హైడ్రోజన్ అనుసంధానంతో నడిచే ఇంజన్ | regency institute of technology made hydrogen engine | Sakshi
Sakshi News home page

హైడ్రోజన్ అనుసంధానంతో నడిచే ఇంజన్

Published Sun, Apr 5 2015 8:34 AM | Last Updated on Sat, Sep 2 2017 11:54 PM

హైడ్రోజన్ ఇంధన అనుసంధానం చేసిన మోటారు వెహికల్‌ను నడుపుతున్న విద్యార్థి

హైడ్రోజన్ ఇంధన అనుసంధానం చేసిన మోటారు వెహికల్‌ను నడుపుతున్న విద్యార్థి

యానాం: హైడ్రోజన్ ఇంధన అనుసంధానంతో నడిచే మోటార్ వెహికల్ ఇంజన్‌ను యానాం లోని రీజెన్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఆర్‌ఐటీ)కి చెందిన విద్యార్థులు తయూరు చేశారు. బీటెక్ మెకానికల్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు చైతన్య, ఎన్. ఉమామహేశ్వరరావు, ఆర్‌వీఎస్ కిరణ్, ఎస్.సతీష్ ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా ఏడాదిపాటు శ్రమించి ఈ ఇంజన్‌ను రూపొందించారు.

హైడ్రోజన్ సెల్‌ను ఉపయోగించి నీటి విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసి, దానిని మోటార్ వెహికల్ కార్బొరేటర్‌లో ప్రవేశపెట్టి ఇంజన్‌ను నడిపినట్టు విద్యార్థులు తెలిపారు. దీనివల్ల వాతావరణ కాలుష్యాన్ని కలుగచేసే కార్బన్ మోనాకై్సడ్, హైడ్రోకార్బన్‌లను 40 శాతం మేరకు తగ్గించవచ్చని పేర్కొన్నారు. దీంతో పాటు ఇంజన్ సామర్థ్యాన్ని 25 శాతం పెంచగలిగామని తెలిపారు. ఒక పాత మోటార్ వెహికల్‌కు ప్రత్యేకంగా తయారు చేసిన హైడ్రోజన్ సెల్, వాటర్ సీల్, 12 ఓల్ట్స్ గల బ్యాటరీని అమర్చాలని, ఇంజన్‌కు అమర్చిన వాటర్‌సీల్ బాటిల్‌ను డిస్టిల్డ్ వాటర్‌తో నింపాలన్నారు.

ఈ బాటిల్‌లో నీరు పూర్తయిన తర్వాత తిరిగి నింపాల్సి ఉంటుందన్నారు. ఈ ఇంజన్ ద్వారా లీటరు పెట్రోల్‌కు 12 కిలోమీటర్ల మేర మైలేజ్ పెరుగుతుంద న్నారు. ప్రాజెక్ట్‌కు రూ.5 వేలు ఖర్చు అయినట్టు తెలిపారు. విద్యార్థులు రూపొందించి న మోటారు వెహికల్‌ను కళాశాల ఆవరణలో నడిపి చూపారు. ప్రాజెక్ట్‌ను పర్యవేక్షించిన ప్రొఫెసర్ జి.రవికుమార్‌ను, విద్యార్థులను ఆర్‌ఐటీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వి.ఎస్.నారాయణ, డీన్ అన్యం రామకష్ణారావు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement