'మా హోటల్‌కు వచ్చారా.. మీ క్రెడిట్ కార్డు జాగ్రత్త'
ఫ్రాన్సిస్కో: అమెరికాలోని ఓ హోటల్ కు చెందిన సేల్ కంప్యూటర్ సిస్టమ్స్ నుంచి క్రెడిట్ కార్డు సమాచారం హ్యాకింగ్‌కు గురైనట్లు ఆ హోటల్ యజమాన్యం తెలిపింది. అంతకుముందు తమ హోటల్స్‌లో కొనుగోళ్లకు క్రెడిట్ కార్డు ఉపయోగించినవారంతా ప్రతి రోజు తమ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే మంచిదని హెచ్చరించింది. అమెరికాలో హిల్టన్ అనే పేరుతో ప్రఖ్యాతిగాంచిన హోటల్స్ అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు భద్రతా సంస్ధల సమాచారాన్ని, ప్రభుత్వశాఖల సమాచారాన్ని దొంగిలించే హ్యాకర్స్ ఈసారి తమ దృష్టిని హిల్టన్ హోటల్స్ పై పెట్టారు. ఆ హోటల్స్ లో క్రెడిట్ కార్డు ఉపయోగించినవారి సమాచారం దొంగిలించారు.
దీంతో గత ఏడాది నవంబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్య అలాగే ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి జూలై 27 మధ్య క్రెడిట్ కార్డులు ఉపయోగించినవాళ్లు కాస్త అప్రమత్తంగా ఉండాలని, వారి ఖాతాలను తనిఖీ చేసుకుంటుండాలని ఆ హోటల్ ఓ ప్రకటనలో హెచ్చరించింది. క్రెడిట్ కార్డుల సమాచారం దొంగిలించిన వారు కేవలం కార్డు సమాచారం మాత్రం హ్యాక్ చేశారు తప్ప ఆ కార్డు యజమాని టెంపరరీ అడ్రస్‌ను గానీ, పర్మినెంట్ అడ్రస్ నుగానీ హ్యాక్ చేయలేదని స్పష్టం చేసింది.