illicit liqour
-
రూ.ఎనిమిది లక్షల కోట్ల అక్రమ దందా!
దుస్తులు, నిత్యం వినియోగించే వస్తువులు సహా ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) వంటి ఐదు కీలక విభాగాల్లో అక్రమ మార్కెట్ పెరుగుతోందని ఫిక్కీ తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ అక్రమ మార్కెట్ విలువ ఏకంగా రూ.7.97 లక్షల కోట్లకు చేరిందని నివేదికలో పేర్కొంది. అక్రమ వ్యాపారాన్ని అరికట్టడానికి కఠిన శిక్షలు, మెరుగైన నిఘా వ్యవస్థను అమలు చేయాలని కేంద్ర సహాయమంత్రి రణ్విత్‌సింగ్ బిట్టు తెలిపారు.ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) కమిటీ-క్యాస్కేడ్, థాట్ ఆర్బిట్రేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నివేదిక విడుదల చేశాయి. అందులోని వివరాల ప్రకారం..2022-23లో అధికంగా ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంలో రూ.2.23 లక్షల కోట్ల అక్రమ మార్కెట్ జరిగింది. ఇది దేశంలో జరిగిన మొత్తం అక్రమ మార్కెట్లో నాలుగో వంతు కంటే ఎక్కువ. వస్త్రాలు, దుస్తుల విభాగంలో అక్రమ వ్యాపారం రూ.4.03 లక్షల కోట్లుగా ఉంది. దేశీయ అక్రమ మార్కెట్లో దీని వాటా సగానికిపైగా ఉంది. 2017-18లో ఇది రూ.3.11 లక్షల కోట్లుగా ఉండేది. 29.67% ఈ మార్కెట్ వృద్ధి చెందింది.ఫిక్కి క్యాస్కేడ్ పదో ఎడిషన్ ‘మాస్క్రేడ్ 2024’ కార్యక్రమంలో కేంద్రమంత్రి రణ్విత్‌సింగ్ బిట్టు మాట్లాడుతూ..‘దేశ ఆర్థిక వృద్ధిని నాశనం చేసే అక్రమ మార్కెట్‌కు వ్యతిరేకంగా వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు సమన్వయంతో పని చేయాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించడంతోపాటు భారీ జరిమానాలు విధించాలి’ అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, సీబీఐసీ సభ్యులు రాజీవ్ తల్వార్ మాట్లాడుతూ..‘నకిలీ వస్తువులు, స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు అధునాతన సాంకేతికతతో పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. దీనివల్ల రోజూ సగటున 60 అక్రమాలు గుర్తిస్తున్నాం. గత 15 నెలల్లో 3,000 మందిని అరెస్టు చేశాం. రూ.40 కోట్ల విలువైన విదేశీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నాం’ అన్నారు. ఇదీ చదవండి: 32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలుఅక్రమ వ్యాపారం అనేది కేవలం భారత్‌కు సంబంధించింది మాత్రమే కాదని, ఇది ప్రపంచ సమస్య అని ఫిక్కీ క్యాస్కేడ్ ఛైర్మన్ అనిల్ రాజ్‌పుత్ అన్నారు. ‘ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ అక్రమ మార్కెట్‌పై తగిన చర్యలు చేపట్టాలి. అన్ని దేశాలు పరస్పరం సహకరించుకుంటూ ఈ సమస్యను పరిష్కరించాలి’ అని చెప్పారు. కార్యక్రమంలో ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ కంప్లయన్స్ అండ్ ఫెసిలిటేషన్ డైరెక్టరేట్ డైరెక్టర్ ప్రణబ్ కుమార్ దాస్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (ఐసీఏ) డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా పాల్గొన్నారు.నివేదికలోని వివరాలు..ఎఫ్ఎంసీజీ (ప్యాకేజ్డ్ ఫుడ్), ఎఫ్ఎంసీజీ (వ్యక్తిగత, గృహ సంరక్షణ వస్తువులు), మద్యం, పొగాకు, వస్త్రాలు & దుస్తులు వంటి ఐదు విభాగాల్లో అధికంగా అక్రమ రవాణా సాగుతోంది.2022-23లో దేశంలో అక్రమ మార్కెట్ పరిమాణం రూ.7,97,726 కోట్లుగా ఉంది.ఎఫ్ఎంసీజీ (ప్యాకేజ్డ్ ఫుడ్)-రూ.2,23,875 కోట్లుఎఫ్ఎంసీజీ (వ్యక్తిగత, గృహ సంరక్షణ వస్తువులు)-రూ.73,813 కోట్లువస్త్రాలు, దుస్తులు-రూ.4,03,915 కోట్లుపొగాకు ఉత్పత్తులు-రూ.30,017 కోట్లుమద్యం-రూ.66,106 కోట్లుఇదీ చదవండి: పెరిగిన జెరోధా లాభం! భవిష్యత్తులో నష్టాలు తప్పవన్న సీఈఓదేశీయంగా వివిధ మార్గాల్లో విభిన్న వస్తువులను అక్రమంగా తరలిస్తూ స్థానికంగా మార్కెట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి న్యాయబద్ధంగా పన్నుల రూపంలో రావాల్సిన నిధులు సమకూరడం లేదు. దాంతో తప్పక పన్నులు, ఇతర వస్తువుల ధరలు పెంచుతున్నారు. ఏదేమైనా అక్రమ మార్కెట్ సామాన్యుడి నెత్తిన భారంగా మారుతోంది. -
‘సారా తాగితే చస్తారు’.. కల్తీ మద్యం మరణాలపై సీఎం నితీశ్
