ముంబై: కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్న బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝలిపించింది. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేయడానికి, కరెంటు అకౌంటు లోటు(క్యాడ్) కట్టడికి కేంద్రం మంగళవారం మరిన్ని చర్యలు ప్రకటించింది. బంగారంపై 15శాతం సుంకాన్ని పెంచుతున్నట్లు తెలిపింది. పసిడి దిగుమతిని తగ్గించడానికి ప్రభుత్వం గతంలో చేపట్టన చర్యలు ఆశాజనకంగా లేకపోవడంతో తిరిగి సుంకాన్ని పెంచింది.
గతంలో బంగారం దిగుమతి సుంకాన్ని 8 శాతం నుంచి 10 శాతానికి పెంచిన్న ప్రభుత్వం తాజాగా 15శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత తొమ్మిది నెలల్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచడం ఇది మూడోసారి.