మళ్లీ పరిశ్రమల పడక
• అక్టోబర్‌లో తిరోగమనం..
• వృద్ధిలేకపోగా -1.9 శాతం క్షీణత
• క్షీణతతో పారిశ్రామిక రంగం దిగాలు
• రేటు కోత డిమాండ్
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి 2016 అక్టోబర్‌లో మళ్లీ నిరాశను మిగిల్చింది. 2015 అక్టోబర్ నెలతో (9.9 శాతం వృద్ధి) పోల్చితే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా -1.9 శాతం క్షీణించింది. జూలై నెలలో సూచీ - 2.5 శాతం క్షీణతను నమోదచేసుకుంది. తరువాతి నెల ఆగస్టులో కూడా -0.7 శాతం క్షీణత నమోదరుు్యంది. అరుుతే సెప్టెంబర్‌లో మాత్రం ఈ క్షీణ ధోరణి నుంచి బయటపడి, 0.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. నెల తిరిగే సరికి తన క్రితం క్షీణ ధోరణికి మారింది.
పెద్ద నోట్ల రద్దు పరిస్థితులు, డిమాండ్‌పై ప్రభావం వంటి అంశాల నేపథ్యంలో నవంబర్ నుంచీ మరికొన్ని నెలలూ ఐఐపీ క్షీణతనే కొనసాగే వీలుందన్న విశ్లేషణలు వస్తున్నారుు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక ఉత్పత్తి ఊపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు తగ్గింపు అవసరమన్న డిమాండ్ ఆయా వర్గాల నుంచి వినిపిస్తోంది. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) శుక్రవారం విడుదల చేసిన పారిశ్రామిక ఉత్పత్తి లెక్కలను ఒకసారి చూస్తే...
తయారీ: మొత్తం సూచీలో దాదాపు 75 శాతం ఉన్న ఈ విభాగంలో వృద్ధి అసలు లేకపోగా -2.4 శాతం క్షీణత నమోదరుు్యంది. 2015 అక్టోబర్‌లో ఈ విభాగం వృద్ధి 10.6 శాతం. తయారీ రంగంలోని మొత్తం 22 గ్రూపుల్లో సగం ప్రతికూలతను నమోదుచేసుకున్నారుు. ఇక ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య 5.1 శాతం వృద్ధి నుంచి -1.0% క్షీణతలోకి జారింది.
మైనింగ్: 3.5 శాతం వృద్ధి -3.1 శాతం క్షీణతలోకి మళ్లింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో కూడా ఈ రేటు 2.2 శాతం వృద్ధి నుంచి -0.2 శాతం క్షీణతలోకి చేరింది.
విద్యుత్: 2015 అక్టోబర్ నెలలో 5.3 శాతం వృద్ధి తాజా నెలలో 1.1% పడిపోరుుంది. ఏప్రిల్-అక్టోబర్ మధ్య ఈ రేటు 5.2% నుంచి 4.6 శాతానికి తగ్గింది.
క్యాపిటల్ గూడ్స్: వ్యవస్థలో డిమాండ్‌ను ప్రతిబింబించే భారీ పరికరాల ఉత్పత్తులకు సంబంధించిన ఈ విభాగం ఏకంగా - 25.9 శాతం క్షీణతను నమోదుచేసుకుంది.
వినియోగ వస్తువులు: మొత్తంగా వినియోగ వస్తువుల ఉత్పత్తి 18.3 శాతం వృద్ధి నుంచి -1.6 శాతం క్షీణతలోకి పడిపోరుుంది.
ఏడు నెలల్లో: ఇక ఏప్రిల్-అక్టోబర్ మధ్య ఏడు నెలల కాలంలో 2015 ఇదే కాలంతో పోల్చితే 4.8 శాతం వృద్ధి -0.3 శాతం క్షీణతలోకి జారింది.