పట్నా: మద్య నిషేధం అమల్లో ఉన్న బిహార్‌లో కల్తీ సారా మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. శరన్ జిల్లాలో బుధవారం కల్తీ సారా కాటుకు 21 మంది బలవగా.. మరో 9 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయారు. వారంతా మంగళవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. ఈ అంశం రాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది. సారాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్ష బీజేపీ సభ్యులు ఆరోపించారు. వారిపై సీఎం నితీశ్ కుమార్ మండిపడ్డారు. తాగిన వారు చస్తారు.. జాగ్రత్త కల్తీసారా అంశంపై అసెంబ్లీ వేదికగా విపక్షాలపై మడ్డిపడ్డ సీఎం నితీశ్ కుమార్ తాజాగా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే మద్యం తాగుతారో వారు చనిపోతారు అంటూ పేర్కొన్నారు. ఛాప్రా కల్తీ సారా ఘటనపై మీడియాతో మాట్లాడారు నితీశ్. ‘లిక్కర్ తాగే వారు చనిపోతారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మేము పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బాపు(మహాత్మా గాంధీ) ఏం చెప్పారో మీకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ఏం చెబుతున్నాయి? మద్యం ప్రమాదకరమని ఇంటింటికి తెలియజేస్తున్నాం. చాలా కాలంగా కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతున్నారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతోంది. ప్రజలే ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. నిషేధం ఉన్న చోట లిక్కర్ అమ్ముతున్నారంటే.. అందులో ఏదో ఉన్నట్లు అర్థం. కొందరు తెలిసి తప్పులు చేస్తున్నారు.’ అని పేర్కొన్నారు నితీశ్ కుమార్. ఇదీ చదవండి: మీరు తాగొచ్చారు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం -
కల్తీ మద్యం తాగి ఆరుగురు మృతి.. పలువురికి అస్వస్థత
పట్నా: కల్తీ మద్యానికి బిహార్‌లో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా మరో ఆరుగురు మద్యం కాటుకు బలయ్యారు. ఛాప్రా జిల్లాలోని సరన్ ప్రాంతం ఐసౌపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దోయిలా గ్రామంలో మంగళవారం ఈ విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం సేవించిన క్రమంలో ఐదుగురు గ్రామంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా.. మరికొంత మంది అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. మృతులు సంజయ్ సింగ్, హరిందర్ రామ్, కునాల్ సింగ్, అమిత్ రంజన్లు సహా మరికొంత మంది కల్తీ మద్యం తాగి అనారోగ్యానికి గురయ్యారని మధురా డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా ఎవరైనా అనారోగ్యానికి గురయ్యారా? అనే విషయంపై విచారిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: ప్రాణం తీసిన ప్రేమ?.. 80 రోజుల క్రితం అదృశ్యమై -
మందుబాబులకు షాక్.. తాగేదంతా మద్యం కాదు
సాక్షి, వికారాబాద్: వికారబాద్ జిల్లా పరిధిలోని 19 మండలాల్లోని మద్యం దుకాణాల యజమానులు ధనార్జనే ధ్యేయంగా మద్యాన్ని కల్తీ చేస్తున్నారు. దీంతో మద్యం ప్రియులకు ఏది అసలో ఏది కల్తీనో తెలియని పరిస్థితి. టెండర్లలో మద్యం షాపులను దక్కించుకున్న వ్యాపారస్తులు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సంపాదించాలనే ఆలోచనతో మద్యాన్ని కల్తీ చేస్తున్నారు. దీంతో మద్యం కల్తీ చేసే వారిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి గుట్టుగా దంగా చేస్తున్నారనే ఆరోపణలు ఊపందుకున్నాయి. ప్రముఖ బ్రాండ్లకు చెందిన బాటిళ్ల మూతలు ఓపెన్ చేసి అందులో చీప్ లిక్కర్, నీటిని కలిపి మల్లీ యథావిధిగా సీల్ చేస్తున్నారు. ఈ వ్యవహారం చాలా రోజులుగా జరుగుతున్నా అధికారులు తమకేమీ తెలియనట్లు గా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. బ్రాండ్లన్నీ కల్తీమయం జిల్లా ఎక్సైజ్ పరిధిలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో మొత్తం 59 వైన్ షాపులు, ఐదు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటికి తోడు గ్రామాలు, తండాల పరిధిలోని ఐదు నుంచి పది వరకు బెల్టు షాపులు ఉన్నాయి. తక్కువ ధరకు లభించే మద్యాన్ని ఎక్కవ ధర ఉన్న బాటిళ్లలో స్టిక్కర్లు, లేబుళ్లను మార్చుతూ విక్రయిస్తున్నారు. ప్రధానంగా పరిగి నియోజకవర్గంలోని పలు దుకాణాల్లో ఈ దందా కొనసాగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరో వైపు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన తాండూరు, కొడంగల్ లోనూ కొనసాగుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. పెరిగిన మద్యం ధరలతో ఈ కల్తీ ప్రక్రియ మరింత ఎక్కువగా సాగుతోంది. చదవండి: హైదరాబాద్‌లో ఫింగర్ ప్రింట్ సర్జరీ ముఠా గుట్టురట్టు వేసిన సీల్ వేసినట్లే.. అధిక ధరలున్న మద్యం సీసాల లేబుళ్లను, స్టిక్కర్లను ఏమాత్రం తేడా లేకుండా ఓపేన్ చేసి మళ్లీ సీల్ వేసేందుకు కొన్ని వైన్‌షాపుల యజమానులు స్థానికేతరులను, కల్తీ చేయడంతో అనుభవం ఉన్నవారిని తీసుకువస్తున్నట్లు సమాచారం. వారికి ఎక్కువ మొత్తంలో జీతాలు ఇచ్చి మద్యాన్ని ఇష్టానుసారంగా కల్తీ చేయిస్తున్నట్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ప్రముఖ బ్రాండ్లలో 25శాతం మద్యాన్ని బయటకు తీస్తూ బదులుగా నీటిని కలుపుతున్నారు. లేదంటే తక్కువ ధరకే లభ్యమయ్యే చీప్ లిక్కర్ ఇతర మందులను కలుపుతూ కల్తీ చేస్తున్నారు. దీంతో వైన్స్ యజమానులు మూడు పువ్వులు, ఆరుకాయలుగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. బెల్టు షాపుల్లోనూ ఈ తరహా వ్యాపారమే కొనసాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. నామమాత్రపు తనిఖీలు జిల్లాలో ఇంత భారీగా మద్యం కల్తీ చేస్తున్న వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏమి తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తుల్లో జోగుతూ కల్తీ మద్యం తయారీకి వత్తాసు పలుకుతున్నారని చర్చించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు, పోలీసు అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మద్యం షాపుల్లో కల్తీ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్లుగా కేటుగాళ్లు తయారయ్యారు. ప్రమాదకర, విషపూరిత రసాయనాలు కలిసి అసలు ఏదో.. నకిలీ ఏదో తెలియకుండా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. -
పీకలదాక మెక్కారు.. బిల్లు కట్టమంటే తప్పుడు కేసులు
లక్నో: కొన్ని పాత సినిమాల్లో పోలీసులు హోటల్‌కు వెళ్లడం.. బాగా తినడం.. బిల్లు కట్టమంటే.. ‘నా దగ్గరే డబ్బులడుగుతావా.. జైలుకెళ్తావా ఏంటి’ అంటూ బెదిరించే సీన్లు చాలా సార్లు చూశాం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి సంఘటన వెలుగు చూసింది. బిల్లు కట్టమని అడిగిన పాపానికి ఓ ధాబా ఓనర్, అతడి కుటుంబ సభ్యుల మీద డ్రగ్స్, మద్యం అక్రమ రవాణ చేస్తున్నారంటూ కేసులు పెట్టారు పోలీసులు. విషయం కాస్త పెద్దది కావడంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు ఇందుకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేశారు. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్ ఈటా జిల్లాలో బాధితుడు ఓ ధాబా నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 4న మధ్యాహ్నం ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ బాధితుడి ధాబాకు వచ్చి భోజనం చేశారు. 400 రూపాయల బిల్లు అయితే వారు కేవలం 100 రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇదెక్కడి న్యాయం.. పూర్తి బిల్లు చెల్లించమని కోరితే.. ధాబా సిబ్బందిని తిడుతూ.. మీ అంతు చూస్తాం అని బెదిరించారు. ఈ ఘటన జరిగిన 40 రోజుల తర్వాత పోలీసులు రెండు జీపుల్లో ఆ ధాబా వద్దకు వచ్చి.. అక్కడ పని చేస్తున్న 9 మందిని జైలుకు తీసుకెళ్లారు. వీరంతా మద్యం, గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని.. అందుకే అరెస్ట్ చేశామని తెలిపారు. అంతేకాక నిందితుల వద్ద నుంచి ఆరు దేశీ తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. (ఫోటో కర్టెసీ: ఎన్డీటీవీ) ఈ క్రమంలో సదరు ధాబా ఓనర్ మాట్లాడుతూ.. ‘‘గతంలో బిల్లు కట్టమని అడిగినందుకు అధికారులు మాపై కక్ష్య కట్టారు. కావాలనే మా మీద అక్రమ కేసులు పెట్టారు. తాగి వచ్చి నా సోదరుడు, సిబ్బందిపై దాడి చేశారు. మా దగ్గర తుపాకులు, గంజాయి దొరికిందని ప్రచారం చేస్తున్నారు. మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. ఒక్కరిని విడిచిపెట్టారు’’ అని తెలిపారు. ఈ వివాదం కాస్త ముదరడంతో జిల్లా ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఈ ఘటనకు బాధ్యులైన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్‌ని సస్పెండ్ చేశారు. విచారణకు ఆదేశించాము అని తెలిపారు. చదవండి: సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో -
కల్తీ మద్యం ఘటనపై స్పందించిన ప్రియాంక
సాక్షి, న్యూఢిల్లీ : యూపీలో కల్తీ మద్యం సేవించి పలువురు మరణించిన ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ విషాద ఘటనకు బాధ్యులైన వారిపై కఠన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు యూపీ ప్రభుత్వం పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రియాంక కోరారు. కల్తీ మద్యం సేవించిన ఘటనలో మరణించిన కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. యూపీ, ఉత్తరాఖండ్‌లో కల్తీ మద్యం ఏరులై పారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ మద్యంతో వందకు పైగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. మరోవైపు కల్తీ మద్యం ఘటనపై యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ యోగి సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ తోడ్పాటు లేనిదే కల్తీ మద్యం వ్యాపారం ఈస్దాయిలో జరగదని మండిపడ్డారు. యూపీలోని సహరన్పూర్, ఖుషీనగర్ జిల్లాలతో పాటు ఉత్తరాఖండ్‌లో కల్తీ మద్యం సేవించి ఇటీవల పలువురు మరణించిన సంగతి తెలిసిందే. -
కల్తీ మద్యం సేవించి 30 మంది మృతి
సాక్షి, న్యూఢిల్లీ : కల్తీ మద్యం సేవించడంతో యూపీ, ఉత్తరాఖండ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని సహరన్పూర్, ఖుషీనగర్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగిన ఘటనలో 16 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మంది అధికారులను సస్పెండ్ చేశామని ఖుషీనగర్ జిల్లా మేజిస్ర్టేట్ అనిల్ కుమార్ తెలిపారు. కల్తీ మద్యం ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. కాగా, కల్తీ మద్యం సేవించిన బాధితులకు తక్షణం వైద్య సాయం అందించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ అధికారులను కోరారు. మృతుల కుటుంబాలకు రూ రెండు లక్షలు, అస్వస్ధతకు గురైన వారికి రూ 50,000 పరిహారం ప్రకటించారు. కల్తీ మద్యం సేవించిన ఘటనకు సంబంధించి రెండు జిల్లాల్లో బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి, డీజీపీలను ఆదేశించారు. కాగా,రెండు రోజుల కిందట ఆయా గ్రామాల్లో జరిగిన వేడుకల సందర్భంగా పెద్దసంఖ్యలో స్ధానికులు కల్తీ మద్యం సేవించడంతో పలువురు తీవ్ర అస్వస్ధతకు గురవగా, మృతుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో కల్తీ మద్యం సేవించిన ఘటనలో 14 మంది మరణించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన 13 మంది ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేసినట్టు హరిద్వార్ ఎస్పీ వెల్లడించారు. -
1000 లీటర్ల గుడుంబా స్వాధీనం
వరంగల్: పోలీసులు చేపట్టిన సాధారణ తనిఖీల్లో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచిన 1000 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ తూర్పు నియోజక వర్గం పరిధిలోని రంగసాయపేటలో మంగళవారం పోలీసులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా 1000 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. -
గుడుంబా స్ధావరాలపై ఆకస్మిక దాడి
కరీంనగర్ (ఎల్లంతకుంట): కరీంనగర్ జిల్లా ఎల్లంతకుంట మండలంలోని అనంతగిరి గ్రామంలో గుడుంబా స్థావరంపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. దాదాపు 2 వేల లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. 40 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిపై కేసు నమోదు చేశారు. స్థానిక ఎస్ఐ ఎల్లయ్యగౌడ్ నేతృత్వంలో ఈ ఆకస్మిక దాడి జరిగింది.