hostels in
-
విద్యార్థి హాస్టళ్లు, పీజీలకు పెరుగుతున్న గిరాకీ
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల వసతి గృహాలకు డిమాండ్ పెరుగుతోంది. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులకు మెట్రో నగరాలకు వలస వస్తుంటారు. ప్రభుత్వ నూతన విద్యా విధానాలు, వినూత్న సాంకేతికత కారణంగా ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యార్థుల వలసల వృద్ధికి ప్రధాన కారణమని కొలియర్స్ ఇండియా అడ్వైజరీ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వప్నిల్ అనిల్ తెలిపారు. క్యాంపస్లు, హాస్టళ్లు, పీజీ గృహాలలో అపరిశుభ్రత, భద్రత కరువు, ఎక్కువ అద్దెలు వంటి రకరకాల కారణాల వల్ల స్టూడెంట్ హౌసింగ్ విభాగం ఇప్పటివరకు ఈ రంగం అసంఘటితంగా, నియంత్రణ లేకుండా ఉంది. ఒకే వయసు వ్యక్తులతో కలిసి ఉండటం, ఆధునిక సౌకర్యాలు, మెరుగైన ప్రయాణ వసతులతో సులువైన రాకపోకలు, రోజువారీ కార్యకలాపాలలో సహాయం వంటి రకరకాల కారణాలతో యువతరం వసతి గృహాలలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. -
వసతిగృహాల్లో బయోమెట్రిక్ విధానం
బీసీ సంక్షేమశాఖ డీడీ చినబాబు భానుగుడి (కాకినాడ) : బీసీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు, వార్డెన్ల గైర్వాజరును తగ్గించేందుకు త్వరలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్టు డి.డి.చినబాబు తెలిపారు. వసతిగృహాల్లో బయోమెట్రిక్ వి«ధానానికి సంబంధించి సోమవారం వార్డెన్లతో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 82 బీసీ సంక్షేమ వసతిగృహాల్లో ఈ విధానం అమలుకానుందన్నారు. ఈ వసతిగృహాల్లో 5వేలకు మందికి పైగా విద్యార్థులు ఉన్నారన్నారు. ఈ విధానంపై వార్డెన్లకు అవగాహనా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల, వార్డెన్ల హాజరును బయోమెట్రిక్ ద్వారా ఎప్పటికప్పుడు జిల్లా కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు.