జడ్చర్ల– కోదాడ హైవే విస్తరణకు సర్వే
జడ్చర్ల: జడ్చర్ల– కోదాడ రహదారి విస్తరణ పనులకు ప్రాథమికస్థాయిలో సోమవారం సర్వే ప్రారంభమైంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ రహదారి డీపీఆర్(డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) తయారుచేయాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే జడ్చర్ల వద్ద జాతీయ రహదారి నుంచి నల్గొండ జిల్లా మల్లేపల్లి వరకు సిబ్బంది సర్వే పనులు చేపట్టారు. రోడ్డు మధ్య నుంచి ఒక్కోవైపునకు 75అడుగుల మేర స్థలాన్ని సేకరించేందుకు కొలతలు తీసుకున్నట్లు తెలిసింది. జడ్చర్ల– కోదాడ రహదారి రెండు వరుసలా లేక నాలుగు వరుసలా అన్న సందిగ్ధంలో ఉన్న పరిస్థితుల్లో ఇటీవల సంబంధిత రాష్ట్రస్థాయి ఇంజనీరింగ్ అధికారులు నాలుగు వరుసల రహదారిగా మారనుందని అధికారులు ప్రకటించారు.