Horns
-
అతి పెద్ద కొమ్ముల ఆవు ఇదే!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతి పొడవైన కొమ్ములు కలిగిన ఆవు ఇదే. హోక్లహోమా (అమెరికా)లోని లాటన్ పట్టణంలో విశేషంగా ఆకర్షిస్తున్న ఈ ఆవును ‘బకుల్‌హెడ్’ అని పిలుస్తున్నారు. దీని కొమ్ముల పొడవు 11 అడుగుల 1.8 అంగుళాలు. దీని వయస్సు ఆరేళ్లు మాత్రమే. త్వరలో దీన్ని గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కించేందుకు పేపర్ వర్క్ జరుగుతోంది. 2020 సంవత్సరంలో ఇది ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’కి ఎక్కుతుందని తెలిసింది. ప్రస్తుతం అలబామాలోని గుడ్‌వాటర్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల ఆవు గిన్నీస్ రికార్డుల్లో కొనసాగుతోంది. పొంచో వియా పేరుతో పిలుస్తున్న ఆ అవు కొమ్ముల పొడువు పది అడుగుల 7.4 అంగుళాలు. బకుల్‌హెడ్ ఆవు యజమాని టెక్సాజ్కు చెందిన 14 ఏళ్ల మార్షియాల గోంజలెస్. సరిగ్గా ఐదున్నర ఏళ్ల కిందట ఈ ఆవును దాని ఏడుగురు బ్రీడర్లు అమ్మకానికి పెట్టగా ఆరు నెలల వయస్సున్న ఆ ఆవును గోంజలెస్ లాటరీ పద్ధతిలో కొనుగోలు చేసింది. అంటే.. ఆమె తరఫున ఆమె తల్లిదండ్రులు దీన్ని కొనుగోలు చేసి ఉంటారు. ప్రస్తుతం ఆ అమ్మాయి సోదరుడు లియాండ్రో ఈ ఆవును దేశమంతా తిప్పుతూ ప్రదర్శన ఇస్తున్నారు. ఏడాదికి 12 నుంచి 15 చోట్ల దీని ప్రదర్శన ఉంటుందని ఆమె సోదరుడు తెలిపారు. -
..ఐతే చలానే!
సాక్షి, సిటీబ్యూరో: నిజాంపేటలో నివసించే వేణు మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగి. తనకు ఇష్టమైన ఎన్ఫీల్డ్ బైక్‌ను రూ.లక్షన్నర వెచ్చించి కొనుగోలు చేశాడు. అది అందరి దృష్టిని ఆకర్షించేందుకు బైక్ సైలెన్సర్, హారన్‌ను మోడిఫై చేయించాడు. దానిపై రోజూ ఆఫీస్‌కు వెళ్లొచ్చే సమయంలో చేసే శబ్దంతో తోటి వాహనదారులు చిరెత్తిపోయేవారు. చివరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు దొరకడంతో జరిమానా విధించారు. జూబ్లీహిల్స్‌లో నివసించే శ్రీకాంత్‌కు ఖరీదైన కారుంది. బిజినెస్ నిమిత్తం రోజూ మాదాపూర్ వెళ్తుంటాడు. రహదారిపై వెళ్తున్న సమయంలో చేస్తున్న మల్టీటోన్డ్ హారన్ ఇతరులకు ఇబ్బందికరంగా మారింది. శబ్ద పరిమితి దాటడంతో ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించారు. ఇలా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పరిమితికి మించి శబ్దం చేస్తూ, ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న