Inda
-
CAAపై అమెరికా ప్రకటన.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో అగ్రరాజ్యం అమెరికా ప్రకటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ విషయం భారత అంతర్గత విషయమని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. 2019కు చెందిన పౌరసత్వ సవరణ చట్టం దేశానికి సంబంధించిన అంతర్గత విషషమని, ఇది దేశ సమగ్ర సంప్రదాయాలకు, మానవ హక్కుల విషయంలో తమ దీర్ఘకాల నిబద్దతకు అనుగుణంగా రూపొందించినట్లు వెల్లడించారు. అఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో హింసకు గురై 2014 వరకు భారత్‌కు వలస వచ్చిన హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, పార్శీ, క్రైస్తవ వర్గాలకు చెందిన మైనారిటీలకు భారత పౌరసత్వం, భద్రత కల్పించే ఉద్ధేశ్యంతో ఈ చట్టం తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ చట్టం ఏ పౌరుడి హక్కులను తొలగించదని అన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. పౌరసత్వ సవరణ చట్టం పౌరసత్వం ఇవ్వడం.. పౌరసత్వం తీసివేయడం గురించి కాదని అన్నారు. ఇది అందరికీ అర్థం కావాలన్నారు. ‘ఇది ఏ దేశపు జాతీయత లేని వ్యక్తి సమస్యను పరిష్కరిస్తుంది. మానవ హక్కులకు మద్దతు ఇస్తుంది. మానవ గౌరవాన్ని అందిస్తుంది’ అని పేర్కొన్నారు. కాగా పౌరసత్వ సవరణ చట్టంపై అమెరికా స్పందించిన విషయం తెలిసిందే. సీఏఏ అమలులు తీరును తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. మార్చి 11వ తేదీన రిలీజైన సీఏఏ నోటిఫికేషన్ పట్ల ఆందోళనగా ఉందని విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. సీఏఏను ఎలా అమలు చేస్తారన్న విషయాన్ని గమనిస్తున్నామని, ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని మతాలకు స్వేచ్ఛ ఉంటుందని మిల్లర్ తెలిపారు. చదవండి: ఎలక్టోరల్ బాండ్ల డేటాపై 'జైరాం రమేష్' కీలక వ్యాఖ్యలు -
దేశంలో మొదటి ప్రాంతీయ రైలు సర్వీసు.. అతి త్వరలో ప్రారంభం!
దేశంలో మొదటి ప్రాంతీయ రైలు సర్వీసు రాపిడ్‌ఎక్స్ (RAPIDX) ఈ నెల (జూలై)లోనే ప్రారంభం కానుంది. 17 కిలో మీటర్ల పొడవుతో ఏర్పాటైన ఈ రైలు సర్వీసులో సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్దార్, దుహాయ్ డిపో అనే స్టేషన్లు ఉంటాయని ఎకనమిక్స్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. ఈ అన్ని స్టేషన్లు పనులన్నీ పూర్తయి కార్యకలాపాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయని ఓ సీనియర్ అధికారి చెప్పినట్లుగా పేర్కొంది. దీంతోపాటు సాహిబాబాద్ నుంచి మీరట్ సౌత్ స్టేషన్ వరకు 42 కిలోమీటర్ల రైలు సర్వీస్ కూడా పూర్తయింది. దుహాయ్ డిపో తర్వాత 25 కి.మీ సెక్షన్‌ను ప్రాధాన్యతా విభాగం తర్వాత ప్రారంభిస్తారని తెలిసింది. ఈ సెక్షన్లో మురదానగర్, మోదీ నగర్ సౌత్, మోదీ నగర్ నార్త్, మీరట్ సౌత్ స్టేషన్లు ఉంటాయి. ఈ సెక్షన్లు ఢిల్లీ - మీరల్ రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్)లో భాగం. ఇందులో రైళ్లు 160 కి.మీ వేగంతో నడిచే అవకాశం ఉంది. 2025 నాటికి 82 కిలో మీటర్లు ఆర్ఆర్టీఎస్ నిర్మాణం 2019 జూన్‌లో ప్రారంభమైంది. ఆర్‌ఆర్‌టీస్ కారిడార్‌ను నిర్మిస్తున్న నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 2025 నాటికి మొత్తం 82 కి.మీల ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మార్గాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ. 30,274 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఆర్‌ఆర్‌టీస్ ప్రాజెక్ట్‌కు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంకులు నిధులు సమకూర్చాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంతటా సెమీ-హై స్పీడ్ రీజినల్ రైల్ సర్వీస్‌ను ఎన్సీఆర్టీసీ అభివృద్ధి చేస్తోంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనేది ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలతోపాటు కేంద్రం ప్రభుత్వం జాయింట్ వెంచర్ కంపెనీ. మీరట్ నుంచి ఢిల్లీకి వెళ్లే ప్రతి రాపిడ్‌ఎక్స్ రైలులో ప్రీమియం కోచ్ తర్వాత మహిళలకు ఒక ప్రత్యేక కోచ్ ఉంటుంది. రిజర్వ్డ్ కోచ్‌లో 72 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. పిల్లలున్న తల్లిదండ్రులకు ఉపయుక్తంగా ప్రతి స్టేషన్లోనూ డైపర్ మార్చేందుకు ప్రత్యేక వసతి ఏర్పాటు చేయడం విశేషం. -
రియల్ ఎస్టేట్ అదరహో.. భారత్‌లో భారీగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత రియల్టీ మార్కెట్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. 2017 నుంచి 2022 మధ్య వీరి నుంచి మొత్తం 26.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.16 లక్షల కోట్లు) వచ్చాయి. అంతకుముందు ఆరేళ్ల కాలంలో (2011–16) వీరు చేసిన పెట్టుబడులతో పోలిస్తే మూడింతలు అధికంగా వచ్చినట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఇందులో అమెరికా, కెనడా నుంచే 70 శాతం మేర పెట్టుబడులు వచ్చాయి. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రాధాన్య ఎంపికకగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. భారత్‌లో విదేశీ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు గత కొన్నేళ్లుగా పెరుగుతూనే వస్తున్నాయి. ఈ రంగంలో ఎన్నో కొత్త విధానాలు, సంస్కరణ చర్యలు చేపట్టడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. పెట్టుబడుల వివరాలు.. ► 2017–22 మధ్య భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి దేశీ (డీఐఐలు), విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి మొత్తంగా 32.9 బిలియన్ డాలర్లు వచ్చాయి. 2011–16 మధ్య ఇవి 25.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మొత్తం పెట్టుబడుల్లో 45 శాతం ఆఫీస్ విభాగంలోకే వెళ్లాయి. ►మొత్తం 32.9 బిలియన్ డాలర్లలో ఎఫ్ఐఐల పెట్టుబడులు 26.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2011–16 మధ్య వచ్చిన 8.2 బిలియన్ డాలర్లతో పోలిస్తే మూడింతలు అధికమయ్యాయి. ►డీఐఐల పెట్టుబడులు 2017–22 మధ్య 6.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ►ఎఫ్ఐఐల పెట్టుబడుల్లో యూఎస్ఏ నుంచి వచ్చినవి 11.1 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2011–16 మధ్య ఇవి 3.7 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. ►కెనడా నుంచి 7.5 బిలియన్ డాలర్లు వచ్చాయి. అంతకుముందు ఆరేళ్లలో కెనడా నుంచి వచ్చిన ఎఫ్ఐఐ పెట్టుబడులు కేవలం 0.5 బిలియన్ డాలర్లుగానే ఉండడం గమనార్హం. ►సింగపూర్ నుంచి కూడా మూడు రెట్లకు పైగా పెరిగి 6 బిలియన్ డాలర్లు వచ్చాయి. అంతకుముందు ఆరేళ్లలో ఇవి 2.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఎన్నో అనుకూలతలు అధిక జనాభా అనుకూలతలు, అభివృద్ధికి అనుకూలమైన ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాల బలోపేతం, పోటీ ధరలతో అంతర్జాతీయ సంస్థలకు భారత రియల్ ఎస్టేట్ ప్రాధాన్య మార్కెట్‌గా మారింది. రియల్ ఎస్టేట్ డిమాండ్‌కు ఇవి చోదకంగా నిలుస్తున్నాయి. బలమైన ఆర్థిక, వ్యాపార మూలాలు సంస్థాగత ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తున్నాయి. దీంతో విదేశీ వ్యూహాత్మక భాగస్వాములు తమ పోర్ట్‌ఫోలియోని విస్తరిస్తున్నారు’’అని కొలియర్స్ ఇండియా చైర్మన్, ఎండీ సాంకే ప్రసాద్ తెలిపారు. భారత్ దీర్ఘకాల నిర్మాణాత్మక సైకిల్లో ఉందని, వచ్చే కొన్నేళ్ల పాటు అవకాశాలు మరింత వృద్ధి చెందుతాయని కొలియర్స్ ఇండియా ఎండీ (క్యాపిటల్ మార్కెట్లు) పీయూష్ గుప్తా తెలిపారు. -
వివాదంలో జెట్ ఎయిర్వేస్ సీఈవో.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ప్రముఖ దేశీయ ఏవియేషన్ దిగ్గజం జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్ వివాదంలో చిక్కుకున్నారు. దేశంలో ఉన్న మెట్రో స్టేషన్ల సౌందర్యం,ఆర్కిటెక్చర్‌పై (aesthetics and architecture) ఆసంతృప్తి వ్యక్తం చేస్తూ వైట్‌ఫీల్డ్-కేఆర్ పురం మెట్రో మార్గం (పర్పుల్ లైన్) - దుబాయ్ మెట్రో స్టేషన్ ఫోటోల్ని ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లపై ఇప్పుడు విపరీతంగా ట్రోలింగ్ నడుస్తున్నది. సంజీవ్ కపూర్ భారత్ - దుబాయ్‌లోని మౌలిక సదుపాయాలను పోల్చారు. దుబాయ్ మౌలిక సదుపాయాలతో పోలిస్తే ఇండియన్ మెట్రోస్టేషన్లు ‘కళ లేని కాంక్రీటు కళ్లజోళ్లు’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. అంతే ఆ ట్వీట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు జెట్ ఎయిర్వేస్ సీఈవోను ట్రోలింగ్ చేస్తున్నారు. ఓ ట్విటర్ యూజర్ బెంగుళూరు, గుర్గావ్, కోల్కతాలలోని ఓవర్‌గ్రౌండ్/ఓవర్ హెడ్ మెట్రో స్టేషన్లు కళావిహీనంగా ఉన్నాయా? అని ప్రశ్నిస్తూ సంబంధిత మెట్రోస్టేషన్ ఫోటోలను పోస్ట్ చేశాడు. దీంతో పాటు దుబాయ్ మెట్రోస్టేషన్ కంటే భారత్‌లో మెట్రో స్టేషన్లు బాగున్నాయని నొక్కాణిస్తూ మరిన్ని ఫోటోల్ని షేర్ చేశారు. చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా అందంగా ఉన్న మెట్రోస్టేషన్లను, వాటి డిజైన్ ఫోటోల్ని ట్విటర్లో పంచుకుంటున్నారు. 'అది కూడా కరెక్టే కదా సార్' సంజీవ్ కపూర్ అభిప్రాయాన్ని ఏకీభవించిన మరికొందరు.‘‘అది కూడా కరెక్టే కదా సార్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్యావరణ అనుకూలమైనది కాదు. ఖర్చుతో కూడుకున్నది. కేవలం మెట్రో స్టేషన్ మాత్రమే కాదు ఇతర పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా. ఈ రోజుల్లో ప్రైవేట్ నిర్మాణాలు సైతం అందానికి తక్కువ ప్రాముఖ్యతనిచ్చి గందరగోళం సృష్టిస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ చేతులు మీదిగా కాగా, జెట్ ఎయిర్వేస్ సీఈవో ట్వీట్ చేసిన బెంగళూరులోని 13 కిలోమీటర్ల వైట్‌ఫీల్డ్-కెఆర్ పురం మెట్రో (పర్పుల్ లైన్) రైలు మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 25న ప్రారంభించనున్నారు. Delhi Metro for you! pic.twitter.com/HA8z0g6AZZ — Rahul Kapoor (@okwithrk) March 18, 2023 The same station from some distance has this look (not the right part of pic), but yes, most of the stations are box shaped. •Sri Sathya Sai Hospital Metro Station#Bangalore pic.twitter.com/SCWEUxtmk6 — Bangalore Metro Updates (@WF_Watcher) March 18, 2023 Bangalore metro has amazing artwork on the walls. They let artists paint the walls later on. Case in point, church street metro: pic.twitter.com/41ojhy7JQx — Srijan R Shetty (@srijanshetty) March 19, 2023 -
‘పునరుత్పాదకత’లోకి రూ.1.64 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన రంగం ఈ ఏడాది 20 బిలియన్ డాలర్లను (రూ.1.64 లక్షల కోట్లు) ఆకర్షిస్తుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిశ్రమకు సంబంధించి బలమైన కార్యాచరణ అవసరమన్న అభిప్రాయం శుక్రవారం ఢిల్లీలో జరిగిన రీకాన్ ఇండియా 2023 సదస్సులో వ్యక్తమైంది. పరిశ్రమకు సంబంధించి కీలక అంశాలు, సవాళ్లు, అవకాశాలను ఈ సందర్భంగా నిపుణులు ప్రస్తావించారు. బ్లూ సర్కిల్ ఈ సదస్సును నిర్వహించింది. పునరుత్పాదక రంగంలోకి 2023లో 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్టు బ్లూసర్కిల్ సీఈవో సిద్ధార్థ్ ఆనంద్ తెలిపారు. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ సైతం 2023లో ఈ రంగం 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని లోగడ చెప్పడం గమనార్హం. భారత్‌లో ఉత్పత్తికి అనువుకాని భూములు అధికంగా ఉన్నాయని, కనుక సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటులో భారీ అవకాశాలు సొంతం చేసుకోవచ్చని ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ప్రైవేటు సెక్టార్ స్పెషలిస్ట్ అలెగ్జాండర్ హాగ్వీన్ రుట్టర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల పరంగా కూడా అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. భారత్ 2030 నాటికి 280 గిగావాట్ సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకుంటుందని ఎన్టీపీసీ రెన్యువబుల్స్ సీఈవో మోహిత్ భార్గవ ప్రకటించారు. -
ఆదేశం.. భారత్ ను మించిపోయింది!
న్యూఢిల్లీః ప్రతివిషయంలో భారత్ తో పోల్చుకొని, అన్నింటా తానే ముందుండాలని ప్రయత్నించే పాకిస్తాన్.. నల్లడబ్బు విషయంలో ఇండియాను మించిపోయిందట. స్విస్ బ్యాంకుల్లో పదివేల కోట్ల వరకూ ఆదేశం నల్లధనం దాచినట్లు తాజా నివేదికలను బట్టి తెలుస్తోంది. ఇండియాతో పోలిస్తే పాకిస్తాన్ నల్లధనం దాచడంలో ముందు స్థానంలో ఉండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. 2014 లెక్కలతో పోలిస్తే పాకిస్తాన్ స్విస్ బ్యాంకుల్లో దాచిన బ్లాక్ మనీ 16 శాతం పెరిగినట్లు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ తాజా నివేదికల్లో వెల్లడించింది. పాకిస్తాన్ నల్లధనం విలువ పెరగడం వరుసగా ఇది రెండోసారని నివేదికలో తెలిపింది. స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ ఎన్ బి) వెల్లడించిన వివరాలను బట్టి, 2014 లో పాకిస్తాన్ కరెన్సీ సీహెచ్ఎఫ్ 1,301 మిలియన్లుగా ఉన్న నల్లధనం, 2015 పూర్తయ్యేనాటికి 16 శాతం పెరిగి సిహెచ్ ఎఫ్ 1,513 మిలియన్లకు చేరినట్లు తెలిపింది. అయితే భారత్ విషయంలో ఆ విలువలు 33 శాతం పడిపోయి, 2015 చివరికి రూ. 8,392 కోట్ల రూపాయలకు చేరినట్లు ఎస్ ఎన్ బి వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోంది.