hitech
-
హైటెక్ స్టేషనండి.. రూ. 100 కోట్లతో అభివృద్ధి చేసినా.. బండి ఆగదండి
సాక్షి, హైదరాబాద్: హైటెక్ స్టేషన్. సాఫ్ట్వేర్ సంస్థలకు, వందలాది కాలనీలకు, ఉద్యోగ, వ్యాపార వర్గాలకు ముఖ్యమైన రైల్వేస్టేషన్. ఎంఎంటీఎస్ రైళ్లు, దూరప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లు హైటెక్‌సిటీ స్టేషన్ నుంచే రాకపోకలు సాగిస్తాయి. తరచూ రద్దయ్యే ఎంఎంటీఎస్ రైళ్ల సంగతి పక్కన పెడితే లింగంపల్లి నుంచి విజయవాడ వైపు వెళ్లే ఒక్క రైలూ ఇక్కడ ఆగదు. రాష్ట్ర విభజన, విజయవాడలో రాజధాని ఏర్పాటు అనంతరం వందలాది మంది ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు హైటెక్ సిటీ నుంచి విజయవాడకు రాకపోకలు సాగిస్తున్నారు. పైగా ఉద్యోగుల కోసమే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టారు. మొదట్లో సికింద్రాబాద్ నుంచి విజయవాడకు నడిచిన ఈ రైలును లింగంపల్లి వరకు పొడిగించారు. ఉదయం 6 గంటలకు లింగంపల్లి నుంచి బయలుదేరే ఇంటర్సిటీ హైటెక్‌సిటీ స్టేషన్లో ఆగకుండానే బేగంపేట్, సికింద్రాబాద్‌కు వచ్చేస్తుంది. అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరుతుంది. అదే ట్రైన్లో విజయవాడకు వెళ్లాలనుకొనే ప్రయాణికులు హైటెక్ సిటీ నుంచి అటు లింగంపల్లికి లేదా, ఇటు సికింద్రాబాద్‌కు వెళ్లాలి. ఇదొక్కటే కాదు. గౌతమి, విశాఖ, కోకనాడ, పల్నాడు తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లన్నీ హైటెక్‌సిటీ మీదుగా వెళ్లినా అక్కడ మాత్రం ఆగడం లేదు. దీంతో కనీసం ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగంపల్లి, మరో 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేగంపేట్, సికింద్రాబాద్ స్టేషన్లకు వెళ్లడం ఇబ్బందిగా ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరకొరగా ఎంఎంటీఎస్‌లు.. ‘హైటెక్ సిటీ నుంచి ఎంఎంటీఎస్‌లో లింగంపల్లికి లేదా సికింద్రాబాద్‌కు వెళ్లి దూరప్రాంతాల రైళ్లను అందుకోవడం ఇబ్బందిగానే ఉంది. కొంతకాలంగా ఎంఎంటీఎస్ రైళ్లు కూడా సరిగ్గా తిరగడం లేదు’ అని కేపీహెచ్‌బీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అవినాష్ అంటున్నారు. వీకెండ్స్‌లో విజయవాడకు తిరిగి బయలుదేరేటప్పుడు సకాలంలో రైళ్లు లభించక కష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన స్టేషన్ల తర్వాత లింగంపల్లి, హైటెక్ సిటీ, బేగంపేట్ల నుంచే ఎక్కువ మంది బయలుదేరుతారు. ప్రతి రోజు 300 మందికి పైగా ఒక్క హైటెక్‌సిటీ నుంచే వెళ్తున్నట్లు అంచనా. ‘ఇంటి ముందు నుంచి వెళ్లే రైలు కోసం ఎక్కడికో ఎందుకు వెళ్లాలి’ అని హైటెక్ సిటీకి చెందిన విశాలి విస్మయం వ్యక్తం చేశారు. కోవిడ్ అనంతరం ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరించినా సక్రమంగా నడపడం లేదు, వారానికి రెండు రోజుల పాటు రైళ్లను రద్దు చేస్తున్నారు. మిగతా రోజుల్లో సరైన సమయ పాలన లేకపోవడంతో ప్రయాణికులు ఈ రైళ్లపైన ఆశలు వదులుకొన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారికి కష్టంగా మారింది. ప్లాట్‌ఫామ్‌లు పొడిగించినా ఫలితం లేదు.. ఎంఎంటీఎస్ రైళ్ల కోసమే ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫామ్‌లను 24 బోగీలు ఉండే ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేందుకు అనుగుణంగా పొడిగించారు. సుమారు రూ.10 కోట్లతో స్టేషన్‌ను అభివృద్ధి చేశారు. వెయిటింగ్ హాళ్లు తదితర మౌలిక సదుపాయాలను విస్తరించారు. కానీ రైళ్ల హాల్టింగ్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. ‘ఈ రైల్వేస్టేషన్‌కు అన్ని వైపులా వందల సంఖ్యలో కాలనీలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. కానీ ప్రజల రవాణా అవసరాల మేరకు రైల్వే సదుపాయాలు పెరగడం లేదు’ అని మాదాపూర్‌నకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఐటీ రాజధానిలో హైటెక్ మయసభ..!
ఇరవై అంతస్తుల భవనం...వేల మంది ఉద్యోగులు.. వందల సంఖ్యలో కార్లు! నేలపై.. భూగర్భంలోనూ పార్కింగ్! హైటెక్ యుగంలో ఏ ఐటీ ఆఫీసును తీసుకున్నా ఇలాగే ఉంటుంది! ఇలాంటి ఆఫీసులో మిత్రుడిని కలిసేందుకు వెళ్లారనుకోండి... పార్కింగ్ స్థలం వెతుక్కునేందుకు పదిహేను నిమిషాలు.. సెక్యూరిటీ వ్యవహారాల పూర్తికి ఇంకొన్ని నిమిషాలు.. రిసెప్షన్‌లోనో.. క్యాంటీన్లోనో పడిగాపులు..ఇదీ తంతు! వందేళ్ల రాబర్ట్ బాష్ కంపెనీలో మాత్రం దీనికి భిన్నం! ఉద్యాన నగరి, దేశ ఐటీ రాజధానిగా చెప్పుకునే బెంగళూరులోని ఆడుగోడి ప్రాంతంలో ఉంటుంది బాష్ కంపెనీ ఫ్యాక్టరీ. 1922లో భారత్‌లోకి అడుగు పెట్టిన ఈ జర్మన్ కంపెనీ ఆటోమొబైల్ రంగంతోపాటు అనేకానేక రంగాల్లో ఉత్పుత్తులు తయారు చేస్తోంది. సేవలందిస్తోంది. ఇందులో పెద్దగా ప్రత్యేకత ఏమీ ఉండకపోవచ్చు కానీ... వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఆడుగోడిలోని 76 ఎకరాల విస్తీర్ణంలోని ఫ్యాక్టరీలో బాష్ నిర్మించిన స్మార్ట్ క్యాంపస్ స్పార్క్ నెక్స్ట్లో మాత్రం నిలువెల్లా ప్రత్యేకతలే! పర్యావరణ పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా నిర్మించిన ఈ బహుళ అంతస్తుల భవనం ఒక రకంగా హైటెక్ మయసభ! అతిథ్యంతో మొదలుపెట్టి... పీల్చే గాలి, వినిపించే శబ్దం... కూర్చునే సీట్లు అన్నింటిలోనూ కృత్రిమ మేధ, బిగ్ డేటా టెక్నాలజీలు పూర్తిస్థాయిలో పనిచేస్తూంటాయి. ఒకొక్క దాని గురించి స్థూలంగా... విజిటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైనా ఆఫీసుకెళ్లి ఉద్యోగిని కలవాలంటే ముందుగా సెక్యూరిటీ, రిసెప్షన్లను దాటాలని మనకు తెలుసు. బాష్‌లోనూ ఈ ఏర్పాట్లు ఉన్నాయి కానీ పనంతా చిటికెలో అయిపోతుంది. స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా మీరు కలవాలనుకున్న ఉద్యోగి పేరు, మీ వివరాలను ముందుగానే తెలియజేసి ఓ సెల్ఫీ తీసుకుంటే చాలు.. స్మార్ట్ క్యాంపస్ రిసెప్షన్లో ఉండే ‘విజిటర్ మేనేజ్మెంట్ సిస్టమ్’... మిమ్మల్ని చూడగానే మీకో పాస్ జారీ చేసేస్తుంది. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా మీరు అప్పటికే తీసి పంపిన సెల్ఫీని పోల్చుకుంటుందన్నమాట. ఆ తరువాత పక్కనే ఉన్న లాకర్లపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే నచ్చిన లాకర్‌ను ఎంచుకోవచ్చు. అందులో మీ సామాన్లు భద్రపరచుకోవచ్చు. మిత్రుడు లేదా ఉద్యోగిని కలవాల్సిన చోటుకుS దారి చూసేందుకు ‘వే ఫైండర్’ పేరుతో ఇంకో స్మార్ట్ సాఫ్ట్వేర్ మీకు సాయం చేస్తుంది. మీటింగ్ అయిపోయినట్లు మిత్రుడు లేదా ఉద్యోగి స్మార్ట్ ఆప్‌లో నోటిఫై చేసిన వెంటనే రిసెప్షన్లో మీ ఎగ్జిట్ పాస్ రెడీ! మిగిలిన ఆఫీసులతో పోలిస్తే సెక్యూరిటీ వద్ద గడిపే సమయం 75 శాతం తక్కువ అవుతుందట ఈ విజిటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ వల్ల! సీట్ల కేటాయింపుతో బోలెడు ఆదా... ఆఫీసులో మీ సీటెక్కడ? అంటే.. రెండో ఫ్లోర్లో ఎడమవైపు మూడో క్యాబిన్ అని చెబుతూంటారు కొందరు. బాష్ స్మార్ట్ క్యాంపస్‌లో ఇలా ఒకరికి ఒక సీటు కచ్చితంగా ఉండదు. కోవిడ్ అనంతర పరిస్థితుల్లో ఇప్పుడు హైబ్రిడ్ పద్ధతిలో పనిచేస్తున్నారిక్కడ. కొన్ని రోజులు ఇంట్లో, మిగిలిన రోజులు ఆఫీసులో అన్నమాట. ఆఫీసుకు రావాలనుకుంటే... ఉద్యోగి తన సీటు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బాష్ తయారు చేసిన ప్రత్యేక సాఫ్ట్వేర్... ఏ ఫ్లోర్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో పరిశీలించి, తగిన సీటు కేటాయిస్తుందన్నమాట. ఒక ఫ్లోర్లో సీట్లు నిండిన తరువాత మాత్రమే ఇంకో ఫ్లోర్లో సీట్ల కేటాయింపు జరుగుతుంది. దీనివల్ల ఉపయోగంలో లేని అంతస్తుల్లో దీపాలు, ఏసీల వృథా అస్సలు ఉండదు. కాఫీ, టీలు, నీళ్లు, బాత్రూమ్ల వాడకం ఇలా అన్ని అంశాల్లోనూ ఆదా జరుగుతుందని కంపెనీ చెబుతోంది. అదే సమయంలో ఒక ఫ్లోర్లో ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా దీపాల కాంతిలో హెచ్చుతగ్గులు ఉంటాయి కూడా. పగటి వెలుతురును పూర్తిగా వినియోగించుకునేందుకు వీలుగా భవనం మొత్తం అద్దాలతోనే నిర్మించారు. సౌకర్యానికి తగ్గట్టుగా ఏసీ... ద బాష్ ఇంటెలిజెంట్ ఎయిర్ కండిషనింగ్ అండ్ కంఫర్ట్ అసిస్టెంట్.. క్లుప్తంగా బియాంక స్పార్క్ నెక్స్ట్లోని హైటెక్ ఏసీ సిస్టమ్. ఉద్యోగులు తాము కూర్చుంటున్న చోట ఏసీ ఎంత సౌకర్యవంతంగా ఉందో చెబితే (స్మార్ట్ అప్లికేషన్ గ్రేడింగ్ ద్వారా) మెషీన్ లెర్నింగ్ సాయంతో అందరి ఫీడ్‌బ్యాక్‌ను విశ్లేషించి.. వీలైనంత వరకూ వారి అనుకూలతకు తగ్గ ఏసీ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లోనే సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఉదాహరణకు మీకు 18 –23 డిగ్రీ సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత బాగుంటుందని అనుకుందాం. ఇంకో ఉద్యోగికి 16 – 26 మధ్య ఏసీ ఉన్నా ఓకే అంటే.. వీరిద్దరి సీట్ల వద్ద ఉష్ణోగ్రతలను 20 – 22 డిగ్రీ సెల్సియస్ మధ్య ఉండేలా బియాంక చర్యలు తీసుకుంటుందన్నమాట. కృత్రిమ మేధ సాయంతో వ్యక్తుల ఇష్టాయిష్టాల ఆధారంగా నిర్ణయాలు జరుగుతాయి. బియాంక వాడకం వల్ల ఏసీ విద్యుత్తు ఖర్చు 30 నుంచి యాభై శాతం వరకూ తగ్గుతుందని బాష్ చెబుతోంది. వాయు కాలుష్యానికీ చెక్... స్పార్క్ నెక్స్ట్లో కాలుష్యం చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఇందుకోసం కంపెనీ క్యాంపస్‌లో దాదాపు 20 వృక్షాలను ట్రాన్స్ లొకేట్ (ఇతర ప్రాంతాల్లోని చెట్లను నాటడం) చేసింది. అంతేకాకుండా.. వాయు కాలుష్యాన్ని పసిగట్టేందుకు బాష్ ప్రత్యేకంగా ఒక పరికరాన్ని కూడా తయరు చేసింది. స్పార్క్ నెక్స్ట్ క్యాంపస్‌లో వేర్వేరు ప్రాంతాల్లో ఈ పరికరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాయు కాలుష్యాన్ని పరిశీలిస్తూంటారు. పరిమితులు మించితే ఉద్యోగులు వీలైనంత వరకూ భవనాల్లోపలే పని చేసుకోవాల్సిందిగా సూచనలు వెళతాయి. బాష్ బెంగళూరు నగరం మొత్తమ్మీద వాయు కాలుష్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు గుర్తించేందుకు ఓ సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించింది. నగర ట్రాఫిక్, వాతావరణం, నగరంలో నిర్మాణ కార్యక్రమాల వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తిస్తుంది. తదనుగుణంగా నగర పరిపాలన యంత్రాంగానికి సూచనలు చేస్తుంది. స్పార్క్ నెక్స్ట్ హైటెక్ హంగులు ఇక్కడితోనే అయిపోలేదు. భవనంలోని వేర్వేరు వ్యవస్థలు, పరికరాల ద్వారా అందే సమాచారాన్ని విశ్లేషించేందుకు కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మేళవింపుతో ‘డీప్‌సైట్స్’ పేరుతో ఓ సాఫ్ట్వేర్ ఉంది. నీటి సరఫరా, నిర్వహణ, విద్యుత్తు వినియోగం వంటి అనేక అంశాలపై ఇది ఓ కన్నేసి ఉంచుతుంది. వీలైనంత వరకూ వీటిని ఆదా చేసేలా నిర్ణయాలు తీసుకుంటూంటుంది. ఇప్పటికే ఈ డీప్‌సైట్స్ కారణంగా సంస్థకు ఏడాది విద్యుత్తు బిల్లులో ఆరు శాతం ఆదా అవుతూన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతోపాటు పదివేల మంది పనిచేసే ఈ క్యాంపస్‌లో వాహనాల స్మార్ట్ పార్కింగ్ కోసం ‘జ్యూస్’ పేరుతో ఓ సాఫ్ట్వేర్ ఉంటుంది. పార్కింగ్ ప్రాంతంలో ఏది ఖాళీగా ఉందన్న విషయాన్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఖాళీ కోసం వెతికే ప్రయాస తగ్గడం వల్ల 1500 పనిదినాలు, 2500 లీటర్ల ఇంధనం, ఐదు వేల కిలోల కార్బన్ డైయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించగలిగారు. -గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
హైదరాబాద్ సరూర్‌నగర్‌లో హైటెక్ తరహాలో మాస్ కాపీయింగ్
-
ఆ బస్టాండ్లలో వైఫై, మొబైల్ చార్జింగ్ సౌకర్యం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని బస్షెల్టర్లు ఆధునికతను సంతరించుకుంటున్నాయి. హైటెక్ హంగులతో ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణికులకు పూర్తి రక్షణ.. 24 గంటలూ విధులు నిర్వహించే భద్రతా సిబ్బంది.. నిరంతర ఏసీ సదుపాయం.. మహిళల రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు వీటి ప్రత్యేకత. గురువారం ఖైరతాబాద్‌లో అధునాత బస్‌షెల్టర్ ప్రారంభమైంది. దేశంలోనే మొట్టమొదటిసారి సకల సదుపాయాలతో నిర్మించిన సరికొత్త బస్‌షెల్టర్ ఇది. శిల్పారామం, కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు, ఖైరతాబాద్‌లో ప్రయోగాత్మకంగా వీటిని నిర్మించారు. శిల్పారామం బస్‌షెల్టర్ వారం కిందట ప్రారంభించగా, కేపీహెచ్‌బీ, ఖైరతాబాద్ ఆర్టీఏ బస్షెల్టర్లు ప్రయాణికులకు గురువారం అందుబాటులోకి వచ్చాయి. ఖైరతాబాద్‌లో మొత్తం 4 షెల్టర్లను ఏసీ సదుపాయంతో కట్టించారు. ఈ షెల్టర్‌లో 24 గంటలపాటు వైఫై సదుపాయం ఉంటుంది. మొబైల్ చార్జింగ్ చేసుకోవచ్చు. మహిళలకు, పురుషులకు ప్రత్యేక టాయిలెట్లు నిర్మించారు. తడి, పొడి చెత్త డబ్బాలు ఏర్పాటు చేశారు. అన్ని షెల్టర్లలోనూ సీసీటీవీలున్నాయి. వీటిల్లో నమోదయ్యే దృశ్యాలు నెలరోజుల బ్యాక్అప్తో లభిస్తాయి. రాత్రింబవళ్లు విధులు నిర్వహించే విధంగా 3 షిఫ్టుల్లో సెక్యూరిటీ అందుబాటులో ఉంటుంది. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా సిబ్బంది రాత్రి, పగలు విధులు నిర్వహిస్తారు. మహిళల భద్రత కోసం ప్యానిక్ బటన్... బస్షెల్టర్లలో, మహిళా టాయిలెట్ల వద్ద ఎఫ్ఓఎఫ్ ప్యానిక్ బటన్లను ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు ఈ బటన్ మోగిస్తే గట్టిగా అలారం వినిస్తుంది. వెంటనే సెక్యూరిటీ అప్రమత్తమవుతారు. పోలీసులకు సమాచారం అందించేవిధంగా బస్షెల్టర్ల నిర్వాహకుల కార్యాలయంలోనూ అలారం వినిపించే విధంగా ఏర్పాటు చేశారు. దీనిని త్వరలో పోలీస్స్టేషన్లకు కూడా అను సంధానించనున్నట్లు యూనియాడ్స్ ప్రతినిధి రాజు ‘సాక్షి’తో చెప్పారు. బస్‌షెల్టర్‌ను పరిశుభ్రంగా ఉం చేందుకు హౌస్‌కీపింగ్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. ఖైరతాబాద్‌లో మొత్తం 4 షెల్టర్లు ఉ న్నాయి. వీటిలో ప్రయాణికులు ఎక్కడ ఉంటే అక్కడ ఏసీ ఆన్ చేస్తారు. మిగతా చోట్ల నిలిపివేస్తారు. మరిన్ని షెల్టర్లు... గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 826 బస్షెల్టర్లను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో నిర్మించేందుకు జీహెచ్ఎంసీ కార్యాచరణ చేపట్టిన సంగతి తెలిసిందే. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ మూడింటిని నిర్మించారు. త్వరలో దిల్సుఖ్నగర్, కోఠీ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ల వద్ద బస్షెల్టర్లను నిర్మించనున్నారు. దశలవారీగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఆధునిక బస్షెల్టర్ల నిర్మాణం పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి కేటగిరీకి చెందిన వాటిని ఏసీ సదుపాయంతో ఏర్పాటు చేస్తుండగా, మిగతా 2 కేటగిరీలకు చెందిన షెల్టర్లను నాన్ ఏసీ షెల్టర్లుగా నిర్మించనున్నారు. -
ఇంటి వద్ద కూర్చోబెట్టి.. హైటెక్ మోసం
నెలకు రూ.30 వేలు సంపాదించవచ్చంటూ ఆశ పెట్టిన సంస్థ ∙బోర్డు తిప్పేసిన ‘ఆపిల్ ఔట్ సోర్సింగ్’! కంబాలచెరువు (రాజమõß ంద్రవరం) : ‘ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటి వద్దే ఉంటూ నెలకు రూ.30 వేలు సంపాదించవచ్చు..’ ఇలాంటి ప్రకటన ఎవరికైనా ఇట్టే ఆకట్టుకుంటోంది. అలాగే ఆశపడిన అనేక మంది సొమ్ము పోగొట్టుకుని, ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ఇంటి వద్ద కంప్యూటర్ ద్వారా వారు చెప్పినట్టు చేస్తే.. ఒక్క రూపాయి రాకపోగా, ఇంటర్నెట్ కనెక్షన్‌కు తడిసిమోపెడైంది. రాజమహేంద్రవరంలో ‘ఆపిల్ ఔట్సోర్సింగ్’ సంస్థ నిర్వాకంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తన ఫేస్బుక్ అకౌంట్లో శ్రీవల్లి అనే యువతి ఓ ఆకర్షిణీయమైన ప్రకటన చూసింది. ఇంటి వద్ద నుంచే నెలకు వేలకు వేల రూపాయలు సంపాదించవచ్చనేది