Honer
-
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ఫ్రాన్స్ పురస్కారం
కాంగ్రెస్ ఎంపీ, ఐక్యరాజ్యసమితి మాజీ దౌత్యవేత్త శశి థరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం ‘షువలియె డి లా లిజియన్ ద హానర్’ లభించింది. ఒక కార్యక్రమంలో ఫ్రెంచ్ సెనేట్ అధ్యక్షుడు గెరార్డ్ లార్చర్.. శశి థరూర్‌ను సత్కరించారు. ఆగస్టు 2022లో థరూర్‌కు ఈ అవార్డును అందజేస్తామని ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ గౌరవం అందించినందుకు ఫ్రాన్స్‌కు థరూర్ కృతజ్ఞతలు తెలిపారు. భారత్-ఫ్రాన్స్ మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసినందుకు, అంతర్జాతీయ శాంతి, సహకారంలో చేసిన కృషికి గుర్తింపుగా థరూర్‌కు ఈ గౌరవం లభించిందని భారత్‌లోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటనలో అధికారులు.. శశి థరూర్ ప్రతిభ, వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఐక్యరాజ్యసమితిలో దౌత్యవేత్తగా, భారతదేశంలో రాజకీయ నేతగా, రచయితగా థరూర్ విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో థరూర్ విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా, మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సహా కీలకమైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలలో కూడా థరూర్ పనిచేశారు. థరూర్ పలు పుస్తకాలు రాశారు. వాటిలో కొన్ని ఫ్రెంచ్ భాషలోకి అనువదించారు. థరూర్ ఐక్యరాజ్యసమితిలోనూ పనిచేశారు. కమ్యూనికేషన్స్, స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్, సెక్రటరీ-జనరల్ కోఫీ అన్నన్‌కు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు. -
ఇండియన్ ఆర్మీ ఎప్పుడు ఏర్పడింది? ‘ఆపరేషన్ రాహత్’ ఘనత ఏమిటి?
దేశ రక్షణ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఇండియన్ ఆర్మీ. ప్రాణాలను సైతం లెక్క చేయక నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ, దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసే జవాన్ల త్యాగం ఎవరూ వెలకట్టలేనిది. భారత సైన్యానికున్న పరాక్రమాన్ని, ధీరత్వాన్ని, త్యాగాలను గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం జనవరి 15న ఇండియన్ ఆర్మీ డేను నిర్వహిస్తారు. ఈ నేపధ్యంలో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన 20 ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ హయాంలో 1776లో కోల్‌కతాలో ఇండియన్ ఆర్మీ ఏర్పడింది. 2. సియాచిన్ గ్లేసియర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమి. ఇది సముద్ర మట్టానికి ఐదువేల మీటర్ల ఎత్తులో ఉంది. ఇది భారత సైన్యం ఆధీనంతో ఉంది. 3. హిమాలయాలలోని ద్రాస్, సురు నదుల మధ్య ఉన్న బెయిలీ వంతెన ప్రపంచంలోనే అతిపెద్ద వంతెన. దీనిని 1982లో భారత సైన్యం నిర్మించింది. 4. అమెరికా, చైనాల తర్వాత భారత సైన్యం ప్రపంచంలో మూడవ అతిపెద్ద సైనికబలగం. 5. ఇతర ప్రభుత్వ సంస్థలలో మాదిరిగా భారత సాయుధ దళాలలో కులం లేదా మతం ఆధారిత రిజర్వేషన్ వ్యవస్థ లేదు. 6. 2013లో ఉత్తరాఖండ్‌లో వరద బాధితులను రక్షించేందుకు నిర్వహించిన ‘ఆపరేషన్ రాహత్’ ప్రపంచంలోనే అతిపెద్ద పౌర రెస్క్యూ ఆపరేషన్. 7. ప్రెసిడెంట్స్ బోర్డ్గార్డ్ అనేది భారత సైన్యంలోని పురాతన సైనిక దళం. ఇది 1773లో స్థాపితమయ్యింది. ప్రస్తుతం ఇది న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఉంది. 8. ఎత్తయిన పర్వతప్రాంతాలలో యుద్ధాలకు భారతీయ సైనికులు సమర్థులైనవారిగా గుర్తింపుపొందారు. 9. 1971 డిసెంబర్లో భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన లాంగేవాలా యుద్ధంలో కేవలం ఇద్దరు సైనికులు మాత్రమే మరణించారు. ఈ యుద్ధ నేపధ్యంతోనే బాలీవుడ్ సినిమా ‘బోర్డర్’ రూపొందింది. 10. ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోనే అతిపెద్ద వాలంటరీ ఆర్మీ. భారతఆర్మీ ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సైనికులను కలిగి ఉంది. 11. హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ (హెచ్ఏడబ్ల్యుఎస్)ను భారత సైన్యం అత్యుత్తమ సైనిక శిక్షణ కోసం నిర్వహిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయడానికి ముందు అమెరికా, ఇంగ్లండ్, రష్యా ప్రత్యేక దళాలు ఇక్కడ శిక్షణ పొందాయి. 12. భారతదేశం 1970, 1990లో అణు పరీక్షలను నిర్వహించింది. 13. కేరళలోని ఎజిమల నావల్ అకాడమీ మొత్తం ఆసియాలోనే అతిపెద్ద అకాడమీ. 14. భారత సైన్యంలో అశ్విక దళం కూడా ఉంది. ప్రపంచంలో ఇలాంటి రెజిమెంట్లు మూడు మాత్రమే ఉన్నాయి. 15. తజికిస్థాన్‌లో భారత వైమానిక దళానికి ఔట్-స్టేషన్ ఉంది. తజికిస్థాన్ తర్వాత, ఇప్పుడు భారత సైన్యం ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా తన అవుట్-స్టేషన్‌ను నిర్మించబోతోంది. 16. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్) భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ ఏజెన్సీలలో ఒకటి. ఇది భారతదేశంలోని అత్యంత విలాసవంతమైన రోడ్ల నిర్మాణం, నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. 17. 1971లో భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఏకంగా 93 వేల మంది పాకిస్తానీ సైనికులు భారత సైన్యానికి లొంగిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం చోటుచేసుకున్న అతిపెద్ద లొంగుబాటు ఇదే. 18. పలువురు ప్రముఖులకు సాయుధ దళాల గౌరవ ర్యాంక్‌లు ఇచ్చారు. సచిన్ టెండూల్కర్‌కు భారత వైమానిక దళం కెప్టెన్ హోదాను ప్రదానం చేశారు. ఎంఎస్ ధోనీకి భారత సైన్యం లెఫ్టినెంట్ హోదాను ప్రదానం చేసింది. 19. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో గల మోవ్ భారతదేశంలోని పురాతన కంటోన్మెంట్లలో ఒకటి. 1840 నుండి 1948 వరకు రెజిమెంట్ ఇక్కడ శిక్షణ పొందింది. 20. 1835లో స్థాపితమైన అస్సాం రైఫిల్స్.. భారత సైన్యంలోని పురాతన పారామిలిటరీ దళం. -
హైదరాబాద్‌లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ.. రూ.3,000 కోట్లతో భారీ ప్రాజెక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్టీ రంగ సంస్థ హానర్ ప్రైమ్ హౌజింగ్ హైదరాబాద్‌లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును ఆవిష్కరించింది. హానర్ సిగ్నాటిస్ పేరుతో హైటెక్‌సిటీ–కూకట్పల్లి మార్గంలో ఐడీఎల్ రోడ్డులో రూ.3,000 కోట్లతో ఈ భారీ నిర్మాణానికి సంస్థ శ్రీకారం చుట్టింది. 27.5 ఎకరాల్లో ఒక్కొక్కటి 25 అంతస్తుల్లో 18 టవర్లు రానున్నాయి. మొత్తం 3,266 అపార్ట్మెంట్లను నిర్మిస్తారు. హానర్ సిగ్నాటిస్ ఇప్పటికే సుమారు 1,300 బుకింగ్స్ నమోదు చేసింది. రెరాకు సమర్పించిన ప్రణాళిక ప్రకారం 9 టవర్లతో కూడిన తొలి దశ ప్రాజెక్టు 2026 డిసెంబరుకల్లా పూర్తి కావాల్సి ఉంది. గడువు కంటే ముందుగా తొలి దశ పూర్తి చేస్తామని ప్రమోటర్–డైరెక్టర్ బాలు చౌదరి వెల్లడించారు. ప్రమోటర్–డైరెక్టర్లు పి.వెంకటేశ్వర్లు, స్వప్న కుమార్, రాజమౌళితో కలిసి ప్రాజెక్టు విశేషాలను గురువారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ధర రూ.3 కోట్ల వరకు.. ఒక్కో అపార్ట్మెంట్ 1,695–3,815 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3, 3.5, 4 బీహెచ్‌కే ఆఫర్ చేస్తారు. ధర రూ.1.25 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఉంది. 4 బీహెచ్‌కే అల్ట్రా ప్రీమియం అపార్ట్మెంట్స్ కోసం ప్రత్యేకంగా నాలుగు టవర్లు ఏర్పాటు చేస్తారు. 1.31 లక్షల చ.అ.విస్తీర్ణంలో రెండు క్లబ్ హౌజులు ఉంటాయి. వీటిలో 20,000 చ.అ.విస్తీర్ణంలో జిమ్ నెలకొల్పుతారు. రెండు స్విమ్మింగ్ పూల్స్, సూపర్ మార్కెట్, క్లినిక్, అలాగే లాకర్ సౌకర్యంతో బ్యాంక్ వంటివి రానున్నాయి. ఈవీ చార్జింగ్ స్టేషన్, 5 ఎకరాల పార్క్ అదనపు ఆకర్షణ. స్కూల్ బస్‌లు వచ్చేందుకు వీలుగా ప్రత్యేకంగా రోడ్డు నిర్మిస్తారు. ఐజీబీసీ నుంచి ఈ ప్రాజెక్టు ప్రీ–సర్టిఫైడ్ గోల్డ్ ధ్రువీకరణ అందుకుంది. మరో కోటి చ.అ. విస్తీర్ణంలో.. హానర్ ప్రైమ్ హౌజింగ్ హైదరాబాద్‌లో ఇప్పటికే రెండు ప్రాజెక్టులను 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తి చేసింది. మూడవ ప్రాజెక్టు హానర్ రిచ్మాంట్లో భాగంగా 28.4 ఎకరాల్లో 12 లక్షల చ.అ. విస్తీర్ణంలో విల్లాలు నిర్మాణంలో ఉన్నాయి. నాల్గవ ప్రాజెక్టు అయిన హానర్ సిగ్నాటిస్ 78 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటవుతోంది. రానున్న రోజుల్లో మరో ఒక కోటి చ.అ.విస్తీర్ణం జోడించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. నాణ్యత, అత్యాధునిక సౌకర్యాలతో హైదరాబాద్ రియల్టీ రంగంలో టాప్–10లో నిలవాలన్న లక్ష్యంతో ఈ రంగంలోకి అడుగు పెట్టినట్టు సంస్థ తెలిపింది. -
డూప్‌ల సందడి
జగిత్యాల అర్బన్ : ఈ చిత్రం చూడండి.. అచ్చం సినీ హీరోలు విక్టరీ వెంకటేశ్, దివంగత నాగేశ్వర్రాలా కనిపిస్తున్నారు కదూ.. అవును అట్లే కనిపిస్తున్నారు. విజయనగరంకు చెందిన రవిచంద్రన్ (వెంకటేశ్ డూప్), హైదరాబాద్‌కు చెందిన నగేశ్ (నాగేశ్వర్రావు డూప్) జగిత్యాలలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన కళాశ్రీ అధినేత గుండేటి రాజు, బానుక రవి, అభి డూప్‌లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తిరునహరి, విజయ్, భానుక శ్రీనివాస్, అమూల్య రవి తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీలకు సన్మానం
నాగార్జునసాగర్ : కష్ణాపుష్కరాలకు సాగర్‌కు వచ్చిన నల్లగొండ, మల్కాజ్గిరి ఎంపీలను రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక రెడ్డి హాస్టల్ ముందు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. 1,500మంది విద్యార్థులకు రెడ్డిహాస్టల్లో భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు వి.సత్యనారాయణరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్ భాస్కర్‌రెడ్డి, రాయపురెడ్డి, కర్నబ్రహ్మానందరెడ్డి, నర్సిరెడ్డి, కోటిరెడ్డి, నారాయణరెడ్డి, కేశవరెడ్డి, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.