high temparature
-
తెలంగాణలో భానుడి భగభగలు..!
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో ఎండలు ప్రచండ‘మే’ అనేంతగా బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలు సెగలు పుట్టిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. సూరీడి ఉష్ణతాపానికి శుక్రవారం ‘ఫ్రై’ డేను తలపించింది. శివార్లలోని కీసరలో 45.7, చిలుకూరులో 45.2, అల్లాపూర్ వివేకానందనగర్‌లో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత తొమ్మిదేళ్లలో ఇదే రికార్డు. 2015 మే 22న మాత్రం సికింద్రాబాద్‌లో 47.6, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఆల్‌టైమ్ రికార్డు. మహానగర సగటు ఉష్ణోగ్రత సైతం రికార్డు సృష్టిస్తోంది. మరో నాలుగు రోజుల్లో మరింత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదయ్య అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప పగటి పూట అడుగు బయటపెట్టొద్దని వైద్యులు సూచిస్తున్నారు.ఉదయం 9 గంటలకే సూరీడు సుర్రుమంటుండడంతో ద్విచక్ర వాహనదారులు, ఇంట్లోని పిల్లలు, వృద్ధులు త్వరగా డీహైడ్రేషన్‌కు లోనై అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. వడదెబ్బ కారణంగా జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతూ నిలోఫర్ చిన్న పిల్లల ఆస్పత్రి సహా నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సహా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లోని ఔట్ పేషెంట్ విభాగాలకు బాధితులు భారీగా వస్తున్నారు. ఆల్కహాల్‌తోనూ డీ హైడ్రేషన్.. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లక పోవడమే ఉత్తమం అని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అనివార్యమైతే వెంట గొడుగుతో పాటు వాటర్ బాటిల్, ఒంటికి చలువ చేసే మజ్జిగ, పండ్ల రసాలను తీసుకెళ్లాలని స్పష్టం చేస్తున్నారు. వేళకు సరిపడా నీరు తాగక పోవడం, ఉక్కపోతకు శరీరంలోని నీరు చమట రూపంలో బయటికి వెళ్లిపోతుండటంతో త్వరగా డీహైడ్రేషన్‌కు లోనవుతుండటంతో పాటు మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఆల్కహాల్ త్వరగా డీహైడ్రేట్ చేస్తుంది, సాధ్యమైనంత వరకు దాని జోలికి వెళ్లక పోవడమే ఉత్తమం. వడదెబ్బ లక్షణాలివీ.. వడదెబ్బకు గురైన వ్యక్తికి మూత్ర విసర్జనలో భరించలేని నొప్పి, కండరాల తిమ్మిరి, భారీగా చెమట పట్టడం, విపరీతమైన బలహీనత, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, అధిక హృదయ స్పందన, చర్మం పాలిపోవడం వంటి లక్షణాలు కని్పస్తాయి. వీరిని తక్షణమే రోగిని చల్లగా ఉండే ప్రదేశానికి తరలించాలి, రోగి చుట్టూ గుంపులు గుంపుగా ఉండకూడదు. చన్నీటి బట్ట, స్పాంజ్‌తో నుదురు, మెడ, తల భాగాన్ని తుడవాలి. వదులుగా ఉండే, తేలిక పాటి, లేత రంగు దుస్తులను ధరించాలి. దోసకాయ, పుచ్చకాయ, దానిమ్మ పండ్లను ఎక్కువ తీసుకోవాలి. ఏరోబిక్ వ్యాయామాలకు బదులు తేలికపాటి వ్యాయామాలు, ఈత ఉత్తమం. ఆరుబయట ఉంటే, నీడలో క్రమం తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి. తరచూ నీళ్లు తాగాలి. నెత్తిన టోపి, కళ్లకు కూలింగ్ గ్లాసులు ధరించడం ద్వారా సూర్య రశ్మి నుంచి శరీరాన్ని, కళ్లను కాపాడుకోవచ్చు. -
