Idea 4G Services
-
ఈ నెల నుంచే ఐడియా 4జీ సర్వీసులు..
తెలుగు రాష్ట్రాల్లో 122 పట్టణాల్లో... మొదలైన ప్రీ-బుకింగ్ రిజిస్ట్రేషన్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ ఐడియా సెల్యులార్ డిసెంబరులోనే 4జీ ఎల్టీఈ సర్వీసులను దేశవ్యాప్తంగా ప్రారంభిస్తోంది. నెట్వర్క్ పనితీరుపై సాంకేతిక పరీక్షలను దాదాపు పూర్తి చేసింది. రిలయన్స్ జియో కంటే ముందే 4జీ మార్కెట్లో ప్రవేశించే దిశగా కంపెనీ ఏర్పాట్లను వేగిరం చేసింది. అటు ప్రీ-బుకింగ్ ఆఫర్‌ను ప్రారంభించింది. పేరు నమోదు చేసుకున్న కస్టమర్‌కు సర్వీసులు ప్రారంభం అయ్యాక 10 రోజుల కాలపరిమితి ఉండే 1 జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనుంది. కాగా, ఐడియా సెల్యులార్ తొలుత 1,800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో ఆంధ్రప్రదేశ్ (తెలంగాణతో కలిపి) సర్కిల్, హర్యానా, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్ మరియు చత్తీస్‌గఢ్, పంజాబ్, ఒడిషా, తమిళనాడు సర్కిళ్లలో 4జీ మార్కెట్లో ప్రవేశిస్తోంది. చిన్న పట్టణాల్లోనూ.. చిన్న పట్టణాల్లో డేటా వినియోగం జోరుగా ఉండడం, 4జీ స్మార్ట్ఫోన్లు రూ.4,500 నుంచి లభిస్తుండటంతో ఐడియా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. బండిల్ ఆఫర్ల కింద దిగ్గజ కంపెనీల స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టనుందని సమాచారం. డేటా చార్జీలు మార్కెట్ ధరలకు పోటీనిచ్చేలా ఉంటాయని ఐడియా ప్రతినిధి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు శుక్రవారం వెల్లడించారు. 122 పట్టణాల్లో 4జీ... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో కంపెనీ 122 పట్టణాల్లో 4జీ సర్వీసులను ప్రారంభిస్తోంది. ప్రధాన పట్టణాలైన హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, వరంగల్, కడప, తిరుపతి, రాజమండ్రితోపాటు అన్ని జిల్లా కేంద్రాలు వీటిలో ఉన్నాయి. -
త్వరలో ఐడియా 4జీ సర్వీసులు
డిసెంబరులో ట్రయల్ ప్రాజెక్ట్ * వచ్చే జనవరి నుంచి వాణిజ్యపరంగా సేవలు... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగంలో ఉన్న ఐడియా సెల్యులార్ త్వరలో 4జీ ఎల్టీఈ సర్వీసులను దేశవ్యాప్తంగా ఆవిష్కరిస్తోంది. డిసెంబరులో ప్రయోగాత్మకంగా సేవలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం కంపెనీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ప్రస్తుతం నెట్వర్క్ పనితీరుపై సాంకేతిక పరీక్షలు జరుపుతోంది. 4జీ వస్తోందంటూ కస్టమర్లకు కంపెనీ సందేశాలను కూడా పంపుతోంది. వాస్తవానికి నవంబరులోనే 4జీ ఎల్టీఈ సేవలు ప్రారంభం కావాల్సి ఉంది. ముందుగా 1,800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు), హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలు, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, కేరళ టెలికం సర్కిళ్లలో కంపెనీ 4జీ సేవల రంగంలోకి అడుగిడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో... ఐడియా సెల్యులార్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో హైదరాబాద్‌తోపాటు వైజాగ్, విజయవాడ, వరంగల్ తదితర నగరాల్లో 4జీ ఎల్టీఈ సర్వీసులను ప్రారంభిస్తోందని సమాచారం. వాణిజ్యపరంగా 4జీ ఎల్టీఈ సేవలు జనవరిలో ప్రారంభం అవుతాయని ఐడియా ప్రతినిధి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు ముంబై నుంచి ఫోన్లో తెలిపారు. దేశంలో 10 సర్కిళ్లలో జూన్‌కల్లా 750 నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మ్యూజిక్, గేమ్స్, మూవీస్, డిజిటల్ వాలెట్స్ వంటి డిజిటల్ సేవలను సైతం కంపెనీ సొంత బ్రాండ్‌లో 2016-17లో ప్రారంభిస్తోంది. వీటిని ప్రాంతీయ భాషల్లో తీసుకురానుండడం ఐడి యాకు కలిసి వచ్చే అంశం. దీనికోసం స్టార్టప్స్‌తోపాటు యాప్ డెవలపర్స్‌తో ఇప్పటికే చేతులు కలిపింది. డేటా వినియోగం పెరిగేం దుకు కస్టమర్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తోంది. 4జీ మార్కెట్లో పోటీ.. ఎయిర్టెల్ ఇప్పటికే 4జీ సేవలను ప్రారంభించి నగరాలను జోడించుకుంటూ పోతోంది. ఈ రంగంలోకి వొడాఫోన్ డిసెంబరులో ప్రవేశిస్తోంది. అటు రిలయన్స్ జియో నేడో రేపో అన్నట్టు ప్రారంభానికి సిద్ధమవుతోంది. తాజాగా ఐడియా సెల్యులార్ కూడా పోటీలోకి దిగుతోంది. మౌలిక వసతులకుగాను 2015-16లో ఐడియా సుమారు రూ.6,500 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందులో సగం మొత్తాన్ని ఇప్పటికే వ్యయం చేసిందని మార్కెట్ వర్గాల సమాచారం. సేవలపరంగా 4జీ మార్కెట్లో పోటీనిస్తామని కంపెనీ ఎండీ హిమాన్షు కపానియా ఇటీవల వెల్లడించారు. కాగా, బండిల్ ఆఫర్లను ప్రకటించేందుకు ఐడియా సిద్ధమవుతోంది. ఇందుకోసం ఐడియా బ్రాండ్ 4జీ ఎల్టీఈ స్మార్ట్ఫోన్లతోపాటు వైఫై గాడ్జెట్స్‌ను ఆవిష్కరించేందుకు దిగ్గజ కంపెనీలతో చర్చలు జరుపుతోంది.