IIT Kharagpur students
-
వైరల్ వీడియో: ఐఐటీ విద్యార్థులపై ప్రొఫెసర్ చిందులు
-
ఐఐటీ విద్యార్థులపై ప్రొఫెసర్ చిందులు, వైరల్ వీడియో
ఖరగ్‌పూర్: కరోనా సంక్షోభ సమయంలో ఆన్లైన్ క్లాసులు, జూమ్ మీటింగ్‌లో తప్పనిసరిగా మారిపోయాయి. ఈ క్రమంలో విద్యార్థుల కష్టాలు అన్నీ కావు. తాజాగా ఒక ఐఐటీ ప్రొఫెసర్ విద్యార్థులపై విరుచుకు పడింది. ఐఐటీ ఖరగ్‌పూర్ అసోసియేట్ ప్రొఫెసర్ సీమా సింగ్ ఆన్లైన్క్లాస్లో విద్యార్ధులతోపాటు, వారి తల్లిదండ్రులపైనా అనుచిత వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆన్క్లాస్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇంగ్లీష్ క్లాస్ చెప్తూ విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించింది. విద్యార్థులనే కాకుండా వారి తల్లిదండ్రులపై కూడా దూషణలకు దిగింది. ‘మీరు నా పై కంప్లయిట్ ఎక్కడ ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి. వీలైతే సెంట్రల్ మినిష్టర్స్‌కు కూడా కంప్లయిట్ ఇచ్చుకోండి’ అంటూ ఆమె విద్యార్ధులపై చిందులు వేసింది. అంతేకాదు పరీక్షలో ఫెయిల్ చేస్తానని విద్యార్థులను బెదిరించిన వైనంప పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరొక వీడియోలో విద్యార్థి తాతా చనిపోయినందుకు పరీక్ష నుంచి మినహాయింపు కోరగా, ప్రొఫెసర్ ఆ విద్యార్థిని దూషించింది. ‘నేను కూడా హిందువునే నాకు మన సంప్రదాయాలు, కట్టుబాట్లు నాకు తెలుసు. కోవిడ్ సమయంలో ఇలాంటివి ఎక్కువగా ఎవరూ చేయడం లేదంటూ’ ప్రొఫెసర్ సీమాసింగ్ విద్యార్థిపై మండిపడింది. మరో వీడియోలో క్లాస్‌లో ఉన్న కొంతమంది విద్యార్థులు భారత్ మాతా కీ జై అనగా, వారిపై ‘మీరు దేశానికి ఇది తప్ప ఇంకొటి చేయాలేరా’అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా విద్యార్థుల మార్కులు నా చేతిలో ఉన్నాయంటూ వారిని బెదిరించింది. కాగా ఈ తతంగాన్ని ఐఐటీ విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకివచ్చింది. కాగా ప్రొఫెసర్‌పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని, వెంటనే ఆమెను ఉద్యోగం నుంచి తీసివేయాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు. చదవండి: మే 2 తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిషేదం: ఈసీ -
గూగుల్ సీఈవో అభిమాన నటి ఎవరు?
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఫేవరెట్ నటి , ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలుసా? ఐఐటీ ఖరగ్ పూర్ విద్యార్థులతో ముచ్చటించిన పిచాయ్ తన జీవితంలోని కొన్నిముఖ్య ఘట్టాలను ప్రస్తావించారు. జనవరి4 ఇండియాకు వచ్చిన సుందర్ పిచాయ్ 23 ఏళ్ల తరువాత మళ్లీ గురువారం ఐఐటీ ఖరగ్ పూర్ ను సందర్శించారు. డిజిటల్ ఎకానమీ లో ఇండియా ప్రముఖ పాత్ర పోషించనుందనీ, 5-10 ఏళ్లలో భారత మార్కెట్ లో భారీగా స్టార్ట్ అప్స్ కు మంచి అవకాశమన్నారు. ఎంట్రీ లెవల్ (30 డాలర్లు) స్మార్ట్ ఫోన్ తయారీపై దృష్టి పెట్టామని పిచాయ్ పేర్కొన్నారు. విద్యార్థిగా పలు స్మృతులను నెమరువేసుకున్న పిచాయ్ అనేక ఆసక్తికర విఫయాలను విద్యార్థులతో పంచుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ తనకు ఇష్టమైన భారతీయ నటి అనీ, అలాగే ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లి తన పేవరెట్ క్రికెటర్ అని చెప్పారు. విరాట్ కోహ్లి ఆట చూడటానికి ఎక్కువగా చూసేవాడినన్నారు. ఫస్ట్ కంప్యూటర్ ను ఐఐటీ ఖరగ్ పూర్ లో చూశాను, 20 ఏళ్ల వయసులో నా మొదటి విమాన ప్రయాణం. కానీ సంవత్సరానికి10 లక్షలమంది విమానాల్లో ప్రయాణించేలా ఇపుడు భారత్ పూర్తిగా మారిపోయింది. రాత్రిళ్లు బాగా మేల్కొని చదవడంతో పొద్దున్న క్లాసులు మిస్ అయ్యేవాణ్ని. నేనూ క్లాసు లు బంక్ కొట్టేవాణ్ణి. హాస్టల్ ఫుడ్ లో పప్పా , సాంబారా అని ఎదురు చూసే వాణ్ణని, తనకు హిందీ అంత బాగా రాదంటూ తన ఐఐటీ రోజులను గుర్తు చేసుకున్నారు. అనేక విషయాల్లో ఆసక్తి చూపించాలని జీవితంలో సాహసాలు చేయడానికి ప్రయత్నించడం ముఖ్యమని విద్యార్థులకు చెప్పారు. దేశంలో విద్యావ్యవస్థ విద్యార్థులపై ఒత్తిడి పెంచేదిగాఉందని ఇది మారాలని ఆయన సూచించారు. ఐఐటీ లో సీటు రావడానికి హార్డ్ వర్క్ తో కూడుకున్నదని, ఎనిమిదివ తరగతి నుంచే ఐఐటీ విద్యార్థులు ఆసక్తిని పెంచుకోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారు. ఏప్రిల్ పూల్ డే రోజు గూగుల్ ఇంటర్వ్యూ జరిగిందనీ, దీంతో నమ్మకం కుదరలేదనీ, నిజంగా జోక్ ఏమో అనుకున్నానంటూ తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఐఐటి ఖరగ్ పూర్ ను గూగుల్ డూడుల్ గా చూడొచ్చా అని ప్రశ్నించినపుడు.. అవకాశాలు తక్కువే కానీ.. తమ టీంకు మెయిల్ పెట్టమని సూచించారు. గూగుల్ లో్ ఉద్యోగం సాధించడం ఎలా అని మరో ఐఐటీయన్ ప్రశ్నించినపుడు.. త్వరలోనే ఖరగ్ పూర్ లో గూగుల్ క్యాంపస్ ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. కాగా 1993 లో ఐఐటీ ఖరగ్ పూర్ లో లోహశోధన ఇంజనీరింగ్, బిజినెస్ వార్టన్ స్కూల్ నుంచి ఎంబిఎ డిగ్రీ పట్టా పుచ్చుకున్న సుందర్ పిచాయ్ 2004 లో గూగుల్ సంస్థలో చేరారు. అనంతరం ఆగష్టు 2015 లో గూగుల్ సీఈఓగా నియమితులైన సంగతి తెలిసిందే. -
'స్మార్ట్ హోమ్స్' కు స్మార్ట్ యాప్
కోల్ కత్తా : భారత్ ను స్మార్ట్ సిటీలుగా రూపకల్పన చేయాలని మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ స్మార్ట్ సిటీలతో రూపకల్పనతో పాటు మన ఇల్లుల్ని కూడా స్మార్ట్ గా ఉంచాలని ఆకాంక్షించారు ఖరగ్ పూర్ ఐఐటీ విద్యార్థులు. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ హోమ్స్ కోసం, స్మార్ట్ యాప్ కు శ్రీకారం చుట్టారు. మొబైల్ స్క్రీన్ పై ఒక్క టచ్ చేస్తే చాలు, ఇంటి మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేలా 'అలైవ్ హోమ్' యాప్ ను టెక్నాలజీ యూజర్ల ముందుకు తీసుకొచ్చారు. ఐఐటీ ఖరగ్ పూర్ కు చెందిన ఐదో ఏడాది ఉత్సాహవంతులైన టెక్నాలజీ విద్యార్థులు పూనమ్ గుప్తా, అలోక్ దీక్షిత్ లు ఈ అప్లికేషన్ ను రూపొందించారు. స్మార్ట్ హోమ్ లోపలున్న ప్రతి పనిని నిర్వహించడానికి ఈ యాప్ ఉపయోగపడనుంది. ఇంట్లో ఉన్న ప్రతీ ఎలక్ట్రానిక్ డివైజ్ లను ఈ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. యూజర్ల మొబైల్ డివైజ్ ద్వారా వాటిని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. హోమ్ ఆటోమేషన్ ఇప్పటికే మార్కెట్లో ఉంది. కానీ అది ఎంతో ఖరీదైనది. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ పరంగా ఎక్కువ మందికి యాక్సెస్ లో ఉంచేలా ఈ యాప్ ను రూపొందించామని ఈ యాప్ సృష్టికర్తలో ఒకరైన అలోక్ దీక్షిత్ చెప్పారు. ఈ హై ఎండ్ టెక్నాలజీని తక్కువ ధరకే యూజర్లకు అందిస్తామని పేర్కొన్నారు. ఇళ్లలో ఉండే స్విచ్ బోర్డులకు బదులు ఈ యాప్ ద్వారా స్మార్ట్ స్విచ్ లను వాడుకోవచ్చు. అదేవిధంగా ప్రతి ఎలక్ట్రానిక్ డివైజ్ కు ఈ యాప్ రిమోట్ కంట్రోల్ ల ఉపయోగపడుతుంది. ఇంట్లో ఏసీని కాని, గ్రీసర్ ను కాని ఆన్ చేసి మర్చిపోయి ఆఫీస్ కు వచ్చేస్తే ఈ యాప్ యూజర్లకు నోటిఫికేషన్ అలారమ్ ఇస్తుంది. ఈ అలారమ్ తో ఆఫీసు నుంచే వాటిని ఆఫ్ చేసుకోవచ్చు. ఎవరైనా మీ ఇంట్లోకి ప్రవేశించి లైట్లు వేస్తే ఈ యాప్ లోని స్మార్ట్ స్విచ్ ఆప్షన్ వల్ల వెంటనే యూజర్లకు తెలిసిపోతుంది. గతేడాది నుంచి ఈ యాప్ రూపొందించడానికి ఐఐటీ విద్యార్థులు అహర్నిశలు కృషిచేశారు. దీనిపై వారు పేటెంట్ ను కూడా దాఖలు చేసుకున్నారు. ఈ యాప్ ఇన్ స్టాలేషన్ ద్వారా ఖరగ్ పూర్ ఐఐటీని కూడా స్మార్ట్ క్యాంపస్ గా తీర్చిదిద్దారు.