Housekeeping
-
ఆసుపత్రిలో మహిళపై వార్డ్బాయ్ అత్యాచారం
హైదరాబాద్: ప్రైవేట్ ఆసుపత్రిలో హౌస్‌కీపింగ్ పనులు నిర్వహించే మహిళపై వార్డ్బాయ్ అత్యాచారం చేసిన ఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కసపరాజు శ్రీనివాస్ కథనం ప్రకారం.. అంబర్‌పేట, అలీకేఫ్ ప్రాంతానికి చెందిన మహిళ(43) దిల్సుఖ్నగర్ నిఖిల్ ఆసుపత్రిలో రెండేళ్లుగా (హౌస్‌కీపింగ్) పని చేస్తోంది. ఆమెకు భర్త, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈనెల 21న బుధవారం రాత్రి 8.30కి క్యాషియర్ ఫోన్ చేసి నైట్ డ్యూటీకి ఉందని చెప్పడంతో రాత్రి 9 గంటలకు ఆమె విధులకు హాజరైంది. జగిత్యాలకు చెందిన మారుతి సందీప్(26) పురానాపూల్‌లో నివాసం ఉంటూ నిఖిల్ ఆసుపత్రిలో రాత్రిపూట వార్డ్ బాయ్‌గా పని చేస్తున్నాడు. 21న రాత్రి నైట్ డ్యూటీకి హాజరైన అతను రెండో అంతస్తులో గదిని శుభ్రం చేయడానికి వెళ్లిన మహిళ వెనుకే వెళ్లి తలు పు వేశాడు. ఆమె తప్పించుకొనేందుకు వెళ్లేందుకు యతి్నంచగా జుట్టుపట్టుకుని లాగి బలవంతం చేశాడు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయపడ్డ బాధితురాలు ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకొని శుక్రవారం మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు పరారీలో ఉన్నాడని ఇన్స్పెక్టర్ తెలిపారు. పోలీసులు ఫోన్ చేసి చెప్పే వరకు తమకు ఈ విషయం తమ దృష్టికి రాలేదని ఆసుపత్రి మేనేజర్ శ్రవణ్ తెలిపారు. -
హౌస్ కీపర్‌ని పెళ్లి చేసుకున్న డాక్టర్
ఓ పాకిస్తానీ జంట వింత ప్రేమ కథ. చాలా వరకు ప్రేమ కథల్లో తల్లిదండ్రులు అంగీకరించకపోవడం లేదా వేర్వేరు మతాలు లేదా వేరే వర్గం ప్రేమకి అడ్డంకిగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ జంట మధ్య ప్రొఫెషన్ పరంగానే చాలా వ్యత్యాసం ఉంది. వాళ్లు ఎలా ప్రేమించుకున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి డాక్టర్, అబ్బాయి హౌస్ కీపర్‌గా పనిచేస్తున్నాడు. అసలేం జరిగిందంటే... పాకిస్తాన్‌కి చెందిన కిశ్వర్ సాహిబా ఎంబీబీఎస్ చదువుకున్న వైద్యురాలు. ఆమె పనిచేసే ఆస్పత్రిలోనే గదులు శుభ్రం చేసి టీలు అందించే షాహిద్‌ని ప్రేమించింది. ఒక రోజు వైద్యురాలు కిశ్వర్ అతడి ఫోన్ నెంబర్ని అడిగింది. ఆ తర్వాత వారు క్రమం తప్పకుండా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. హఠాత్తుగా ఒకరోజు కిశ్వర్ షాహిదాకి ప్రపోజ్ చేసింది. ఒక్కసారిగా ఆమె అలా అడిగేటప్పటికీ షాహిదా షాక్‌కి గురవ్వడమే కాదు దెబ్బకి జ్వరం కూడా వచ్చేసింది. కొద్ది రోజుల్లనే వారిద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు. ఐతే ఆమె వివాహాన్ని ఆమె స్నేహితులు, బంధువులు వ్యతిరేకించారు. పైగా ఆమెను ఇది చాలా పిచ్చి నిర్ణయం అంటూ తిట్టడం మొదలు పట్టారు. దీంతో ఆమె ఉద్యోగాన్ని సైతం వదిలేసింది. ఇప్పుడు ఈ జంట కొత్తగా ఒక క్లినిక్‌ని తెరవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు అందం అనేది చూసేవారి దృష్టిని బట్టి ఉంటుంది, ఇది అద్భుతమైన ప్రేమ కథ అని ఆ జంటని ప్రశంసిస్తున్నారు. (చదవండి: స్వీట్ బాక్స్ లేయర్ల మధ్య అరకోటిపైనే అక్రమ రవాణ!.. వీడియో వైరల్) -
ఏపీ సచివాలయంలో వేధింపుల పర్వం
-
రైల్వేలో హౌజ్ కీపింగ్‌కు ప్రత్యేక విభాగం
న్యూఢిల్లీ: రైళ్లలో, ప్లాట్‌ఫామ్‌లపై శుభ్రతాపరమైన కార్యక్రమాల నిర్వహణ కోసం భారతీయ రైల్వే ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో పరిశుభ్రత, ఆరోగ్యకర ప్రమాణాలు పాటించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ హౌజ్ కీపింగ్ పనులు వేర్వేరు విభాగాలు చేస్తున్నాయి. దీనివల్ల శుభ్రతాపరమైన నాణ్యతా ప్రమాణాల నిర్వహణలో పరిమితులు ఏర్పడటంతో పాటు, ఈ విభాగంలో ఆధునిక పద్దతులను వినియోగించడం సాధ్యం కాలేదని గురువారం రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతానికి ఈ నూతన సమగ్ర హౌజ్ కీపింగ్ విభాగం సేవలు ఉత్తర, దక్షిణ మధ్య, దక్షిణ రైల్వే జోన్లలో ప్రారంభమవుతాయన్నారు. ప్రస్తుతం రాజధాని, శతాబ్ది, దురంతో సహా 540 రైళ్లలో 'ఆన్‌బోర్డ్ హౌజ్ కీపింగ్' సేవలు అందుబాటులో ఉన్నాయి. రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫామ్‌లు, వెయిటింగ్ రూమ్‌లు, రైల్వే బోగీలను శుభ్రపరచడం మొదలైన పనులు హౌజ్ కీపింగ్ విభాగం చేస్తుంది. -
పరాయి దేశంలో వలస మహిళ ఆక్రందన
కాళ్ల : ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన ఒక మహిళ అక్కడ కష్టాలపాలైంది. తిరిగి ఇండియాకు రావడానికి సరైన ధ్రువపత్రాలు లేక ఇబ్బందులు పడుతోంది. అధికారులు తన కష్టాన్ని అర్థం చేసుకుని తాను ఇండియాకు వచ్చే ఏర్పాట్లు చేయాలని ఆమె వేడుకుంటోంది. ఈ వైనంపై గల్ఫ్‌లోని ‘టైమ్స్ ఆఫ్ ఒమన్’ అనే పత్రిక కథనం ప్రచురించింది. వివరాలిలా ఉన్నాయి.. కాళ్ల మండలం కోనలపల్లె గ్రామానికి చెందిన ఉల్లూరి బేబిరాణి గల్ఫ్‌లోని ఒమన్ దేశానికి సుమారు ఐదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం వెళ్లింది. అక్కడ ఒక ఇంట్లో హౌస్ కీపింగ్ పనులు నిర్వర్తిస్తోంది. తమిళనాడుకు చెందిన శక్తిదాసన్ కూడా ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు. అక్కడ బేబిరాణికి శక్తిదాసన్తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహానికి చట్టబద్ధత లేదు. తదనంతరం వీరు ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. వీరికి వివాహ ధ్రవపత్రాలు లేకపోవడంతో పురుడు సమయంలో ఆసుపత్రికి వెళ్లలేకపోయారు. ఇద్దరు పిల్లలు సాధారణ ప్రసవం ద్వారానే జన్మించారు. అందులో మొదటి బిడ్డ వికలాంగుడు. బేబిరాణి వయసు 28 సంవత్సరాలు కాగా ఇద్దరి పిల్లల వయసు 2, 4 సంవత్సరాలు. ప్రస్తుతం ఆమె పూర్తిగా అనారోగ్యం పాలై మంచాన పడింది. ఆమె భర్త.. పిల్లలను, ఆమెను పోషించడం కష్టంగా మారింది. ఆమె అనారోగ్యానికి డబ్బులు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతున్నాయి. ఆమెను ఇండియా తీసుకొద్దామంటే పాస్‌పోర్టు ఎక్కడో పోయింది. దీంతో ఆమె భర్త భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. అయితే ఆమె భారతీయురాలనే ధ్రువపత్రం ఉంటేనే ఆమెను, పిల్లలను ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేస్తామని అక్కడి అధికారులు తెలిపారు. శక్తిదాసన్కు పాస్‌పోర్టు ఉన్నా బేబిరాణికి పాస్‌పోర్టు లేకపోవడంతో అందరూ అక్కడే ఉండిపోవలసి వచ్చింది. అయితే తన భార్యను, పిల్లలను ఇండియాకు తీసుకెళ్లి పోషించుకుంటానని తన భార్య ఇండియాకు వెళ్లాలంటే ఇండియన్ నేటివిటీ సర్టిఫికెట్ కావలసి ఉందని అధికారులు తాము ఇండియాకు వచ్చేలా సహాయం చేయాలని శక్తిదాసన్ కోరుతున్నాడు. తన భార్య తల్లిదండ్రులతోపాటు ఉన్న రేషన్‌కార్డు జిరాక్స్ కాపీ ఉందని, దాని ఆధారంగా తనకు స్థానిక అధికారులు నేటివిటీ పంపిస్తే భారత రాయబార కార్యాలయ అధికారులు తమను ఇండియాకు పంపించే అవకాశం ఉందని శక్తిదాసన్ వేడుకుంటున్నాడు. నేటివిటీ సర్టిఫికెట్ ఇస్తాం : వి.జితేంద్ర తహసిల్దార్ ఈ విషయాన్ని తహసిల్దార్ వి.జితేంద్ర దృష్టికి తీసుకెళ్లగా గల్ఫ్‌దేశం ఒమన్‌లో అనారోగ్యం పాలైన బేబిరాణి ఈ దేశానికి రావడానికి అన్ని విధాలా సహకరిస్తామని, తగిన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేస్తే నేటివిటీ సర్టిఫికెట్ అందజేస్తామని, ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. -
హౌస్ కీపింగ్ మాయాజాలం
సాక్షి,తిరుమల: తిరుమలలో కాటేజీల పరిశుభ్రత విషయంలో ప్రైవేట్ కంపెనీలు చేతులెత్తేశాయి. టీటీడీ విధించిన నిబంధనలు పాటించడం లేదు. హౌస్‌కీపింగ్ పేరుతో ప్రైవేట్ కంపెనీలకు ఏటా రూ.2కోట్లు కేటాయించే సంబంధిత అధికారులు గదుల శుభ్రత తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. నాలుగు కంపెనీలకు ఏటా రూ.2 కోట్లపైగా కాంట్రాక్టు తిరుమలలో మొత్తం 6,800 గదులున్నాయి. వీటిని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ప్యాకేజీల కింద టీటీడీ విభజిచింది. వాటి శుభ్రత కోసం బీవీజీ (వెస్ట్ ), క్రిస్టల్ (నార్త్), పనోరమ (ఈస్ట్), ఆల్సర్వీస్ (సౌత్) ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. ఇందుకోసం ఏటా రూ.2 కోట్లకుపైగా కేటాయిస్తోంది. టీటీడీ నిబంధనల ప్రకారం ఆయా ప్రాంతాల్లోని కాటేజీలు, అతిథి గృహాల్లోని గదుల్లో పరిశుభ్రత చర్యలు, నిర్వహణ అంతా ఆ కంపెనీల నిర్వాహకులే చూడాలి. నిబంధనలకు పాతర గదుల శుభ్రత విషయంలో సంబంధిత ప్రైవేట్ సంస్థలు టీటీడీ నిబంధనల్ని ఏమాత్రం పాటించడం లేదన్న విమర్శలున్నాయి. ఖాళీ అయిన గదిని తిరిగి కేటాయించేందుకు అనువైన మార్గం కల్పించడంలో విఫలమవుతున్నాయి. గది, మరుగుదొడ్డి, స్నానాల గది శుభ్రత వినియోగించాల్సిన పరికరాలు, మాఫ్, సువాసనలతో కూడిన ఫినాయిల్, నాప్తలిన్ ఉండలు కూడా అందుబాటులో ఉంచడం లేదు. విరిగిన కొళాయిలు, లీకేజీ బెడత, బొద్దింకలు, నల్లుల గోల, పేరుకుపోయిన దుమ్ము, ధూళితో నిండిన గదులను వంద శాతం శుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకు భిన్నంగా కాటేజీల్లోని గదులు అపరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి. అదేమని కార్మికులను అడిగితే సంబంధిత కంపెనీలు అవసరమైన వస్తువులు, పదార్థాలు ఇవ్వడం లేదని కుండబద్ధలు కొడుతున్నారు. గదులు నిర్వహణ చేసే టీటీడీ రిసెప్షన్ సిబ్బంది కూడా సంబంధిత కంపెనీల ప్రతినిధులను నిలదీసిన సందర్భాలూ ఉన్నాయి. వీఐపీలు బస చేసే ప్రాంతాల్లో అన్నీ ఉన్నా..సామాన్య భక్తులు బసచేసే గదుల్లో మాత్రం పారిశుధ్యం బాగోలేదు. ఆచరణలోలేని కమిటీలు నాలుగు ప్యాకేజీల్లోని గదుల శుభ్రతను ఎప్పటికప్పుడు పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు రిసెప్షన్, హెల్త్, ఎఫ్ఎంఎస్ ఇంజినీరింగ్ విభాగాలతో కమిటీలు వేశారు. ఆచరణలో మాత్రం కమిటీలు పనిచేయడం లేదనే విమర్శలున్నాయి. గదుల్లో పారిశుధ్య లోపాలను గుర్తించి సంబంధిత కంపెనీల నుంచి జరిమానా వసూలు చేయాల్సిన కమిటీలు ఏమాత్రం పట్టీపట్టనట్టుగా ఉండడంతో సంబంధిత పారిశుద్ధ్య పనులు దక్కించుకున్న కంపెనీలకు కలసి వస్తోంది.