హచ్పీ స్లేట్ వాయిస్ టాబ్...
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రీ ఎంట్రీ చేస్తూ ప్రముఖ కంప్యూటర్ తయారీ సంస్థ హ్యూలెట్ ప్యాకర్డ్ తాజాగా హెచ్‌పీ స్లేట్ 7 వాయిస్ టాబ్లెట్‌ను విడుదల చేసింది. స్లేట్ 6 గత నెలలోనే మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే. ఏడు అంగుళాల స్క్రీన్ సైజు, 1280 బై 880 రెజల్యూషన్ దీని సొంతం.
దాదాపు 25 గిగాబైట్ల ఉచిత క్లౌడ్ స్టోరేజీ, హెచ్‌పీ ఈ ప్రింట్, కనెక్టడ్ ఫొటో, ఫైల్ మేనేజర్, కనెక్టడ్ మ్యూజిక్ వంటి ఉచిత అప్లికేషన్లు (మూడు నెలల అన్లిమిటెడ్ డౌన్లోడింగ్)లు దీని ప్రత్యేకతలు. డ్యుయెల్ సిమ్‌లను సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఈ ఫాబ్లెట్లో సాధారణ సైజు సిమ్ ఒకదాన్ని మాత్రమే వాడవచ్చు. రెండోదాన్ని మైక్రోసిమ్‌గా వాడాల్సి ఉంటుంది.
ప్రాసెసర్: 1.2 గిగాహెర్ట్జ్, క్వాడ్‌కోర్
ప్రధాన కెమెరా: 5 మెగాపిక్సెల్స్
ఫ్రంట్ కెమెరా: 2 మెగాపిక్సెల్స్
ఆపరేటింగ్ సిస్టమ్: 4.2 జెల్లీబీన్
ర్యామ్: 1 జీబీ
మెమరీ: 16 జీబీ ఇంటర్నల్
(మైక్రోఎస్డీ కార్డుతో 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు)
బ్యాటరీ: 4100 ఎంఏహెచ్