హెచ్చరిక: ఏపీలో నేడూ భగభగలే.. బయటకు రాకపోవడమే బెటర్
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో శనివారం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ వెల్లడించారు. అల్లూరి జిల్లాలోని నెల్లిపాక, చింతూరు, కూనవరం, వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల, ఏలూరు జిల్లా కుక్కునూరు, పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని తెలిపారు. మరో 256 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందన్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం 45–47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే, శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 42–44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందన్నారు. 20 జిల్లాల్లో 42–45 డిగ్రీల ఉష్ణోగ్రతలు మరోవైపు.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండాయి. 20 జిల్లాల్లో 150 మండలాలకు పైగా 42–45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా అనేక ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి. పల్నాడు, కృష్ణా, ఏలూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, గుంటూరు, కాకినాడ, బాపట్ల, ఎన్టీఆర్, కర్నూలు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి. ఈ జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా రావిపాడులో రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. అదే జిల్లా ఈపూరు, విజయనగరం జిల్లా కనిమెరకలో 44.9 డిగ్రీలు, ఏలూరు జిల్లా శ్రీరామవరం, ఈదులగూడెంలో 44.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో 44.8 డిగ్రీలు, బాపట్లజిల్లా వల్లపల్లిలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఆయా ప్రాంతాల్లో 50 డిగ్రీలకు పైగా ఉష్ణతీవ్రత ఉన్న అనుభూతి కలిగింది. ఉదయం తొమ్మిది గంటలకే పలుచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అలా సాయంత్రం ఐదు గంటల వరకూ అదే తీవ్రత కొనసాగింది. వడగాడ్పుల ధాటికి జనం అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి బెంబేలెత్తిపోతున్నారు. అలాగే, గాలిలో తేమ అధికంగా ఉండడంతో ఉక్కపోత కూడా జనాన్ని ఇబ్బందిపెడుతోంది. ఈనెల 8 వరకు వడగాడ్పుల ప్రభావం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రానున్న మూడ్రోజులు రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో సాధారణంకంటే 2–4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అదే సమయంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు సంభవించే అవకాశముందని, గంటకు 40–50 కి.మీల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వివరించింది. విస్తరిస్తున్న రుతుపవనాలు ఇక నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవుల్లోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్‌లోని కొన్ని ప్రాంతాలకు కొమరిన్‌లోని అన్ని ప్రాంతాలు, దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని భాగాల్లోకి విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రెండ్రోజుల్లో మరింత విస్తరించే అవకాశముందని పేర్కొంది. ఇది కూడా చదవండి: ఏపీలో పుష్కలంగా కరెంటు -
