His
-
ఉప్పు తిన్న విశ్వాసం అంటే ఇదేనేమో.. కుక్క తెలివికి ఫిదా..!
-
హిట్ కోసం ప్రభాస్ సూపర్ ప్లాన్
-
బాస్కెట్బాల్కే ఆయన జీవితం అంకితం
ప్రసాద్ సంస్మరణసభలో పలువురి నివాళి రాజమహేంద్రవరం సిటీ : బాస్కెట్‌బాల్ క్రీడాభివృద్ధి జీవితాన్ని అంకితం చేసిన టీవీఎస్ఎన్ ప్రసాద్ మృతి ఆ క్రీడకు రాష్ట్రంలో తీరని లోటని జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ చెలికాని స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశారు. జాతీయ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, రాష్ట్ర, జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ల ప్రధాన కార్యదర్శి, పేపరుమిల్లు ఉద్యోగి టీవీఎస్ఎన్ ప్రసాద్ సంస్మరణసభను పేపరుమిల్లు క్వార్టర్స్ అసోసియేషన్ హాల్లో బుధవారం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచీ వచ్చిన క్రీడాభిమానులు, కోచ్‌లు, రిఫరీలు, ఫిజికల్ డైరెక్టర్లు ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు మాట్లాడుతూ బాస్కెట్‌బాల్ క్రీడాభివృద్ధికి ప్రసాద్ చేసిన కృషి అద్వితీయమన్నారు. జిల్లాలో బాస్కెట్‌బాల్ క్రీడను 15 ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రసాద్ జ్ఞాపకార్థం బాస్కెట్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తే ట్రోఫీతో పాటు అవసరమైన సహాయం అందిస్తామని జిల్లా పుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి సుంకర నాగేంద్రకిశోర్ ప్రకటించారు. ఇండియన్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ టెక్నికల్ కమిటీ సభ్యుడు నార్మన్ ఐజాక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొజ్జ రామయ్య, కోశాధికారి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
కుతురిపై తండ్రి అఘాయిత్యం
-
రైలులో పురుడు పోసిన హిజ్రాలు
రైలులో పురుడు పోసిన హిజ్రాలు గోరఖ్‌పూర్ రైలులో ఘటన... రామగుండంలో ప్రాథమిక చికిత్స మగుండం: బెంగళూరు నుంచి గోరఖ్‌పూర్ వెళ్తున్న గోరఖ్‌పూర్ రైలులో ప్రసవ వేదన పడుతున్న మహిళకు హిజ్రాలు పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. అంతటితో ఆగకుండా తల్లీబిడ్డలకు దగ్గరుండి మరీ వైద్య చికిత్సలు చేయించారు. వివరాలు... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో జిల్లా గోండా పట్టణానికి చెందిన రాజుయాదవ్ హైదరాబాద్‌లో ఉపాధి పొందుతున్నాడు. ఆయన భార్య నిర్మ నిండు గర్భిణి. వైద్యులు ఈ నెల 20న డెలివరీ డేట్ ఇచ్చారు. పురుడు కోసం ఆమెను తల్లిగారింటికి పంపించేందుకు రాజుయాదవ్ భార్య నిర్మ, మూడేళ్ల కుమారుడితో కలిసి లక్నో వెళ్లేందుకు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కాడు. రైలు కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వేస్టేషన్‌కు వచ్చేసరికి నిర్మకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె నొప్పులతో తల్లడిల్లుతుంటే తోటి మహిళా ప్రయాణికులు ఎవరూ సహకరించలేదు. రైలు కొలనూర్ రైల్వేస్టేషన్ వచ్చేసరికి నొప్పులు మరింత తీవ్రతరమయ్యాయి. అదే సమయంలో రైలులో భిక్షాటన హిజ్రాలు రోష్నీ, ఉషా, సమీరా, నగరంలు పురిటినొప్పులతో మహిళ బాధపడటం చూసి స్పందించారు. ప్రయాణికుల వద్దనున్న కొన్ని దుస్తులను అడ్డుగా ఉంచి పురుడుపోయగా, మగశిశువుకు జన్మనిచ్చింది. అయితే, పుట్టిన బిడ్డ ఉమ్మనీరు మింగి అచేతన స్థితిలో ఉంది. మరో పక్క బోగీ మొత్తం రక్తంతో నిండిపోయింది. అంతలోనే రైలు రామగుండం రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే బాలింతను దింపి 108 ద్వారా గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే శిశువును వస్త్రంతో శుభ్రం చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో అందరూ ఆందోళన చెందారు. 