husbend died
-
ఇన్సూరెన్స్ డబ్బు కోసం భర్తను హత్య చేసిన భార్య
-
భర్త మరణం .. భార్యపాలిట శాపం
వరంగల్, మామునూరు: రోడ్డు ప్రమాదంలో భర్త మరణించడంతో అత్తింటి వారు ఆస్తి కోసం భార్యను ఇంటి నుంచి గెంటేశారు. తన భర్త పేరిట ఉన్న ఆస్తిని తన కుమారుడి దక్కేవిధంగా న్యాయం చేయాలంటూ అత్తింటి ఎదుట మౌన పోరాటం చేపట్టిన సంఘటన ఖిలా వరంగల్ మండలం ముస్కులపల్లిలో శుక్రవారం జరిగింది. బాధితురాలు, బంధువుల కథనం ప్రకారం.. రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం పంతులపల్లి గ్రామానికి చెందిన ముస్కు సాంబరెడ్డి, సుగుణల కూతురు భవానిని 2008 సంవత్సరంలో ఖిలా వరంగల్ మండలం ముస్కులపల్లికి చెందిన ముస్కుల జయపాల్‌రెడ్డి, శోభ దంపతుల రెండో కుమారుడు రఘపాల్రెడ్డి(23)కు ఇచ్చి వివాహం చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన మూడెకరాల భూమిలో ఈ దంపతులు రూ.25లక్షల వ్యయంతో డెయిరీఫాంను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. ఆ తర్వాత రఘుపాల్రెడ్డికి హన్మకొండ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సేల్స్ మేనేజర్‌గా ఉద్యోగం వచ్చింది. విధి నిర్వహణలో భాగంగా డెయిరీఫాం భవాని అత్తమామలు జయపాల్‌రెడ్డి, శోభలకు అప్పగించి హన్మకొండలో ఆద్దెకుంటున్నారు. ఏప్రిల్ 2017 మాసంలో మామునూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో రఘుపాల్‌రెడ్డి మృతిచెందాడు. కోడలిని అత్తింట్లో వారు దశదిన కర్మవరకు ఉంచి దుఖంలో ఉన్న కోడలిని ఆత్తంటివారు ఇంటి నుంచి గెంటేశారు. పెద్దల సమక్షంలో అనేక సార్లు పంచాయతీ పెట్టించారు. అత్తమామల వేధింపుల భరించలేక మామునూరు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ న్యాయం జరుగలేదు. భర్త రఘుపాల్‌రెడ్డి పేరిట ఉన్న డైయిరీఫాం, మూడెకరాల భూమిని లాక్కోవడమే కాకుండా ఇంటి నుంచి గెంటేశారు. దీంతో తనకు తన కుమారుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ముస్కులపల్లిలో అత్తింటి ఎదుట బాధితురాలు కుమారుడు భావితేజ్రెడ్డి, తన తల్లి సుగణతో కలిసి మౌన పోరాటం చేపట్టింది. ఇది తెలుసుకు న్న అత్తమామ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై యుగేంధర్ చేరుకుని మూడురోజుల్లో ఇంట్లో ఉండేవిధంగా న్యాయం చేస్తానని హ మీ ఇవ్వగా మౌన పోరాటాన్ని విరమించి తన తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. -
27 ఏళ్ల తర్వాత శవమై!!
విధి ఆడిన నాటకంలో ఓ మహిళ భర్త బతికి ఉండగానే వైధవ్యం అనుభవించింది. చిన్నపిల్లలతో ఒంటరి అయిన ఆమె వారి భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడి, పెంచి, పెద్ద చేసింది. ముగ్గురు కుమారుల్లో ఇద్దరికి పెళ్లిళ్లు చేసింది. ఓ మనుమరాలు, ఇద్దరు మనవళ్లతో కాలం గడుపుతోంది. హఠాత్తుగా భర్త ప్రత్యక్షమయ్యాడు. అదీనూ 27 ఏళ్ల తర్వాత శవమై!! ఒక్కసారిగా కుటుంబంలో ఒక్కసారిగా కుదుపు..నాన్న ఎలా ఉంటాడో తెలియని కన్నకుమారులకు ఆనందపడాలో, దుఃఖించాలో తెలియని స్థితి. ఆ శవం చెప్పిన జీవితగాథలోకి వెళితే.. తవణంపల్లె : తమిళనాడు రాష్ట్రం వేలూరు సమీపంలోని ఒడింగళ్కు చెందిన మణి 33 ఏళ్ల క్రితం అరగొండ వచ్చాడు. అరగొండలో కూలీ పనులు చేసుకుని జీవించేవాడు. స్థానికులు చారాల దళితవాడకు చెందిన పునీతతో మణికి వివాహం చేశారు. మణి, పునీత దంపతులకు లవకుమార్ అలియాస్ కుట్టి, శ్రీనివాసులు, మనోహర్ అనే ముగ్గురు కుమారులు సంతానం. భార్య భర్తల మధ్య గొడవ రావడంతో 27 ఏళ్ల క్రితం భార్యను, చిన్న వయస్సులోని ముగ్గురు కొడుకులను వదలి వెళ్లిపోయాడు. పలు ప్రాంతాల్లో గాలించినా ఫలితం శూన్యం. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి దూరమవడంతో పునీతకు దిక్కుతోచలేదు. చిన్న పిల్లలు..ఏ ఆసరా లేకుండా ఎలా బతకాలో తెలియని స్థితి నుంచి అన్నీ తానై, పిల్లల కోసం రెక్కలుముక్కలు చేసుకుంది. పెద్ద కొడుకు లవకుమార్ అలియాస్ కుట్టి పదవ తరగతి వరకు చదివి పాసయ్యాడు. ఇప్పుడతని వయస్సు 30. టెన్త్ ఫెయిలైన రెండో కొడుకు శ్రీనివాసులు వయసు 28. ఇంటర్ వరకు చదివిన మూడో కొడుకు మనోహర్ వయస్సు 26. ఇద్దరు కుమారులకు వివాహమైంది. వారికీ పిల్లలు కలిగారు. అందరూ కూలీ పనులతో జీవనం సాగిస్తున్న వారే.! తన భర్త చనిపోయి ఉంటాడని భావించిన పునీత గుండెను రాయి చేయికుని కుమారులు, వారి పిల్లలతో ప్రస్తుతం కాలం వెళ్లదీస్తోంది. ఈ నేపథ్యంలో, గురువారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ఓ వార్త ఆ కుటుంబాన్ని ఆనంద పడాలో, దుఃఖించాలో తెలియని అలౌకిక స్థితిలో తీసుకెళ్లింది. ‘ఈ మృతుడు ఎవరో?’ శీర్షికతో సాక్షి దినపత్రిలో కథనం ప్రచురితమైంది. వార్తలో వచ్చిన ఫొటో చూసి ఆ కుటుంబం, గ్రామస్తులతో కలిసి చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి పరుగులు తీసింది. 27 ఏళ్ల క్రితం అదృశ్యమైన మణి మృతదేహమది! చిత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందు తూ మరణించాడు. అతను అనారోగ్యం తో ఆస్పత్రిలో చేరినప్పుడు ఇచ్చిన చిరునామాలో అరగొండ తన ఊరు అని పేర్కొన్నాడు. దీంతో ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన సమాచారంతో అరగొండ పరిసర గ్రామాల్లో పోలీసులు ఆరా తీశారు. మణి ఎవరో తమకు తెలియదని గ్రామస్తులు చెప్పారు. దీంతో మణి (60) మృతదేహాన్ని చిత్తూరు మార్చురీ ఉంచారు. మృతుడి సంబంధీకులెవరైనా ఉంటే సంప్రదించాలంటూ పోలీసులు తెలిపిన సమాచారాన్ని సాక్షి ప్రచురించింది. గురువారం ఇది చూసిన లవకుమార్ తన తండ్రిని గుర్తుపట్టాడు. తల్లికి, తన సోదరులకు విషయాన్ని చెప్పాడు. అంతే! వారికిదో పెద్ద షాక్. మాటలు పెగల్లేదు. ఉన్నపళాన చిత్తూరు ఆస్పత్రికి పరుగులు తీశారు. మార్చురీలో అనాథలా పడి ఉన్న మణి మృతదేహాన్ని చూశారు. తన భర్తేనని పునీత సైతం గుర్తు పట్టింది. ఆస్పత్రి వర్గాలను సంప్రదించి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఇదే రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. -
పిల్లలు లేరని దంపతుల ఆత్మహత్యాయత్నం
- చికిత్స పొందుతూ భర్త మృతి డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామానికి చెందిన మేకల రవి, సుశీల భార్యాభర్తలు. పిల్లలు పుట్టడం లేదనే మనస్తాపంతో ఇద్దరూ గురువారం పురుగుల మందు తాగి దగ్గరలో ఉన్న చెరువులో దూకారు. గమనించిన స్థానికులు వారిని రక్షించి 108 వాహనంలో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్త రవి చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
మూడో ప్లాన్‌తో మట్టుబెట్టింది..!
