హైటెక్ అంగన్‌వాడీ కేంద్రాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలు ఇకపై హైటెక్ రూపు సంతరించుకోనున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అన్ని కేంద్రాలకు ట్లాబ్లెట్ పీసీలను అందివ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించనున్నారు. పోషకాహార సరఫరా, చిన్నారుల ఆరోగ్యం వంటి వివరాలు అంగన్‌వాడీ కార్యకర్తలు ట్యాబ్లెట్ ద్వారా అవసరమైన వెంటనే అప్‌లోడ్ చేస్తారని అధికారులు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్ డెవలప్‌మెంట్ స్కీమ్ కింద ప్రభుత్వం దేశవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 1,045 లక్షల మందికి పోషకాహారం అందిస్తోంది. వీరిలో 849 లక్షల మంది ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు.