Home Minister
-
రెజ్లర్లకు న్యాయం జరిగేనా? అమిత్ షాతో భేటీ
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ న్యాయం కోసం పోరాడుతున్న భారత రెజ్లర్లు శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి తమ సమస్యను వివరించగా చట్టం తన పని తాను చేస్తుందని వారికి హామీ ఇచ్చారు. తొందరగా విచారణ చేయించండి... కొద్ది రోజులుగా భారత రెజ్లర్లు భారత బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. జంతర్ మంతర్ వద్ద కొన్నాళ్లపాటు సాగిన ఈ నిరసన నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున కీలక మలుపు తీసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఆ కార్యక్రమంలో ఎలాగైనా ఆయనకు తమ గోడు చెప్పుకుందామని అటువైపుగా వెళ్తుంటే ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు భారత రెజ్లర్లపై ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేశారు. ఇన్నాళ్లుగా న్యాయంకోసం పోరాడుతుంటే ఎవరూ స్పందించకపోగా కేసులు పెట్టడం దారుణమని దీన్ని అవమానంగా భావించిన రెజ్లర్లు తాము సాధించిన పతకాలను గంగలో కలిపే ప్రయత్నం చేశారు. రైతు సంఘం నాయకులు నరేష్ తికాయత్ వారిని వారించగా ఆ ప్రయత్నాన్ని ఐదు రోజులపాటు వాయిదా వేశారు. దీంతో చివరి ప్రయత్నంగా రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, సంగీత ఫోగట్, సత్యవర్త్ కడియాన్ లు కేంద్ర హోంమంత్రిని కలిసి రెజ్లర్లపై జరుగుతున్న లైంగిక వేధింపుల విషయంలో బ్రిజ్ భూషణ్ పై త్వరితగతిన విచారణ జరిపించి న్యాయం చేయాల్సిందిగా కోరారు. అందుకు హోంమంత్రి స్పందిస్తూ... చట్టంపై నమ్మకముంచండి. చట్టరీత్యా జరగవలసింది జరుగుతుందని హామీ ఇచ్చారు. -
ఎన్ఐఏ చేతికి ‘ఉగ్ర త్రయం’ కేసు
సాక్షి, హైదరాబాద్: నగరంలో గత ఏడాది దసరా ఉత్సవాల నేపథ్యంలో హ్యాండ్ గ్రెనేడ్లతో భారీ విధ్వంసానికి కుట్ర పన్ని చిక్కిన లష్కరేతొయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులు అబ్దుల్ జాహెద్, మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫారూఖ్‌లకు సంబంధించిన కేసు జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్ఐఏ) బదిలీ అయింది. ఈ కేసుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఆదేశాలు జారీ చేసింది. వీటి ఆధారంగా గత నెల 25న తాజా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎన్ఐఏ హైదరాబాద్ యూనిట్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసుకు ఎన్ఐఏ డీఎస్పీ రాజీవ్ కుమార్ సింగ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ తన అధికారిక వెబ్సైట్లో ఈ ఎఫ్ఐఆర్ను ఆదివారం అప్లోడ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది అక్టోబర్ 2న అరెస్టు అయిన ఈ ఉగ్ర త్రయంపై తొలుత సీసీఎస్ ఆధీనంలోని సిట్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు ఉగ్రవాదులను సిట్ అధికారులతో పాటు రాష్ట్ర, కేంద్ర నిఘా వర్గాలకు చెందిన బృందాలు వివిధ కోణాల్లో విచారించాయి. ఈ కేసులో వెలుగులోకి రావాల్సిన జాతీయ, అంతర్జాతీయ కోణాలు అనేకం ఉన్నాయని నగర పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ఉన్న హ్యాండ్లర్స్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఫర్హతుల్లా ఘోరీ, సిద్ధిఖ్ బిన్ ఉస్మాన్, అబ్దుల్ మాజిద్‌కు సంబంధించిన కీలక వివరాలను దర్యాప్తు చేయాల్సి ఉంది. వీరి నుంచి ఈ త్రయానికి విధ్వంసాలకు పాల్పడాలంటూ ఆదేశాలు అందాయి. చైనాలో తయారైన హ్యాండ్ గ్రెనేడ్లు అక్కడ నుంచే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) మీదుగా కాశ్మీర్‌కు డ్రోన్ల ద్వారా డెడ్ డ్రాప్ విధానంలో చేరాయి. వాటిని అక్కడ నుంచి మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ వరకు చేర్చిన స్లీపర్‌సెల్స్ ఓ రహస్య ప్రదేశంలో దాచాయి. అక్కడకు వెళ్లిన సమీయుద్దీన్ నాలుగు గ్రెనేడ్స్‌ను తీసుకువచ్చారు. ఈ స్లీపర్ సెల్స్ ఎవరనే దాంతో పాటు ఈ ఆపరేషన్‌లో పాల్గొనాలని భావించిన వాళ్లు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే అంశాన్నీ ఆరా తీయాల్సి న అవసరం ఉందని రాష్ట్ర పోలీసులు నిర్ధారించారు. వీటితో పాటు ఉగ్రవాదుల సంప్రదింపుల మార్గాలు, నగదు లావాదేవీలు గుర్తించడంతో సహా కీలక వివరాలు వెలుగులోకి తేవాల్సి ఉంది. వీటితో పాటు ఈ కేసులో పోలీసులు అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (యూఏపీఏ) కింద ఆరోపణలు చేర్చా రు. ఈ పరిణామాల నేపథ్యంలో కేసు దర్యాప్తు ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో ఆ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను కస్టడీకి తీసుకోవడానికి ఎన్ఐఏ అధికారులు కోర్టు అనుమతి కోరే అవకాశం ఉంది. (చదవండి: 300 బస్సులు ఎక్కడ?.. డొక్కు బస్సులే దిక్కా?) -
ఎమ్మెల్యేలుగా మేము...
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బుధవారం శాసన సభలో ప్రమాణ స్వీకారం చేశారు..రాష్ట్ర శాసనసభకు జిల్లా నుంచి ఎన్నికైన 17 మంది శాసనసభ్యుల్లో బుధవారం 16 మంది శాసనసభ్యులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. నరసరావుపేట నుంచి ఎన్నికైన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత కారణాల వలన హాజరుకాలేకపోయారు. శాసనసభలో ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకట అప్పలనాయుడు శాసనసభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభ్యులు వరుసగా విడదల రజని, డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావు, కాసు మహేష్‌రెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, కిలారి వెంకట రోశయ్య, మేరుగ నాగార్జున, మద్దాళి గిరిధర్, అనగాని సత్యప్రసాద్. -
50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వలేం..!
-
రాజప్పకు ఘనస్వాగతం
అమలాపురం:రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు కోనసీమలో ఘనస్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఆయన తొలిసారిగా కోనసీమ పర్యటనకు వచ్చారు. పెద్దాపురం నుంచి ఆయన యానాం- ఎదుర్లంక వారధి మీదుగా కోనసీమలోకి ప్రవేశించారు. వారధి వద్దకు కోనసీమ నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అక్కడ నుంచి అమలాపురం వరకు భారీ ఊరేగింపుగా సాగారు. దారి పొడవునా బాణ సంచా కాలుస్తూ రాజప్పకు జేజే నినాదాలు చేశారు. మురమళ్ల, ముమ్మిడివరం, అనాతవరం మీదుగా అమలాపురం వరకు భారీ మోటార్ సైకిల్, కార్లతో ర్యాలీ సాగింది. అమలాపురం ఎర్రవంతెన వద్ద పార్టీ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అక్కడ నుంచి హైస్కూల్ సెంటరు, గడియారస్తంభం సెంటరు, ఈదరపల్లి మీదుగా సాగిన ర్యాలీ నల్లవంతెన, బాలయోగి ఘాట్‌కు చేరింది. దివంగత నేత, తన రాజకీయ గురువు బాలయోగికి రాజప్ప ఘనంగా నివాళులర్పించారు. అక్కడ నుంచి అమలాపురంలోని రంగనాయుడు కాలనీలోని తనస్వగృహానికి రాజప్ప చేరుకున్నారు. తిరిగి అక్కడ నుంచి బయలుదేరి భీమనపల్లి మీదుగా స్వగ్రామమైన ఉప్పలగుప్తం మండలం పెదగాడవిల్లి చేరుకున్నారు. ముమ్మిడివరం, అమలాపురం ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబు, అయితాబత్తుల ఆనందరావు, మాజీమంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు, అమలాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి యాళ్ల మల్లేశ్వరరావు, ఆంధ్రబ్యాంక్ డెరైక్టర్ పరసా పరమేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి, నిమ్మకాయల జగ్గయ్యనాయుడు, మెట్ల రమణబాబు, పొలమూరి ధర్మపాల్, చిక్కాల గణేష్, బోనం అప్పారావు, నిమ్మకాయల చెల్లయ్యనాయుడు, తిక్కిరెడ్డి నేతాజీ తదితరులు రాజప్పకు స్వాగతం పలికినవారిలో ఉన్నారు. ‘మావోయిస్టుల బెడద లేదు’ ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల సమస్య లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన మంగళవారం అమలాపురంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. చిన్నరాష్ట్రాలు ఏర్పడితే మావోయిస్టుల సమస్య తలెత్తుతుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పైమేరకు బదులిచ్చారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానన్నారు. కోనసీమలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై తనకు పూర్తిస్థాయి అవగాహన ఉందని, వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. దివంగత నేత జీఎంసీ బాలయోగి అడుగుజాడల్లో పయనించి కోనసీమ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. కోనసీమ రైల్వేలైను సాధనకు స్థానిక ఎంపీ పండుల రవీంద్రబాబు, జిల్లాకు చెందిన ఎంపీలు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మానవప్రయత్నంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి గాలించినా హిమాచల్‌ప్రదేశ్‌లో బియాస్ నదిలో కొట్టుకుపోయిన విద్యార్థులను గుర్తించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వరద ఉధృతికి మట్టిలో వారు కూరుకుపోవడం గానీ, కిందకు కొట్టుకు పోవడం గానీ జరిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.