Hyderabad CCS
-
రూ.579 కోట్ల కాంట్రాక్టులంటూ..రూ.3 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు మరో లిమిటెడ్ సంస్థకు చెందిన పనులు ఇప్పిస్తామంటూ నగరానికి చెందిన వ్యక్తిని మోసం చేసిన ముఠాపై హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు కేసు నమోదు చేశారు. రూ.579 కోట్ల పనులు సబ్–కాంట్రాక్ట్‌కు ఇస్తామంటూ రూ.3 కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని అధికారులు తెలిపారు. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన సివిల్ ఇంజినీర్ కె.జగదీశ్వర్ దాదాపు పదహారేళ్లుగా సాయిడక్స్ ఇంజినీర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థ నిర్వహిస్తున్నారు. శివప్రసాద్ అనే దళారి ద్వారా ఈయనకు గతేడాది సెప్టెంబర్ 21న డీఎన్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ డి.నరేష్ చౌదరి కలిశారు. ఆ సందర్భంలో మహానంది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ సంస్థకు చెందిన రూ.539 కోట్ల కాంట్రాక్టుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపించారు. ఆ కాంట్రాక్టు తనకే వచ్చిందంటూ నమ్మబలికాడు. దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన రూ.40 కోట్ల కాంట్రాక్టునూ సబ్–కాంట్రాక్టుకు ఇస్తానంటూ చెప్పాడు. బేరసారాల తర్వాత జగదీశ్వర్, నరేష్‌లు ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత నరేష్ నుంచి జగదీశ్వర్‌కు ఆ రెంటితో సంబంధం లేని పనులకు సంబంధించిన వర్క్ ఆర్డర్లు ఇచ్చారు. అదేమని ప్రశ్నిస్తే జీఎస్టీ ఇబ్బందుల నేపథ్యంలో అలా ఇవ్వాల్సి వచ్చిందంటూ చెప్పాడు. చదవండి: యువ దంపతుల ఆత్మహత్య .. అదే కారణమా..? గరిష్టంగా వారం రోజుల్లో అసలు పనులు ప్రారంభిద్దామంటూ అందుకు అవసరమైన ఖర్చుల నిమిత్తం కావాలంటూ రూ.1.4 కోట్లు తీసుకున్నాడు. ఈ నగదు తీసుకునే సమయంలో నరేష్‌తో పాటు అతడి భార్య లావణ్య, బంధువు రాకేష్‌లతో పాటు చైతన్య అనే వ్యక్తి కూడా వచ్చారు. ఆపై సరుకు సరఫరా పేరుతో ఉమా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కంపెనీ, ఏకదంత రిటైలర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు రూ.50 లక్షలు, రూ.1.1 కోట్లు చొప్పున నగదు, పర్చేజ్ ఆర్డర్లు ఇప్పించాడు. ఈ చెల్లింపుల తర్వాత జగదీశ్వర్‌కు ఎలాంటి సరుకు సరఫరా కాలేదు. కొన్నాళ్లు ఎదురు చూసిన ఈయన తన సబ్–కాంట్రాక్టులు, నగదు విషయంపై నరేష్‌ను సంప్రదించారు. అయితే అతడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గుర్తించారు. దీంతో ఆరా తీయగా... నరేష్ నేతృత్వంలోని ముఠా అనేక మందిని ఇదే పంథాలో మోసం చేసిందని, దాదాపు ప్రతి సందర్భంలోనూ నకిలీ లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లు చూపించినట్లు తేలింది. దీంతో ఆయన సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో నరేష్, లావణ్య, రాకేష్, స్వాతి, చైతన్య, శివప్రసాద్లతో పాటు ఉమా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కంపెనీ, ఏకదంత రిటైలర్స్ ప్రైవేట్ లిమిటెడ్లపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన రోజే అన్ని బెనిఫిట్స్ తీసుకెళ్లొచ్చంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే కొందరు ఉన్నతాధికారులు, సెక్షన్ ఇన్చార్జుల నిర్లక్ష్యం కారణంగా అది నెరవేరట్లేదు. ఫలితంగా పదవీ విరమణ చేసిన అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తాజా ఉదాహరణే రిటైర్డ్ ఏసీపీ కేఎన్ విజయ్‌కుమార్ పరిస్థితి. సీసీఎస్‌లో ఏసీపీగా పనిచేసిన కేఎన్ విజయ్‌కుమార్ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు. ఇప్పటికీ ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ దక్క లేదు. ఇటీవల ఆయన కరోనా బారినపడి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మొదట కొద్ది రోజులు గచ్చిబౌలిలోని కార్పొరేట్ ఆస్ప త్రిలో చికిత్స పొందారు. ఆర్థిక కారణాలతో ఆస్పత్రి బిల్లులు చెల్లించలేక ప్రస్తుతం మరో ప్రైవేట్ ఆస్పత్రికి మార్చారు. ఎంతో సేవ చేసిన తన తండ్రిని పోలీస్ విభాగం గాలికి వదిలేసిందంటూ ఆయన కుమార్తె ఓ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, విజయ్‌కుమార్‌ను ఫోన్లో ‘సాక్షి’పలకరించింది. ‘నాకు రావాల్సిన బెనిఫిట్స్ నేను దాచుకున్నవి. నా డబ్బు నాకు తిరిగి ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నా కష్టార్జితం నుంచి పొదుపు చేసుకున్న నగదు ఇప్పుడు చేతికి అందట్లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: ఇందల్వాయి ఎస్ఐ శివప్రసారెడ్డిపై వేటు మాస్కుతో ఇబ్బందులు.. పీల్చిన గాలే పీల్చి..! -
చారి.. జైలుకు పదకొండోసారి!
సాక్షి, హైదరాబాద్: అతడో ‘అవతార’పురుషుడు. చిన్నమొత్తాలు కొల్లగొట్టే పెద్దదొంగ. పేరు రాయబండి సూర్యప్రకాశ్‌చారి... ఇంటర్మీడియెట్ కూడా పాస్ కాలేదు... అయితేనేం.. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లోని అధికారినని చెప్పుకుంటాడు... నకిలీ జర్నలిస్ట్ అవతారం ఎత్తుతాడు.. సన్మానాలు, అన్నదాన కార్యక్రమాల పేరిట ప్రభుత్వాధికారులకు ఎరవేస్తాడు. బదిలీల పేరుతో భయపెట్టి అందినకాడికి దండుకుంటాడు. ఈ ఘరానా మోసగాడిని మధ్యమండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. వివరాలను డీసీపీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు. సూర్యప్రకాశ్‌చారి ఇప్పటివరకు 11 సార్లు కటకటాల్లోకి వెళ్లాడు. అతడు ఏ నేరంలోనూ రూ.లక్షకు మించి వసూలు చేయలేదు. చిన్న మొత్తాలు అయితేనే అధికారులు పెద్దగా పట్టించుకోరని ఈ జాగ్రత్తలు తీసుకున్నాడు. నకిలీ విలేకరి అవతారంతో మొదలు... రంగారెడ్డి జిల్లా కుంట్లూరుకు చెందిన రాయబండి సూర్యప్రకాశ్‌చారి ఉప్పల్‌లోని కళ్యాణ్పురి కాలనీలో నివసిస్తున్నాడు. ఇతగాడికి ఆర్ఎస్పీ చారి, సూరిబాబు, ప్రకాశ్ అనే మారు పేర్లూ ఉన్నాయి. నగరానికి వలసవచ్చి కొన్ని దిన, వార పత్రికల్లో పనిచేశాడు. ఇతడి ప్రవర్తన కారణంగా ఉద్యోగాలు ఊడిపోయాయి. అయినా, హైదరాబాద్, సైబరా బాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని అనేక స్కూళ్లు, ఆస్పత్రులకు కాల్ చేసి ప్రముఖ దినపత్రికలో ఉన్నతస్థాయిలో పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకునేవాడు. తమ పత్రిక తరఫున భారీ ఈవెంట్ జరుగుతోందని, విరాళాలు ఇవ్వాలని అందినకాడికి దండుకునేవాడు. మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడినంటూ చెప్పి పలువురి దగ్గర డబ్బు వసూలు చేశాడు. మున్సిపల్ కమిషనర్, ఐఏఎస్ సైతం... ఈ తరహా నేరాలకు పాల్పడుతూ 2009 నుంచి కుషాయిగూడ, చైతన్యపురి, కీసర, మీర్పేట్, హయత్‌నగర్, చైతన్యపురి, సనత్‌నగర్, హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఇతడి మోసాల బారినపడినవారిలో మున్సిపల్ కమిషనర్, ఐఏఎస్ అధికారి సైతం ఉన్నారు. 2016లో కోరుట్ల మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎ.రాణిరెడ్డికి అతడు ఫోన్‌కాల్ చేసి సీఎంవో నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకున్నాడు. జిల్లాస్థాయిలో ఉత్తమ అధికారిణిగా ఎంపికయ్యారని, రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానం చేయనున్నామని చెప్పాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ కార్యక్రమం నిర్వహణకు రూ.35 వేలు చెల్లించాలంటూ బ్యాంకు ఖాతా నంబర్‌ను ఎస్సెమ్మెస్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన రాణిరెడ్డి సీఎంవోలో ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె అప్పట్లో హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అధికారులు బ్యాంకు అకౌంట్, ఫోన్ నంబర్ ఆధారంగా సూర్యప్రకాశ్‌చారిని గుర్తించి అరెస్టు చేశారు. ఆ తరువాత ఓ ఐఏఎస్ అధికారి ఫిర్యాదుతో ఇతగాడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా రిజిస్ట్రేషన్స్ శాఖ టార్గెట్ ఈ మోసగాడు తాజాగా రిజిస్ట్రేషన్ శాఖలోని సబ్–రిజిస్ట్రార్లను లక్ష్యంగా ఎంచుకున్నాడు. సిద్ధిపేట, జగిత్యాల, షాద్‌నగర్, చౌటుప్పల్, వరంగల్, శామీర్‌పేటలకు చెందిన ఎస్ఆర్వోలకు కాల్ చేసి తెలంగాణ పోరాటయోధుల కార్యక్రమంలో భాగంగా అన్నదానం చేయడానికి రూ.లక్ష డొనేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తక్షణం తాను చెప్పిన బ్యాంకుఖాతాలో వేయాలని, లేదంటే, మారుమూల ప్రాంతానికి బదిలీ చేయిస్తానని బెదిరించడంతో సిద్ధిపేట రూరల్ ఎస్ఆర్వో, టౌన్ ఇన్చార్జ్ ఎస్ఆర్వోలు రూ.55 వేలు, సంగారెడ్డికి చెందిన ఓ ఎస్ఆర్వో రూ.30 వేలు డిపాజిట్ చేశారు. సదరు ఎస్ఆర్వోలు సీఎంవోలో ఆరా తీయగా సూర్యప్రకాశ్‌చారి అనే వ్యక్తి ఎవరూ లేరని తేలింది. -
‘వేధింపుల కేసుల్లో’ వేరే కోణం!
హైదరాబాద్: ‘వరకట్న దురాచారాన్ని రూపుమాపేందుకు తీసుకొచ్చిన 498-ఏ కేసు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఈ కేసు పెడితే భర్త తమ దారిలోకి వస్తారనే ఉద్దేశంతో అనే మంది ఉంటున్నారు’. - రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తేల్చి చెప్పిన అంశమిది. * హైదరాబాద్‌కు చెందిన ఓ వివాహిత తన ఆడపడుచు కుమార్తె (రెండు నెలలు) తరచు ఏడుస్తుండటంతో తనకు మానసిక వేధింపులు ఎదురవుతున్నాయంటూ ఫిర్యాదు చేశారు. * కెనడాలో ఉండే ఆడపడుచు తరచూ తన భర్తకు ఫోన్ చేస్తోందని, ఫోన్లో మాట్లాడిన తర్వాత భర్త తనపై చేయి చేసుకుంటున్నాడని మరో గృహిణి ఫిర్యాదు చేసింది. విదేశంలో ఉంటున్న ఆడపడుచుతో పాటు భర్త నిందితులుగా పేర్కొంది. * ఉద్యోగస్తులైన ఓ జంట మనస్పర్థల కారణంగా విడిపోవాలనుకుంది. కొన్నాళ్ల క్రితం పరస్పరం ‘ఎస్సెమ్మెస్‌లు’ ఇచ్చుకొని విడిపోయి.. ఎవరికి వారు జీవిస్తున్నారు. తనకు చెందిన ఓ నగ ‘మాజీ భర్త’ వద్ద ఉందని భా వించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. * ఈ ముగ్గురు మహిళలను మించి మరో వివాహిత ఇంకో చిత్రమైన ఫిర్యాదు చేసిం ది. తనను ఇంట్లో వారితో పాటు పక్కింట్లో ఉండే వృద్ధుడూ వేధిస్తున్నాడని ఆరోపించింది. అతడిపై కేసు ఎలా నమోదు చేస్తామని పోలీసులు అడగ్గా.. ‘చనిపోయిన మా మామగారు దెయ్యమై పక్కింటాయన్ని ఆవహించి వేధిస్తున్నాడు’.. అని అంది. * నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని మహిళా ఠాణా అధికారులకు ఇటీవల అందిన ఈ ఫిర్యాదులు వారి దిమ్మ తిరిగేలా చేశాయి. 498-ఏగా పిలిచే వరకట్న వేధింపుల కేసుల్లో వేరే కోణాన్ని ఆవిష్కరించడానికి ఈ ఉదాహరణలు చాలు. వేరు కుంపటి కోసం వేధింపుల పేరు... వరకట్న వేధింపుల కేసు పేరు చెప్తే చాలు పెళ్లైన మగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. భార్య ఫిర్యాదు చేస్తే చాలు... తనతో పాటు తల్లిదండ్రులు, తోడపుట్టిన వాళ్లు కూడా కటకటాల్లోకి వెళ్లాల్సి వస్తుందని పలువురు భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది నలిగిపోతున్నారని పోలీసులే అంటున్నారు.ఎగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో అనేకం బోగస్‌వి ఉంటున్నాయంటున్నారు. అత్తమామలతో కలిసి ఉండటం ఇష్టం లేక, వేరే కాపురం కావాలంటూ పలువురు తమను ఆశ్రయిస్తున్నారని సీసీఎస్ అధికారులు చెప్తున్నారు. ఫిర్యాదులో మాత్రం వరకట్న వేధింపులని పేర్కొంటున్న వివాహితలు కౌన్సిలింగ్ వద్దకు వచ్చేసరికి భర్త వేరు కాపురం వస్తే చాలంటున్నారని తెలిపారు. ‘అమ్మతో పోల్చిచూడటంతో’ అనేక అపార్థాలు... ప్రస్తుతం సమాజంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు కావడం అనివార్యంగా మారింది. ఉద్యోగానికి వెళ్తుండంతో భార్యకు కొన్ని దైనందిన కార్యక్రమాలు నిర్వహించడం కష్టంగా మారుతోంది. ఇక్కడే సదరు భర్తల అహం దెబ్బ తింటోందని అధికారులంటున్నారు. తన తల్లి తమ విషయం లో కనబరిచిన శ్రద్ధను భార్య తనతో పాటు పిల్లలపైనా చూపడంలేదన్న భావన భర్తల్లో కలిగి స్పర్థలకు కారణమవుతోందంటున్నారు. నాటి-నేటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, జీవన ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటే ఇబ్బందే ఉండదని.. అయితే ఆ కోణంలో ఆలోచించే భర్త లు తక్కువగా ఉంటున్నారంటున్నారు. ఈ అపార్థంతో మొదలయ్యే స్పర్థలు వేధింపుల కేసుల వర కు వెళ్తున్నాయి. ఓ మహిళకు రక్షణ కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ‘498-ఏ’ సెక్షన్‌ను దుర్వినియోగం చేయడం వల్ల అత్త, ఆడపడుచు, మరిది ... ఇలా మరికొందరు మహిళలు సామాజికంగా, చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్పష్టం చేస్తున్నారు. వ్యక్తిగత కారణాల నేపథ్యంలోనే అనేక మంది భర్తతో పాటు ఆయన కుటుంబీకులపైనా... ఒక్కోసారి భర్తను వదిలేసి కుటుంబీకులపై కట్న వేధింపుల ఫిర్యాదులు చేస్తున్నారని సీసీఎస్ పోలీసులు చెప్తున్నారు. ‘లాభాలు’ కోరడంతో సాధ్యంకాని రాజీలు... ఈ తరహా ఫిర్యాదుల్లో అనేక రాజీలకు సాధ్యం కావట్లేదని పోలీసులంటున్నారు. ‘రాజీ అంటేనే ఇరువురూ ఎంతో కొంత నష్టపోవడం. అయితే భార్యాభర్తలు సంపాదిస్తున్న కేసుల్లో మాత్రం ఇది అమలుకావట్లేదు. ఇద్దరూ ఎదుటి వారి కంటే తామే ఎక్కువ లాభపడాలని ఆశిస్తున్నారు. ఫలితంగా కౌన్సెలింగ్‌లో రాజీ సాధ్యం కావట్లేదు’ అని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇలాంటప్పుడు భార్య కూడా ఉద్యోగస్తురాలు కావడం, అప్పటికి పిల్లలు పుట్టకపోవడం వంటి పరిస్థితులు ఉంటే తేలిగ్గా విడిపోతున్నారని, ఇది వరకట్న వేధింపుల కేసుకు దారితీస్తోందని ఆయన అన్నారు. ఇలాంటి కేసుల్లో ఆడపడుచులు, వదినల్ని నిందితులుగా చేస్తుండటంతో వారి కుటుంబ జీవితాలు కూడా దెబ్బతింటున్నాయని స్పష్టం చేశారు. చక్కదిద్దే చర్యలు... ఈ పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు సీసీఎస్ అధికారులు కొన్ని ప్రత్యేక చర్యల్ని చేపడుతున్నారు. * కేసు నమోదుకు ముందు భార్యాభర్తల్ని పిలిచి కౌన్సెలింగ్ చేస్తున్నారు. * వేధింపులు నిజమని నిర్థారణైతే సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. * ఇది నిష్పాక్షికంగా జరగడం కోసం ఏసీపీ స్థాయి అధికారి ఆధ్యంతం పరిశీలిస్తున్నారు. * ప్రధాన నిందితుడు (భర్త) మినహా మిగిలిన వారికి అరెస్టు చేయడంలో పూర్తి విచక్షణతో వ్యవహరిస్తున్నారు. * కేసులో ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా ఇరికించారని తేలితే, కేసుతో సంబంధంలేని వారి పేర్లను డీసీపీ తొలగిస్తున్నారు. * అరెస్టులు తప్పనిసరి కాని కేసుల్లో నేరుగా చార్జ్‌షీట్ దాఖలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.