చేతలతో సాయం చేయండి: పవన్ కళ్యాణ్
రాజమండ్రి : హదూద్ తుఫాను వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం రాజమండ్రి చేసుకున్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ దివిసీమ తర్వాత ఇదే అతి పెద్ద తుఫాను అన్నారు. విశాఖ వెళ్లి బాధితులను పరామర్శించనున్నట్లు పవన్ తెలిపారు. బాధితులకు అవసరమైన సాయం అందిస్తామన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వీఐపీలు ఎంత తక్కువ వస్తే అంత మంచిదని పవన్ కళ్యాణ్ అన్నారు.
ప్రతి ఒక్కరూ మాటల్లో కాకుండా చేతల్లో సాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందుచూపు వల్లే నష్టం తగ్గిందని పవన్ అన్నారు. నరేంద్ర మోడీ మాట మీద నిలబడే వ్యక్తి అని ...అందుకే ఇటీవల ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇచ్చినట్లు పవన్ తెలిపారు. కేంద్ర మంత్రులతో మాట్లాడి మరింత సాయం కోరతామని ఆయన అన్నారు. కాగా రాజ్యసభ సభ్యుడు, సినీనటుడు చిరంజీవి హుదూద్ తుఫాను బాధితులుకు ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు.