మూడో ప్లాన్‌తో మట్టుబెట్టింది..!
ఓ భార్య ఘాతుకం
రెండుసార్లు జిల్లేడు పాలతో చంపాలని విఫలం
నలుగురి సహాయంతో హత్య
నేరడిగుంట హత్య కేసులో నిందితుల అరెస్టు
జోగిపేట: భర్తను అడ్డు తొలగించుకునేందుకు ఓ మహిళ పధకం ప్రకారం ప్రియుడు, ఇతరుల సహకారంతో కట్టుకున్నవాడినే హత్య చేసిందని మెదక్ డీ ఎస్పీ రాజారత్నం తెలిపారు. శుక్రవారం జోగిపేటలోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చాం బర్‌లో సీఐ వి.నాగయ్య, ఎస్‌ఐ విజయ్‌రావుతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నవంబర్ 28న రాత్రి అందోలు మండలం నేరడిగుంట గ్రామంలో జరిగిన ఖాదిరాబాద్ నరేష్ (30) హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి సంఘటనకు సంబంధించి న వివరాలను వివరించారు.
మృతుడు నరేష్‌కు గ్రామంలోనే మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని గ్రహించిన అతడి భార్య అంజమ్మ పలుమార్లుగొడవ చేసింది. అయినా అతడు ఆ సంబందాన్ని వదులుకోలేదు. అంతేకాకుండా భార్య అంజమ్మ సైతం గ్రామానికి చెం దిన శివకుమార్ అనే యువకుడితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది. అయి తే తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని భావించిన అంజమ్మ తన ప్రియుడితో పధకంరూపొందించింది. ప్రియుడు శివకుమార్ తన స్నేహితుడైన మల్లేశం, గ్రామానికి చెందిన వెంకటేశంతో పాటు మృతుడు నరేష్ అక్రమ సంబంధం ఏర్పరచుకున్న మహిళ తం డ్రి రాందాస్‌లు కలిసి 28 తేదీ శనివారం నరేష్ ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో నరేష్ పడుకున్న గదిలోకి వెళ్లి కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకొని దిండును అ తడి ముఖంపై అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేశారు. అప్పుడు జరిగిన గలాటాలో పక్కనే నివాసం ఉంటున్న సోదరుడు యాదయ్య, ఆయన భార్య నిద్రలేచారు. ఏమైందని వారు ప్రశ్నిస్తే ఏమీ లేదని నిందితులు సమాధానం చెప్పా రు. తర్వాత గొంతు నొక్కి నరేష్‌ను హత్య చేశారు. అప్పుడే అనుమానంతో వారి కుటుంబ సభ్యులు ఇంట్లోకి రాగా నరేష్ చనిపోయి ఉన్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అదేరోజు రాత్రి గ్రామానికి వె ళ్లారు.
జిల్లేడు పాలతో భర్తను చంపాలని ప్రయత్నించింది.....
ఈ సంఘటనకు ముందు రెండుసార్లు భర్త నరేష్‌ను చంపేందుకు అతడి భార్య ప్రయత్నించిందని డీఎస్పీ తెలిపారు. ఒకసారి పాలల్లో జిల్లేడు పాలు కలిపిందని, నరేష్ వాంతులు చేసుకొని బతికి బయటపడ్డాడని తెలిపారు. మరోసారి తినే అన్నంలో జిల్లేడు పాలను కలిపి పెట్టిందని, అప్పుడు ఫుడ్ పాయిజన్ అయ్యిందని భావించి ఆస్పత్రిలో చికిత్సపొంది ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగాడని వివరించారు. ఇక మూడవ సారి ఏకంగా నలుగురి సహాయంతో హత్య చేయించిందని ఆయన వివరించారు. నరేష్ హత్య కేసులో భార్య అంజమ్మతో పాటు శివకుమార్, మల్లేశం, రాందాస్, వెంకటేశంలపై కేసు నమోదు చేసినట్లు డీఎస్‌పీ తెలిపారు. సమావేశంలో ఏఎస్‌ఐ రాములు, పోలీసులు పాల్గొన్నారు.