himayath sagar
-
హిమాయత్ సాగర్ : మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల
-
హిమాయత్ సాగర్ రిజర్వాయర్ కు భారీగా వరద
-
లిఫ్ట్‌లో ఇరుక్కున్న మంత్రి
హిమాయత్‌నగర్: ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మించి పట్టుమని 6 నెలలు కూడా గడవకముందే అప్పుడే సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర మంత్రే లిఫ్ట్‌లో అరగంట పాటు ఇరుక్కుపోయారు. ఈ ఘటన శుక్రవారం హైదర్‌గూడలోని ‘ఎంఎస్–3’(ఎమ్మెల్యే క్వార్టర్స్)లో చోటుచేసుకుంది. వివరాలు.. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ 8వ అంతస్థులోని 810 ఫ్లాట్ (క్వార్టర్)లో నివాసముంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంట ల ప్రాంతంలో తన అనుచరులు, వ్యక్తిగత సిబ్బందితో కలసి రేషన్ డీలర్ల సమావేశానికి హాజరయ్యేందుకు ఫ్లాట్ నుంచి బయలుదేరారు. లిఫ్ట్‌లోకి వెళ్లిన తర్వాత కిందకి వెళ్లే బటన్ నొక్కడంతో లిఫ్ట్ డోర్లు మూసుకుపోయాయి. లిఫ్ట్ ఎటూ కదలకపోవడం, డోర్లు కూడా తెరుచుకోకపోవడంతో ఆందోళన చెందిన మంత్రి సిబ్బంది క్వార్టర్స్ నిర్వహణాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిబ్బంది అక్కడకు చేరుకుని అరగంట పాటు నానా శ్రమ పడి గడ్డపార, స్కూ డ్రైవర్ ఉపయోగించి డోర్లు తెరిచారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే క్వార్టర్స్ అధికారులపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిమితికి మించిన బరువు వల్లే లిఫ్ట్ నిలిచిపోయిందని ఎమ్మెల్యే క్వార్టర్స్ సెక్షన్ అధికారి సునీల్ తెలిపారు. మంత్రితోపాటు ఆయన అనుచరులు, సిబ్బంది మొత్తం 13 మంది వరకు ఆ సమయంలో లిఫ్ట్ ఎక్కడం వల్ల ఇలా జరిగిందన్నారు. -
పెరిగిన హిమాయత్‌సాగర్ నీటిమట్టం
నార్సింగి: హిమాయత్‌సాగర్ జలాశయానికి శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఆడుగుమేర వరద నీరు చేరింది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి వరద నీరు వాగుగూండా శుక్రవారం సాయంత్రం నుంచి ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రానికి నీటిమట్టం 1747.60గా నమోదైంది. గతంలో సాగర్‌లోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రస్తుతం హిమాయత్‌సాగర్ కళకళలాడుతుంది. ప్రస్తుతం వరద నీటి ప్రవాహం కాస్త తగ్గిందని జలమండలి మెనేజర్ వెంకట్రావు తెలిపారు. ఆదివారం ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిస్తే వరద నీరు చేరే అవకాశం ఉందన్నారు. -
హిమాయత్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య..
రాజేంద్రనగర్ (రంగారెడ్డి జిల్లా): కుటుంబ సమస్యలతో ఒక వ్యక్తి హిమాయత్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని హిమాయత్‌సాగర్ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... బి.ఆనందరావు అనే వ్యక్తి కుటుంబ సమస్యలతో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే మంగళవారం హిమాయత్‌సాగర్‌లో శవమై తేలాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి, పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.