import duty on gold
-
పసిడికి పెరిగిన డిమాండ్
ముంబై: దిగుమతి సుంకం తగ్గింపుతో బంగారానికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 248.3 టన్నులుగా నమోదైంది. ముఖ్యంగా సుంకం తగ్గింపు ఆభరణాల కొనుగోళ్లను పెంచినట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ‘2024 క్యూ3 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్’ నివేదిక తెలిపింది. ‘‘బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరడంతో.. ధరలు తగ్గే వరకు కొనుగోళ్ల కోసం ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అనుసరించొచ్చు. దీంతో పూర్తి ఏడాదికి (2024) బంగారం డిమాండ్ 700–750 టన్నుల మేర ఉంటుంది. గతేడాదితో పోలి్చతే కొంత తక్కువ. 2024 చివరి త్రైమాసికంలో ధనత్రయోదశి, వివాహాల సీజన్ మొత్తం మీద బంగారం డిమాండ్‌కు ఊతంగా నిలుస్తాయి’’అని ఈ నివేదిక తెలిపింది. 2023లో బంగారం డిమాండ్ 761 టన్నులుగా ఉంది. ధనత్రయోదశి సందర్భంగా డిమాండ్ పెరగడంతో మంగళవారం ఢిల్లీలో బంగారం ధర 10 గ్రాములకు రూ.300 పెరిగి రూ.81,400కు చేరడం గమనార్హం. ఇక విలువ పరంగా చూస్తే సెప్టెంబర్ క్వార్టర్లో బంగారం డిమాండ్ 53 శాతం పెరిగి రూ.1,65,380 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.1,07,700 కోట్లుగా ఉంది. బంగారం, వెండి దిగుమతులపై 15 శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి బడ్జెట్లో తగ్గించడం తెలిసిందే. బంగారం దిగుమతులు 22% జంప్ పస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు జోరుగా సాగుతున్నాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో 22 శాతం అధికంగా 27 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయినట్టు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో బంగారం దిగుమతులు 22 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత పండుగల సీజన్ దిగుమతులు పెరగడానికి కారణంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో మొత్తం మీద బంగారం దిగుమతులు 30 శాతం పెరిగి 45.54 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. అత్యధికంగా స్విట్జర్లాండ్ 40 శాతం మేర మన దేశానికి బంగారం ఎగుమతి చేయగా, యూఏఈ 16 శాతం, దక్షిణాఫ్రికా 10 శాతం వాటా ఆక్రమించాయి. దేశ మొత్తం దిగుమతుల్లో బంగారం దిగుమతుల వాటా 5 శాతంగా ఉంటుంది. బంగారం దిగుమతులు పెరగడంతో దేశ వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) మొదటి ఆరు నెలల్లో (సెప్టెంబర్ చివరికి) 137.44 బిలియన్ డాలర్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వాణిజ్య లోటు 119.24 బిలియన్ డాలర్లుగానే ఉండడం గమనించొచ్చు. బంగారానికి చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద వినియోగదారుగా భారత్ ఉంటోంది. వెండి దిగుమతులు సైతం 376 శాతం పెరిగి 2.3 బిలియన్ డాలర్లుగా ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి నమోదయ్యాయి. కరెంటు ఖాతా లోటు ఒక శాతం ఎగసి 9.7 బిలియన్ డాలర్లకు చేరింది. -
బంగారంపై బాదుడు తగ్గేనా..?
న్యూఢిల్లీ: పసిడిపై ప్రస్తుతం అమల్లో ఉన్న 12.5 శాతం ఇంపోర్ట్ డ్యూటీ (దిగుమతి సుంకం)ని సాధ్యమైనంత మేర తగ్గించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. వచ్చే నెల తొలి వారంలో ప్రవేశపెట్టనున్న 2020–21 కేంద్ర బడ్జెట్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని విన్నవించినట్లు విశ్వసనీయ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. ఇప్పటికే ఈ రేటును 4 శాతానికి తగ్గించాలని దేశీయ రత్నాభరణాల పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే కాగా, పరిశ్రమను ఆదుకోవడం కోసం ఈ తగ్గింపు తప్పనిసరని సూచించినట్లు తెలుస్తోంది. ఈ విన్నపాన్ని ప్రభుత్వం మన్నిస్తే.. సుంకాల కోత మేర బంగారం ధరల్లో తగ్గింపు ఉంటుందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే, భారత్‌లో అధిక శాతం సప్లై దిగుమతుల ద్వారానే కొనసాగుతోంది. ఏడాదికి 800–900 టన్నుల పసిడిని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. ఎందుకింత రేటు..: గతేడాది బడ్జెట్‌కు ముందు బంగారంపై దిగుమతి సుంకం 10 శాతంగా ఉంది. అయితే, విదేశాల నుంచి ఈ కమోడిటీ దిగుమతులు గణనీయంగా పెరిగిపోతూ ఉండడం వల్ల కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) అదుపు తప్పుతోందని, దీనిని కట్టడి చేయడంలో భాగంగా గత బడ్జెట్లో 12.5 శాతానికి పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ పెంపు తరువాత ఫలితాలు కేంద్రం అనుకున్న విధంగా ఉన్నప్పటికీ.. దేశీయ రత్నాభరణాల పరిశ్రమకు మాత్రం తగిన ప్రోత్సాహం లభించలేదు. ఏప్రిల్–నవంబర్ కాలంలో ఈ రంగ ఎగుమతులు 1.5% తగ్గడం ఇందుకు నిదర్శనం. దిగుమతి సుంకాలు అధికంగా ఉన్న కారణంగా పలు కంపెనీలు సరిహద్దు దేశాలకు వెళ్లిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంతటి రేటు ఉండడం సమంజసం కాదని వాణిజ్య శాఖ కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. -
బంగారంపై దిగుమతి సుంకం మరింత పెంపు
ముంబై: కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్న బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝలిపించింది. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేయడానికి, కరెంటు అకౌంటు లోటు(క్యాడ్) కట్టడికి కేంద్రం మంగళవారం మరిన్ని చర్యలు ప్రకటించింది. బంగారంపై 15శాతం సుంకాన్ని పెంచుతున్నట్లు తెలిపింది. పసిడి దిగుమతిని తగ్గించడానికి ప్రభుత్వం గతంలో చేపట్టన చర్యలు ఆశాజనకంగా లేకపోవడంతో తిరిగి సుంకాన్ని పెంచింది. గతంలో బంగారం దిగుమతి సుంకాన్ని 8 శాతం నుంచి 10 శాతానికి పెంచిన్న ప్రభుత్వం తాజాగా 15శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత తొమ్మిది నెలల్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచడం ఇది మూడోసారి.