WardBoy Molestation On HouseKeeping Woman In Malakpet Private Hospital - Sakshi
Sakshi News home page

Hyderabad Crime: ఆసుపత్రిలో మహిళపై వార్డ్‌బాయ్‌ అత్యాచారం

Sep 24 2022 8:16 AM | Updated on Sep 24 2022 9:30 AM

WardBoy Molestation On HouseKeeping Woman - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్: ప్రైవేట్‌ ఆసుపత్రిలో హౌస్‌కీపింగ్‌ పనులు నిర్వహించే మహిళపై వార్డ్‌బాయ్‌ అత్యాచారం చేసిన ఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ కసపరాజు శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. అంబర్‌పేట, అలీకేఫ్‌ ప్రాంతానికి చెందిన మహిళ(43) దిల్‌సుఖ్‌నగర్‌ నిఖిల్‌ ఆసుపత్రిలో రెండేళ్లుగా (హౌస్‌కీపింగ్‌) పని చేస్తోంది. ఆమెకు భర్త, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈనెల 21న బుధవారం రాత్రి 8.30కి  క్యాషియర్‌ ఫోన్‌ చేసి నైట్‌ డ్యూటీకి ఉందని చెప్పడంతో రాత్రి 9 గంటలకు ఆమె విధులకు హాజరైంది.

జగిత్యాలకు చెందిన మారుతి సందీప్‌(26) పురానాపూల్‌లో నివాసం ఉంటూ నిఖిల్‌ ఆసుపత్రిలో రాత్రిపూట వార్డ్‌ బాయ్‌గా పని చేస్తున్నాడు. 21న రాత్రి నైట్‌ డ్యూటీకి హాజరైన అతను రెండో అంతస్తులో గదిని శుభ్రం చేయడానికి వెళ్లిన మహిళ వెనుకే వెళ్లి తలు పు వేశాడు. ఆమె తప్పించుకొనేందుకు వెళ్లేందుకు యతి్నంచగా జుట్టుపట్టుకుని లాగి బలవంతం చేశాడు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయపడ్డ బాధితురాలు ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకొని శుక్రవారం మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు పరారీలో ఉన్నాడని  ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. పోలీసులు ఫోన్‌ చేసి చెప్పే వరకు తమకు ఈ విషయం తమ దృష్టికి రాలేదని ఆసుపత్రి మేనేజర్‌ శ్రవణ్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement