హిమబిందును హత్యకేసులో హంతకులను ఉరి తీయాలి
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్:హిమబిందును హత్యచేసిన బలరామిరెడ్డిని ఉరి తీయాలని రాయలసీమ పరిరక్షణ సమితి విద్యార్థి ఫెడరేషన్ (ఆర్పీఎస్ఎస్ఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్పీఎస్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు బాధి త కుటుంబీకులతో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆర్పీఎస్ఎస్ఎఫ్ జిల్లా నాయకుడు శ్రీను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బి.శ్రీరాములు మాట్లాడుతూ మహిళలపై కామాంధులు పెట్రేగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
హిమబిందు కేసును సమగ్రంగా విచారణ చేయాలని, నేరస్థులపై కఠినచర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హిమబిందు లాగా మరొకరు బలి కాకూడదనుకుంటే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే మిగతా వారిపై కూడా చర్యలు తీసుకోవాలని, అలాగే హిమబిందు తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షం లో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ధర్నా వద్ద హిమబిందు ను తలచుకుని తల్లి మధుమతి విలపించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. ధర్నాకు ముందు రాజ్‌విహార్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు బాధిత కుటుంబీకులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఎస్పీ రఘురామిరెడ్డికి వినతిపత్రాలు సమర్పించారు. కుటుంబానికి ఆర్థిక సహాయం అందిం చి, నిందితులపై కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్పీఎస్ఎస్ఎఫ్ నాయకులు రామలింగారెడ్డి, నగర నాయకులు వినయ్, చంద్రమౌళి, రవి, రఘు, షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.