‘ఎండి’పోతున్న పక్షులు
బరంపురం: వేసవి కారణంగా ప్రస్తుతం జిల్లాలో పెరుగుతున్న రోజువారీ ఉష్ణోగ్రతలకు చిలికా సరస్సులోని విదేశీ విహంగాలు మృత్యువాత పడుతున్నాయి. చిలికా వన్యప్రాణి సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో గత కొన్నిరోజుల నుంచి జరుగుతున్న సరస్సులోని విదేశీ పక్షుల లెక్కింపు ప్రక్రియ బుధవారం సాయంత్రం నాటికి పూర్తయింది. ఈ లెక్కన సరస్సులోని పలు దీవులు సహా సరస్సు పరిసర ప్రాంతాల్లో మొత్తం 59,687 పక్షులు నివశిస్తున్నట్లు అధికారులు తేల్చారు. వీటిలో 22,395 విదేశీ పక్షులు ఉండగా, మిగతా 39,292 పక్షులు స్థానిక పక్షులుగా అధికారులు గుర్తించారు. ఏటా నవంబర్‌లో శీతాకాలం సమీపించగానే విడిది కోసం విదేశాల నుంచి ఇక్కడి సరస్సుకి చేరుకునే ఈ అతిథి పక్షులు తిరిగి ఫిబ్రవరిలో వేసవి ప్రారంభం కాగానే తమ స్వదేశానికి బయలుదేరుతాయి. అయితే ప్రస్తుతం అనివార్య కారణాల వల్ల ఇక్కడే ఉండిపోయిన కొన్ని విదేశీ పక్షులు వేసవి ఉష్ణోగ్రతల కారణంగా చనిపోతున్నాయి. మృతి చెందుతున్న వాటిల్లో ఎక్కువగా ఫ్లెమింగో, పెలికాన్, బ్రాహ్మణి డక్ పక్షులు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. రోజూ 36 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ఈ ఉష్ణాన్ని ఈ పక్షులు తట్టుకోలేకపోతున్న కారణంగానే మృతి చెందుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, విదేశీ పక్షుల మరణాలు జరగకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించాలని పర్యాటకులు, యాత్రికులు కోరుతున్నారు. -
2070 నాటికి ఆ ఖండం పరిస్థితి
ఈ భూమి మీద ఏ జీవరాశికి లేని అరుదైన లక్షణం విచాక్షణ శక్తి మానవుని సొంతం. మంచికి, చెడుకు మధ్య తేడా గుర్తించడం మానవునికే సాధ్యం. ఇంత అరుదైన సామార్ధ్యం ఉన్న మనిషి మాత్రం స్వార్ధపూరితంగా తయారయ్యాడు. అతని అత్యాశకు బలవుతున్నది వాతావరణం, జీవరాశి. వీటి గురించి శాస్త్రవేత్తలు గొంతు చించుకుని చెప్తున్న మనం మాత్రం తలకెక్కించుకోవటం లేదు. ఫలితం ఎలా ఉండబోతుందో ఇప్పటికే చూస్తూనే ఉన్నాము. ఇప్పటికే గతి తప్పిన వాతావరణం, విరుచుకుపడుతున్న ప్రకృతి విపత్తులు, నిప్పులు చెరుగుతున్న భానుడు వెరసి తీవ్ర క్షామం, ఆకలి, దరిద్రం. వీటన్నింటిని నిత్యం చూస్తున్నా మనిషిలో మార్పు రావడం లేదు. కనీసం ఇప్పటికైనా మనిషి మేలుకోకపోతే అతి త్వరలోనే మనిషి మనుగడ తుడిచిపెట్టుకుపోతుందంటున్నారు శాస్త్రవేత్తలు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఆందోళనకరంగా మారిన అంటార్కిటికా వాతావరణ పరిస్ధితులు. భూమి మీద ఉన్న ఏడు ఖండాల్లో అంటార్కిటికాకు ప్రత్యేక స్థానం ఉంది. నిత్యం మంచుతో కప్పబడి మానవ నివాసానికి అనుకూలంగా లేని వాతవారణంతో పాటు.. అరుదైన జీవరాశికి ఆవాసంగా ఉన్న ప్రాంతం ఇది. అలాంటిది ఇప్పుడు ఈ ఖండంలోని మంచు ఆందోళనకర రీతిలో కరిగిపోతుంది. కేవలం 1992 నుంచి 2017 మధ్య కాలంలో దాదాపు 3 ట్రిలియన్ టన్నుల మంచు కరిగిందని సాటిలైట్ పరిశీలనలో తెలింది. దక్షణ అంటర్కిటికా ప్రాంతంలో ఈ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయంటున్నారు శాస్త్రవేత్తల. గడిచిన శతాబ్ద కాలంలో మంచు మూడు రెట్ల అధికంగా కరుగుతూ ఏకంగా ఏడాదికి 159 బిలియన్ టన్నులకు చేరుకున్నట్లు అంచనా వేశారు శాస్త్రవేత్తలు. మంచే కదా.. కరగుండా ఉంటుందనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే మంచు కరిగి నీరుగా మారుతుంది. ఆ నీరు సముద్రాలలో కలుస్తుంది. ఫలితంగా సముద్రాల నీటి మట్టం పెరుగుతుంది. గత పాతికేళ్ల నుంచి అంటార్కిటికాలో మంచు కరగడం వల్ల సముద్ర జలాల స్థాయి దాదాపు 8 మిల్లి మీటర్లు పెరిగింది. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే 2070నాటికి అంటార్కిటికా పరిస్థితి ఏంటి..? అంటార్కిటికాలో కలిగే మార్పులు.. ప్రపంచపై ఉండే ప్రభావం వంటి అంశాల గురించి పరిశోధించిన శాస్త్రవేత్తలు ఆందోళనకర వాస్తవాలను వెల్లడించారు. ఈ అంశాల గురించి ప్రముఖ బ్రిటీష్ జర్నల్ ‘నేచర్’లో వెల్లడించారు. అంతేకాక ప్రంపంచ ముందు రెండు పరిష్కారాలను కూడా ఉంచారు. వీటిలో ఒకటి గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను పట్టించుకోకుండా, మన స్వార్ధ పూరిత చర్యలతో ప్రకృతిని మరింత నాశనం చేయడమా లేక ఇప్పటికైన మేల్కొని గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గించి, పర్యావరణాన్ని కాపడడమా. ఈ రెండింటిలో మనిషి ఎంచుకునే దాని మీదనే అంటార్కిటిక భవిష్యత్తు ఆధారపడి ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. అంటర్కిటికాయే ఎందుకు... భూమి మీద ఎక్కడ ఎలాంటి మార్పులు జరిగిన వాటి ఫలతం మిగితా ప్రాంతాల్లో అంత త్వరగా కనిపించే అవకాశం ఉండదు. కానీ అంటార్కిటికా, దక్షిణ సముద్రంలో వచ్చే మార్పులు మాత్రం మానవాళి మీద చాలా త్వరగా ప్రభావం చూపుతాయంటున్నారు శాస్త్రవేత్తలు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు అధిక మొత్తంలో విడుదలవుతున్న కార్బన్ డయాక్సైడ్ వల్ల సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా, మంచు శకలాలు కూడా త్వరగా కరుగుతాయి. ఫలితంగా ఇంతకాలం సముద్ర పర్యావరణ వ్యవస్థను కాపాడుతున్న దక్షిణ సముద్రం అతి త్వరలోనే విపత్కర పరిస్థితులును ఎదుర్కొనున్నట్లు ఆందోళన చెందుతున్నారు శాస్త్రవేత్తలు. తక్షణ కర్తవ్యం... భూమి మీద ముఖ్యమైన అంటార్కిటికా, దక్షిణ సముద్రాల పర్యవేక్షణ బాధ్యతలను ‘అంటార్కిటికా ట్రీటి సిస్టం’ పర్యవేక్షిస్తుంది. ఇన్నాళ్లు అంటార్కిటికా బాధ్యతలను కాపాడిన ఈ సంస్థకు మారుతున్న పర్యావరణ పరిస్ధితుల నుంచి అంటార్కిటకాను కాపాడటం పెద్ద సవాలుగా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మంచు తిరోగమనం వల్ల సముద్ర జలాల ఆమ్లీకరణ పెరుగుతుంది. ఫలితంగా మహాసముద్రాల పర్యావరణ వ్యవస్థ దెబ్బ తింటుంది. కాబట్టి ఎంత త్వరగా వీలైత అంత త్వరగా గ్రీన్ హౌస్ వాయువులను నియంత్రించడంతో పాటు పర్యావరణానికి హానీ చేసే మానవ కార్యకలపాలను కూడా తగ్గించుకుంటే అంటార్కిటికాను మాత్రమే కాక ప్రపంచాన్ని కూడా కాపాడిన వాళ్లం అవుతాము. -
తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు
-
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం
-
తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారబోతున్నాయి..
హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారబోతున్నాయి.. ఉదయం పది దాటితేచాలు వడగాడ్పులు పంజా విసరబోతున్నాయి.. నోరు తెరిస్తే చాలు గొంతెండిపోనుంది. అదే మూడు నెలల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోనుంది.. కుండపోత వానలతో పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం కానుంది.. భారీ వర్షాలతో కొత్త ఆశలకు బీజం వేయనుంది. ఈ విభిన్న వాతావరణ పరిస్థితులకు కారణం ఎల్‌నినో, లానినా పరిస్థితులే. ఏమిటీ ఎల్ నినో? సూర్యుడి తాపానికి భూమధ్య రేఖా ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణంతో పోలిస్తే 0.5 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉన్న పరిస్థితిని ‘ఎల్‌నినో’ అంటారు. స్పానిష్ భాషలో ‘చిన్న బాలుడు’ అని దీనికి అర్థం. ఇది నాలుగున్నరేళ్లకోసారి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సాధారణం కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. కొన్నిచోట్ల విపరీతమైన వర్షాలు కురిస్తే... కొన్నిచోట్ల తీవ్రమైన వర్షాభావం, కరువు పరిస్థితులకు కారణమవుతుంది. ఎల్‌నినో కారణంగా బ్రెజిల్ సహా దాని చుట్టుపక్కల దేశాల్లో భారీగా వర్షాలు కురుస్తాయి. అదే భారత్‌లో, దక్షిణాసియా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరగడం, తీవ్ర వర్షాభావ పరిస్థితులను సృష్టిస్తుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ఎల్‌నినో కారణంగా వచ్చే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో గత పదేళ్లలో లేనంత అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు 50 ఏళ్లలో సంభవించిన ఎల్‌నినో రికార్డుల ప్రకారం కరువు, వర్షాభావ పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. 2002, 2004, 2009, 2014లలో ఎల్‌నినో రావడంతో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. 1953, 1969, 1997 సంవత్సరాాల్లో ఎల్‌నినో ఉన్నా సాధారణ వర్షాలే నమోదయ్యాయి. లానినో అంటే.. భూమధ్య రేఖ ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా ఉన్న పరిస్థితిని ‘లానినో’ అంటారు. స్పానిష్ భాషలో ‘చిన్న బాలిక’ అని దీనికి అర్థం. ఎల్‌నినో క్రమంగా బలహీనపడితే.. ఆ ప్రాంతంలో లానినా ఏర్పడుతుంది. దీంతో దక్షిణాసియా సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఎల్‌నినో ఎంత తీవ్రంగా ఉంటే.. లానినా కూడా అదే స్థాయిలో ప్రభావం చూపిస్తుంది. ఈ లెక్కన ఈసారి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో పాటు జూలై తొలి వారం నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎందుకు ఏర్పడుతాయి? కాలుష్యం పెరగడం, రకరకాల కారణాలవల్ల అడవులు, చెట్ల సాంద్రత తగ్గి పచ్చదనం తగ్గిపోవడమే వాతావరణలో పెను మార్పులకు కారణం. దీనికితోడు వివిధ రసాయనాలు, క్లోరోఫ్లోరో కార్బన్ల కారణంగా భూమిని ఆవరించి ఉన్న ఓజోన్ పొర మందం తగ్గిపోతోంది. భూమిపై పడిన సూర్యరశ్మి కాలుష్య మేఘాల కారణంగా తిరిగి అంతరిక్షంలోకి పరావర్తనం చెందడం తగ్గిపోతోంది. దీంతో భూమి విపరీతంగా వేడెక్కుతోంది. దీనినే గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఎల్‌నినో, లానినో వంటి విపరీతమైన మార్పులకు ఇదే కారణం. ఒక ప్రాంతంలో తీవ్రమైన వర్షాభావం, మరో ప్రాంతంలో భారీ వర్షాలు, అత్యధిక ఉష్ణోగ్రతలు వంటి అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడుతాయి. 1961 నుంచి 1990 వరకున్న సరాసరి ఉష్ణోగ్రత కంటే 2015 నాటికి భూమిపై 0.73 డి గ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోందని వాతావరణ మార్పులపై పారిస్‌లో జరిగిన సదస్సు తేల్చింది. 0.73 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడమనేది అసాధారణం. ఇటీవల చెన్నైలో ఒకేరోజు 50 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురవడానికి, ఆంధ్రప్రదేశ్‌లోనూ కుండపోత వర్షాలకు గ్లోబల్ వార్మింగే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
బాబోయ్ ‘గ్రేటర్’ బాధలు!
- ఎండ తీవ్రత, ఒత్తిడితో కరిగిపోతున్న కేబుళ్లు - ఆయిల్ లీకేజీలతో పేలుతున్న ట్రాన్స్ఫార్మర్లు - అనధికారిక కోతలపై గ్రేటర్ వాసుల ఆందోళన.. అధికారులకు ముచ్చెమటలు హైదరాబాద్: రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. మండుతున్న ఎండలకు తోడు గృహ, వాణిజ్య విద్యుత్ వినియోగం ఒక్కసారిగా రెట్టింపు కావడంతో వారికి దిక్కుతోచడం లేదు. టీఎస్ఎస్పీడీసీఎల్ చరిత్రలోనే గురువారం హైదరాబాద్‌లో అత్యధికంగా 52.0 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఈ డిమాండ్‌కు పగటి ఉష్ణోగ్రతలు తోడవ్వడంతో ఒత్తిడిని తట్టుకోలేక డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కుప్పకూలుతోంది. గురువారం ఘన్‌పూర్‌లోని ట్రాన్స్‌కోకు చెందిన 400 కేవీ సబ్‌స్టేషన్‌లో ఓ పవర్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడానికి ఇదే కారణమని నిపుణులు అంటున్నారు. అక్కడి నుంచి బండ్లగూడ 220 కేవీ సబ్‌స్టేషన్‌కు సరఫరా నిలిచింది. కొత్తపేట, నాగోలు, హయత్‌నగర్, వనస్థలిపురంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేబుళ్లు కరిగి పోయి... పగటి ఉష్ణోగ్రతల ధాటి, పెరిగిన విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోలేక మాదాపూర్, కళ్యాణ్‌నగర్, అయ్యప్పసొసైటీ, హైదర్‌గూడ, చంచల్‌గూడ, ఎగ్జిబిషన్గ్రౌండ్లోని 11 కేవీ యూజీ కేబుళ్లు కరిగిపోయి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆయిల్ లీకేజీలను అరికట్టక పోవడంతో నాంపల్లి, జూబ్లీహిల్స్, పంజేషా, శ్రీరమణ కాలనీలోని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లలో కాయిల్స్ కాలి పోయాయి. కొన్ని చోట్ల వెంటనే పునరుద్ధరించినప్పటికీ...అర్ధరాత్రి వరకు సరఫరా నిలిచింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని ఓ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కు ఉన్న ఫ్యూజ్ వైరు ఎండతీవ్రతకు కరిగిపోయింది. సకాలంలో గుర్తించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించక పోవడంతో ఆ ప్రాంతంలోని వారంతా శుక్రవారం తెల్లవారుజాము 3 గంటల వరకు అంధకారంలో మగ్గారు. ఉక్కపోత ఆపై ఇంట్లో కరెంట్ కూడా లేక పోవడంతో సిటిజన్లు న రక యాతన అనుభవించారు. ఈఎల్ఆర్ పేరుతో ఎడాపెడా ‘కోత’... దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 52 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో ఒక్క గ్రేటర్లో 38 లక్షలు ఉన్నాయి . డిస్కం పరిధిలో ప్రస్తుతం 4వేల మెగావాట్లకు పైగా విద్యుత్ సరఫరా అవుతుండగా, దీనిలో 2,400 మెగావాట్లు గ్రేటర్ హైదరాబాద్‌కు సరఫరా అవుతోంది. డిమాండ్‌కు సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం నమోదు అవుతుండటంతో ఒత్తిడితో ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలకు డిస్ట్రిబ్యూషన్ లైన్లు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యలో భాగంగా అత్యవసర లోడ్ రిలీఫ్ పేరుతో మధ్యాహ్నం, సాయంత్రం అనధికారిక కోతలు అమలు చేస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు పని చేయడం లేదు. పగలే కాకుండా అర్థరాత్రి కూడా ఈఎల్ఆర్లు అమలు చేస్తుండటంతో నగరవాసులు తట్టుకోలేకపోతున్నారు.