
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ తో నడుస్తున్న వాహనాల కారణంగా వెలువడే వాయు కాలుష్యం వల్ల పర్యావరణానికి ఎక్కువ హాని జరుగుతుంది. దింతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు భవిష్యత్ లో దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొనిరావాలని భావిస్తున్నాయి. ఇప్పటికే ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారివైపు దృష్టి సారిస్తున్నాయి. కానీ ఈ ఎలక్ట్రిక్ కార్లను వేధిస్తున్న ప్రధాన సమస్య బ్యాటరీ ఛార్జింగ్. ఎలక్ట్రిక్ కార్లను ఫుల్ ఛార్జింగ్ చేయడానికి ఒక గంట నుంచి రెండు గంటలు పడుతున్నాయి. దీనిని తగ్గించేందుకు కూడా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.
తాజాగా పెట్రోల్, డీజిల్ వాహనాలలో ఇంధనానికి బదులు హైడ్రోజన్ ని వాడాలని కంపెనీలు చూస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే బ్యాటరీలను స్టేషనరీ ఛార్జర్‌తో నింపేందుకు హైడ్రోజన్ వాడనున్నారు. ఇలా చేయడం వల్ల కారులో విద్యుత్ ఉత్పత్తి అవ్వడమే కాకుండా.. కేవలం నీరు, వేడి మాత్రమే వాడి స్వచ్ఛమైన పద్ధతిలో వాహనాలను నడిపించవచ్చు. దీనివల్ల కూడా పర్యావరణానికి కూడా ఎటువంటి హాని జరగదు. అలాగే పెట్రోల్, డీజిల్ వాడకాలను తగ్గించొచ్చు. పెట్రోల్ మాదిరిగానే క్షణాల్లో కారు ఇందనాన్ని నింపేయొచ్చు. ఈ సాంకేతికతను త్వరగా అందుబాటులోకి తేవడానికి హ్యుందాయ్ మోటార్ గ్రూప్, చైనా ప్రభుత్వంతో చేసుకున్న పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేసింది.(చదవండి: ఇక టెస్ట్ డ్రైవింగ్ అవసరం లేదు)
Comments
Please login to add a commentAdd a comment