Hunting ban
-
నేటి అర్ధరాత్రి నుంచి ‘మత్స్య’ వేట నిషేధం అమలు
సాక్షి, అమరావతి: రెండు నెలల విరామం కోసం బోట్లు తీరానికి చేరుకోనున్నాయి. చేపల పునరుత్పత్తి కోసం 61 రోజుల పాటు అమలు చేయనున్న వేట నిషేధం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు మత్స్యశాఖ కమిషనర్ ఏ సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే బోట్లతో సహా అందులో ఉండే మత్స్యసంపదను స్వాదీనం చేసుకోవడంతో పాటు ఆయా బోట్ల యజమానులు ఏపీ సముద్ర మత్స్య క్రమబద్దీకరణ చట్టం 1994 సెక్షన్ (4)కింద శిక్షార్హులని తెలిపారు. జరిమానా విధించడమే కాకుండా డీజిల్ ఆయిల్ రాయితీతో పాటు అన్ని రకాల సౌకర్యాలను నిలిపేస్తామని పేర్కొన్నారు. నిబంధనలు అమలు చేసేందుకు మత్స్యశాఖ, కోస్ట్‌గార్డు, కోస్టల్ సెక్యురిటీ, నేవీ, రెవెన్యూ అధికారులతో కూడిన బృందాలు నిరంతరం గస్తీ నిర్వహిస్తారని తెలిపారు. ఐదేళ్లలో రూ.538 కోట్ల మత్స్యకార భృతి రాష్ట్రంలో తడ మొదలుకుని ఇచ్చాపురం వరకు 974కిలో మీటర్ల మేర విస్తరించిన సముద్ర తీరంలో 555 మత్స్యకార గ్రామాల్లో 8.50 లక్షల మంది మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వారిలో 1.60 లక్షల కుటుంబాలు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. డీజిల్ సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9కు పెంచడంతో ఏటా వేటకు వెళ్లే బోట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం బోట్ల సంఖ్య 2019–20లో 14,229 బోట్లు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య ఏకంగా 29,964కు చేరింది. వీటిలో 1,610 మెకనైజ్డ్, 22,011 మోటరైజ్డ్, 6,343 సాంప్రదాయ బోట్లున్నాయి. వీటిపై వేట సాగించే మత్స్యకార కుటుంబాలకు వేట విరామ సమయంలో రూ.4 వేల చొప్పున ఇచ్చే వేట నిషేధ భృతిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.10 వేలకు పెంచింది. పైగా ఈ మొత్తాన్ని నిషేధ కాలం ముగియకుండానే ప్రతీ ఏటా మే నెలలోనే వారి ఖాతాలకు నేరుగా జమ చేస్తూ గంగపుత్రులకు అండగా నిలిచింది. టీడీపీ ఐదేళ్లలో 3 లక్షల మందికి రూ.104.62 కోట్ల భృతిని అందిస్తే, గడిచిన ఐదేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం 5.38లక్షల మందికి రూ.538.01 కోట్ల భృతిని అందించింది. అలాగే డీజిల్ సబ్సిడీ కింద టీడీపీ ఐదేళ్లలో రూ.59.42 కోట్లు అందించగా, ఈ ప్రభుత్వ హయాంలో రూ.148 కోట్లు అందించింది. ఐదేళ్లూ మత్స్యకార భృతినందుకున్నా.. నాకు తెప్పనావ ఉంది. 20 ఏళ్లుగా ఈ నావే జీవనాధారం. గతంలో వేట విరామ çసమయంలో జీవనాధారం లేక చాలా ఇబ్బంది పడేవాళ్లం. కానీ ప్రస్తుతం భృతిని రూ.10వేలకు పెంచడమే కాదు నిషేధ సమయంలోనే అందిస్తున్నారు. ఐదేళ్లుగా మత్స్యకార భృతిని అందుకున్నా. – కోడా లక్ష్మణ్, బోటు యజమాని, దొండవాక, అనకాపల్లి జిల్లా మత్స్యకారులంతా జగన్ వెంటే.. స్వాతం్రత్యానంతరం మరే ప్రభుత్వం చేయలేని రీతిలో మత్స్యకారుల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలా పాటుపడిన మరో నాయకుడు లేరనే చెప్పాలి. వేట నిషేధ భృతిని రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచడమే కాదు..ఏటా క్రమం తప్పకుండా నిషేధ సమయంలోనే అర్హులైన ప్రతీ మత్స్యకారుని అందించి అండగా నిలిచారు. మత్స్యకారులతో పాటు ఆక్వారైతులు జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటారు. – లంకె వెంకటేశ్వరావు, మెకనైజ్డ్ బోటు యజమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు, కృష్ణా జిల్లా -
మే రెండోవారంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా
సాక్షి, అమరావతి: రెండునెలల విరామం కోసం బోట్లు తీరానికి చేరుకుంటున్నాయి. చేపల పునరుత్పత్తి కోసం సముద్రంలో 61 రోజుల పాటు అమలు చేయనున్న వేట నిషేధం శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. వేట నిషేధాన్ని పక్కాగా అమలు చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం వచ్చేనెల రెండోవారంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా (వేటనిషేధ భృతి) పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వేట విరామాన్ని ఉల్లంఘించిన వారి బోట్లను సీజ్ చేయడమేగాక సంక్షేమ పథకాలు కట్ చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో తడ మొదలు ఇచ్ఛాపురం వరకు 974 కిలోమీటర్ల మేర విస్తరించిన సముద్రతీరంలో 555 మత్స్యకార గ్రామాల్లో 8.50 లక్షల మత్స్యకార కుటుంబాలున్నాయి. వీటిలో 1.60 లక్షల కుటుంబాలు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఏటా పెరుగుతున్న బోట్లు డీజిల్ సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9కి పెంచడంతో ఏటా వేటకు వెళ్లే బోట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం బోట్ల సంఖ్య 2019–20లో 14,229 బోట్లు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య ఏకంగా 29,964కు చేరింది. వీటిలో 1,610 మెకనైజ్డ్, 22,011 మోటరైజ్డ్, 6,343 సంప్రదాయ బోట్లున్నాయి. వీటిపై వేట సాగించే మత్స్యకార కుటుంబాలకు వేట విరామ సమయంలో రూ.4 వేల చొప్పున ఇచ్చే వేటనిషేధ భృతిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.10 వేలకు పెంచింది. పైగా ఈ మొత్తాన్ని నిషేధకాలం ముగియకుండానే బ్యాంకు ఖాతాలకు నేరుగా జమచేస్తూ గంగపుత్రులకు అండగా నిలుస్తోంది. టీడీపీ ఐదేళ్లలో 3 లక్షల మందికి రూ.104.62 కోట్ల భృతిని అందించగా, గడిచిన 4 ఏళ్లలో ఈ ప్రభుత్వం 4.14 లక్షల మందికి రూ.414.49 కోట్ల భృతిని అందించింది. అదేరీతిలో ఈ ఏడాది కూడా మే రెండో వారంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అర్హుల గుర్తింపునకు బృందాలు ఆర్బీకేల్లో పనిచేసే గ్రామ మత్స్య సహాయకునితో పాటు వలంటీర్, సాగరమిత్రలతో ఏర్పాటు చేసిన బృందాలతో ఈ నెల 17వ తేదీన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టనుంది. ఆరోజు తీరంలో లంగరేసిన బోట్లను ఈ బృందాలు పరిశీలించి వివరాలు నమోదు చేస్తాయి. గుర్తింపు సమయంలో బోటు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఫిషింగ్ లైసెన్సు, ఆధార్, రైస్‌కార్డుతోపాటు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. 18వ తేదీ గ్రామ సచివాలయ డిపార్టుమెంట్ రూపొందించే సాప్ట్‌వేర్‌లో అప్లోడ్ చేస్తారు. ఈ డేటా ఆధారంగా ఆరుదశల వెరిఫికేషన్ తర్వాత అర్హుల జాబితాలను సామాజిక తనిఖీకి ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. అనర్హత పొందిన వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించి క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హత ఉంటే జాబితాల్లో చేర్చి తుది జాబితాలను సిద్ధం చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తిచేసేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేసింది. అర్హులు వీరే.. ♦ 18 మీటర్లకుపైన పొడవు ఉండే మెకనైజ్డ్ బోట్లకు యజమాని కాకుండా 10 మంది, 18 మీటర్ల లోపులో ఉండే మోటరైజ్డ్ బోట్లకు యజమాని కాకుండా ఎనిమిదిమంది, ఇతర మోటరైజ్డ్ బోట్లకు యజమానితో కలిపి ఆరుగురు, సంప్రదాయ, నాన్ మోటరైజ్డ్ బోట్లకు యజమానితో సహా ముగ్గురు చొప్పున అర్హులు. ♦ వయసు 18–60 ఏళ్ల మధ్య ఉండాలి. ♦ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో 1.44 లక్షలలోపు ఉండాలి. ♦ సంక్షేమ పథకాలు పొందినవారు, మత్స్యకార పింఛన్ పొందుతున్నవారు, కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఉద్యోగాలు చేస్తున్నవారు. 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట, లేదా రెండు కలిపి 10 ఎకరాలకు మించి భూమి ఉండకూడదు. ♦ అర్బన్ ప్రాంతాల్లో కనీసం వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణానికి మించి ఇల్లు ఉండకూడదు. ఆదాయపన్ను చెల్లింపుదారులై ఉండకూడదు. -
సాపాటు లేదు..సాయం లేదు..
బియ్యం..నిత్యావసరాల ఊసులేదు ఇస్తామన్న రూ.2 వేల జాడలేదు పస్తులతో అలమటిస్తున్న ‘గంగపుత్రులు’ నిద్ర లేచింది మొదలు పొద్దుగుంకే వరకు సముద్రంతో సహజీవనం చేస్తారు. నడి సంద్రంలోకి వెళ్లి వేటాడటం.. తెచ్చిన మత్స్యసంపదను అమ్ముకోవడమే వీరికి తెలిసిన విద్య. వేటకెళ్తేనే వీరికి పూటగడుస్తుంది. వేటకెళ్లని నాడు పస్తులే. ఏటా ఏప్రిల్-మే నెలల్లో సంతానోత్పత్తి కాలంలో అమలులోకి వచ్చే వేటనిషేధం వీరి పాలిట ఆశని పాతమే అవుతుంది. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పత్తాలేకుండా పోతే వీరి పరిస్థితి అగమ్య గోచరమే. విశాఖపట్నం: విశాఖ మహానగరంతో పాటు జిల్లాలోని ఎనిమిది మండలాల్లో తీరం ఉంది. 134 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 62 మత్స్యకార గ్రామాలున్నాయి. సుమారు లక్షా 20 వేల మంది మత్స్యకారులున్నారు. వీరిలో సుమారు 35వేలమంది పూర్తిగా చేపలవేటే జీవనోపాధిగా జీవిస్తున్నారు. 650 మెక నైజ్డ్ బోట్లు, 1500కు పైగా ఇంజన్ బోట్లు ఉన్నాయి. వందలాదిగా తెప్పలు,నావలు ఉన్నాయి. వేట నిషేధ సమయంలో మెకనైజ్డ్, ఇంజన్ బోట్లు లంగరేయాల్సిందే. మెకనైజ్డ్ బోటుపై 8 నుంచి 10 మంది, ఇంజన్ బోటుపై ఆరు నుంచి ఎనిమిది మంది వరకు మత్స్యకారులు పని చేస్తుంటారు. ఇక పరోక్షంగా మరో 10వేల నుంచి 15వేల మంది వరకు జీవనోపాధి పొందుతుంటారు. ప్రతీ ఏటా ఏప్రిల్-15వ తేదీ నుంచి మే-31వ తేదీ వరకు వేట నిషేధం అమలులో ఉండేది. గతేడాది వరకు 47రోజులు పాటు ఉండే వేటనిషేధ సమయాన్ని ఈ ఏడాది నుంచి ఏకంగా 61రోజులకు పెంచారు. గతంలో నిషేధ సమయంలో కుటుంబానికి 31 కిలోల బియ్యంతో సరిపెట్టేవారు. ఏటా నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకారుల జాబితాలు మారుతుంటాయి. కొన్ని సార్లు పెరుగుతుంటాయి.. మరి కొన్ని సార్లు తగ్గుతుంటాయి. అలాంటిది గతేడాది మంజూరైన సాయం ఈ ఏడాది పంపించడం.. ఈ ఏడాది సాయం వచ్చే ఏడాది పంచిపెట్టడం పరిపాటిగా మారిపోయింది. గతేడాది నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు నేటికీ బియ్యం పంపిణీ జరగలేదు. ఇక ఈ ఏడాది నుంచి నిషేధసమయం పెంచడంతో బియ్యం స్థానంలో నగదు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబానికి రూ.2వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాలోనే జమచేయనున్నారు. నిషేధం అమలు లోకి వచ్చిసగం రోజులు గడిచినా అది ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. మెకనైజ్డ్, ఇంజన్ బోట్లపై ఆధారపడి జీవించే సుమారు ఐదువేల మంది మత్స్యకారులతో పాటు వీటిపై పరోక్షంగా ఆధారపడిజీవించే మరో 15వేల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూర్చే విధంగా రూ.4కోట్లతో జిల్లా మత్స్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆర్థిక లోటు కారణంగా ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. దీంతో సాపాటు లేక..సాయం లేక గంగపుత్రులు ఈ ఏడాది పస్తులతో అలమటించాల్సిన పరిస్థితి దాపురించింది.