hydrogen engine
-
రూ.150 ఖర్చుతో 300 కిమీ ప్రయాణం.. కొత్త కారుతో సత్తా చాటిన రైతుబిడ్డ!
గత ఏడాది మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన రైతు బిడ్డ 'హర్షల్ నక్షనేని' (Harshal Nakshane) హైడ్రోజన్‌తో నడిచే కారును రూపొందించి అందరి చేత ప్రశంసలందుకున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి 'దేవేంద్ర ఫడ్నవిస్' (Devendra Fadnavis) ఈ కారుని వీక్షించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ అందించే ఈ కారు ప్రత్యేకమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. ఇంత గొప్ప కారుని తయారు చేసిన నక్షనేనిని 'దేవేంద్ర ఫడ్నవిస్' కలిసి అభినందించారు. అంతే కాకుండా అతన్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. గ్రీన్ కలర్లో కనిపించే ఈ కారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేస్తూ 'సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్' పొందినట్లు హర్షల్ వివరించారు. ఇది ఇంకా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో కారు తనకు తానుగానే ముందుకు వెళ్లడం చూడవచ్చు. ఈ హైడ్రోజన్ కారుని తయారు చేయడానికి హర్షల్ నక్షనేనికి సుమారు రూ. 25 లక్షలు ఖర్చు అయినట్లు వెల్లడించాడు. ఈ కారు కేవలం రూ.150 హైడ్రోజన్‌తో ఏకంగా 300 కిమీ పరిధిని అందిస్తుందని తెలిపాడు. ఫెరారీ కారుని తలపించే డోర్స్, సన్‌రూఫ్ వంటివి ఇందులో మరింత ప్రత్యేకంగా కనిపిస్తాయి. గ్రీన్ కలర్ హోమ్మేడ్ హైడ్రోజన్ కారు ఇంకా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండటం వల్ల ఖచ్చితమైన లాంచ్ గురించి వివరించలేదు. అంతే కాకుండా ఈ కారుకు సంబంధించిన మరిన్ని స్పెసిఫికేషన్లను వెల్లడించాల్సి ఉంది. దీనికోసం Aicars.in వెబ్సైట్లో బుకింగ్ చేసుకోవచ్చని వారు వెల్లడించారు. ఇలాంటి వాహనాలు భారతదేశంలో చట్టవిరుద్ధం హర్షల్ నక్షనేని అద్భుతమైన సృష్టి అందరి ఆకట్టుకుంటున్నప్పటికీ.. భారతదేశంలో అమలులో ఉన్న మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద ఇలాంటివి పబ్లిక్ రోడ్డుమీద ఉపయోగించడానికి ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే ఇండియాలో ఒక వాహనం రోడ్డు మీదికి రావాలంటే ఖచ్చితంగా 'ఏఆర్ఏఐ' (Automotive Research Association of India) దృవీకరించాలి. మన దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలను ప్రవేశపెడుతున్నాయి. కాబట్టి ఒక వాహనం పబ్లిక్ రోడ్ల మీదికి రావాలంటే సంబంధిత వివిధ అధికారుల నుంచి ఆమోదం పొందాలి. లేకుంటే ఇవి ప్రాజెక్ట్ కార్లుగా పరిగణించి, రేసింగ్ ట్రాక్‌లు లేదా ఫామ్‌హౌస్‌ల వంటి ప్రైవేట్ ప్రాపర్టీలకు మాత్రమే పరిమితం చేస్తారు. పబ్లిక్ రోడ్లలో ఇలాంటి వాహనాలు కనిపిస్తే వాటిని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇదీ చదవండి: ఆగని యుద్ధం.. పోయిన లక్షల ఉద్యోగాలు - ఐఎల్ఓ సంచలన రిపోర్ట్ ప్రస్తుతం మన దేశంలో హైడ్రోజన్ కార్ల వినియోగానికి కావాల్సిన కనీస సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. కానీ ఫ్యూయెల్ కార్ల కంటే ఎక్కువ పరిధిని, తక్కువ కాలుష్యం కలిగించే ఇలాంటి వాహనాలను వినియోగించాలని గతంలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రస్తావించారు. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో హైడ్రోజన్ కార్ల వినియోగం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. Blazing a trail from Chandrapur, Maharashtra, this AI-powered hydrogen car is a game-changer! It was great meeting Maharashtra's Innovative Genius, Harshal Nakshane, a farmer's son from Chandrapur, yesterday in Mumbai. He cracked a groundbreaking innovation - an AI-controlled… pic.twitter.com/tdANS9YNIp — Devendra Fadnavis (@Dev_Fadnavis) October 29, 2023 -
హైడ్రోజన్ ఆధారిత వాణిజ్య వాహనాల కోసం..టాటా మోటార్స్, కమిన్స్ జోడీ
ముంబై: ఇంజన్ల తయారీలో ఉన్న కమిన్స్, వాహన రంగ దిగ్గజం టాటా మోటార్స్ చేతులు కలిపాయి. హైడ్రోజన్ ఆధారిత వాణిజ్య వాహనాలకు కావాల్సిన ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్, ఫ్యూయల్ సెల్స్, బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్ సిస్టమ్స్‌తో సహా ఉద్గార రహిత ప్రొపల్షన్ టెక్నాలజీ సొల్యూషన్స్‌ను ఇరు సంస్థలు కలిసి రూపకల్పన, అభివృద్ధి చేస్తాయి. టాటా మోటార్స్, కమిన్స్‌ల సంయుక్త భాగస్వామ్య కంపెనీ 1993 నుంచి ఇంజన్ల తయారీలో ఉంది. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
హైడ్రోజన్ కారు 484 కి.మీ మైలేజీ.. గరిష్ట వేగం 353 కి.మీ
ఎలక్ట్రిక్ కార్ల హవా ఇప్పుడిప్పుడే మొదలవుతుంటే వాటికి పోటీగా మార్కెట్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి హైడ్రోజన్ కార్లు. మైలేజీ, స్పీడ్, మెయింటనెన్స్ విషయంలో ఎలక్ట్రిక్ కార్లతో పోటీ పడుతున్నాయి. అంతేకాదు లేటేస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని రోడ్డు, వాయు మార్గంలో ప్రయాణించేలా కొత్త రకం డిజైన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వెనుకున్నది మన సత్యనే భారతీయ అమెరికన్ సంత సత్య లుఫ్ట్‌కారు పేరుతో స్టార్టప్ నెలకొల్పారు. హైడ్రోజన్ ఫ్యూయల్‌తో నడిచేలా ఫ్లైయింగ్కారును తయారు చేస్తున్నారు. ఈ కారుకు సంబంధించిన ప్రాథమిక డిజైన్లు పూర్తయ్యాయి. 20213లో మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఆటో ఎక్స్‌ప్లోలో ఈ కారుకు సంబంధించిన విశేషాలు దుబాయ్ షేక్‌లను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్కెట్లోకి రాకముందే ఈ కారుని కొనుగోలు చేసేందుకు దుబాయ్ షేక్‌లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ హైడ్రోజన్ కారు విశేషాలు ఏంటో ఓసారి చూద్దాం. ప్లేన్‌లోనే కారు సంత్సత్య రూపొందించిన లుఫ్ట్‌కారు భూమి మీద, ఆకాశంలో ప్రయాణం చేయగలదు. అటాచబుల్, డిటాచబుల్ పద్దతిలో ఈ కారును డిజైన్ చేయడం వల్ల ఈ కారు రెండు విధాలుగా ప్రయాణం చేయగలదు. ఈ కారు ఎగిరేందుకు వీలుగా నాలుగు ప్రొపెల్లర్లతో చేసిన డిజైన్ విమానం, హెలికాప్టర్ల నమూనాను పోలీ ఉంటుంది. ఇందులో మనుషులు ప్రయాణించేందుకు వీలుగా క్యాబిన్ ఉంటుంది. ఈ క్యాబిన్ డిటాచ్ చేస్తే రెగ్యులర్ కారు తరహాలో రోడ్డుపై ప్రయాణం చేయవచ్చు. మ్యాగ్జిమమ్ స్పీడ్ 354 కి.