home minister Naini Narasimha Reddy
-
‘నాయిని’ తూటాలు లేని తుపాకీ: పొన్నం
సిరిసిల్ల: హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తూటాలు లేని తుపాకీ లాంటివాడని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్ ఎద్దేవా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘అభివృద్ధి కనిపిస్తలేదా.. అయితే కంటి పరీక్షలు చేయించుకో? అనే నాయిని వ్యాఖ్యలపై పొన్నం మండిపడ్డారు. ‘మా కళ్లు బాగానే ఉన్నాయి.. మీరే మెదడు పరీక్ష చేయించుకోవాలి’అని హితవు పలికారు. మంత్రి కేటీఆర్ అసహనంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజలకే కాదు.. దేవుడికి ఇచ్చిన హామీని కూడా విస్మరించడంలో కేసీఆర్‌కు మించినోడు లేడని ధ్వజమెత్తారు. -
ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతాం
ఎంపీ కవిత కవాడిగూడ: హైదరాబాద్‌ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని ఎంపీ కవిత అన్నారు. గ్రేటర్ పగ్గాలనూ టీఆర్ఎస్కు అప్పగిస్తే హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. టీఆర్ఎస్ కవాడిగూడ డివిజన్ అభ్యర్థి లాస్య నందిత తరఫున హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలిసి ఆమె శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా కేసీఆర్ పేదల సంక్షేమం కోసం వినూత్న పథకాలు ప్రవేశపెట్టారన్నారు. వృద్ధులు, వికలాంగ, వితంతు పెన్షన్లు పెంచిన ఘనత టీఆర్ఎస్కే దక్కిందన్నారు. పేద యువతుల వివాహం కోసం ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం రూ.51 వేలు మంజూరు చేయడం దేశంలో మరెక్కడా లేదన్నారు. గూడు లేని పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తున్న ఘనత కేసీఆర్‌దేనన్నారు. స్థానిక మహిళల నుంచి కవితకు అపూర్వ స్వాగతం లభించింది. ఆమెకు హారతులిచ్చి పూలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్.యాదగిరి, గౌరీశంకర్, దినేష్, కల్వ గోపి, చంద్రశేఖర్‌గౌడ్, శ్యామ్యాదవ్, రాజుయాదవ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఖైదీల క్షమాభిక్షపై నీలినీడలు!
గ్రేటర్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జాప్యం సాక్షి, హైదరాబాద్: ఖైదీలకు మళ్లీ ఎదురుచూపులు తప్పడంలేదు. క్షమాభిక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం(జనవరి 26) రోజున విడుదల చేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఖైదీల క్షమాభిక్షపై ఏర్పాటైన జైలు సూపరింటెండెంట్ల కమిటీ ఒక జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి అందజేసింది. దీనిపై ప్రభుత్వ ఉన్నతస్థాయి కమిటీ పరిశీలించి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు ఆ ప్రక్రియ జరగలేదు. ప్రస్తుత ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెలువరించే పరిస్థితి లేదు. నిర్ణయాన్ని ప్రకటించాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి అవసరం. ఇప్పటికిప్పుడు ఈసీ నుంచి అనుమతి తీసుకున్నా ఖైదీల క్షమాభిక్ష జనవరి 26 నాటికి పూర్తయ్యే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న క్షమాభిక్ష ప్రసాదించే అవకాశం ఉంది. క్షమాభిక్షపై నిషేధాన్ని తొలగిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. కొన్ని మార్గదర్శకాలను సూచించింది. తీర్పు ప్రతులు ప్రభుత్వానికి, జైళ్లశాఖకు అందాయి. న్యాయస్థానం తీర్పును అనుసరించి నియమ నిబంధనలు రూపొందించాలని రాష్ట్ర జైళ్ల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అనుగుణంగా అన్ని జైళ్ల సూపరింటెండెంట్లను సభ్యులుగా నియమిస్తూ జైళ్లశాఖ ఒక కమిటీని వేసింది. క్షమాభిక్షకు అర్హత కలిగిన ఖైదీలను కమిటీ ఎంపిక చేసింది. ఈ మేరకు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి గత నెలలో అందజేసింది. తెలంగాణలోని అన్ని జైళ్లలో శిక్షపడిన ఖైదీలు 18 వందల మంది వరకు ఉండగా వీరిలో దాదాపు 300 మంది ఖైదీలు క్షమాభిక్షకు అర్హత కలిగి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. -
ఆంధ్రా వారు సంక్రాంతికి వెళ్లొచ్చాకే..
గ్రేటర్ ఎన్నికలపై హోంమంత్రి నాయిని హైదరాబాద్: హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ఆంధ్ర ప్రాంత ప్రజలు సంక్రాంతికి వెళ్లొచ్చిన తర్వాతే గ్రేటర్ ఎన్నికలు నిర్వహిస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. వాళ్లు పండగకు వెళ్లగానే ఎన్నికలు జరుపుతామంటూ కొంత మంది పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కవాడిగూడలో శనివారం నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య బంధువు నంది మానవ్ నాయిని సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ... ‘హైదరాబాద్‌లోని ఆంధ్రా ప్రాంత ప్రజలపై టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందనే తప్పుడు ప్రచారానికి కొన్ని రాజకీయ పార్టీలు పూనుకున్నాయి. ఇది పూర్తి అవాస్తవం. సీమాంధ్రులు సంక్రాంతికి వెళ్లి వచ్చిన తరువాతనే గ్రేటర్ ఎన్నికలు నిర్వహిస్తాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ సీటుతో పాటు వంద డివిజన్లలో గెలుపొందుతాం. రానున్న రోజుల్లో హైదరాబాద్ విశ్వ నగరంగా మారబోతోంది. విదేశీ పెట్టుబడుల రాకతో వేలాది ఉద్యోగాలు వస్తాయి. సింగరేణిలో 50 వేలు, జెన్కోలో 40 వేల ఉద్యోగాలు వచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు’ అని అన్నారు. -
హోంమంత్రిని కలిసిన ఎస్సై సిద్ధయ్య భార్య
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో ముష్కరుల కాల్పుల్లో మృతి చెందిన ఎస్సై సిద్ధయ్య, హోంగార్డు మహేశ్ కుటుంబ సభ్యులు శుక్రవారం సచివాలయంలో హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిశారు. తమకు ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగం, ఎక్స్‌గ్రేషియా, ఇతరత్రా సదుపాయాలకు సంబంధించి చర్చించారు. తనకు గెజిటెడ్ పోస్టు కావాలని సిద్ధయ్య భార్య ధరనీష, జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కావాలని మహేశ్ భార్య కోరారు. అలాగే ఎక్స్‌గ్రేషియా కూడా పెంచాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని నాయిని చెప్పారు. -
హోంమంత్రి దృష్టికి పోలీసుల సమస్యలు
సంగారెడ్డి క్రైం : పోలీసుల సమస్యలను పరిష్కరించాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు దుర్గారెడ్డి శనివారం హైదరాబాద్‌లో కలిసి విన్నవించారు. అదనపు హెచ్ఆర్ఏ, రిస్క్ అలవెన్సు, యూనిఫాం అలవెన్సు, టీఏ తదితర సమస్యలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారని దుర్గారెడ్డి శనివారం స్థానిక విలేకరులకు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం కోశాధికారి ఆసీఫ్, సభ్యుడు నారాయణలు ఉన్నట్లు దుర్గారెడ్డి తెలిపారు. -
పోరాటాల గడ్డలో ఏ పార్టీ అడ్రస్ ఉండదు
సూర్యాపేట : తెలంగాణ పోరాటాల గడ్డలో వచ్చే మూడేళ్లలో ఏ పార్టీ అడ్రస్ ఉండదని, తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే ఉంటుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపునకు సోమవారం సూర్యాపేటలోని త్రివేణి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో చదువుకునే వారు అభిప్రాయమేమిటో పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించి నిరూపించుకోవాలన్నారు. తొమ్మిది నెలల పాలనలో టీఆర్ఎస్ చేసిన కార్యక్రమాలు మాటలకందనివన్నారు. రాష్ర్టం ఏర్పడితే నక్సలైట్ల రాజ్యం వస్తుందని, హిందూ,ముస్లింల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటాయని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతాయని గిట్టని వాళ్లు ఏవేవో కారుకూతలు కూశారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక శాంతిభద్రతలకు ఎక్కడా కూడా విఘాతానికి చోటు లేకుండా బతుకమ్మ, బోనాలు, వినాయక నిమజ్జనం, రంజాన్ పండగలను వైభవంగా జరిపామన్నారు. టీడీపీ.. ఆంద్రోళ్ల పార్టీ అని, తెలంగాణలో ఆ పార్టీకి బతుకు దెరువు లేదని ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం నల్లగొండ జిల్లాకే పరిమితమైందని, మిగతా తొమ్మిది జిల్లాలో ఎక్కడా కూడా నామరూపాల్లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లను నామ రూపం లేకుండా చేయాలంటే పల్లా గెలుపుతోనే తేటతెల్లమవుతుందన్నారు. బీజేపీలో ముగ్గురు నలుగురు ఉన్నారని, నిన్నగాక మొన్ననే ఒకాయన బీజేపిని పొరకపట్టి ఊడ్చేశారన్నారు. రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను ఎంత తిడితే అంత పెద్దపదవి వస్తుందనే భ్రమలో ఉండి అర్థంపర్థం లేని మాటలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు కోసం చివరి క్షణం వరకు పట్టభద్రులు కృషి సల్పాలని పిలుపునిచ్చారు. కేసీర ప్రభుత్వ పాలనకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు రెఫరెండంగా తీసుకోవాలన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన జిల్లా ముద్దుబిడ్డ కొండేటి వేణుగోపాల్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రాణత్యాగం చేస్తే అక్కడ నుంచి ఆయనమృతదేహాన్ని స్వగ్రామం దోసపహాడ్ గ్రామానికి తీసుకొచ్చేందుకు రాజేశ్వర్‌రెడ్డి చేసిన కృషి అంతా ఇంతా కాదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళ్లిక, కట్కూరి గన్నారెడ్డి, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, వై.వెంకటేశ్వర్లు, గండూరి ప్రకాష్, శనగాని రాంబాబుగౌడ్, బద్దం అశోక్‌రెడ్డితో పాటు ఆయా సంఘాల ప్రతినిధులు, పట్టభద్రులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.