108 సిబ్బంది ఎయిల్ బెలూన్‌తో గాలికొట్టగా శిశువు ఒక్కసారిగా రోదించడంతో తల్లిదండ్రులు, హిజ్రాల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. అనంతరం బాలింతతో పాటు శిశువును హిజ్రాల సహకారంతో గోదావరిఖని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించి డిశ్చార్జి చేశారు. మహిళా ప్రయాణికులు ధైర్యం చేయకపోయినప్పటికీ హిజ్రాలు ముందుకు వచ్చి పురుడు పోయడంతో ప్రయాణికులు అభినందించారు. -
15న డచ్ గిటారిస్ట్ వాన్ హీస్ రాక
హెచ్డబ్ల్యూఎంఎఫ్ ఐదో వార్షికోత్సవాలు.. హైద్రాబాద్ వెస్ట్రన్ మ్యూజిక్ ఫౌండేషన్ (హెచ్డబ్లుంఎఫ్) ఐదవ వార్షికోత్సవాలలో పాల్గొనేందుకు ‘అథీనియం ఛాంబర్ ఆఫ్ ఆర్కెస్ట్రా’ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత డచ్ గిటారిస్ట్ మార్టిన్ హీస్ నగరానికి విచ్చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి 19 వ తేదీ వరకూ నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పబ్లిక్ పర్ఫార్మెన్స్లు బుధవారం సాయంత్రం 7 గంటలకు అన్నపూర్ణ స్టూడియో లైన్‌లోని ప్లాంటేషన్ స్టుడియో హౌస్‌లో శనివారం (18వ తేదీ) సాయంత్రం 7 గంటలకు హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్లో సంగీత కచేరీ ఇస్తారు. వర్క్‌షాప్‌లు శుక్రవారం సాయంత్రం (17వ తేదీ) 6-30 నుంచి 8-30 గంటల వరకూ బేగంపేటలోని పాత ఎయిర్పోర్ట్ సమీపంలోని యమహా మ్యూజిక్ స్వ్యేర్లో ఆదివారం (19వ తేదీ) ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని లామకాన్‌లో సంగీత శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. వ్యక్తిగతంగా సలహాలు, శిక్షణ తీసుకోవాలనుకునే వారికీ అందుబాటులో (info@hydmusic.com mailto:info@hydmusic.com 9912201659 9849451794 ) ఉంటారు. -
హిజ్రాలకు ‘మైత్రి’
నెలనెలా రూ. 500 పింఛన్.. లబ్ధిదారులకు బీపీఎల్ కార్డు, ‘యశస్విని’ వర్తింపు పింఛన్‌ను రూ.1000కి పెంచే యోచన పథకాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస ప్రసాద్ సాక్షి, బెంగళూరు : దారిద్య్రరేఖకు దిగువన ఉన్న హిజ్రాలకు నెలనెలా రూ. 500 పింఛన్ అందించే మైత్రి పథకాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసప్రసాద్ స్థానిక రవీంద్ర కళాక్షేత్రాలో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో లాగా ఇక్కడి హిజ్రాలకూ రూ. 1000 పింఛన్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రితో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మైత్రి లబ్ధిదారులకు బీపీఎల్ కార్డులతో పాటు యశస్విని పథకం ఫలాలు అందిస్తామన్నారు. ఈ పథకంపై అధికారులు విస్తృతంగా ప్రచారం చేసి.. అర్హులకు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వయస్సుపై గందరగోళం.. పథకం ప్రారంభించాలనే తొందరలో అధికారులు అర్హుల వయస్సు విషయంలో తప్పటడుగు వేశారు. బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ కార్యాలయం ముద్రించిన కొన్ని కరపత్రాల్లో అర్హుల వయసు 18 నుంచి 64 అని ఉండగా, మరికొన్ని కరపత్రాల్లో 40 నుంచి 64 అని ఉంది. దీంతో అర్హులు అయోమయంలో పడ్డారు.