బాస్కెట్‌బాల్‌కే ఆయన జీవితం అంకితం
బాస్కెట్‌బాల్‌కే ఆయన జీవితం అంకితం
Published Wed, Jul 27 2016 10:41 PM | Last Updated on Fri, Oct 5 2018 6:30 PM
ప్రసాద్ సంస్మరణసభలో పలువురి నివాళి
రాజమహేంద్రవరం సిటీ : బాస్కెట్‌బాల్ క్రీడాభివృద్ధి జీవితాన్ని అంకితం చేసిన టీవీఎస్‌ఎన్ ప్రసాద్ మృతి ఆ క్రీడకు రాష్ట్రంలో తీరని లోటని జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ చెలికాని స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశారు. జాతీయ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, రాష్ట్ర, జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్‌ల ప్రధాన కార్యదర్శి, పేపరుమిల్లు ఉద్యోగి టీవీఎస్‌ఎన్ ప్రసాద్ సంస్మరణసభను పేపరుమిల్లు క్వార్టర్స్ అసోసియేషన్ హాల్‌లో బుధవారం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచీ వచ్చిన క్రీడాభిమానులు, కోచ్‌లు, రిఫరీలు, ఫిజికల్ డైరెక్టర్లు ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు మాట్లాడుతూ బాస్కెట్‌బాల్ క్రీడాభివృద్ధికి ప్రసాద్ చేసిన కృషి అద్వితీయమన్నారు. జిల్లాలో బాస్కెట్‌బాల్ క్రీడను 15 ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రసాద్ జ్ఞాపకార్థం బాస్కెట్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తే ట్రోఫీతో పాటు అవసరమైన సహాయం అందిస్తామని జిల్లా పుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి సుంకర నాగేంద్రకిశోర్ ప్రకటించారు. ఇండియన్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ టెక్నికల్ కమిటీ సభ్యుడు నార్మన్ ఐజాక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొజ్జ రామయ్య, కోశాధికారి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement