Hoarders
-
గడువు ముగిస్తే.. ఇక చర్యలే..
న్యూఢిల్లీ:నల్లధనం కుబేరులపై కొరడా ఝళిపించేందుకు కేంద్ర ప్రభుత్వం అస్త్రశస్త్రాలతో సంసిద్దమవుతోంది. సెప్టెంబర్30 తో ముగియనున్న ఇన్ కం డిక్లరేషన్ స్కీం ముగిసిన తరువాత నల్లధనంపై కఠిన చర్యలు చేపట్టేందుకు నరేంద్ర మోదీ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. ఆదాయ ప్రకటన గడువు పూర్తికాగానే కఠినమైన కార్యాచరణకు దిగనుంది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నుంచి పన్ను ఎగవేతదారులకు సంబంధించిన డాటాను కూడా సేకరించింది. దీనిలో భాగంగా ఇప్పటికే జరిగిన లావాదేవీలపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసినట్లు సీనియర్ సీబీడీటీ అధికారి తెలియజేశారు. వ్యక్తులు, వివిధ సంస్థలకు దాదాపు ఏడులక్షలమందికి పైగా ఈ నోటీసులు అందించింది. జూన్ 1 ప్రకటించిన ఈ ఐడీఎస్ పథకంకింద ఆదాయ ప్రకటనకు ఒక అవకాశం ఇచ్చామని, ఇదే ఆఖరి అవకాశమని చెప్పారు. వివిధ మార్గాల ద్వారా తమ దగ్గర భారీ సమాచారం ఉందని ఈ మేరకు చర్యలకు దిగనున్నామని సీబీడీటీ స్పష్టం చేసింది. అయితే ఈ గడువు అనంతరం ఏ రకంగా కార్యాచరణ ఉండబోతోందన్న వివరాలను అధికారులు ప్రకటించలేదు. విదేశీ నల్లధనం పథకం కింద రూ. 4,164 కోట్ల విలువ చేసే 648 డిక్లరేషన్లను సిద్ధంగా ఉంచింది. వాటికి ద్వారా సుమారు 2, 476 కోట్లను పన్నుల రూపంలో వసూలు చేయనుంది. మరో పక్క నల్లధనం నిల్వచేసే, తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకునే బినామీ చట్టం కూడా త్వరలో అమల్లోకి రానుంది. 2018 తర్వాత చాలా దేశాల్లో సమాచార మార్పిడి ఒప్పందాలు అమల్లోకి రానుండటంతో విదేశాల్లో కూడా నల్లధనం అంశంపై నిబంధనలు కఠినతరం కానున్నాయి ఈ లోపు ప్రభుత్వం కూడా నగదు వినియోగాన్ని పూర్తిగా తగ్గించే చర్యలకు దిగనుంది. -
'అక్రమ నిల్వల వల్లే ఉల్లి ధరల మంట'
అక్రమ నిల్వల వల్లే ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. శుక్రవారం ఆయన ధరల పెరుగుదలపై మీడియాతో మాట్లాడారు. ప్రతియేటా జూలై నుంచి డిసెంబర్ మధ్య కాలంలో కొన్ని కూరగాయలు, ఇతర ఆహార ధరలు పెరడం సాధారణం అయిపోయిందని చెప్పారు. అక్రమంగా నిల్వ ఉంచేవాళ్లపై చర్యలు తీసుకుంటే ఇలా జరగదని ఆయన అన్నారు. రుతుపవనాలు కాస్త ఆలస్యం అవుతున్నాయన్న విషయం తెలిసి ఇలా అక్రమంగా నిల్వ ఉంచేవాళ్లు మరింత రెచ్చిపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ నిల్వదారులపై చర్యలు తీసుకోవాలని, వాటికి కేంద్రం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. అయినా.. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఉల్లిపాయల ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయని, అందువల్ల మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జైట్లీ వ్యాఖ్యానించారు. -
దిగుమతి చేసుకున్నా దిగని ధరలు
సాక్షి ముంబై: ఉల్లిపాయలను దిగుమతి చేసుకున్నప్పటికీ వాటి ధరలు మాత్రం తగ్గడం లేదు. నవీముంబైలోని వాషి మార్కెట్‌కు ఇటీవల 60 టన్నుల ఉల్లిపాయలు దిగుమతి అయ్యాయి. ప్రస్తుతం కిలో ఉల్లిపాయలు రూ.40 నుంచి రూ.45 ధర పలుకుతున్నాయి. గతంలో ఉల్లి దిగుబడి తగ్గడంతో పాకిస్థాన్ నుంచి తెప్పించారు. అప్పట్లో వాటి ధర కిలో రూ.20 నుంచి రూ.25 వరకు పలికింది. ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి వాషి మార్కెట్లోకి కరాచీ నుంచి ఉల్లిపాయలు వచ్చాయి. మరోవైపు వాషి మార్కెట్కుి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు బెంగళూర్, కర్ణాటకల నుంచి మొత్తం 84 వాహనాలు ఉల్లి లారీలు వచ్చాయి. బెంగళూర్ నుంచి తెప్పించిన ఉల్లిపాయలు కిలో రూ.40 నుంచి 45 చొప్పున విక్రయిస్తున్నారు. చౌక దుకాణాలద్వారా అందజేయండి చౌకధరల దుకాణాల ద్వారా ఉల్లిపాయలను చౌక ధరలకు అందజేయాలని సోషలిస్ట్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఉల్లి ధర రూ.100కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొరార్జీ దేశాయ్, వి.పి.సింగ్‌లు ప్రధానమంత్రులగా పనిచేసిన సమయంలో చౌకధరల దుకాణాలద్వారా ఉల్లిపాయలను ప్రజలకు విక్రయించారన్నారు. ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల కారణంగా ప్రస్తుత పరిస్థితి దాపురించిందని ఆ పార్టీ కార్యదర్శి కమలాకర్ సుబేదార్, నాయకుడు సుధామ్ వాఘ్మారేలు ఆరోపించారు. పనిచేసిన హెచ్చరిక మంత్రం నాసిక్: నిల్వ చేస్తే దాడులు జరుపుతామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన హెచ్చరిక మంత్రం బాగానే పనిచేసింది. దీంతో ఉల్లిపాయ ధరలు కిలోకి రూ. 10 మేర తగ్గాయి. మరోవైపు కనీస ఎగుమతి ధర (ఎంఈపీ)ని 38 శాతం పెంచుతామంటూ ప్రకటించడం కూడా కలిసొచ్చింది. దీంతో మార్కెట్లోకి దిగుమతి అవుతున్న ఉల్లి లారీల సంఖ్య పెరిగింది. దీంతో ఉల్లిపాయల ధరలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. ఉల్లిపాయల ధరలు అంతకంతకూ పెరుగుతుండడంతో ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) అధికారులతో సమావేశమైంది. ఉల్లిపాయలను ఎవరైనా చట్టవిరుద్ధంగా దాచిపెడితే దాడులు చేస్తామని హెచ్చరించింది. దీంతో లసల్గావ్ మార్కెట్లో 17.31, పింపల్గావ్ మార్కెట్లో 22.73 శాతం తగ్గాయి. కాగా కర్ణాటక ఉల్లిపాయలు నగరంలోని మార్కెట్లలోకి రావడం ప్రారంభమైంది. దీంతో వీటి ధరలు మరింత తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.