంతీయ పార్టీల వివరాలు లభించనందున వాటి వివరాల గురించి తెలియరాలేదంది. అత్యధికంగా వ్యయం చేసిన పార్టీల్లోనూ ఎస్పీ తొలిస్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో అన్నా డీఎంకే, డీఎంకే ఉన్నాయి. ఈ మూడు పార్టీలు వాటికి వచ్చిన ఆదాయానికన్నా ఎక్కువే ఖర్చుపెట్టాయి. టీడీపీ 2016–17లో తనకు వచ్చిన ఆదాయంలో 33 శాతాన్నే ఖర్చు చేసింది. -
టీ అమ్ముతూ నెలకు 12 లక్షలు
పుణె: చాయ్ అమ్ముతూ నెలకు ఎంత సంపాదించొచ్చు? వ్యాపారం బాగా జరిగినా రోజుకు వెయ్యి రూపాయలు ఆదాయం పొందడం గగనం. అలాంటిది పుణెలో ఓ వ్యక్తి మాత్రం చాయ్ అమ్మి ఏకంగా నెలకు రూ. 12 లక్షలు ఆర్జిస్తున్నాడు. అతనే నవ్‌నాథ్ యేవలే. పుణెలో టీకి మంచి డిమాండ్ ఉన్నప్పటికీ ప్రఖ్యాత టీ బ్రాండ్లు, ఔట్లెట్లు ఏవీ లేవని 2011లో యేవలే గుర్తించారు. ఆ తర్వాత తాను ఆ వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని తన టీ రుచి ఎలా ఉండాలనే దానిపై నాలుగేళ్లు పరిశోధనలు చేశారు. అనంతరం మరికొందరిని భాగస్వాములుగా చేర్చుకుని తన పేరుమీదనే చాయ్ దుకాణం తెరిచారు. కొద్దిరోజుల్లోనే ఆయన టీకి భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో పుణెలోనే మరో రెండు చోట్ల యేవలే ఔట్లెట్లను తెరిచారు. ఇప్పుడు ఒక్కో ఔట్లెట్లో 12 మందికి ఆయన ఉపాధి కల్పిస్తున్నారు. రోజుకు దాదాపు 4 వేల కప్పుల చాయ్ అమ్ముడుపోతోంది. త్వరలోనే యేవలే టీ స్టాల్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తాననీ, మరో వంద టీ స్టాల్స్ ఏర్పాటు చేసి మరింత మందికి ఉద్యోగాలిస్తానని ఆయన చెబుతున్నారు. పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమేనని ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల వ్యాఖ్యానించడంతో దానిపై తీవ్ర చర్చ జరగడం తెలిసిందే. ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ‘పకోడా వ్యాపారంలా కాకుండా మేం చాయ్ అమ్మి ఉపాధి కూడా కల్పిస్తున్నాం’ అని నవ్‌నాథ్ అన్నారు. -
వీడు మామూలోడు కాదు!..
► సర్వర్ మైనింగ్ పేరిట రూ.కోట్లలో కుచ్చుటోపీ ► సొంత కరెన్సీ, కాయిన్స్ పేరుతో బురిడీ ► పోలీసు కస్టడీలో నిందితుడు సాక్షి, సిటీబ్యూరో: మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో ఎంతో మంది అమాయకుల నుంచి రూ.లక్షల్లో దండుకున్న ఘరానా ఆన్లైన్ మోసగాడు... బెంగళూరుకు చెందిన బీఎం జగదీశా లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ట్రాన్సిట్ వారెంట్‌పై నిందితుడిని బెంగళూరు నుంచి నగరానికి తీసుకువచ్చారు. మియాపూర్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం కస్టడీలోకి తీసుకొని నిందితుడి మోసాలపై ఆరా తీస్తున్నారు. జర్మనీ కేంద్రంగా పని చేస్తున్నట్టుగా రిజిస్ట్రేషన్ చేసిన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.3జీకాయిన్.ఈయూ, ఇంగ్లండ్ చిరునామాతో 3జీ మైనింగ్ టెక్ లిమిటెడ్‌ల మార్కెటింగ్‌కు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.3జీకాయిన్.గోల్డ్ పేరుతో మరో వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. తన గర్ల్ ఫ్రెండ్ భర్త, తమిళనాడుకు చెందిన కె.నాగరాజన్ పేరుతో ఈ వెబ్సైట్లను ప్రారంభించాడు. మరో ట్విస్ట్ ఏంటంటే కె.నాగరాజన్ గత ఏడాది జనవరిలో చనిపోయాడు. దీంతో అతడి ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాలు, పాన్ కార్డు నంబర్లను వినియోగించి సర్వర్ మైనింగ్‌కు తెరలేపాడు. దీని ద్వారా వచ్చే డేటాను గిగా బైట్స్‌గా మార్చి ఇస్తే మీకు ఒక గ్రాము క్రిష్ణో కరెన్సీ వస్తుందని... దీని విలువ నాలుగు యూరోలని వెబ్సైట్లో ప్రకటన ఇచ్చాడు. కుషాయిగూడకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రూ.18 లక్షలు పెట్టుబడి పెట్టాడు. నెలవారీ రిటర్న్స్ ఆ కంపెనీ ఇవ్వకపోవడంతో వెబ్‌సైట్‌లోని చిరునామా ఆధారంగా బెంగళూరు కార్యాలయాన్ని సంప్రదించాడు. ఎంతకీ సమాధానం రాకపోవడంతో మోసపోయానని తెలుసుకొని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బెంగళూరు వెళ్లి జగదీశాను అరెస్టు చేశారు. మోసం చేసేదిలా... ‘మా సంస్థ నిర్వహిస్తున్న సర్వర్ మైనింగ్ డేటా ప్రాజెక్టులను తీసుకుంటే... రెండేళ్లలో మీ పెట్టుబడికి 180 శాతం అధిక ఆదాయం వస్తుంద’ని నమ్మిస్తాడు. దీని కోసం కంపెనీ ఇచ్చే సర్వర్ మైనింగ్ డేటాను అల్గారిథమ్ ప్రక్రియలో క్రిష్ణోగ్రఫీ, బార్‌కోడ్‌లను కిలోబైట్స్, మెగాబైట్స్, గిగా బైట్స్లుగా మార్చి డేటాను రూపొందించాలి. ఒక గిగాబైట్ డేటాను తయారు చేస్తే ఒక గ్రాము క్రిష్ణో కరెన్సీని ఇస్తామని చెబుతాడు. దీని విలువ నాలుగు మూరోలకు సమానమని చెబుతాడు. దీని కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.3జీకాయిన్.గోల్డ్‌లో 3జీ కాయిన్ ఖాతా తెరవాలంటే తొమ్మిది స్టెప్పుల్లో వివరాలు నింపాలి. బ్యాంక్ ఖాతా, పాన్ నంబర్, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లు పూర్తి చేయాలి. వెబ్సైట్లో ఇవన్నీ తనిఖీ చేసిన తర్వాత దరఖాస్తుదారుడి అడ్మినిస్ట్రేటర్ ఈ–మెయిల్‌కి ఓ ఐడీ నంబర్ పంపించేవాడు. రిజిస్ట్రేషన్ చార్జీల కింద 30 యూరోలకు సమానమైన భారత కరెన్సీని 3జీ కాయిన్ఐఎన్సీ పేరిట రూ.2,250 డిపాజిట్ చేయమనే వాడు. ఇలా ఒక్కో క్రిష్ణో కాయిన్‌పై 30 యూరోలను డిపాజిట్ చేసి సర్వర్ మైనింగ్ పొందితే రెండేళ్లలో 128 క్రిష్టో కాయిన్స్ పొందవచ్చని చెప్పేవాడు. -
కాగ్నిజెంట్ లాభం 10% అప్
న్యూయార్క్: ఐటీ సర్వీసుల అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ ఈ ఏడాది జనవరి-మార్చి క్వార్టర్‌కు 38.2 కోట్ల డాలర్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(34.8 కోట్ల డాలర్లు)తో పోల్చితే 10 శాతం వృద్ధి సాధించామని కాగ్నిజెంట్ పేర్కొంది. ఇక ఆదాయం 242 కోట్ల డాలర్ల నుంచి 20 శాతం వృద్ధితో 291 కోట్ల డాలర్లకు పెరిగిందని కాగ్నిజెంట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కరెన్ మెక్లాఫ్లిన్ చెప్పారు. తాము అంచనా వేసిన అదాయం(288 కోట్ల డాలర్లు)కంటే అధిక అదాయం ఆర్జించామని వివరించారు. ఫలితాలు ప్రోత్సాహాకరంగా ఉన్నాయని దీంతో ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్లో అంచనాలను పెంచుతున్నామని ఆమె పేర్కొన్నారు. ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు ఆదాయం కనీసం 301 కోట్ల డాలర్లుగా ఉండొచ్చని ఆమె అంచనా వేస్తున్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను కూడా పెంచుతున్నామని చెప్పారు.