ఓ భార్య ఘాతుకం రెండుసార్లు జిల్లేడు పాలతో చంపాలని విఫలం నలుగురి సహాయంతో హత్య నేరడిగుంట హత్య కేసులో నిందితుల అరెస్టు జోగిపేట: భర్తను అడ్డు తొలగించుకునేందుకు ఓ మహిళ పధకం ప్రకారం ప్రియుడు, ఇతరుల సహకారంతో కట్టుకున్నవాడినే హత్య చేసిందని మెదక్ డీ ఎస్పీ రాజారత్నం తెలిపారు. శుక్రవారం జోగిపేటలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ చాం బర్లో సీఐ వి.నాగయ్య, ఎస్ఐ విజయ్రావుతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నవంబర్ 28న రాత్రి అందోలు మండలం నేరడిగుంట గ్రామంలో జరిగిన ఖాదిరాబాద్ నరేష్ (30) హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి సంఘటనకు సంబంధించి న వివరాలను వివరించారు. మృతుడు నరేష్‌కు గ్రామంలోనే మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని గ్రహించిన అతడి భార్య అంజమ్మ పలుమార్లుగొడవ చేసింది. అయినా అతడు ఆ సంబందాన్ని వదులుకోలేదు. అంతేకాకుండా భార్య అంజమ్మ సైతం గ్రామానికి చెం దిన శివకుమార్ అనే యువకుడితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది. అయి తే తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని భావించిన అంజమ్మ తన ప్రియుడితో పధకంరూపొందించింది. ప్రియుడు శివకుమార్ తన స్నేహితుడైన మల్లేశం, గ్రామానికి చెందిన వెంకటేశంతో పాటు మృతుడు నరేష్ అక్రమ సంబంధం ఏర్పరచుకున్న మహిళ తం డ్రి రాందాస్‌లు కలిసి 28 తేదీ శనివారం నరేష్ ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో నరేష్ పడుకున్న గదిలోకి వెళ్లి కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకొని దిండును అ తడి ముఖంపై అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేశారు. అప్పుడు జరిగిన గలాటాలో పక్కనే నివాసం ఉంటున్న సోదరుడు యాదయ్య, ఆయన భార్య నిద్రలేచారు. ఏమైందని వారు ప్రశ్నిస్తే ఏమీ లేదని నిందితులు సమాధానం చెప్పా రు. తర్వాత గొంతు నొక్కి నరేష్‌ను హత్య చేశారు. అప్పుడే అనుమానంతో వారి కుటుంబ సభ్యులు ఇంట్లోకి రాగా నరేష్ చనిపోయి ఉన్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అదేరోజు రాత్రి గ్రామానికి వె ళ్లారు. జిల్లేడు పాలతో భర్తను చంపాలని ప్రయత్నించింది..... ఈ సంఘటనకు ముందు రెండుసార్లు భర్త నరేష్‌ను చంపేందుకు అతడి భార్య ప్రయత్నించిందని డీఎస్పీ తెలిపారు. ఒకసారి పాలల్లో జిల్లేడు పాలు కలిపిందని, నరేష్ వాంతులు చేసుకొని బతికి బయటపడ్డాడని తెలిపారు. మరోసారి తినే అన్నంలో జిల్లేడు పాలను కలిపి పెట్టిందని, అప్పుడు ఫుడ్ పాయిజన్ అయ్యిందని భావించి ఆస్పత్రిలో చికిత్సపొంది ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగాడని వివరించారు. ఇక మూడవ సారి ఏకంగా నలుగురి సహాయంతో హత్య చేయించిందని ఆయన వివరించారు. నరేష్ హత్య కేసులో భార్య అంజమ్మతో పాటు శివకుమార్, మల్లేశం, రాందాస్, వెంకటేశంలపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో ఏఎస్ఐ రాములు, పోలీసులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన చిన్నగొడవ
ములుగు : భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవతో భార్య పురుగుల మందు తాగింది. ఆమె చనిపోతుందేమోనని భర్త సైతం అదే పురుగుల మందు తాగాడు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య చికిత్ప పొందుతోంది. ఈ సంఘటన గురువారం మండలంలోని పత్తిపల్లి శివారు చిత్తకుంటలో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాలు.. నల్లబెల్లి మండలం గుల్లపాడుకు చెం దిన కేలోతు ఇడియాల్-చంద్రకళ దంపతుల ప్రథమ కుమారుడు కేలోతు రాజు(26)కు అ దే గ్రామానికి చెందిన తేజావత్ జేత్యా-కమలమ్మ దంపతుల కుమార్తె అనితతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. గ్రామంలో ఉపా ధి లేక ఆరేళ్ల క్రితం ములుగు మండలం చిం తకుంటకు వలస వచ్చారు. భార్యాభర్తలు స్థా నికంగా కూలీనాలీ చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఈ సంవత్సరం మూడున్నర ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశారు. పెట్టుబడి కోసం కొంత అప్పు చేశారు. అయితే గత 10 రోజులుగా దంపతులకు పెట్టుబడి కోసం డబ్బులు అందక ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో పెట్టుబడి డబ్బులు కావాలని భార్య అనిత భర్తను అడిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య బుధవారం సాయంత్రం గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన అనిత ఇంటి వద్ద పురుగుల మందు తాగింది. స్థానికులు గమనించి భర్త రాజుపై మండిపడ్డారు. భార్య ఎక్కడ చనిపోతుందోనని భయంతో రాజు సైతం పురుగుల మందు తాగాడు. గమనించిన గ్రామస్తులు భార్యాభర్తలను ములుగు సివిల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజు మృతి చెందగా భార్య అనిత చికిత్స పొందుతోంది. కాగా, రాజుకు ఇంద్రజ(6), నందిని(4), ఈశ్వర్(2) సంతానం. తండ్రి చనిపోరుు, తల్లి చికిత్స పొందుతుండగా పిల్లల రోదన పలువురిని కలిచివేసింది. నాకు దిక్కెవరు నానా ఇబ్బందులు పడి భర్త సహకారంతో పిల్లలను సాదుకుంటున్నా. అండగా ఉండాల్సి భర్త మృతి చెందాడు. ఊహ తెలియని ముగ్గురు పిల్లలు, రూపాయి ఆదాయం లేని జీవితం ఈ పరిస్తితిలో ఎలా బతకాలని, తనకు ఎవరు దిక్కని భార్య అనిత ఆసుపత్రిలో చేసిన రోదన పలువురిని కన్నీరు కార్చేలా చేసింది. పేదరికమే కారణం.. రాజు అనితల వివాహం జరిగినప్పటి నుంచి భార్యాభర్తలు ఆర్థికంగా నానా ఇబ్బందులు పడ్డారు. స్వగ్రామం గుండ్లపహాడ్లో ఎదుర్కున్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా చింతకుంటకు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. గత ఐదు సంవత్సరాలు కూలీ చేసుకొని బతికిన దంపతులు ఈ సంవత్సరమే కౌలు తీసుకొని పంటసాగు చేశారు. ఐతే పిల్లల భవిష్యత్ బాగుండాలని కోరి ఇలా ప్రాణం మీదకు తెచ్చుకుంటారని ఊహించలేదని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. -
దంపతులపై దాడి
నర్సాపూర్ : కుటంబకలహాల నేపథ్యంలో దంపతులపై కొంతమంది గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో భర్త చనిపోగా, భార్య అపస్మారక స్థితిలో ఉంది. ఈ సంఘటన బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో జరిగింది. వివరాలు..మండల కేంద్రంలో నర్సింహాలు, అనసూయ దంపతులపై గుర్తుతెలియని దుండుగులు దాడి చేశారు. ఈ దాడిలో నర్సింహాలు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన అనసూయ అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, ఈ ఘటనలో నర్సింహులు మృతదేహాన్ని పోలీసులు పక్కనే ఉన్న పొలాల్లో గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.