వాహనచోదకులపై ట్రాఫిక్ పోలీసులు సౌండ్ లెవల్ మీటర్స్(ఎస్ఎల్ఎం) సహాయంతో ఉక్కుపాదం మోపుతున్నారు. మార్చిలో ప్రారంభించి ఇప్పటి వరకు 2,245 మంది వాహనదారులకు స్పాట్ ఈ–చలాన్లు విధించారు. మార్చిలో 9, ఏప్రిల్‌లో 54, మేలో 88, జూన్‌లో 197, జూలైలో 1,897 వాహనాలకు జరిమానా వేశారు. అయితే మొదట్లో బైకులు తొలి స్థానం లో ఉండగా... ఇప్పుడు కార్లు నిలిచాయి. శబ్ద కాలుష్యం, మల్టీటోన్డ్ హారన్, ఎయిర్ హారన్ల వారీగా స్పాట్లోనే చలాన్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి ఠాణాల్లో ఎస్ఎల్ఎం యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో నిర్వహిస్తున్న తనిఖీలను ఇతర ఠాణాల్లోనూ అమలు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. పరిమితిని మించి... యువత ఖరీదైన కార్లు, బైకులతో రహదారులపై దూసుకెళ్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) మార్గదర్శకాల ప్రకారం ద్విచక్ర వాహనాలకు 75 డెసిబుల్స్ దాటితే, కార్లకు 74 డెసిబుల్స్ దాటితే జరిమానా విధిస్తున్నారు. వాహనదారులను హారన్ కొట్టమని అది మల్టీటోన్డ్, ఎయిర్ హారన్, కంపెనీ ఫిక్స్డ్ చేసిన హారనా? అని ట్రాఫిక్ పోలీసులు గుర్తిస్తున్నారు. 12 ఫీట్ల దూరం నుంచి శబ్ద తరంగాలను ఎస్ఎల్ఎంలతో గుర్తిస్తున్నారు. మోటారిస్టులు ఎక్సలేటర్ తొక్కితే కొంత దూరం నుంచి ఎస్ఎల్ఎం సౌండ్ సెన్సార్లు శబ్ద స్థాయిని పసిగడుతున్నాయి. వాహనానికి 5–6 ఫీట్ల దూరం నుంచి ఈ యంత్రాలు శబ్ద తీవ్రతను నమోదు చేస్తున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఒక యంత్రం ఉండగా పదుల సంఖ్యలో కేసులు నమోదు చేశారు. ఇక హైదరాబాద్ కమిషనరేట్‌లో 1,153 ఈ–చలాన్లు జారీ చేసినట్టు ట్రాఫిక్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. శబ్దం చేస్తే చర్యలే.. కంపెనీ ఫిక్స్ చేసిన హారన్ శబ్దం నచ్చకపోవడంతో చాలామంది మార్చేస్తున్నారు. అలాగే రోడ్లపై వెళ్తున్న సమయంలో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు సైలెన్సర్లు మోడిఫై చేస్తున్నారు. చాలా వరకు ఈ బైకులు 90–120 డెసిబుల్స్ వరకు వెళ్తున్నట్టు ఎస్ఎల్ఎం రీడింగ్‌లు చెబుతున్నాయి. ఇక కార్ల పరిస్థితి వీరి కంటే ఎక్కువగా ఉంది. అధిక శబ్దం చేసే వాహనదారులపై చర్యలు తప్పవు. – విజయ్‌కుమార్,సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ -
సౌండ్ పెరిగితే చలాన్ మోతే!
సాక్షి, సిటీబ్యూరో: రహదారిలో నిదానంగా వెళ్తున్న వాహనచోదకుడికి వెనుక నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సు హారన్ మోగిస్తే అతడి గండె ఆగినంత పనవుతుంది... రోడ్డుపై నడుస్తున్న పెడస్ట్రియన్ పక్క నుంచి బుల్లెట్ తరహా వాహనం దూసుకుపోతే దాని సౌండ్ దడపుడుతుంది... నగరవాసుల్లో అనేక మందికి ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. ఇలాంటి వాటి ఫలితంగానూ రాజధానిలో శబ్ధ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరి అనేక మంది చెవి రుగ్మతలకు గురవుతున్నారు. దీనిని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇలాంటి వాహనచోదలకు చెక్ చెప్పడానికి ఈ నెల 14 నుంచి స్పెషల్ డ్రైవ్స్‌కు శ్రీకారం చుట్టారు. ఫలితంగా వారం రోజుల్లో 654 కేసులు నమోదు చేశారు. మోటారు వాహనాల చట్టం నిబంధనల ప్రకారం ఓ వాహనం హారన్ గరిష్టంగా 93 నుంచి 100 డెసిబుల్స్ మధ్య మాత్రమే శబ్ధం చేయాలి. అలాగే ఆయా వాహనాల ఇంజిన్లు, సైలెన్సర్లు సైతం ఎంత శబ్ధం చేయవచ్చనేది స్పష్టంగా నిర్ధేశించి ఉంది. అయితే ఈ నిబంధనల్ని తుంగలో తొక్కుతున్న వాహనచోదకులు పరిమితికి మించి శబ్ధాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కేవలం ప్రైవేట్ వాహనాలు, ట్రావెల్స్ బస్సులు, బుల్లెట్ తదితర వాహనాలు మాత్రమే కాదు.. చివరకు ఆర్టీసీ బస్సులు, కాలేజీలు, స్కూళ్ళకు విద్యార్థులను తరలించే వాహనాలు సైతం కర్ణకఠోరమైన శబ్ధాలను విడుదల చేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఫ్యాన్సీ హారన్లు, ఎయిర్ హారన్స్, మల్టీ టోన్ హారన్స్, మాడిఫైడ్ సైలెన్సరే ఇందుకు కారణమని నిర్ణయించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు కేటాయించిన సౌండ్ లెవల్ మీటర్ల సాయంతో నిర్ణీత వేళల్లో డ్రైవ్స్ చేస్తున్నారు. ఆయా హారన్లు వెంటనే తొలగించాల్సింగా వాహనాల డ్రైవర్లు, ఆయా సంస్థల నిర్వాహకులకు సైతం స్పష్టం చేశారు. 14–20 తేదీల మధ్య కేసులు ఇలా ఉల్లంఘన కేసులు ఎయిర్ హారన్ 125 మల్టీ టోన్డ్ హారన్ 424 ఇంజిన్/సైలెన్సర్ శబ్ధాలు 105 మొత్తం 654 -
గోవుల చట్టం కోసం 8 ఏళ్ల ఉద్యమం
సాక్షి, న్యూఢిల్లీ : ఆవులను ప్రేమించడంలో, గౌరవించడంలో బహూశ భారత్ తర్వాత ప్రపంచంలో రెండో దేశం స్విడ్జర్లాండే కావచ్చు. వారి జాతీయ చిహ్నం కూడా ఆవులే. ఆవుల విషయంలో అక్కడి రైతులకు ఓ ఆటవిక ఆనవాయితీ ఉంది. వారు ఓ దశలో ఆవుల కొమ్ములను నాటు పద్ధతిలో కత్తిరించి వేస్తారు. స్విడ్జర్లాండ్ మొత్తం మీద 80 శాతం ఆవులకు కొమ్ములుండవు. ఈ అనాచారం ఎందుకొచ్చిందో వారికి కూడా తెలియదుగానీ, కొమ్ములుండడం వల్ల గోశాలలకు స్థలం ఎక్కువ అవసరం పడుతుందని, కొమ్ముల వల్ల ఆవులు కోపతాపాలకు గురవుతాయని, పరస్పరం పొడుచుకుంటాయని, అప్పుడప్పుడు వాటిని సాదుతున్న రైతులనే పొడిచే ప్రమాదం ఉందని అక్కడి రైతులు చెబుతున్నారు. ఆవుల కొమ్ములను కత్తిరించడం క్రూరత్వమని నమ్మే ఆర్మిన్ కపాల్ అనే రైతు ఈ అనాచారానికి వ్యతిరేకంగా చట్టం తీసుకరావడానికి పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమాన్ని చేపట్టారు. విజయం సాధించారు. ఫలితంగా ఆయన ప్రతిపాదించిన చట్టంపై రేపు (ఆదివారం) స్విడ్జర్లాండ్ ప్రభుత్వం ‘రిఫరెండమ్ (ప్రజాభిప్రాయ సేకరణ)’ నిర్వహిస్తోంది. రిఫరెండానికి అనుకూలంగా మెజారిటీ ప్రజలు ఓటేస్తే చట్టం ఖాయమవుతుంది. స్విడ్జర్లాండ్ ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశం అవడం వల్ల ఏ అంశంపైనైనా, ఏ పౌరుడైన చట్టాన్ని ప్రతిపాదించవచ్చు. అయితే అందుకు కనీసం లక్ష మంది ప్రజల సంతకాలను సేకరించాల్సి ఉంటుంది. మన రైతు ఆర్మిన్ కపాల్ లక్షా ఇరవై వేల మంది సంతకాలు సేకరించారు. అయితే ఆర్మిన్ ప్రతిపాదించిన చట్టంలో ఆవుల కొమ్ముల కత్తిరింపుపై నిషేధం కోరలేదు. ఆవుల కొమ్ములను కత్తిరించని రైతులకు, రాయితీగా రోజుకు ఒక్కో ఆవుకు ఒక్క స్విస్ ఫ్రాంక్ అంటే, దాదాపు 70 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించాలంటూ చట్టాన్ని ప్రతిపాదించారు. ఈ చట్టం కోసం ఆర్మిన్ దాదాపు ఎనిమిదేళ్లుగా పౌరుల సంతకాల కోసం కృషి చేస్తున్నారు. చట్టం కోసం చేసే ప్రతిపాదనపై స్విస్ పౌరులు గుడ్డిగా సంతకం చేయరు. ప్రతిపాదనతో పూర్తిగా ఏకీభవించినప్పుడే వారు సంతకాలు చేస్తారు. అందుకే లక్షా ఇరవై వేల సంతకాలు సేకరించేందుకు ఆయనకు అంతకాలం పట్టింది. ఆజానుభావుడిలా కనిపించే ఆర్మిన్కు ఇప్పుడు 67 ఏళ్లు. బవురు గడ్డంతో కనిపించే ఆర్మిన్ రకరకాల దుస్తులు, పలు రకాల టోపీలతో ఆకర్షణీయంగా కనిపిస్తాడు. ‘మేము ఆవులను ప్రేమిస్తాం, వాటిని తింటాం’ ‘ఆవు కొమ్ములను కత్తిరించడం క్రూరత్వమని నమ్మే మీరు, ఆవు మాంసాన్ని ఎలా తింటారు? అది క్రూరత్వం కాదా?’ అని జర్మనీ జర్నలిస్ట్ పీటర్ జాగ్గి (ఆమె భారత దేశంలో ఆవులను పవిత్రంగా చూడడంపై జర్మనీలో ఇటీవల ఓ పుస్తకం రాశారు) ప్రశ్నించగా ‘మేము ఆవులను ప్రేమించేమాట నిజమే. వాటి మాంసాన్ని ఇష్టంగా తినే మాట కూడా నిజమే. కొన్ని ఆవులను కబేళాలకు పంపించకపోతే నేడు స్విడ్జర్లాండ్‌లో మనుషులకన్నా ఆవులే ఎక్కువగా ఉండేవి. ఆవుల సంరక్షణను మనుషులమైన మనం బాగా చూసుకుంటాం కనుక, అవి ఆహారంగా మారి మన రుణం తీర్చుకుంటాయి. ఆవులను గౌరవించడం వల్లనే మా దేశస్థులు విమానాశ్రయాల్లో అతిథులను రికార్డు చేసిన ఆవు శబ్దాలతో ఆహ్వానిస్తారు’ అని ఆర్మిన్ అన్నారు. ఆయన మాటల్లో నిజాయతీ ఉందని, భారత దేశంలో గోమాంసాన్ని నిషేధించడంలో నిజాయితీ లేదని ఆమె ఈ సందర్భంగా ఓ మీడియాతో వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా నేరం చేస్తోంది! ‘నా దష్టిలో ఆవులను అవసాన దశలో కబేళాలకు పంపించడం నేరం కాదు. ఆ దశలో అవి బతికి ఉండడం వల్ల ఎక్కువ బాధను అనుభవించాల్సి ఉంటుంది. గోమాంసాన్ని తినడాన్ని నేరంగా పరిగణించేవారు ఆవు పాలను తాగడం కూడా నేరమే అన్న విషయాన్ని గ్రహించాలి! ప్రకృతి సిద్ధంగా ఆవు పాలనిచ్చేది వాటి సంతానం కోసం. మనుషుల కోసం కాదు. ఈ లెక్కన ప్రపంచమంతా నేరం చేస్తోంది’ అని అమె ‘హోలి కౌవ్స్ ఇండియా (జర్మనీలో)’ పుస్తకంలో వ్యాఖ్యానించారు. -
దడ పుట్టిస్తున్న సైలెన్సర్లు!
మామూలు శబ్దం కాదు.. తుపాకీ నుంచి తూటా దూసుకొచ్చినంత సౌండ్. రాకెట్లాగా నిప్పులు చిమ్ముకుంటూ ప్రయాణం.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగం.. అంతా కుర్రకారే.. రేసుల కోసం.. ప్రత్యేక ఆకర్షణ కోసం.. ప్రజలకు దడ పుట్టిస్తున్నారు. బుల్లెట్ వాహనాలకు వింతైన సైలెన్సర్లను బిగించి రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. తెనాలిలోని ఓ వ్యాపారి తన కుమారుడు బీటెక్ పూర్తి చేసిన ఆనందంలో అతని కోరిక మేరకు బుల్లెట్ కొనిచ్చాడు. అప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి ఓ మెకానిక్ అధిక శబ్దంతో పాటు నిప్పులు చెరిగే సైలెన్సర్లు విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న యువకుడు నేరుగా అక్కడకు వెళ్లి మెకానిక్ కోరినంత డబ్బు ఇచ్చి నిప్పులు చెరిగే సైలెన్సర్‌ను వాహనానికి బిగించుకున్నాడు. దీంతో రాత్రి వేళల్లో ప్రధాన రహదారులపై హల్చల్ చేస్తున్నాడు. నిప్పులు చెరుగుతూ బుల్లెట్ వెళుతుంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ.. రోడ్డు పక్కకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు బైక్ రేసులకు రహస్యంగా వెళ్లడం ప్రారంభించాడు. గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అభివృద్ధి చెందుతున్న గుంటూరు జిల్లాలో గడచిన నాలుగేళ్లలో యువతలో బుల్లెట్ల క్రేజ్ పెరిగింది. అధునాతనంగా తీర్చిదిద్దిన వాహనానికి అదనపు హంగులు కోసం ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలో కొందరు మెకానిక్‌లు వారిదైన శైలిలో యువత మోజును క్యాష్ చేసుకుంటున్నారు. కొందరు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటుంటే మరి కొందరు జిల్లాలోనే నకిలీ సైలెన్సర్లను తయారు చేసి గుట్టుగా విక్రయాలు చేస్తున్నారు. మార్పులు ఇలా... జిల్లా వ్యాప్తంగా గడచిన నాలుగేళ్లలో ప్రతిఏటా సగటున 700 బుల్లెట్ వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి. అధికంగా యువత వాటినే కొనుగోలు చేసేందుకు ఆసకి చూపుతున్నారు. వాహన కొనుగోలు చేసిన అనంతరం బుల్లెట్‌కు నిబంధనల ప్రకారం 70 నుంచి 80 డెసిబుల్స్ లోపు శబ్దం వచ్చే సైలెన్సర్లను ఏర్పాటు చేస్తారు. అయితే వాటిని తొలగించి వాటి స్థానంలో 90 నుంచి 160 డెసిబుల్స్ సౌండ్ వచ్చే వాటిని బిగించుకుని హంగామా సృష్టిస్తున్నారు. అయితే వీటితో పాటు పటాకా పేరుతో నూతనంగా మార్కెట్లోకి మంటలు వచ్చే సైలెన్సర్లు అందుబాటులోకి వచ్చాయి. రకాలను బట్టి రూ.2 వేల నుంచి రూ.28 వేల వరకు మెకానిక్‌లు వసూలు చేస్తున్నారు. వాటితో పాటు అధిక శబ్దం వచ్చే విధంగా హారన్లను బిగిస్తున్నారు. ఇలా అదనపు హంగులను ఏర్పాటు చేసుకుంటున్న యువత రహస్యంగా బైక్ రేస్‌లు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో గత నెలలో విజయవాడలో బైక్ రేస్ నిర్వహిస్తున్న ఆరుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని కొందరు మెకానిక్‌లు తమిళనాడు, తెలంగాణ, కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు నుంచి ఆర్డర్లపై సైలెన్సర్లను తెప్పించి విక్రయిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో నకిలీ సైలెన్సర్ల తయారీ.. ఇదిలా ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాలకు సరిహద్దుగా ఉన్న మంగళగిరి, తాడేపల్లి మండలాలను బైక్ రేసులకు అనువైన ప్రాంతంగా యువత ఎన్నుకొంటోంది. ఈ క్రమంలోనే కొందరు వ్యాపారులు ఏకంగా విజయవాడ, తాడేపల్లి, మంగళగిరితో పాటు తెనాలి, గుంటూరు, నరసరావుపేట ప్రాంతాల్లో నకిలీ సైలెన్సర్లను తయారు చేస్తూ విక్రయిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి తెస్తున్న సైలెన్సర్లు అధిక రేటు కావడంతో యువత తక్కవ ధరకు వచ్చే వాటిని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడకు చెందిన ఓ వ్యాపారి నకిలీలను తనకు నమ్మకమైన మెకానిక్‌లకు మాత్రమే అమ్ముతున్నట్టు సమాచారం. తెనాలిలో ఓ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ కానిస్టేబుల్ చెందిన దుకాణంలో మెకానిక్ విజయవాడ నుంచి సైలెన్సర్లను తెప్పించి మరీ విక్రయిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. భారీ శబ్దం వచ్చే హారన్లు, సైలెన్సర్లను బిగించి వాహనాలతో రోడ్లపై యువత హల్చల్ చేస్తున్నారు. ఫలితంగా తోటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక గుండెపోటు వున్న వారి సంగతి అంతే. ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. రవాణా, పోలీస్, శబ్ద కాలుష్యం శాఖల మధ్య సమన్వయం లోపంతో యువత ఇష్టాను సారంగా రెచ్చిపోతున్నారనే వాదన వినిపిస్తోంది. -
కాలుష్య కారకులకు భారీ జరిమానా..!
న్యూఢిల్లీః రాజధాని నగరంలో కాలుష్య నివారణకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరో అడుగు ముందుకేసింది. కాలుష్యం కోరల్లో విలవిల్లాడుతున్ననగరంలో ఇకపై ధ్వని కాలుష్యాన్ని కూడా అరికట్టేందుకు చర్యలు తీసుకోనుంది. సైలెన్సర్ లేని వాహనాలు నడిపేవారిపై ఆంక్షలు విధించి, కాలుష్య కారకులకు 5000 రూపాయల జరిమానా విధించనుంది. హస్తినలో వాయు కాలుష్యమే కాదు, ధ్వని కాలుష్యం కూడ ఎక్కువేనని గుర్తించిన ఎన్జీటీ.. కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తున్న వ్యక్తులపై కొరడా ఝుళిపించనుంది. సైలెన్సర్ లేని వాహనాలను నడుపుతూ, నగరంలో తీవ్ర శబ్దకాలుష్యాన్ని సృష్టిస్తున్న వారిపై 5000 వేల రూపాయలు జరిమానా వేయాలని ప్రకటించింది. ఎన్జీటీ ఛైర్ పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం.. భరించరాని, నిబంధనలకు విరుద్ధమైన ధ్వని కాలుష్యాన్ని సృష్టించేవారిపై ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మోటార్ వాహనాల చట్టం కింద చలాన్స్ మరియు పెనాల్టీలు విధించినట్లుగానే పర్యావరణ కాలుష్యాన్ని సృష్టించే నేరస్థులు 'పొల్యూటర్ పేస్' (కాలుష్య కారకులు) ఆధారంగా 5000 రూపాయలు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని జస్టిస్ ఎం ఎస్ నంబియార్ దర్శకత్వంతో కూడిన ధర్మాసనం తెలిపింది. అలాగే వాతావరణ పరిహారాన్ని ప్రత్యేక ఖాతాలో జమచేయాలని ట్రాఫిక్ పోలీసులకు గ్రీన్ ప్యానెల్ సూచించింది. నేరస్థులకు నోటీసులు జారీ చేయడంలో ఎన్జీటీని సంప్రదించేందుకు ట్రాఫిక్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. భారీ శబ్దం వచ్చే హారన్స్ తీవ్ర శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తాయన్న ట్రిబ్యునల్.. వాటి వాడకంపై దేశరాజధానిలో నిషేధం విధించింది. వాహనాల్లో హారన్స్ నుంచి వచ్చే శబ్దం కాలుష్యానికి ప్రధాన సమస్య అని, ముఖ్యంగా ఢిల్లీలో ట్రక్కు డ్రైవర్ల వంటివారు మితిమీరి హారన్ మోగించడంతో పాటు, డిటిసి బస్సులతో వచ్చే శబ్దం వల్ల కూడా నగరంలో కాలుష్యం తీవ్రమౌతోందని తెలిపింది. ముఖ్యంగా ఢిల్లీ అధికారులు ఈ కోణంలో దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెంచ్ పేర్కొంది. పర్యావరణ మంత్రిత్వశాఖ, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసి, నగరంలో శబ్దకాలుష్యాన్ని నివారించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సూచించింది. -
బిగ్ (హర్న్స్) రెడ్907
ఫొటో చూడగానే అర్థమైపోలే.. దీని ప్రత్యేకత ఏమిటో.. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన కొమ్ములు కలిగిన ఎద్దు. పేరు బిగ్ రెడ్907. నివాసం అమెరికాలోని టెక్సాస్. రెండు కొమ్ముల పొడవు ఈ మూల నుంచి ఆ మూలకు లెక్కేస్తే.. 115.6 అంగుళాలు(9.6 అడుగులు) ఉంటుంది. -
కొమ్ములు తిరిగిన రికార్డు
తిక్క లెక్క పొడవాటి కొమ్ములు తిరిగిన ఈ వృషభరాజం పేరు లేజీ జేస్ బ్లూగ్రాస్. అమెరికాలో ఓక్లహామాలోని ఏరోహెడ్ క్యాటిల్ కంపెనీలో ఉంటుంది. రెండు కొమ్ములను ఒక చివరి నుంచి మరో చివరకు కొలిస్తే, వాటి పొడవు ఏకంగా 293.8 సెంటీమీటర్లుగా తేలింది. ఇంకేం..? ఈ వృషభరాజం గిన్నిస్ బుక్కులోకెక్కింది. పొడవాటి కొమ్ములతో రికార్డు సాధించిన ఈ వృషభరాజాన్ని ఏరోహెడ్ క్యాటిల్ కంపెనీ అపురూపంగా చూసుకుంటోంది. -
కొమ్ములొచ్చాయ్.. నచ్చాయ్!
బుర్రకో టేస్ట్. అందులో మనోడు మరింత డిఫరెంట్. తాజా చిత్రం నేపథ్యంలో తనకు వచ్చిన ‘కొమ్ములు’ తెగ నచ్చేశాయంటున్నాడు హాలీవుడ్ స్టార్ రాడ్‌క్లిఫ్. విషయం ఏమంటే ఈ సినిమా పేరు కూడా అదే.. ‘హార్న్స్’. ఈ కుర్ర హీరోకే కాదు... అతని గర్ల్‌ఫ్రెండ్ ఎరిన్ డార్కేకు కూడా బాగా నచ్చాయట. ఈ కొమ్ములతో రాడ్ భలే ముచ్చటగా ఉన్నాడంటూ చూసి మురిసిపోతుందట. ఈ రెండు కొమ్ములు మెరుస్తూ... కలర్ఫుల్గా ఉన్నాయని తనకు తానే గొప్పగా చెప్పేసుకొంటున్నాడు రాడ్.