దాని సారాంశం. ఆమె అందులో ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసింది. ఓ వ్యక్తి ఆమెతో మాట్లాడి, రాజమహేంద్రవరంలోని దానవాయిపేటలో ఉన్న ఆపిల్ ఔట్సోర్సింగ్ కార్యాలయానికి వెళ్లమన్నాడు. అక్కడ నాయుడు అనే వ్యక్తి ఆమెను కలిశాడు. తమ వద్ద నాలుగు రకాల ప్లాన్లు ఉన్నాయని, ఎస్ఎంఎస్లు చేయడం, రోజుకు 500 వీడియోలు వీక్షించడం, రోజంతా నెట్ ఆ¯Œæలో ఉంచడం వంటి ప్లాన్లు చెప్పారు. వాటికి రూ.5,500 నుంచి రూ.10 వేలు చెల్లించాల్సి ఉందన్నాడు. ముందుగా ఫీజు చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొన్నాడు. నగలు తాకట్టు పెట్టి.. మరుసటి రోజు శ్రీవల్లి తన వద్ద ఉన్న బంగారు చెవిదిద్దులు తాకట్టుపెట్టి, రూ.5,500 చెల్లించి, ఆ సంస్థలో రిజిస్టర్ అయింది. ఆమెకు ధ్రువపత్రంతో పాటు కంప్యూటర్ ఐడీ ఇచ్చారు. ఇంటర్నెట్ కనెక్షన్ కోసం ఆమె మరో రూ.వెయ్యి అప్పు చేయాల్సి వచ్చింది. రోజుకు 500 వీడియోలు చూసే ప్లాన్ చేపట్టి, కొద్దిరోజులకు అస్వస్థతకు గురైంది. రెండు నెలలు గడిచినా.. ఆమెకు ఒక్క పైసా కూడా రాలేదు. దీంతో సంస్థ కార్యాలయానికి వెళితే, ఆపిల్ ఔట్సోర్సింగ్ షిఫ్ట్ టు హైదరాబాద్ అనే బోర్డు కనిపించడంతో అవాక్కైంది. దీనిపై ఆరాతీస్తే.. నాయుడు అనే వ్యక్తి ఆఫీసు మార్చి వెళ్లిపోయాడని తెలిసింది. అదే సమయంలో మరికొందరు బాధితులు అక్కడకు చేరుకుని, విషయం తెలిసి బావురుమన్నారు. ఈ విషయాన్ని ‘సాక్షి’కి వివరించారు. అక్కడున్న సిబ్బందిని ప్రశ్నించగా, పొంతన లేని సమాధానాలు చెప్పారు. నాయుడు అనే వ్యక్తి తమకూ జీతాలు ఇవ్వలేదని తెలిపారు. ప్రస్తుతం ఆఫీసు నిర్వహిస్తున్న రాజు అనే వ్యక్తి.. తాను ఎనిమిది ఐడీలకు సొమ్ము చెల్లించానని పేర్కొన్నాడు. బాధితులు ఫిర్యాదు చేస్తే చర్యలు సంస్థ బోర్డు తిప్పేయడంపై అర్బన్‌జిల్లా ఎస్పీ రాజకుమారిని వివరణ కోరగా, ఈ సంఘటనపై ఆరా తీస్తామని చెప్పారు. బాధితులు ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చే స్తే, చర్యలు తీసుకుంటామన్నారు. -
ఉత్సాహంగా మారథాన్ 5కే రన్..
-
హైటెక్ దీప్మేళ ఎగ్జిబిషన్
-
హైటెక్ అంగన్వాడీ కేంద్రాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు ఇకపై హైటెక్ రూపు సంతరించుకోనున్నాయి. అంగన్వాడీ కేంద్రాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అన్ని కేంద్రాలకు ట్లాబ్లెట్ పీసీలను అందివ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించనున్నారు. పోషకాహార సరఫరా, చిన్నారుల ఆరోగ్యం వంటి వివరాలు అంగన్వాడీ కార్యకర్తలు ట్యాబ్లెట్ ద్వారా అవసరమైన వెంటనే అప్లోడ్ చేస్తారని అధికారులు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ప్రభుత్వం దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా 1,045 లక్షల మందికి పోషకాహారం అందిస్తోంది. వీరిలో 849 లక్షల మంది ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు.