Illustrations
-
నాటి మొఘల్ చిత్రాలతో నేటి వరదల ఢిల్లీకి పోలిక.. ఫొటోలు వైరల్..
ఢిల్లీ: దేశ రాజధానిలో వరదలు విజృంభించాయి. యమునా నది చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో ఉప్పొంగింది. ఢిల్లీ ప్రధాన మార్గాలపైకి వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలన్నీ నదిలో మునిగిపోయాయి. చారిత్రక కట్టడాలైన ఎర్రకోట, సుప్రీంకోర్టుకు కూడా వరద నీరు వచ్చి చేరింది. ఇంతకూ ఇంతటి పెను ప్రళయం ఎందుకని? ఎత్తైన ప్రాంతాలన్నింటినీ నదే ఆక్రమించిందా? లేక నది భాగాన్నే మనం ఆక్రమిస్తే.. ఈ విపత్తు సంభవించిందా? 'నీరు పల్లమెరుగు' అని అంటారు పెద్దలు.. లోతట్టు ప్రాంతాల నుంచి నీరు ప్రవహిస్తుందని అర్ధం. ఆ నీటి మార్గాన్నే మనం నది అంటున్నాం. మరి నది తన మార్గం మరవదు కదా..! అంటే మనమే దాని మార్గాన్ని ఆక్రమించామని చెప్పకనే అర్థమవుతోంది. అయితే.. ఓ ట్విట్టర్ యూజర్ మొఘల్ కాలం నాటి పిక్చర్స్‌ను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఆనాటి ఫొటోల్లో యమునా నది రెడ్ ఫోర్ట్ వెనక గోడలను ఆనుకుని ప్రవహిస్తున్నట్లు ఉంది. ఆనాటి పిక్చర్స్‌లో కనిపించినట్లే.. నేడు వరదలతో కూడిన ఢిల్లీలో దృశ్యాలు ఒకేలా ఉన్నాయంటూ ఆ నెటిజన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. శతాబ్ధాలు మరిచినా.. నది మరువునా తన మార్గం అంటూ కామెంట్ పెట్టాడు. A river never forgets! Even after decades and centuries pass, the river would come back to recapture its borders. Yamuna reclaims it's floodplain. #Yamuna #DelhiFloods pic.twitter.com/VGjkvcW3yg — Harsh Vats (@HarshVatsa7) July 13, 2023 ఇదీ చదవండి: Delhi Floods: రికార్డులు బ్రేక్ చేసిన యమున.. ఎర్రకోటను తాకిన వరద నీరు 'ప్రకృతి ఎప్పుడు తన ధర్మాన్ని మరవదు. తనదైన విషయాన్ని దేన్ని వదలదు. అంతటిని మళ్లీ కలిపేసుకుంటుంది' అని అర్థం వచ్చేలా మరో ట్విట్టర్ యూజర్ తన కామెంట్లో పేర్కొన్నాడు. దశాబ్దాలు గడిచినా యమునా నది తన మార్గాన్ని మరవలేదంటూ మరికొందరు స్పందించారు. మనం నది మార్గాన్ని ఆక్రమించుకున్నప్పటికీ బలీమైన శక్తితో అది తన మార్గాన్ని మళ్లీ తీసుకుంటుందని మరో వ్యక్తి కామెంట్ చేశారు. Nature always comes back to reclaim it's course....#DelhiFloods2023 #Yamuna #RedFort pic.twitter.com/woEieUoyaN — Rohit Sharma (@rohitzsharmaz) July 14, 2023 ప్రస్తుతం వరదలతో యమునా నది ప్రవాహం 45 ఏళ్ల నాటి రికార్డులను బ్రేక్ చేసింది. 207.49 మీటర్లకు చేరి ఢిల్లీని ముంచెత్తే ప్రయత్నమే జరిగింది. ఢిల్లీలో ప్రధాని భాగాలైన మహాత్మా గాంధీ రాజ్‌ఘాట్, దేశ రాజధాని నడిబొడ్డున ఉన్న సుప్రీంకోర్టు వరకు యమునా వరద నీరు వచ్చి చేరిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కాలనీలన్నీ జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్థమైంది. త్రాగునీరు వ్యవస్థలు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చివరికి దేశ సైన్యం ఎంట్రీ ఇచ్చే స్థాయికి పరిస్థితి చేరింది. Unforgettable is the river's resilience! Through the passage of time, spanning decades and centuries, the Yamuna returns to reclaim its floodplain, reminding us of its unyielding power. #Yamuna #DelhiFloods pic.twitter.com/TDJZ4CAqWK — Randhir Singh 🇮🇳 (@randhirs) July 13, 2023 ఇదీ చదవండి: Delhi Floods Highlights: ఇంకా జల దిగ్బంధంలోనే ఢిల్లీ -
Bapu: బాపుయగుట దుష్కరమ్ము సుమ్ము
‘నేనయితే కింద సంతకం లేకపోయినా సరే! బాపు బొమ్మని గుర్తుపడతాను’ అని కొంతమంది అమాయకంగా అమాయకమై పోతుంటారు. అలా అవనవసరం లేదు. రేఖ పండిన చిత్రకారులకి సంతకం అవసరం లేదు. వారి బొమ్మే సంతకం అవుతుంది. మరి బాపు గొప్పతనమంతా సంతకంలో కాక మరెక్కడుంది అని మీరెవరైనా అడిగితే నేను ఇలా చెబుతాను. అనగనగా అనేక కథలు మన సాహిత్యానికి ఉన్నాయి. ఒకానొక బంగారు కాలంలో ఆ కథలన్నిటికీ అరచేయంత కొలత దగ్గరి నుండి, రెండు పేజీల వరకు వ్యాపించిన డబుల్ డమ్మీ ఇలస్ట్రేషన్లను బాపు బొమ్మలు కట్టేరు. తన క్రియేటివిటీతో సమకాలీన తెలుగు సాహిత్యాన్ని అమరం చేశారు. కన్యాశుల్కంలో గిరీశం వెంకటేశాన్ని అడుగుతాడు ‘ఏమి వాయ్! క్రియేషన్ అనగానేమీ?’ దానికి వెంకటేశం ఏమి చెప్పాడో మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు మాత్రం నేను చెప్పేది వినండి. క్రియేషన్ అనగా తెల్లని కాగితంపై మూడు అక్షరాల నల్లని అచ్చుగా మాత్రమే ఉండిన గిరీశం అనే ఒక పేరుకి ‘ఇదిగో ఇంత ఎత్తు, ఇది నుదురు, ఇలా పంచె అని కట్టి, చేతిలో చుట్ట పెట్టి మన మెవ్వరమూ ఎప్పటికీ ఊహించలేని ఒక ఊహకు రూపం ఇచ్చి మనకు పరిచయం చేయడమన్నది బాపు చేసిన క్రియేషన్. గిరీశం కానీ, మధురవాణి కానీ, సౌజన్యరావు పంతులు కానీ, బుచ్చమ్మ కానీ ఇలా ఉంటారు అని ఆ గురజాడ అప్పారావు తమ పుస్తకంలో ఎక్కడా వర్ణన చేయలేదు. కానీ బాపు వారందరికీ ఒక రంగూ, ఒక రూపం, ఒక లక్షణం, ఒక ధోరణి, ఒక రీతి ఇచ్చి వారిని బొమ్మలుగా మలిచి మనకు మప్పారు. ఒకసారి బాపు బొమ్మల్లో వారిని చూశాక... వారు అలా కాక మరి ఇంకోలా ఉండటానికి మన ఇమాజినేషన్లో కుదరదు. బాపు బొమ్మ అంటే ఒక సంతకం కాదు. పేరు కాదు. కాసింత కాగితం, కలం మాత్రమే కలిసి దిద్దిన కల్పన కాదు. అంత కాక మరెంత? అనడిగితే, అదీ చెబుతా. తొంబైల నాటి తరం మాది. మేము చదువుకున్న కథా సాహిత్యమంతా కొకు కథా సంపుటాలు, శ్రీపాద కథా సంపుటాలు, రావిశాస్త్రి కథా సంపు టాలు. మా తరానికి ఆ కథలు తొలినాళ్లల్లో అచ్చ యిన ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, యువ, జ్యోతి లాంటి అనేకానేక పుస్తక పుటలు తిరగేయడం కుదరలేదు. తరవాత్తరువాత ఆ పాత పుస్తకాలు, అందులో వాటికి వేసిన బొమ్మలు చూసే అవకాశం దొరికినపుడు, ఒకోసారి ఇంటర్నెట్లో పైన కథ పేరు కూడా లేని చాలా బాపు బొమ్మలను చూసినపుడు... నా కళ్ళకు కనపడింది బొమ్మ కాదు అచ్చంగా కథలే. చలపతి, దాసూ పూర్వాశ్రమంలో సహధ్యాయులు, వారిద్దరి మధ్య పెద్ద స్నేహమేం ఏర్పడలేదు. చదువుల అనంతరం ఎన్నో ఏళ్ళ తరువాత అనుకోకుండా చలపతికి దాసు కనపడతాడు. చలపతికి పెళ్ళి కావాల్సిన రాజ్యం అనే చెల్లెలు ఉంది. చలపతి దాసూని ఇంటికి ఆహ్వానిస్తాడు. ఇంట్లో చలపతి, అతని భార్య, వారి ఇద్దరు పిల్లలు, రాజ్యం ఉంటారు. అ చదువుకున్న మధ్యతరగతి ఇల్లు, ఈ దంపతులు, ఆ పిల్లలు, వంటగదిలోంచి రెండు లోటాలతో కాఫీ తెస్తున్న రాజ్యం, కుర్చీలో కూచుని బుగ్గన సొట్టతో నవ్వుతున్న దాసు. ఈ బొమ్మని, వీటితో పాటూ అదే కథకు బాపు చిత్రించిన మరికొన్ని బొమ్మలని చూసిన నాకు ఒక్కసారిగా ఆ కథ మొత్తం నోటికి తగిలింది. బొమ్మ బొమ్మలో వెంకమ్మ, భాగ్యమ్మ, గోపీ, సత్యం అనే అందరినీ గుర్తు పట్టగలిగాను. ఈ కథే కాదు. బాపు వేసిన ఎన్నో బొమ్మల్లో ఆ కథలనూ, అందులోని మనుష్యులనూ గుర్తుపట్టి థ్రిల్లవుతూ వారిని చేయి పట్టి ఊపి షేక్ హాండ్ ఇచ్చిన అనుభవాలు నాకు కొల్లలు. (చదవండి: ఆత్మ గలవాడి కథ.. ఆయన మరణం కూడా చడీ చప్పుడు లేకుండా..) దీనిని మించిన మరో అద్భుత సంఘటనను మీకు చెబుతా. భారత దేశానికి గాలిబ్ కవితా, తాజమహలూ మరవరాని అందాలు అని ఒక మహానుభావుడు అన్నాడుట. మరి గాలిబ్ కవితకు ఏమిటి అందం? ఏ చేతులది చందం? అని వెదుక్కుంటూ బంగారం వంటి కవి దాశరథి, గొప్ప పబ్లిషర్ ఎంఎన్ రావు బాపును కలిశారు, ఆయనకు గాలిబ్ గీతాల అనువాదం ఇచ్చారు. వాటన్నిటికీ బాపు బొమ్మలు వేశారు. ఆ తరువాత ఆ పుస్తకం సాధించిన ఘన కీర్తి, తెలుగు వారి హృదయాలలో సంపాదించుకున్న సుస్థిర యశస్సు అందరికీ తెలిసినదే. అయితే చాలా మందికి తెలియని ఒక గొప్ప విషయం, బాపు బొమ్మకే అందిన అందలం ఏమిటంటే, దాశరథి గాలిబ్ గీతాల తెలుగు అనువాదం పుచ్చుకుని ఒక్క తెలుగు అక్షరం కూడా ఎరుగని ఎక్కడెక్కడి ఉర్దూ కవులూ కేవలం బాపు బొమ్మల్ని చూసి గాలిబ్ ఉరుదూ మూలం చదివేవారుట. ఇంతకూ చెప్పదలుచుకున్నదేమిటంటే... ‘ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము, మరియొకడు బాపుయగుట ఎంతో దుష్కరమ్ము సుమ్ము.’ – అన్వర్ (డిసెంబర్ 16న బాపు జయంతి; తెలుగు యూనివర్సిటీలో బాపు–రమణ పురస్కారాల ప్రదానం) -
అద్భుత కార్టూన్ వైరల్: ఉద్యోగం పోయింది
ఆయన వేసిన కార్టూన్ చూసి అందరూ ఆశ్చర్య పోయారు. అద్బుతం, అమోఘం అంటూ ప్రశంసలు కురిపించారు. ప్రఖ్యాత అంతర్జాతీయ అవార్డు పులిట్జర్ బహుమతికి యోగ్యమైందంటూ పలువురు సెలబ్రిటీలు, ఇతర రాజకీయ విమర్శకులు పొగడ్తల్లో ముంచెత్తారు. కానీ ఆ పొలిటికల్ కార్టూనిస్ట్ మాత్రం ఉద్యోగాన్ని కోల్పోయారు. ఇంతకీ ప్రచురణ సంస్థ ఆగ్రహానికి ఎందుకు గురయ్యారు? ఆయన ఉద్యోగానికి చేటు తెచ్చిన ఆ కార్టూన్ ఏంటి? వలసదారుల అవస్థలపై స్పందించిన కెనడియన్ కార్టూనిస్ట్ మైఖేల్ డి ఆడెర్ ఒక కార్టూన్‌ను ప్రచురించారు. అదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను విమర్శిస్తూ ఈ చిత్రాన్ని గీసినందుకు తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. ఇటీవల ఎల్ సాల్వడార్ నుంచి మెక్సికో ద్వారా అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన తండ్రీ బిడ్డలు (ఆస్కార్ అల్బెర్టో మార్టినెజ్ రామిరేజ్, అతని 23 నెలల కుమార్తె వాలెరియా) ప్రాణాలు పోగొట్టుకున్నసంగతి తెలిసిందే. వీరి మృతదేహాల ఫోటో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. దీంతో స్పందించిన ఆడెర్ సరిహద్దు వివాదాలపై వ్యంగ్యంగా వలసదారుల మృతదేహాలపై ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్నట్లుగా కార్టూన్ వేశారు. ఇది న్యూ బ్రూన్స్‌విక్‌లోని ఒక ప్రచురణ సంస్థలో ప్రచురితమైంది. ఇది కెనడా, అమెరికా వ్యాప్తంగా పలువురి మనసులను గెల్చుకుంది. కానీ అతని ఉద్యోగం మాత్రం ప్రమాదంలో పడిపోయింది. తనను ఉద్యోగంనుంచి తొలగించారని ఆడెన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో పలువురు కార్టూనిస్టులు ఇతర ప్రముఖులు ఆడెర్కు మద్దతుగా నిలిచారు. The highs and lows of cartooning. Today I was just let go from all newspapers in New Brunswick. #editorialcartooning #nbpoli #editorialcartooning — Michael de Adder (@deAdder) June 28, 2019 Michael de Adder is one of the best in his art form. New Brunswick’s loss here. Keep up the great work @deAdder https://t.co/9VXV8CMG0m — Mark Critch (@markcritch) June 28, 2019 అయితే ట్రంప్‌పై కార్టూన్ సోషల్ మీడియాలో వైరల్ అయిన 24 గంటల తరువాత ఆడెర్ను తొలగించారని కెనడియన్ కార్టూనిస్టుల సంఘం అధ్యక్షుడు వెస్ టైరెల్ ఆరోపించారు. 17 సంవత్సరాల పాటు అతను సంస్థకు సేవలందించిన అతని తొలగింపునకు ఎటువంటి కారణం లేదని పేర్కొన్నప్పటికీ ఇది యాదృచ్చికంగా జరిగింది కాదని ఫేస్బుక్ పోస్ట్‌లో కమెంట్ చేశారు. అటు తన కాంట్రాక్ట్ ఇంకా పూర్తి కాలేదనీ, సాంకేతికంగా తనను తొలగించే అధికారం బ్రూన్స్విక్ పత్రికకు లేదని ఆడెర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ట్రంప్ కార్టూన్ విషయంలో ఆడెర్తో ఫ్రీలాన్స్ ఒప్పందాన్ని రద్దు చేసిందన్న వాదన పూర్తిగా తప్పు అని.. అనవసరంగా సోషల్ మీడియాలో ఇది వైరలైంది అని బ్రూన్స్విక్ న్యూస్ ఇంక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. అసలు ఆడెర్ ట్రంప్ కార్టూన్ తమకు ఇవ్వలేదంది. తాము ఇప్పటికే మరో కార్టూనిస్ట్‌ను నియమించుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. గత కొన్ని వారాలుగా దీనిపై సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పింది. Cartoon for June 26, 2019 on #trump #BorderCrisis #BORDER #TrumpCamps #TrumpConcentrationCamps pic.twitter.com/Gui8DHsebl — Michael de Adder (@deAdder) June 26, 2019 -
హాలీవుడ్లో... బొమ్మల బాపు
సినిమా స్క్రిప్ట్‌ల్లో బాపు సినిమా స్క్రిప్ట్ ప్రత్యేకమైనది. ఇంచక్కా ప్రతి సన్నివేశానికి బొమ్మలు వేసి స్క్రిప్టు బుక్‌లో ముందే సినిమా చూపిస్తారు. ఇలా చాలా తక్కువ మంది మాత్రమే బొమ్మలతో స్క్రిప్ట్‌లు తయారు చేసుకుంటారు. ‘ఇన్సెప్షన్’ నుంచి ఇటీవలి ‘ఇంటర్స్టెల్లార్’ చిత్రాల దాకా హాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన దర్శకుడు క్రిస్టఫర్ నోలన్. ఈ దిగ్దర్శకుడు కూడా స్క్రిప్ట్‌ను స్కెచ్‌లుగా మార్చే కళాకారుడే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ట్రైబె కా చిత్రోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న క్రిస్టఫర్ మాట్లాడుతూ ‘‘మూలకథ కూడా రాసుకోను. అంతా స్కెచ్ వర్కే ఉంటుంది. దీంతో కథలో తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయంపై నాకు పూర్తి అవగాహన ఉంటుంది. ఇదే నా శైలి. నా ‘మెమొంటో’ చిత్రానికి మాత్రమే స్క్రిప్ట్ రాసుకున్నాను. మిగతా వాటన్నిటికీ ఇలస్ట్రేషన్స్ వేసుకున్నా’’ అని చెప్పారు.