IIP growth
-
గణాంకాలు.. ‘బేస్ మాయ’!
న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక రంగం ఉత్పత్తి సూచీ (ఐఐపీ) మార్చిలో భారీగా 22.4 శాతం వృద్ధిని (2020 ఇదే నెలతో పోల్చి) నమోదుచేసుకుంది. బేస్ ఎఫెక్ట్ దీనికి ప్రధాన కారణం. ‘లో బేస్ రేటు ఎఫెక్ట్’ వల్ల ఐఐపీ 17.5 శాతం నుంచి 25 శాతం శ్రేణిలో ఉండవచ్చని ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితీ నాయర్ సహా పలువురి అంచనాలకు అనుగుణంగానే తాజా ఫలితం వెలువడ్డం గమనార్హం. ఇక ఏప్రిల్‌లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 4.29 శాతంగా (2020 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. గడచిన మూడు నెలల్లో ఇంత తక్కువ స్థాయి ఇదే తొలిసారి. దీనికి కూడా 2020 ‘హై బేస్ ఎఫెక్ట్’ కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2 నెలల తర్వాత పరిశ్రమలు వృద్ధిబాటకు.. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ దేశ వ్యాప్తంగా కఠిన లాక్డౌన్ అమలైన సంగతి తెలిసిందే. లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో సెపె్టంబర్లో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి వృద్ధిలోకి మారింది. ఒక శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అక్టోబర్‌లో కూడా 4.5 వృద్ధి నమోదయ్యింది. ఇందుకు పండుగల సీజన్ కూడా కలిసి వచి్చంది. అయితే నవంబర్‌లో తిరిగి ఐఐపీ 1.6 శాతం క్షీణతలోకి పడిపోయింది. డిసెంబర్లో తిరిగి 2.2 శాతం వృద్ధి నమోదుచేసుకున్నా, తిరిగి జనవరిలో క్షీణతలోకి (-0.9 శాతం)జారిపోయింది. రెండవ నెలా ఫిబ్రవరిలోనూ మైనస్ 3.4 శాతంలో పారిశ్రామిక రంగం పడిపోయింది. అయితే బేస్ ఎఫెక్ట్ దన్నుతో మూడవ నెల– మార్చిలో భారీ వృద్ధికి జంప్ చేసింది. ఈ కారణంగానే ‘తాజా గణాంకాలను మహమ్మారి ముందు నెలలతో పోల్చి చూడడం సరికాకపోవచ్చు’ అని గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తాజా గణాంకాల ప్రకారం కొన్ని కీలక రంగాలను పరిశీలిస్తే... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77.63 శాతం వాటా ఉన్న ఈ భాగంలో మార్చి వృద్ధి 25.8 శాతంగా నమోదయ్యింది. మార్చి 2020లో 22.8 శాతం ఈ విభాగం పతనమైంది. మైనింగ్: ఈ విభాగంలో వృద్ధి 6.1 శాతం (2020 మార్చిలో 1.3 శాతం క్షీణత) విద్యుత్: 22.5 శాతం పురోగతి (గత ఏడాది మార్చిలో 8.2 శాతం క్షీణత) క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్రపరికరాల ఉత్పత్తికి, డిమాండ్‌కు సంకేతమయిన ఈ విభాగం 38.3 శాతం క్షీణత (2020 మార్చి)నుంచి 41.9 శాతం వృద్ధి బాటకు మారింది. కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజరేటర్లు, ఎయిర్‌కండీషనర్ల వంటి ఈ విభాగంలో 36.8% క్షీణత తాజా సమీక్షా నెల్లో 54.9% వృద్ధికి మారింది. మౌలిక రంగాల గ్రూప్ ఇలా...: ఐఐపీలో దాదాపు 44 శాతం వాటా ఉన్న ఎనిమిది పరిశ్రమల గ్రూప్ 2021 మార్చి ఉత్పత్తి వృద్ధి రేటు భారీగా 6.8 శాతంగా నమోదయ్యింది. ఏప్రిల్‌లో ముగిసిన 2020–21లో ఐఐపీ 8.6 శాతం క్షీణతను చవిచూసింది. ఇదీ... బేస్ ఎఫెక్ట్ ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్ప టితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడం బేస్ ఎఫెక్ట్‌గా పేర్కొంటారు. ఇక్కడ 2020 మార్చిలో 18.7% క్షీణత నమోదుకావడం (లో బేస్) ఇక్కడ గమనార్హం. అప్పటి నుంచీ 2020 ఆగస్టు వరకూ పారిశ్రామిక ఉత్పత్తి మైనస్‌లోనే ఉంది. ఈ ప్రాతిపదికన ఆగస్టు వరకూ పారిశ్రామిక ఉత్పత్తిలో భారీ వృద్ధి రేట్లు నమోదయ్యే అవకాశాలే అధికం. రిటైల్ ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, 2020 ఏప్రిల్‌లో లాక్‌డౌన్‌తో ధరలు పెరగడం (హై బేస్) తాజా గణాంకాల్లో ‘రేటు(%) తగ్గుదల’ను సూచిస్తుందన్నది విశ్లేషణ. తగ్గిన కూరగాయల ధరలు రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) ఏప్రిల్‌లో 3 నెలల కనిష్టం 4.29%గా (2020 ఇదే నెలతో పోల్చి) నమోదైంది. కూరగాయలు, తృణ ధాన్యాల వంటి నిత్యావసరాల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. ఆహార ద్రవ్యోల్బణం 2.02% తగ్గి 4.87%కి దిగివచ్చింది. గణాంకాల ప్రకారం, కూరగాయల ధరలు 14.18 శాతం తగ్గాయి. చక్కెర, సంబంధిత ఉత్పత్తుల ధరలు 5.99% తగ్గాయి. తృణ ధాన్యాల ధరలు 2.96% దిగివచ్చాయి. కఠిన లాక్డౌన్ పరిస్థితుల్లో 2020 ఏప్రిల్‌లో సీపీఐ గణాంకాలు అధికారికంగా విడుదల కాలేదు. అయితే అప్పటి లాక్డౌన్ వల్ల రిటైల్ ధరలు తీవ్రంగా ఉన్నాయని అప్పటితో పోలి్చతే ఇప్పుడు ధరలు తగ్గడం (హై బేస్ వల్ల) ‘శాతాల్లో’ కొంత సానుకూలత చూపుతోందని ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితీ నాయర్ పేర్కొన్నారు. చదవండి: కరోనా పోరులో భారత్‌కు అండగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ -
పరిశ్రమలు మళ్లీ ‘ప్లస్’లోకి..
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక రంగం నవంబర్‌లో వెలుగురేఖలు చూసింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 1.8 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకుంది. భారత్ పారిశ్రామిక రంగం మూడు నెలల తర్వాత వృద్ధిబాటలోకి రావడం గమనార్హం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లలో భారత్ పారిశ్రామిక రంగంలో అసలు వృద్ధినమోదుకాకపోగా, క్షీణ రేటు నెలకొంది. మొత్తం సూచీలో మెజారిటీ వాటా ఉన్న తయారీ రంగం కూడా క్షీణతలో నుంచి బయటపడ్డం మొత్తం గణాంకాలకు కొంత సానుకూలమైంది. శుక్రవారం జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ►2018 నవంబర్‌లో పారిశ్రామిక రంగం ఉత్పత్తి వృద్ధి రేటు కేవలం 0.2 శాతం. ►సూచీలో దాదాపు 77 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం 2.7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. 2018 ఇదే నెలలో ఈ విభాగం అసలు వృద్ధిలేకపోగా –0.7 శాతం పడింది. నవంబర్ తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 13 సానుకూల ఫలితాలనే ఇచ్చాయి. ►విద్యుత్ రంగం విషయానికి వస్తే పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. 2018 నవంబర్‌లో కనీసం 5.1 శాతం వృద్ధి నమోదయితే, 2019 ఇదే నెలలో అసలు వృద్ధిలేకపోగా –5 శాతం క్షీణత నమోదయ్యింది. ►మైనింగ్ విషయంలో క్షీణ రేటు 1.7 శాతంగా ఉంది. అయితే ఈ రేటు 2018 నవంబర్‌లో పోల్చితే (–2.7 శాతం) తగ్గడం గమనార్హం. ►భారీ యంత్రపరికరాలు, పెట్టుబడులను సూచించే క్యాపిటల్ గూడ్స్ విభాగంలో –8.6 శాతం క్షీణత నమోదుకావడం గమనార్హం. పైగా 2018 నవంబర్ క్షీణత స్థాయి (–4.1 శాతం) పెరగడం ఆందోళన కలిగించే అంశం. ►ఎఫ్ఎంసీజీ (కన్జూమర్ నాన్–డ్యూరబుల్ సెగ్మెట్) వస్తువుల విభాగంలో 2 శాతం స్వల్ప వృద్ధి (2018 నవంబర్‌లో –0.3 శాతం) నమోదయ్యింది. అయితే రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో మాత్రం వృద్ధి నమోదుకాలేదు. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ ఇక ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ చూస్తే, వృద్ధి రేటు కేవలం 0.6 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే కాలంలో ఈ రేటు 5 శాతంగా ఉంది. విధాన నిర్ణేతలకు ఊరట పారిశ్రామిక రంగం తాజా గణాంకాలు ఇటు మార్కెట్‌కు, అటు విధాన నిర్ణేతలకు కొంచెం ఊరటనిస్తాయి. క్యాపిటల్ గూడ్స్ విభాగంలో క్షీణత తగ్గుముఖం పడుతుండడం ఆశాజనకమైన అంశం. –రుమ్కీ మజుందర్, ఆర్థికవేత్త, డెలాయిట్ ఇండియా బేస్ ఎఫెక్ట్ మాత్రమే.. ఇప్పుడు కనిపించిన పారిశ్రామిక వృద్ధి రేటు కేవలం బేస్ ఎఫెక్ట్ మాత్రమే. 2018 ఇదే నెలల్లో అతి తక్కువ రేటు ప్రతిబింబమిది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి వరకూ (మార్చి) ఈ ఫలితాలు ఇలానే ఉండే వీలుంది. –కరణ్, మహర్షి, యాక్యురేట్ రేటింగ్స్ అండ్ రిసెర్చ్ -
మౌలిక పరిశ్రమల దారుణ పతనం
ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్... ద్రవ్యలోటు... విదేశీ రుణ భారం... ఇలా ఆర్థిక రంగానికి సంబంధించి సోమవారం వెలువడిన లెక్కలన్నీ ఆర్థిక విశ్లేషకులకు నిరాశ కలిగిస్తున్నాయి. ఆయా అంశాలను పరిశీలిస్తే... న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమలతో కూడిన మౌలిక రంగం గ్రూప్ ఆగస్టులో దారుణ పనితనాన్ని ప్రదర్శించింది. ఆగస్టులో ఈ గ్రూప్‌లో అసలు వృద్ధిలేకపోగా –0.5 శాతం క్షీణత నమోదయ్యింది. అంటే 2018 ఇదే నెలతో పోల్చి (సంబంధిత నెల్లో వృద్ధి 4.7 శాతం) ఈ గ్రూప్ ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా, క్షీణతలోకి జారిందన్నమాట. గడచిన మూడు సంవత్సరాల్లో (2015 నవంబర్‌లో –1.3 శాతం తరువాత) ఇలాంటి స్థితిని (క్షీణత) చూడ్డం ఇదే తొలిసారి. మొత్తం ఎనిమిది పరిశ్రమల్లో ఐదు క్షీణతను చూడ్డం మరో ప్రతికూలాంశం. సోమవారం విడుదలైన గణాంకాలను పరిశీలిస్తే.. బొగ్గు: 2.4%(2018 ఆగస్టు) వృద్ధి తాజా సమీక్షా నెలలో (2019 ఆగస్టు) –8.6%కి క్షీణించింది. క్రూడ్ ఆయిల్: మరింత క్షీణతలోకి జారింది. –3.7 శాతం నుంచి –5.4 శాతానికి పడింది. సహజ వాయువు: 1 శాతం వృద్ధి రేటు నుంచి –3.9 శాతం క్షీణతలోకి పడిపోయింది. సిమెంట్: ఈ రంగంలో ఆగస్టులో –4.9 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 ఇదే నెల్లో ఈ రంగం భారీగా 14.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. విద్యుత్: 7.6 శాతం వృద్ధి రేటు –2.9 శాతం క్షీణతలోకి పడిపోయింది. రిఫైనరీ ప్రొడక్టులు: ఈ రంగంలో వృద్ధి 2.6 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే నెలల్లో ఈ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 5.1 శాతంగా ఉంది. స్టీల్: ఈ రంగంలో వృద్ధిరేటు 4 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది. ఎరువులు: ఈ రంగంలో క్షీణ రేటు వృద్ధిలోకి మారడం గమనార్హం. 2019 ఆగస్టులో వృద్ధి రేటు 2.9% నమోదయ్యింది. అయితే 2018 ఇదే నెల్లో వృద్ధిలేకపోగా –5.3% క్షీణత నమోదయ్యింది. ఐదు నెలల్లోనూ పేలవమే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఎనిమిది పరిశ్రమల వృద్ధి రేటు 2.4 శాతంగా ఉంది. అయితే 2018 ఇదే నెలలో ఈ వృద్ధిరేటు 5.7 శాతం. ఐఐపీపై ప్రభావం... పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఎనిమిది పరిశ్రమల వాటా దాదాపు 38%. ఆగస్టులో ఐఐపీ గ్రూప్ పనితీరుపై తాజా ఎనిమిది పరిశ్రమల గ్రూప్ ఫలితాల ప్రతికూల ప్రభావం ఉంటుందన్నది నిపుణుల విశ్లేషణ. అక్టోబర్ 2వ వారంలో ఐఐపీ ఆగస్టు ఫలితాలు వెల్లడికానున్నాయి. జూలైలో ఐఐపీ (4.3%) కొంత మెరుగైన ఫలితాన్ని ఇచి్చనప్పటికీ, ఇది రికవరీకి సంకేతం కాదని తాజా (ఆగస్టు మౌలిక రంగం గ్రూప్) గణాంకాలు సూచిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. -
తయారీ, మైనింగ్ పేలవం
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు మెరుగుపడ్డం లేదు. జూన్‌లో కేవలం 2 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జూన్‌తో (అప్పట్లో వృద్ధి రేటు 7 శాతం) పోల్చితే 2019 జూన్‌లో కేవలం 2 శాతం వృద్ధి మాత్రమే నమోదయ్యిందన్నమాట. గడచిన నాలుగు నెలల్లో ఇంత తక్కువస్థాయి వృద్ధి రేటు ఇదే తొలిసారి. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► మైనింగ్, తయారీ రంగాలు పేలవ పనితనాన్ని ప్రదర్శించాయి. ► దేశంలో పారిశ్రామికరంగం వృద్ది రేటు మందగమనంలో కొనసాగుతోంది. ఫిబ్రవరిలో కేవలం 0.2 శాతం వృద్ధి నమోదయ్యింది. మార్చిలో 2.7 శాతంగా ఉంది. ఏప్రిల్ (4.3 శాతం), మే నెలల్లో (4.6 శాతం) కొంత బాగుందనిపించినా, మళ్లీ జూన్ వచ్చే సరికి భారీగా జారిపోయింది. ► తయారీ: 2018 జూన్‌లో 6.9 శాతంగా ఉన్న తయారీ రంగంలో వృద్ధి రేటు 2019 జూన్‌లో కేవలం 1.2 శాతానికి పడిపోయింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 8 మాత్రమే సానుకూల వృద్ధిరేటును నమోదు చేసుకున్నాయి. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్రపరికరాల ఉత్పత్తి, డిమాండ్లను సూచించే క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి 9.7 శాతం నుంచి 6.5 శాతానికి పడిపోయింది. ► మైనింగ్: మైనింగ్‌లో వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 1.6 శాతానికి పడిపోయింది. ► విద్యుత్: విద్యుత్ ఉత్పత్తి 8.5 శాతం నుంచి 8.2 శాతానికి తగ్గింది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: కార్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా –5.5 శాతం క్షీణత నమోదయ్యింది. ► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: కాస్మొటిక్స్, క్లీనింగ్ ప్రొడక్ట్స్, దుస్తులు వంటి ఫాస్ట్ మూ వింగ్ కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో మాత్రం వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంది. జూన్ త్రైమాసికమూ మందగమనమే ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలు ఏప్రిల్, మే, జూన్ త్రైమాసిక కాలాన్ని చూసినా, పారిశ్రామిక వృద్ధి మందగమనంలోనే ఉంది. ఈ కాలంలో వృద్ధి రేటు కేవలం 3.6 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 5.1 శాతంగా ఉంది. -
మళ్లీ పరిశ్రమల పడక
• అక్టోబర్‌లో తిరోగమనం.. • వృద్ధిలేకపోగా -1.9 శాతం క్షీణత • క్షీణతతో పారిశ్రామిక రంగం దిగాలు • రేటు కోత డిమాండ్ న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి 2016 అక్టోబర్‌లో మళ్లీ నిరాశను మిగిల్చింది. 2015 అక్టోబర్ నెలతో (9.9 శాతం వృద్ధి) పోల్చితే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా -1.9 శాతం క్షీణించింది. జూలై నెలలో సూచీ - 2.5 శాతం క్షీణతను నమోదచేసుకుంది. తరువాతి నెల ఆగస్టులో కూడా -0.7 శాతం క్షీణత నమోదరుు్యంది. అరుుతే సెప్టెంబర్‌లో మాత్రం ఈ క్షీణ ధోరణి నుంచి బయటపడి, 0.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. నెల తిరిగే సరికి తన క్రితం క్షీణ ధోరణికి మారింది. పెద్ద నోట్ల రద్దు పరిస్థితులు, డిమాండ్‌పై ప్రభావం వంటి అంశాల నేపథ్యంలో నవంబర్ నుంచీ మరికొన్ని నెలలూ ఐఐపీ క్షీణతనే కొనసాగే వీలుందన్న విశ్లేషణలు వస్తున్నారుు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక ఉత్పత్తి ఊపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు తగ్గింపు అవసరమన్న డిమాండ్ ఆయా వర్గాల నుంచి వినిపిస్తోంది. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన పారిశ్రామిక ఉత్పత్తి లెక్కలను ఒకసారి చూస్తే... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 75 శాతం ఉన్న ఈ విభాగంలో వృద్ధి అసలు లేకపోగా -2.4 శాతం క్షీణత నమోదరుు్యంది. 2015 అక్టోబర్‌లో ఈ విభాగం వృద్ధి 10.6 శాతం. తయారీ రంగంలోని మొత్తం 22 గ్రూపుల్లో సగం ప్రతికూలతను నమోదుచేసుకున్నారుు. ఇక ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య 5.1 శాతం వృద్ధి నుంచి -1.0% క్షీణతలోకి జారింది. మైనింగ్: 3.5 శాతం వృద్ధి -3.1 శాతం క్షీణతలోకి మళ్లింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో కూడా ఈ రేటు 2.2 శాతం వృద్ధి నుంచి -0.2 శాతం క్షీణతలోకి చేరింది. విద్యుత్: 2015 అక్టోబర్ నెలలో 5.3 శాతం వృద్ధి తాజా నెలలో 1.1% పడిపోరుుంది. ఏప్రిల్-అక్టోబర్ మధ్య ఈ రేటు 5.2% నుంచి 4.6 శాతానికి తగ్గింది. క్యాపిటల్ గూడ్స్: వ్యవస్థలో డిమాండ్‌ను ప్రతిబింబించే భారీ పరికరాల ఉత్పత్తులకు సంబంధించిన ఈ విభాగం ఏకంగా - 25.9 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. వినియోగ వస్తువులు: మొత్తంగా వినియోగ వస్తువుల ఉత్పత్తి 18.3 శాతం వృద్ధి నుంచి -1.6 శాతం క్షీణతలోకి పడిపోరుుంది. ఏడు నెలల్లో: ఇక ఏప్రిల్-అక్టోబర్ మధ్య ఏడు నెలల కాలంలో 2015 ఇదే కాలంతో పోల్చితే 4.8 శాతం వృద్ధి -0.3 శాతం క్షీణతలోకి జారింది.