మీ లుఫ్ట్‌కారు గరిష్టంగా 4,000 అడుగుల ఎత్తు వరకు పైకి ప్రయాణం చేయగలదు. వాయు ఒక్కసారి హైడ్రోజన్ ఫ్యూయల్ నింపుకుంటే వాయు మార్గంలో గరిష్టంగా 484 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఇక రోడ్డు మార్గంలో అయితే 241 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. వాయు మార్గంలో గరిష్ట వేగం గంటకి 354 కిలోమీటర్లు. ఈ కారులో గరిష్టంగా ఐదుగురు ప్రయాణం చేయవచ్చు. వర్టికల్‌గా ల్యాండింగ్ టేకాఫ్ తీసుకోగలదు. ధర ఎంతంటే యూఎస్, యూరప్‌లతో పాటు సంపన్నులు ఎక్కువగా ఉండే దుబాయ్ లాంటి ప్రాంతాల్లో సంపన్నులు, నగరాల మధ్య నిత్యం ప్రయాణం చేసే బిజినెస్ పీపుల్ అవసరాలకు తగ్గట్టుగా ఈ కారుని డిజైన్ చేశారు. ఇంటి నుంచి ఎయిర్‌పోర్టు, ఎస్టేట్ తదితర ప్రదేశాల వరకు ట్రాఫిక్ చిక్కులు లేకుండా వాయు మార్గంలో ప్రయాణించవచ్చు. అత్యవసర సమయంలో రోడ్డు మార్గంలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ హైడ్రోజను కారు ధర 3.50,000 డాలర్లుగా ఉంది. చిన్న ప్లేన్‌తో పాటు కారు లుఫ్ట్కారును కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులకు ఒకేసారి ఒక చిన్న ప్లేను, కారుని కొనుగోలు చేసినట్టు అవుతుంది. ట్రాఫిక్ చిక్కులు లేకుండా కుటుంబంతో సహా ప్రయాణించేందుకు వీలు ఏర్పడుతుందని లుప్ట్కార సీఈవో సంత్ సత్య అంటున్నారు. -
భవిష్యత్ ఇంధనంగా హైడ్రోజన్
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ తో నడుస్తున్న వాహనాల కారణంగా వెలువడే వాయు కాలుష్యం వల్ల పర్యావరణానికి ఎక్కువ హాని జరుగుతుంది. దింతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు భవిష్యత్ లో దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొనిరావాలని భావిస్తున్నాయి. ఇప్పటికే ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారివైపు దృష్టి సారిస్తున్నాయి. కానీ ఈ ఎలక్ట్రిక్ కార్లను వేధిస్తున్న ప్రధాన సమస్య బ్యాటరీ ఛార్జింగ్. ఎలక్ట్రిక్ కార్లను ఫుల్ ఛార్జింగ్ చేయడానికి ఒక గంట నుంచి రెండు గంటలు పడుతున్నాయి. దీనిని తగ్గించేందుకు కూడా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ వాహనాలలో ఇంధనానికి బదులు హైడ్రోజన్ ని వాడాలని కంపెనీలు చూస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే బ్యాటరీలను స్టేషనరీ ఛార్జర్‌తో నింపేందుకు హైడ్రోజన్ వాడనున్నారు. ఇలా చేయడం వల్ల కారులో విద్యుత్ ఉత్పత్తి అవ్వడమే కాకుండా.. కేవలం నీరు, వేడి మాత్రమే వాడి స్వచ్ఛమైన పద్ధతిలో వాహనాలను నడిపించవచ్చు. దీనివల్ల కూడా పర్యావరణానికి కూడా ఎటువంటి హాని జరగదు. అలాగే పెట్రోల్, డీజిల్ వాడకాలను తగ్గించొచ్చు. పెట్రోల్ మాదిరిగానే క్షణాల్లో కారు ఇందనాన్ని నింపేయొచ్చు. ఈ సాంకేతికతను త్వరగా అందుబాటులోకి తేవడానికి హ్యుందాయ్ మోటార్ గ్రూప్, చైనా ప్రభుత్వంతో చేసుకున్న పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేసింది.(చదవండి: ఇక టెస్ట్ డ్రైవింగ్ అవసరం లేదు) -
బిల్‌గేట్స్ ముచ్చట ఖరీదు రూ. 4600కోట్లు
ప్రపంచంలోనే సంపన్నుడు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఓ విలాసవంతమైన యాట్(విహార నౌక)ను కొన్నారు. గతేడాది మొనాకోలో నిర్వహించిన యాట్‌షోలో గేట్స్ దీన్ని చూసి ముచ్చట పడ్డారు. పర్యావరణానికి ఈ యాట్ ఏ మాత్రం హాని చేయదని తెలుసుకున్న బిల్‌గేట్స్ తన కోసం ప్రత్యేకించి రూపొందించుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. వెంటనే దీనికి సంబంధించి కొంత మొత్తాన్ని చెల్లించి పనులు ప్రారంభించాలని సూచించారు. కాగా.. ఈ నౌక విశేషాలు: ఆక్వా నౌక 370 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో నాలుగు గెస్ట్ రూమ్‌లు, రెండు వీఐపీ గదులు, యజమాని రూమ్ ఉంటుంది. ఇందులో 5 డెక్‌లు ఉంటాయి. 14 మంది అతిథులు, 31 మంది సిబ్బంది ఈ బోట్లో వెళ్లవచ్చు. అలాగే ఒక జిమ్, యోగా స్టూడియో, బ్యూటీ రూం, మసాజ్ పార్లర్, స్విమ్మింగ్ పూల్ తదితర సదుపాయాలు ఈ బోట్లో ఉన్నాయి. కాగా ఈ బోట్‌ను బిల్‌గేట్స్ తరచూ వెకేషన్‌కు వెళ్లేందుకు గాను కొనుగోలు చేశారు. ఈ పడవ లిక్విడ్ హైడ్రోజన్‌తో నడుస్తుంది. అంటే కేవలం నీటిని మాత్రమే ఇది వ్యర్థంగా బయటకు వదులుతుంది. ఇక ఈ బోటు ధర రూ.4600 కోట్లు కావడం విశేషం. కాగా లిక్విడ్ హైడ్రోజన్‌తో నడిచే ప్రపంచంలోని ఏకైక బోటు కూడా ఇదే కావడం మరో విశేషం. బిల్‌గేట్స్ కొనుగోలు చేసిన సూపర్‌యాచ్ పొడవు 370 అడుగులు. దీంట్లో ఒకసారి ద్రవ హైడ్రోజన్ ఇంధనాన్ని నింపితే 3750 మైళ్లు ప్రయాణిస్తుంది. నౌక వేగం గంటకు 17 నాటికల్ మైళ్లు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఎంతో విలాసవంతంగా, ఆధునిక టెక్నాలజీ సాయంతో నడిచే ఈ నౌకలో బయటకు వెళ్లి విహారం చేయడానికి వీలుగా రెండు చిన్న బోట్లు కూడా ఉంటాయి. కాగా ఇప్పటి వరకూ బిల్ గేట్స్‌కు సొంత విహార నౌక లేదు. ప్రస్తుతం ఈ నౌక తయారీ దశలో ఉంది. ఇది 2024 నాటికి బిల్‌గేట్స్ చేతికి రానుంది. -
హైడ్రోజన్ అనుసంధానంతో నడిచే ఇంజన్
యానాం: హైడ్రోజన్ ఇంధన అనుసంధానంతో నడిచే మోటార్ వెహికల్ ఇంజన్‌ను యానాం లోని రీజెన్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఆర్ఐటీ)కి చెందిన విద్యార్థులు తయూరు చేశారు. బీటెక్ మెకానికల్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు చైతన్య, ఎన్. ఉమామహేశ్వరరావు, ఆర్వీఎస్ కిరణ్, ఎస్.సతీష్ ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా ఏడాదిపాటు శ్రమించి ఈ ఇంజన్‌ను రూపొందించారు. హైడ్రోజన్ సెల్‌ను ఉపయోగించి నీటి విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసి, దానిని మోటార్ వెహికల్ కార్బొరేటర్‌లో ప్రవేశపెట్టి ఇంజన్‌ను నడిపినట్టు విద్యార్థులు తెలిపారు. దీనివల్ల వాతావరణ కాలుష్యాన్ని కలుగచేసే కార్బన్ మోనాకై్సడ్, హైడ్రోకార్బన్లను 40 శాతం మేరకు తగ్గించవచ్చని పేర్కొన్నారు. దీంతో పాటు ఇంజన్ సామర్థ్యాన్ని 25 శాతం పెంచగలిగామని తెలిపారు. ఒక పాత మోటార్ వెహికల్‌కు ప్రత్యేకంగా తయారు చేసిన హైడ్రోజన్ సెల్, వాటర్ సీల్, 12 ఓల్ట్స్ గల బ్యాటరీని అమర్చాలని, ఇంజన్‌కు అమర్చిన వాటర్‌సీల్ బాటిల్‌ను డిస్టిల్డ్ వాటర్‌తో నింపాలన్నారు. ఈ బాటిల్లో నీరు పూర్తయిన తర్వాత తిరిగి నింపాల్సి ఉంటుందన్నారు. ఈ ఇంజన్ ద్వారా లీటరు పెట్రోల్‌కు 12 కిలోమీటర్ల మేర మైలేజ్ పెరుగుతుంద న్నారు. ప్రాజెక్ట్‌కు రూ.5 వేలు ఖర్చు అయినట్టు తెలిపారు. విద్యార్థులు రూపొందించి న మోటారు వెహికల్‌ను కళాశాల ఆవరణలో నడిపి చూపారు. ప్రాజెక్ట్‌ను పర్యవేక్షించిన ప్రొఫెసర్ జి.రవికుమార్‌ను, విద్యార్థులను ఆర్ఐటీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వి.ఎస్.నారాయణ, డీన్ అన్యం రామకష్ణారావు అభినందించారు.