చైనా కంపెనీకి గట్టి షాకిచ్చిన ఐటీ శాఖ..!
ప్రముఖ చైనీస్ టెలికాం కంపెనీ హువావేకు ఆదాయ పన్నుశాఖ గట్టి షాక్‌ను ఇచ్చింది. దేశవ్యాప్తంగా కంపెనీకి చెందిన ఆయా ప్రాంతాల్లో ఐటీ శాఖ దాడులను జరిపినట్లు తెలుస్తోంది.
ముప్పేట దాడి...!
పన్ను ఎగవేత విచారణలో భాగంగా హువావేకి చెందిన పలు ప్రాంగణాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. ఢిల్లీ, గురుగ్రామ్ (హర్యానా), కర్ణాటకలోని బెంగళూరు ప్రాంగణాల్లో మంగళవారం దాడులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. విదేశీ లావాదేవీలపై పన్ను ఎగవేత దర్యాప్తులో భాగంగా పలు ఆర్థిక పత్రాలను, రికార్డులను అధికారులు పరిశీలించి అందులో కొన్ని రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా భారత నియమాలకు కట్టుబడి ఉన్నామని హువావే ఒక ప్రకటనలో తెలిపింది.
5జీ నెట్వర్క్ ట్రయల్స్‌కు దూరంగా..!
పన్నుఎగవేత విషయంలో హువావేపై ఆరోపణలను రావడంతో కేంద్ర ప్రభుత్వం 5G సేవల కోసం హువావేను ట్రయల్స్ నుంచి దూరంగా ఉంచింది. అయినప్పటికీ, టెలికాం ఆపరేటర్లు తమ నెట్‌వర్క్‌లను నిర్వహించడానికి వారి పాత ఒప్పందాల ప్రకారం హువావే, ZTE నుంచి టెలికాం గేర్‌ను సోర్స్ చేయడానికి అనుమతించబడ్డారు, అయితే టెలికమ్యూనికేషన్ సెక్టార్‌పై నేషనల్ సెక్యూరిటీ డైరెక్టివ్ ప్రకారం ఏదైనా కొత్త వ్యాపార ఒప్పందంలోకి వచ్చే ముందు వారికి ప్రభుత్వం ఆమోదం అవసరం. కాగా గత ఏడాది షావోమీ, ఒప్పో చైనీస్ కంపెనీలపై ఆదాయపన్ను శాఖ సోదాలను నిర్వహించింది. ఆయా కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను రూ. 6500 కోట్లను ఐటీ శాఖ జరిమానా వేసింది
చదవండి: ‘అంతా బోగస్ లెక్కలు..! మమ్మల్ని నట్టేంటా ముంచేసింది..’ యాపిల్‌కు గట్టి షాకిస్తూ కోర్టుకు